మెగా మూవీకి హాలీవుడ్ టచ్ | hollywood stunt choreographer for Chiranjeevi syeraa | Sakshi
Sakshi News home page

మెగా మూవీకి హాలీవుడ్ టచ్

Aug 23 2017 3:46 PM | Updated on Sep 12 2017 12:51 AM

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు పోరాట యోధుడిగా నటిస్తున్నాడు. చిరు తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

ముఖ్యంగా యుద్ధం సన్నివేశాలు కీలకంగా రూపొందుతున్న ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా హాలీవుడ్ నిపుణుడు పనిచేస్తున్నాడు. స్పైడర్ మేన్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టోని చింగ్ సై రా కోసం పనిచేయనున్నాడు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement