చైన్ కొట్టేస్తూ దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | Sakshi
Sakshi News home page

చైన్ కొట్టేస్తూ దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Published Tue, Apr 5 2016 8:27 PM

చైన్ కొట్టేస్తూ దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఎలమంచిలి (పశ్చిమగోదావరి): ప్రముఖ బహుళజాతి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కానీ, వ్యసనాలతో పక్కదారి పట్టిన అతడు ఓ మహిళ మెడలో బంగారు గొలుసును కొట్టేయబోయి స్థానికులకు చిక్కాడు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కాజా గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే బొరుసు మనోజ్ మద్యం, జూదానికి బానిసగా మారాడు.

స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొడ్డిపట్లకు వచ్చిన అతడు... మంగళవారం సాయంత్రం బైక్‌పై వెళుతూ కాజా గ్రామంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసు కాజేయబోయాడు. గొలుసు తెగి కిందపడిపోగా, అదే సమయంలో అతడి బైక్ కూడా ఆగిపోయింది. దీంతో స్థానికులు మనోజ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement