షారూఖ్కి సల్మాన్ కాస్ట్లీ గిఫ్ట్..! | Salman Khan gifts a Luxury car to Shahrukh Khan | Sakshi
Sakshi News home page

షారూఖ్కి సల్మాన్ కాస్ట్లీ గిఫ్ట్..!

Jul 6 2017 2:01 PM | Updated on Sep 5 2017 3:22 PM

షారూఖ్కి సల్మాన్ కాస్ట్లీ గిఫ్ట్..!

షారూఖ్కి సల్మాన్ కాస్ట్లీ గిఫ్ట్..!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కి గిఫ్ట్ ఇవ్వటం అలవాటు. తన తోటి నటీనటులతో పాటు తనకు ఏ మాత్రం

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కి గిఫ్ట్ ఇవ్వటం అలవాటు. తన తోటి నటీనటులతో పాటు తనకు ఏ మాత్రం సాయం చేసిన వారిని గుర్తుపెట్టుకొని మరి ఏదో ఒక బహుమతి ఇవ్వటం సల్లూభాయ్కి అలవాటు. అదే బాటలో ఈ సీనియర్ బ్యాచిలర్ తన తోటి హీరో షారూఖ్కు ఓ కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చాడట. ఇటీవల విడుదలైన సల్మాన్ సినిమా ట్యూబ్ లైట్లో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించాడు.

చిన్న పాత్రే కావటంతో షారూఖ్ ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే నటించాడట. ఆ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన సల్మాన్ మాత్రం షారూఖ్కు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. షారూఖ్ సెట్స్లో ఉండగా షూటింగ్ స్పాట్కు వెళ్లి మరి తన గిఫ్ట్ అందించాడు సల్మాన్. అంతేకాదు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న షారూఖ్ సినిమాలో సల్మాన్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు. మరి సల్మాన్ కోసం షారూఖ్ ఎలాంటి గిఫ్ట్ ప్లాన్ చేస్తాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement