అతనితో ముద్దుకి సిగ్గుపడలేదు! | no shy to kiss him! | Sakshi
Sakshi News home page

అతనితో ముద్దుకి సిగ్గుపడలేదు!

Aug 1 2016 12:55 AM | Updated on Aug 21 2019 10:13 AM

అతనితో ముద్దుకి   సిగ్గుపడలేదు! - Sakshi

అతనితో ముద్దుకి సిగ్గుపడలేదు!

‘‘ఆర్క్ లైట్స్ వేడి.. చుట్టూ ఓ వంద మంది ఉన్నప్పుడు చేసే సీన్ బాగా రావాలనే ఆలోచన తప్ప పర్సనల్ ఫీలింగ్స్ ఏవీ ఉండవు.

‘‘ఆర్క్ లైట్స్ వేడి.. చుట్టూ ఓ వంద మంది ఉన్నప్పుడు చేసే సీన్ బాగా రావాలనే ఆలోచన తప్ప పర్సనల్ ఫీలింగ్స్ ఏవీ ఉండవు. ముద్దు సీన్ చేసినా అంతే. స్క్రీన్‌పై ముద్దు సీన్ పండాలనే ఆకాంక్ష తప్ప అందరూ చూస్తున్నారనే ఆలోచనే ఉండదు’’ అంటున్నారు పూజా హెగ్డే. ‘మొహంజొదారో’లో హృతిక్ రోషన్, పూజా హెగ్డే జంటగా నటించిన సంగతి తెలిసిందే.


ఇందులో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్‌తో పాటు లిప్‌లాక్ కూడా ఉంది. ఆ ముద్దు ముచ్చట చెప్పమని అడిగితే.. ‘‘అప్పటికే చాలా రోజుల నుంచి షూటింగ్ చేస్తుండడం వలన నేనూ, హృతిక్ స్నేహితులయ్యాం. దాన్నో ముద్దుగా చూడలేదు. ఓ మామూలు సీన్ చేసినట్లు చేశాం. ఎప్పుడు ముద్దు పెట్టుకోవడం ప్రారంభించామో.. ఎప్పుడు ముగించామో తెలియలేదు. నేనేం సిగ్గుపడలేదు.  బెస్ట్ ఆన్‌స్క్రీన్ కిస్‌లలో ఇది ఒకటిగా నిలుస్తుంది’’ అని పూజా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement