'కబాలి'కి లైన్ క్లియర్ | line clear to kabali release | Sakshi
Sakshi News home page

'కబాలి'కి లైన్ క్లియర్

Jul 21 2016 1:53 PM | Updated on Sep 4 2017 5:41 AM

'కబాలి'కి లైన్ క్లియర్

'కబాలి'కి లైన్ క్లియర్

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి' విడుదలకు అడ్డంకులు తొలగాయి.

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి' విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ సినిమా విడుదల కాకుండా స్టే ఇచ్చేందుకు చెన్నై హైకోర్టు నిరాకరించింది. 'లింగా' సినిమా డిస్ట్రిబ్యూటర్లు పిటిషన్ వేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. 'లింగా' సినిమా కారణంగా వచ్చిన నష్టాలను ఇప్పటివరకు రజనీకాంత్ చెల్లించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. తమకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసిన తర్వాతే కబాలి' సినిమా విడుదలకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. 'కబాలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలకానుంది.

రజనీకాంత్ నటించిన లింగా చిత్రం పరాజయం కావడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. భారీ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పరిహారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్మాత రాక్లైన్ వెంకటేశ్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పరిష్కారం కుదరలేదు. దీంతో పరిహారం కోసం రజనీకాంత్ ఇంటి ముందు భిక్షాటన చేసి ఆందోళన కూడా చేశారు. నిరహారదీక్షలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.

Advertisement
 
Advertisement
Advertisement