దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం | Amit Shah lunch with a Dalit family | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం

Jun 1 2016 2:01 AM | Updated on Mar 29 2019 9:31 PM

దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం - Sakshi

దళిత కుటుంబంతో అమిత్ షా భోజనం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీ లోక్‌సభ స్థానం వారణాసి పరిధిలోని జోగియాపూర్ గ్రామంలో దళిత కుటుంబంతో కలిసి భోజనం చేశారు.

వారణాసి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీ లోక్‌సభ  స్థానం వారణాసి పరిధిలోని జోగియాపూర్ గ్రామంలో దళిత కుటుంబంతో కలిసి భోజనం చేశారు. రైతుల ర్యాలీలో పాల్గొనేందుకు అలహాబాద్ వెళ్తున్న షా ఆ గ్రామంలో కొద్దిసేపు ఆగారు. దళిత వ ర్గానికి చెందిన గిరిజా ప్రసాద్ బిండ్ కుటుంబంతో కలిసి ఆయన నేలపై కూర్చొని మధ్యాహ్న భోజన ం చేశారని బీజేపీ మీడియా ఇంచార్జీ సంజయ్ భరద్వాజ్  తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసే ఆయన దళితులతో భోజనం చేశారని యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్ విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement