సూర్య సినిమాకు కేటీఆర్ ప్రశంసలు | telangana minister KTR on suriya 24 | Sakshi
Sakshi News home page

సూర్య సినిమాకు కేటీఆర్ ప్రశంసలు

May 11 2016 8:17 AM | Updated on Sep 3 2017 11:53 PM

సూర్య సినిమాకు కేటీఆర్ ప్రశంసలు

సూర్య సినిమాకు కేటీఆర్ ప్రశంసలు

తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్, సూర్య హీరోగా తెరకెక్కిన ఎక్స్ పరిమెంటల్ సినిమా 24పై ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఉదయం ఈ సినిమాను చూసిన కేటీఆర్ చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు...

సూర్య హీరోగా తెరకెక్కిన ఎక్స్ పరిమెంటల్ సినిమా 24పై  తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఉదయం ఈ సినిమాను చూసిన ఆయన చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా చూసిన తరువాత 'ఇప్పుడే 24 సినిమాను చూశాను. బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన పర్ఫామెన్స్.. నా కూతురు, కొడుకు ఇప్పుడే 24 సినిమాను చూడాలన్నారు' అని ట్వీట్ చేశాడు.

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. కాలం లో ప్రయాణించటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కి మంచి టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో సూర్య నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement