కాకినాడ బీచ్‌లో విషాదం | Tragedy at Kakinada beach: 5 students on a picnic drown in sea | Sakshi
Sakshi News home page

కాకినాడ బీచ్‌లో విషాదం

Apr 6 2017 5:19 PM | Updated on Nov 9 2018 4:12 PM

కాకినాడ బీచ్‌లో విషాదం - Sakshi

కాకినాడ బీచ్‌లో విషాదం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సూర్యారావుపేట బీచ్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది.

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సూర్యారావుపేట బీచ్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. విహార యాత్ర కాస్తా విద్యార్థుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. సముద్ర స్నానానికి వెళ్లి తొమ్మిదిమంది విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో అయిదు మృతదేహాలు బయటికి కొట్టుకువచ్చాయి. మరో ముగ్గుర్ని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గల్లంతు అయిన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 మొత్తం 19 మంది కాకినాడ బీచ్కి విహర యాత్రకు వచ్చారు. వీరంతా  పక్కనే ఉన్న పాలరేవు మండలం కాపులపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందినవారు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులు వంశీ, పండు, శీలం దుర్గ, పితాని శ్రీను, అనితగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement