పోటీ చేయనని ముందే చెప్పిన షర్మిల | Sharmila is not interest to contest: Vasireddy Padma | Sakshi
Sakshi News home page

పోటీ చేయనని ముందే చెప్పిన షర్మిల

Apr 14 2014 4:13 PM | Updated on Aug 29 2018 8:54 PM

వైఎస్ షర్మిల - Sakshi

వైఎస్ షర్మిల

ఎన్నికలలో పోటీ చేయనని వైఎస్ షర్మిల ముందే చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు.

హైదరాబాద్: ఎన్నికలలో  పోటీ చేయనని వైఎస్ షర్మిల ముందే చెప్పినట్లు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. పార్టీలో మొదటి నుంచి పని చేసినవారికే అభ్యర్థుల జాబితాలో చోటు దక్కినట్లు  ఆమె చెప్పారు.  పనిచేసిన వారికి ప్రాధాన్యత లభించిందన్నారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ కూడా పోటీ చేయనని ముందే చెప్పినట్లు ఆమె తెలిపారు. అందుకే ఆయన సోదరుడు రఘుకు అనకాపల్లి శాసనసభా స్థానం నుంచి అవకాశం కల్పించినట్లు  వాసిరెడ్డి పద్మ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement