చంద్రబాబు తీరు దుర్నీతి కాదా? | ponguleti sudhakar reddy slams tdp government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తీరు దుర్నీతి కాదా?

Sep 22 2014 12:59 PM | Updated on Oct 9 2018 6:34 PM

చంద్రబాబు తీరు దుర్నీతి కాదా? - Sakshi

చంద్రబాబు తీరు దుర్నీతి కాదా?

అధికారిక కార్యక్రమాలకు ఒక మీడియాను అనుమతించకపోవడం దుర్నీతి కాదా అని పొంగులేటి సుధాకర్ రెడ్డి నిలదీశారు.

మీడియా స్వేచ్ఛ అంటూ నీతులు చెప్పే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్వహించే విలేకరుల సమావేశాలకు సాక్షి మీడియాను ఎందుకు అనుమతించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఇది దుర్నీతి కాదా అని ఆయన టీడీపీ సర్కారును ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయిలో అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలను మాత్రం అనుమతించకపోవడం సరికాదని పొంగులేటి హితవు చెప్పారు. ఇకనైనా తీరు మార్చుకుని అన్ని మీడియాల ప్రతినిధులను కార్యక్రమాలకు అనుమతించాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement