యువన్‌కి మూడో పెళ్లి! | Yuvan Shankar Raja Ready for Marriage Again? | Sakshi
Sakshi News home page

యువన్‌కి మూడో పెళ్లి!

Oct 30 2014 11:14 PM | Updated on Sep 2 2017 3:37 PM

యువన్‌కి మూడో పెళ్లి!

యువన్‌కి మూడో పెళ్లి!

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు ముగ్గురు పిల్లలు. పెద్ద వాడు కార్తీక్ రాజా, చిన్నవాడు యువన్, అమ్మాయి భవతారిణి-ముగ్గురూ సంగీత దర్శకులే. అయితే, ఇళయరాజా కుమారుడు

 మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు ముగ్గురు పిల్లలు. పెద్ద వాడు కార్తీక్ రాజా, చిన్నవాడు యువన్, అమ్మాయి భవతారిణి-ముగ్గురూ సంగీత దర్శకులే. అయితే, ఇళయరాజా కుమారుడు అనే ఇమేజ్ నుంచి సులువుగానే బయటపడగలిగారు యువన్. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో వంద చిత్రాలకు సంగీత దర్శకునిగా వ్యవహరించిన ఘనత యువన్‌ది. ప్రస్తుతం తమిళం, తెలుగుతో కలిపి చేతిలో అరడజను చిత్రాలున్నాయి. అయితే, యువన్ చేస్తున్న చిత్రాలకన్నా ఆయన వ్యక్తిగత జీవితం గురించే ఇప్పుడు వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం ముస్లిమ్ యువతి జఫరున్నీసాను యువన్ పెళ్లి చేసుకోనున్నారు.
 
 రెండు రోజుల క్రితం నిశ్చితార్థం జరిగిందట. దుబాయ్‌లో పెళ్లి జరగనుందని తెలిసింది. ఇది ప్రేమ వివాహమట. యువన్‌కి ఇది మూడో పెళ్లి. 2005లో సుజయ చంద్రన్‌తో యువన్ వివాహం జరిగింది. అది లవ్ మ్యారేజే. మూడేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2011లో శిల్పా మోహన్‌ని యువన్ పెళ్లి చేసుకోవడం, ఆమెనుంచి కూడా విడిపోవడం జరిగింది. ఇప్పుడు జఫరున్నీసాతో యువన్‌కి జరగనున్నది మూడో వివాహం. కాగా, ఆయన తన పేరుని కూడా అబ్దుల్ హలీక్ అని మార్చుకున్నారట. తల్లి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలకు ఇస్లామ్ మతం మీద యువన్‌కి విశ్వాసం కలిగింది. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement