వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల | YS Jagan Mohan reddy released YSRCP Manifesto | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల

Published Sun, Apr 13 2014 11:43 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల - Sakshi

వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. వైఎస్ఆర్ సీపీ కార్యాయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలోని అంశాలను గత నాలుగు నెలలుగా చెబుతూ వస్తున్నవేనని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం ఏయే పథకాలు అమలు చేస్తుందనే విషయాల్ని మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలిపారు. తెలంగాణ, సీమాంధ్రల కోసం వేర్వేరు మేనిఫెస్టోలను విడుదల చేశారు.

రాష్ట్రానికి స్వర్ణ యుగం అందించింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని జగన్ చెప్పారు. అభివృద్ధి తమ అజెండా అని జగన్ మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు మీడియాను మేనేజ్ చేయడంలో దిట్టని జగన్ విమర్శించారు. ఆయన చేసింది తక్కువ ప్రచారం చేసుకున్నది ఎక్కువని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు ఎలా ఉన్నాయి.. రాజశేఖర రెడ్డి పాలనలో ఎలా పరుగులు తీసింది బేరీజు వేసి జగన్ వివరించారు.

చంద్రబాబు హయాంలో వృద్ధి రేటు 5.7 శాతం ఉంటే.. దివంగత నేత పాలనలో 9.6 శాతం నమోదైందని జగన్ చెప్పారు. రాజశేఖర రెడ్డి మరణించాక వృద్ధిరేటు మళ్లీ దిగజారిందని తెలిపారు. ఇవన్నీ దివంగత మహానేత స్వర్ణ యుగానికి దిక్సూచి అని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ సాధించలేని అభివృద్ధి వైఎస్ఆర్ చేసి చూపించారని పేర్కొన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్ పాలనల్లో వ్యవసాయం, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో ఎలా అభివృద్ధి చెందింది.. ఇరువురి పాలనలో వ్యత్యాసాలను బేరీజు వేసి గణాంకాలతో సహా జగన్ వివరించారు. చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరి టీడీపీ నాయకులకు పంచిపెట్టారని ఉదాహరణలతో సహా వివరించారు. పారిశ్రామిక సంస్థలను ఎవరెవరికి దారాదత్తం చేసి పేర్లతో సహా వెల్లడించారు.

తాను గత నాలుగేళ్లుగా రాష్ట్రం నలువైపులా పర్యటించానని, గ్రామాల్లో ఎన్నో పేద గుడిసెలను చూశానని, పేదల కష్టాల గురించి తాను విన్నది, చూసినదే మేనిఫెస్టోలో చేర్చామని జగన్ చెప్పారు. ప్రజల కష్టాలను తాను ప్రత్యక్షంగా చూశానని, వారి సమస్యలను తీర్చడమే అజెండాగా మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరా రెడ్డి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • చంద్రబాబు హయాంలో వ్యవసాయం వృద్ధిరేటు 3.84శాతం
  • వైఎస్‌ హయాంలో వ్యవసాయం వృద్ధిరేటు 6.14శాతం
  • YS మరణం తర్వాత మళ్లీ పడిపోయిన వ్యవసాయ వృద్ధిరేటు 2.56%
  • బడ్జెట్‌లో వ్యవసాయానికి బాబు 2.46శాతం కేటాయించారు
  • బడ్జెట్‌లో వ్యవసాయానికి వైఎస్‌ 4.62 కేటాయించారు
  • బాబు హయాంలో పారిశ్రామిక వృద్ధిరేటు 6.17శాతం మాత్రమే
  • వైఎస్‌ హయాంలో పారిశ్రామిక వృద్ధిరేటు 10.5శాతం
  • అన్ని రంగాల్లో చంద్రబాబు కంటే...వైఎస్‌ఆర్‌ మెరుగైన పాలన అందించారు
  • బాబు హయాంలో సేవా రంగంలో 7.14శాతం పురోగతి నమోదు
  • వైఎస్‌ హయాంలో సేవారంగంలో 10.61శాతం పురోగతి నమోదు
  • బాబు హయాంలో ఐటీ రంగంలో మనవాటా 8శాతం
  • వైఎస్‌ హయాంలో ఐటీ రంగంలో మన వాటా 14శాతం
  • బాబు హయాంలో ఐటీ ఉద్యోగులు 81వేలు మాత్రమే
  • వైఎస్‌ హయాంలో ఐటీ ఉద్యోగులు 2.35లక్షలు
  • బాబు హయాంలో ఐటీ ఎగుమతులు 5వేల కోట్లు మాత్రమే
  • వైఎస్‌ హయాంలో ఐటీ ఎగుమతులు 26వేల కోట్లు
  • బాబు హయాంలో 65 ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయి
  • బాబు హయాంలో 26వేల మంది నిరుద్యోగులయ్యారు
  • చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థలను...టీడీపీ నేతలకు ధారాదత్తం చేశారు
  • ఆచరణ సాధ్యం కాని హామీలను చంద్రబాబు గుప్పిస్తున్నారు
  • చంద్రబాబు మాటలకు విశ్వసనీయత లేదు
  • అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు
  • ప్రజలను నా అంత దగ్గరగా ఏ నేతా చూడలేదు
  • ప్రజల కష్టనష్టాలన్నీ నాకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు
  • పేద ప్రజల ఇక్కట్లను ప్రత్యక్షంగా చూశా
  • వారి గుడిసెల్లో చాలాసేపు గడిపాను
  • అప్పటి నిరుపేద కష్టాలను రూపుమాపే విధంగానే మా మేనిఫెస్టో
  • రాష్ట్రబడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లు.. రాష్ట్రంలో వ్యవసాయరుణాలు మొత్తం రూ.1.27లక్షల కోట్లు
  • ఈ రుణాలు మాఫీ చేస్తామని బాబు చెప్తున్నారు
  • చంద్రబాబు.. బడ్జెట్‌ నుంచి రుణమాఫీ ఎలా సాధ్యం?


మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:

  • నిరుపేద పిల్లల కోసం అమ్మఒడి పథకం
  • ఈ పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లలకు రూ.500 చొప్పున..తల్లి బ్యాంక్‌ అకౌంట్‌లో జమ
  • ఒక్క కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే రూ.1000 జమ
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాక్షికంగా గాక మొత్తం ఫీజు చెల్లింపు
  • వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే... వృద్ధులకు రూ.700 ఫించన్‌ చెల్లింపు
  • 20 వేల కోట్ల రూపాయిల డ్వాక్రా రుణాలు మాఫీ.. రుణ విధానంలో మార్పులు


రైతుల కోసం

  • రూ.2వేల కోట్లతో ప్రకృతివైపరీత్యాల సహాయనిధి ఏర్పాటు
  • ఈ నిధి నుంచి రైతులను తక్షణమే ఆదుకుంటాం
  • అధికారంలోకి రాగానే రెండు జిల్లాలకు వ్యవసాయకాలేజీ
  • మూడు అగ్రికల్చర్‌, వెటర్నరీ యూనివర్శిటీల ఏర్పాటు
  • ప్రతి మండల కేంద్రంలో 102 మొబైల్ టీమ్‌ సర్వీస్‌
  • ఫోన్‌ చేసిన ప్రతీరైతుకు 20నిమిషాల్లో సేవలందిస్తుంది
  • ప్రతిమండల కేంద్రంలో 103 మొబైల్ టీమ్ సర్వీస్‌
  • డ్వాక్రా మహిళల రూ.20వేల కోట్ల రుణాల మాఫీ
  • డ్వాక్రా మహిళలకు రుణవిధానంలో మార్పు


గ్రామాల్లోకే ప్రభుత్వపాలన

  • ప్రతిగ్రామంలో ఒక ఆఫీస్‌ ఏర్పాటు
  • అక్కడే ఎవరికి ఏకార్డు కావాలన్న 24గంటల్లో జారీ
  • స్థానికుల్లో పదిమంది మహిళలకు ఆఫీస్‌లో బాధ్యతలు
  • వారే గ్రామంలో ఆడపోలీసుల్లా వ్యవహరిస్తారు
  • బెల్ట్‌షాపులపై నిఘా పెడతారు
  • పీఎహెచ్‌సీలు, స్కూల్స్, పీడీఎస్, పెన్షన్లు మానిటరింగ్ చేస్తారు
  • 20వేల పంచాయతీల్లో 2లక్షల మంది మహిళలకు ఉపాధి
  • ఐదేళ్లలో 50లక్షల ఇళ్లు
  • రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద ఉండకూడదు..అదే మాలక్ష్యం

     

ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు


ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయినవాళ్లకు... తిరిగి పనుల్లోకి వెళ్లేవరకు నెలకు రూ.3వేలు
ప్రతిజిల్లాలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి

మద్యం పై ఆంక్షలు 

  • నియోజకవర్గంలో ఒకచోట మాత్రమే మద్యం అమ్మకం
  • ప్రతినియోజకవర్గంలో వృద్దాశ్రమం, అనాధాశ్రమం
  • ఆతరువాత మండల కేంద్రాలకు ఆశ్రమాల విస్తరణ
  • వంటగ్యాస్‌పై రూ.100 సబ్సిడీ

ఉద్యోగుల కోసం..

  • ఉద్యోగులకు అత్యుత్తమ పీఆర్‌సీ
  • కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై కమిటీ
  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సర్వీస్ రెగ్యులరైజ్‌ చేస్తాం
  • ప్రతిఉద్యోగికి పక్కాఇళ్లు


బాబూ అన్ని ఉద్యోగాలు ఎలా సాధ్యం?

  • ప్రతిఇంటికి ఉద్యోగమంటూ బాబు అబద్దాలు చెప్తున్నారు
  • రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి
  • 3.5కోట్ల ఉద్యోగాలు సాధ్యమా?

హైదరాబాద్‌ను మించిన నగరం నిర్మాణం

  • 20 ఫాకల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు
  • 2019నాటికి విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా ఏర్పాటు
  • కొత్తగా కట్టే నగరంలో అన్ని సౌకర్యాలు
  • ప్రతిజిల్లాలో ఎయిర్‌పోర్ట్
  • అన్నిచోట్ల రేడియల్ రోడ్స్‌
  • శ్రీకాకుళం నుంచి బెంగళూరు, చెన్నైకి 8వే కారిడార్‌
  • కారిడార్‌ నిర్మాణంతో ఎంతో పురోగతి
  • ప్రతి జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌,..
  • స్టోరేజ్‌, ప్యాకేజింగ్ సౌకర్యం
  • కాలుష్యం లేని నగరంగా విశాఖ
  • పెట్రో యూనివర్శిటీ ఏర్పాటు
  • పెట్రోలియం సెక్టర్‌లో మంచి ఉపాధి అవకాశాలు, జీతాలు
  • యువత అటువైపు మళ్లేలా యూనివర్శిటీతో ప్రోత్సాహం
  • పేదలకు కట్టిచ్చే ఇళ్లకు పక్కా డాక్యుమెంట్లు
  • ఆఇళ్లపై పేదలకు పూర్తి హక్కు
  • అవసరమైతే ఆఇళ్లపై పావలావడ్డీకే రుణాలు
  • వైఎస్‌ఆర్ జిల్లాలో స్టీల్‌ప్లాంట్ విశాఖలో మెట్రో రైలు
  • విశాఖ, తిరుపతి, విజయవాడల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు

పారదర్శక పాలన

  • అవినీతికి తావులేని విధంగా పారదర్శక పాలన
  • పాలన వ్యవస్థలో వేగం
  • నిర్ణయాలు, పథకాల అమలుకు ముందే...ప్రభుత్వమే స్వయంగా హైకోర్టు, కాగ్‌ను ఆశ్రయిస్తుంది
  • అవసరమైన మార్పులు సూచనలు కోరుతుంది
  • ఆ తర్వాతే వాటి అమలు జరుగుతుంది
  • అయినప్పటికీ వాటిలో లోపాలు వెతికే ప్రయత్నం చేసి....
  • ఈనాడు వంటి పత్రికలు రాతలు రాస్తే, కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలని...
  • మేమే విజ్ఞప్తి చేస్తాం: వైఎస్‌ జగన్


ప్రతి పేదవాడి గుండెల్లో ఉండాలనే రాజకీయాల్లోకి వచ్చా: జగన్‌

 

  • ఆ రోజు నేను ఓదార్పుయాత్రను వదిలేసి ఉంటే... కేంద్రమంత్రిని అయ్యేవాడిని..
  • ఆ తర్వాత సీఎం కూడా అయ్యేవాడిని
  • దీనిపై సోనియా నాకు హామీ ఇచ్చారు
  • అయినా నిరుపేదల కోసం నేను రాజీ పడలేదు
  • నిరుపేదల సంక్షేమం అభివృద్ధి నా లక్ష్యం
  • ప్రతి పేదవాడి ఇంట్లో మహానేతతో పాటు... నా ఫొటో ఉండాలనేది కూడా నా లక్ష్యం: జగన్‌



 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement