కాంగ్రెస్‌ సమయం వృధా చేస్తోంది: వినోద్ | trs mp vinod kumar respond on currency ban | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సమయం వృధా చేస్తోంది: వినోద్

Nov 18 2016 2:04 PM | Updated on Sep 22 2018 7:50 PM

కాంగ్రెస్‌ సమయం వృధా చేస్తోంది: వినోద్ - Sakshi

కాంగ్రెస్‌ సమయం వృధా చేస్తోంది: వినోద్

పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలనడం సరికాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు.

న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలనడం సరికాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం  ఆయనిక్కడ మాట్లాడుతూ... నోట్ల కష్టాలపై పార్లమెంట్‌ లో చర్చించాలని సూచించారు. లోక్‌ సభలో కాంగ్రెస్‌ బాధ్యతాయుతంగా వ్యహరించడం లేదని విమర్శించారు. వాయిదాలతో సభా సమయాన్ని వృధా చేస్తోందన్నారు.

శనివారం ఉదయం తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రధాని మోదీని కలుస్తారని చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రధానికి కేసీఆర్‌ లిఖితపూర్వక సూచనలు ఇస్తారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement