పవన్ చేతనైతే రాజకీయాల్లోకి రా : నారాయణ | CPI leader narayana criticises pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్ చేతనైతే రాజకీయాల్లోకి రా : నారాయణ

Aug 28 2016 3:56 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ చేతనైతే రాజకీయాల్లోకి రా : నారాయణ - Sakshi

పవన్ చేతనైతే రాజకీయాల్లోకి రా : నారాయణ

సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొంగే పాలల్లో ఉప్పుగళ్లు వేసే తరహా వ్యక్తి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
రాజంపేట: ‘చేతనైతే రాజకీయాల్లోకి రా.. లేదంటే రజనీకాంత్‌లా ఇంట్లో ఉండు’ అని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హితవు పలికారు. శనివారం వైఎస్సార్ జిల్లా రాజంపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్ వైఖరి పొంగే పాలల్లో ఉప్పు వేసే రకంగా కనిపిస్తోందని, అభిమానులను స్వార్థం కోసం వాడుకుంటున్నాడని ఆరోపించారు. అభిమాన సంఘాల పేరుతో కొట్టుకునే విధంగా వారిని హీరోలు తయారుచేస్తున్నారని విమర్శించారు. కోలార్‌లో ఇటీవల ఓ యువకుడు మృతిచెందిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement