అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ? | Buggana Rajendranath reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ?

Mar 3 2016 1:48 PM | Updated on Jul 28 2018 3:23 PM

అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ? - Sakshi

అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గురువారం హైదరాబాద్లో మండిపడ్డారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గురువారం హైదరాబాద్లో మండిపడ్డారు. నిప్పులాంటి మనిషినని చెప్పకునే మీరు ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఫిరాయింపులు తెలంగాణలో జరిగితే అన్యాయం... అదే ఆంధ్రప్రదేశ్లో జరిగితే అభివృద్ధా ? అని అడిగారు. ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచినా... అధికార పార్టీలోకి చేర్చుకోవడమే చంద్రబాబు విజనా అని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితి గురించి మాట్లాడే బాబుకు అనర్హత చట్టం తెలియదా ? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  సందేహాం వ్యక్తం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement