'క్వీన్' రీమేక్ ఆగిపోలేదట..! | Parul Yadav In Queen Remake | Sakshi
Sakshi News home page

'క్వీన్' రీమేక్ ఆగిపోలేదట..!

Apr 20 2017 1:04 PM | Updated on Sep 5 2017 9:16 AM

'క్వీన్' రీమేక్ ఆగిపోలేదట..!

'క్వీన్' రీమేక్ ఆగిపోలేదట..!

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను స్టార్ చేయానలి భావించిన త్యాగరాజన్, రేవతి దర్శకత్వంలో తమన్నా లీడ్ రోల్లో క్వీన్ను రీమేక్ చేయడానికి ప్లాన్ చేశాడు.

అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంలో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. కానీ త్యాగరాజన్ మాత్రం తమన్నా తప్పించి క్వీన్ రీమేక్ ను ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ముందుగా కన్నడ రీమేక్ ను ప్రారంభిస్తున్నాడు. పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో రమేష్ అరవింద్ దర్శకత్వంలో సినిమా ప్రారంభిస్తున్నాడు. తరువాత తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement