‘అటవీ’ ఉద్యోగాలకు 3.10 లక్షల దరఖాస్తులు | 3.10 lakhs of applications received for Forest officer jobs | Sakshi
Sakshi News home page

‘అటవీ’ ఉద్యోగాలకు 3.10 లక్షల దరఖాస్తులు

Mar 12 2014 3:31 AM | Updated on Oct 3 2018 5:26 PM

అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును ఈనెల 15వ తేదీ వరకూ పొడిగించారు. వాస్తవంగా దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది.

సర్వర్ సమస్యతో దరఖాస్తుల అప్‌లోడ్‌లో సమస్య
  ఫీజు చెల్లించిన వారికి 15 వరకూ దరఖాస్తు గడువు పొడిగింపు

 సాక్షి, హైదరాబాద్:  అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును ఈనెల 15వ తేదీ వరకూ పొడిగించారు. వాస్తవంగా దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. అయితే సర్వర్‌లో సమస్యవల్ల చాలామంది నిర్దిష్ట సమయంలో ఫీజు చెల్లించినప్పటికీ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేకపోయారు. సర్వర్ సమస్యవల్ల అభ్యర్థులకు కలిగిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులను అప్‌లోడ్ చేసుకునేందుకు గడువును ఈనెల పదో తేదీవరకూ పొడిగించినట్లు రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి బీఎస్‌ఎస్ రెడ్డి తెలిపారు. అయితే ఈనెల పదో తేదీలోగా ఫీజు చెల్లించిన వారికే గడువు పొడిగింపు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 2,167 పోస్టుల కోసం మంగళవారం ఉదయానికి సుమారు 3.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి.  15వ తేదీ నాటికి ఇంకా ఈ సంఖ్య పెరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement