రాజేంద్రప్రసాద్ vs జయసుధ | Rajendra prasad and jayasudha to contest in maa elections | Sakshi
Sakshi News home page

రాజేంద్రప్రసాద్ vs జయసుధ

Mar 19 2015 6:36 PM | Updated on Sep 2 2017 11:06 PM

రాజేంద్రప్రసాద్ vs జయసుధ

రాజేంద్రప్రసాద్ vs జయసుధ

మా అధ్యక్ష పదవి ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీ పడటం దాదాపు ఖాయమైంది.

సినీ కళాకారుల సంఘం (మా) అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. ఈ పదవికి తాను దూరంగా ఉండనున్నట్లు ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. దాంతో ఆ పదవిని చేపట్టేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించారు.

అయితే.. ఈలోపు ఈ పదవికి తాను రంగంలో ఉంటానంటూ సహజనటి జయసుధ ముందుకొచ్చారు. ఆమెకు 'మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ మద్దతు పలికారు. ఆయన మద్దతుతో జయసుధ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక దశలో మంచు విష్ణు కూడా ఈ పదవికి పోటీ పడతారన్న కథనాలు వచ్చాయి గానీ.. ఆయన వాటిని ఖండించారు. తాను పోటీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు 'మా' అధ్యక్ష పదవి బరిలో రాజేంద్రప్రసాద్, జయసుధ నిలవడం దాదాపు ఖాయమైంది.

Advertisement
 
Advertisement
Advertisement