రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? | sujana Chowdary comments on AP special status | Sakshi
Sakshi News home page

రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా?

May 1 2016 9:31 PM | Updated on Mar 23 2019 9:10 PM

రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? - Sakshi

రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా?

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన సుజనా చౌదరి... 'మంత్రి పదవికి రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా తీసుకురాగలమా' అని ప్రశ్నించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రత్యేక హోదా మన హక్కు, దానిని వదులుకునేది లేదని స్పష్టంచేశారు. రాష్ట్రానికి ఏది ఉపయోగకరమైతే అది చేస్తామని చెబుతూ, ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు ఎలాంటి కార్యచరణ చేస్తున్నారో మాత్రం తెలపకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement