ఆంధ్రప్రదేశ్ లో డెంగీ కాటుకు మరో బాలుడు బలయ్యాడు.
తాడిపత్రి: ఆంధ్రప్రదేశ్ లో డెంగీ కాటుకు మరో బాలుడు బలయ్యాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రామాపురానికి చెందిన శేఖర్, రాజమ్మ దంపతుల కుమారుడు తిమ్మరాజు (10) నాలుగు రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నాడు.
మొదట స్థానిక వైద్యుల వద్ద చికిత్స చేయించినా నయం కాకపోవడంతో అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం తిమ్మరాజును కర్నూలుకు తరలిస్తుండగా ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు.


