వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి | MLA Adhinarayana Reddy joined YSR Congress party | Sakshi
Sakshi News home page

వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

Oct 9 2013 7:51 PM | Updated on Mar 18 2019 8:57 PM

వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి - Sakshi

వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బుధవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బుధవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  'సమైక్య దీక్ష' శిబిరం వద్దకు వెళ్లి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.

ఆదినారాయణ రెడ్డి తన మద్దతుదారులతో కలసి భారీ సంఖ్యలో తరలివెళ్లి జగన్ను కలిశారు. సమైక్యాంధ్ర కోసం జగన్ చేపడుతున్న దీక్షకు సంఘీభావం తెలుపుతూ వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయన వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement