ఢిల్లీ పేస్ బౌలర్ పై దాడి | Delhi pacer Parvinder Awana attacked in Greater Noida | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పేస్ బౌలర్ పై దాడి

Jul 22 2017 3:37 PM | Updated on Sep 5 2017 4:38 PM

ఢిల్లీ పేస్ బౌలర్ పై దాడి

ఢిల్లీ పేస్ బౌలర్ పై దాడి

ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానాపై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది.

గ్రేటర్ నోయిడా:ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానాపై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది.  గ్రేటర్ నోయిడాలో పర్వీందర్ అవానా కారులో ప్రయాణిస్తుండగా అతనిపై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హరిద్వార్ నుంచి పర్వీందర్ కారులో తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

గ్రేటర్ నోయిడాలోని కాస్నా ఏరియాలో పర్వీందర్ కారును వెనుకనుంచి వస్తున్న మరొక వాహనం ఢీకొట్టింది. ఆ ఘటనలో పర్వీందర్ కారు మహీంద్ర ఎక్స్యూవీ ధ్వంసమైంది. దాంతో ఇరు వర్గాల మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్తా దాడికి దారితీసినట్లు కాస్నా స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్వో) జితేందర్ కుమార్ తెలిపారు. పర్వీందర్ పై వారు మూకుమ్ముడిగా దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఆ ఐదుగురిలో ఒక మహిళా కూడా ఉన్నట్లు జితేందర్  పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement