నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వీధి కుక్కలు శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేశాయి.
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వీధి కుక్కలు శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేశాయి. ఇంటి బయట ఆడుకుంటున్న మమత అనే నాలుగేళ్ల చిన్నారిని చుట్టుముట్టి విపరీతంగా కరిచాయి. పాప ఏడుపులు విన్న కుటుంబసభ్యులు కుక్కలను తరిమేశారు. శరీరంపై 20కి పైగా కుక్క కాట్లతో తీవ్రంగా గాయపడిన బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


