విజయవాడ అబ్బాయి... జర్మనీ అమ్మాయి | vijayawada boy married German girl | Sakshi
Sakshi News home page

విజయవాడ అబ్బాయి... జర్మనీ అమ్మాయి

Dec 29 2013 12:22 PM | Updated on Sep 2 2017 2:05 AM

విజయవాడ అబ్బాయి... జర్మనీ అమ్మాయి

విజయవాడ అబ్బాయి... జర్మనీ అమ్మాయి

కుల, మత, భాషా భేదాలనే కాదు... దేశ హద్దులను కూడా నిజమైన ప్రేమ చెరిపేస్తుందని మరోసారి నిరూపించింది బాలరాజు, అన్నామగ్ఢలీన వివాహబంధం.

విజయవాడ:  కుల, మత, భాషా భేదాలనే కాదు...  దేశ హద్దులను కూడా నిజమైన ప్రేమ చెరిపేస్తుందని మరోసారి నిరూపించింది బాలరాజు, అన్నామగ్ఢలీన వివాహబంధం. ఖండాంతరం దాటిన వీరి ప్రేమను ఇరువైపుల పెద్దలు అంగీకరించడంతో శనివారం వీరి వివాహం వైభవంగా జరిగింది.

విజయవాడలోని పెజ్జోనిపేటకు చెందిన బాలరాజు ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లారు. అక్కడ తాను చదివే కళాశాలలోనే చదువుతున్న ఆస్ట్రియాకు చెందిన ఆన్నామగ్ధలీన రాకుసన్‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. శనివారం స్థానిక ఆర్‌సీఎం చర్చిలో పూలదండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ  వేడుకకు బాలరాజు కుటుంబసభ్యులతో పాటు అన్నామగ్ధలీన తల్లిదండ్రులు ఒల్ఫ్‌గాంగ్ రాకుసన్,మిఖాయె హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement