పట్టపగలే శృంగారం.. పది హేనేళ్ల జైలు

పట్టపగలే శృంగారం.. పది హేనేళ్ల జైలు - Sakshi


ఫ్లోరిడా: మనిషన్నాకా కూసింత ఇంగిత జ్ఞానం ఉండాలని అంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఎక్కడ, ఎప్పుడు, ఏది, ఎలా చేయాలి, ఏం పాటించాలనే కనీస జ్ఞానం ఉండాలని పెద్దలు అంటుంటారు. ప్రపంచంలో మనమే కాదు.. మనచుట్టూ ఎందరో ఉన్నారనే ఆలోచన నీడలా మనతోనే ఉండాలి. అప్పుడే చక్కటి క్రమశిక్షణ, ప్రవర్తన, గౌరవం అన్ని మన వెంట నడుస్తూ వస్తాయి. లేదంటే అవమానం, చీత్కారం, భంగపాటు, శిక్షలు తప్పదు. పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం.. చుట్టూ జనాలు.. అడుగు దూరంలో మూడేళ్లపాప.. ఇవేం పట్టించుకోకుండా ఓ జంట శృంగార చర్యలకు పాల్పడ్డారు.



దీంతో పద్ధతి పాటించని వారిద్దరికి పది హేనేళ్లు జైళ్లో గడపండి అంటూ శిక్ష విధించింది. ఫ్లోరిడాలో ఎలిస్సా అల్వారెజ్ (20), జోస్ కాబాల్లెరో(40) అనే జంట అందరూ చూస్తుండగా బ్రాదెంటాన్ బీచ్లో ఒళ్లు తెలియకుండా శృంగార కార్యకలాపాలకు పాల్పడ్డారు.  అక్కడ సేద తీరేందుకు వచ్చిన జనాలు వారి ప్రవర్తన చూసి అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటపడి.. చివరికి కోర్టు వరకు వెళ్లింది. దీంతో కోర్టు వారు చేసిన పనికి నిలదీసింది. మిట్టమధ్యాహ్నం చుట్టూ అంతమంది మనుషులు, పక్కనే చిన్న పాప కూడా ఉందన్న సోయి మరిచిపోయి అలాంటి చర్యకు ఎందుకు పాల్పడ్డారని ప్రశ్నించింది. చివరికి పదిహేనేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top