మామకు అసభ్య చిత్రాలు.. అల్లుడి అరెస్టు | man arrested who sent obscene messages to father in law | Sakshi
Sakshi News home page

మామకు అసభ్య చిత్రాలు.. అల్లుడి అరెస్టు

Mar 21 2017 7:50 PM | Updated on Sep 2 2018 4:41 PM

మామకు అసభ్య చిత్రాలు.. అల్లుడి అరెస్టు - Sakshi

మామకు అసభ్య చిత్రాలు.. అల్లుడి అరెస్టు

భార్యతో గొడవపడ్డాడు. విడాకుల కేసులో విచారణలో ఉంది. అయినా ఊరుకోలేదు.

బనశంకరి: భార్యతో గొడవపడ్డాడు. విడాకుల కేసులో విచారణలో ఉంది. అయినా ఊరుకోలేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంది కదా అని అశ్లీల అసభ్య చిత్రాలు, మెసేజ్‌లు పంపసాగాడు. అయితే ఆ సందేశాలు మామగారి సెల్‌కు చేరడంతో కథ అడ్డం తిరిగింది.

వివర్లాల్లోకి వెళ్తే... కర్ణాటకలో హుబ్లీ నగరంలోని జయనగర లేఔట్‌లో ఉన్న ఓ యువతితో రెండేళ్లక్రితం అరుణ్‌నాయక్‌ అనే వ్యక్తితో వివాహమైంది. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల ఆమె తన తండ్రి సెల్‌ఫోన్‌ నుంచి అరుణ్‌నాయక్‌కు ఫోన్‌ చేసింది.

ఈ ఫోన్‌ తన భార్యదే అని భావించిన నిందితుడు నిత్యం అశ్లీల వీడియో దృశ్యాలు, ఫోటోలు వాట్సప్‌ ద్వారా పంపేవాడు. కానీ ఆ మొబైల్‌ భార్య తండ్రి వద్ద ఉండడంతో ఆయనకు వెళ్లేవి. అల్లుడి నిర్వాకాన్ని గమనించిన మామ హుబ్లి అశోకనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్యభర్తల విడాకుల కేసు హుబ్లీ ఫ్యామిలీ కోర్టులో ఉంది. కోర్టుకు హాజరుకావడానికి సోమవారం రాగానే పోలీసులు ఘరానా అల్లుడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement