'బుల్లెట్లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను' | will not afraid to anybody, says chandra babu naidu | Sakshi
Sakshi News home page

'బుల్లెట్లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను'

Jun 4 2015 3:08 PM | Updated on Aug 29 2018 6:26 PM

'బుల్లెట్లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను' - Sakshi

'బుల్లెట్లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను'

తాను బుల్లెట్లా దూసుకుపోతానని, ఎవ్వరికీ భయపడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

తాను బుల్లెట్లా దూసుకుపోతానని, ఎవ్వరికీ భయపడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు భయపడవని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలులో నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హోం మంత్రి తనపై కేసు పెడతానని చెబుతున్నారని, ఒక ముఖ్యమంత్రి అని కూడా లెక్కలేకుండా మాట్లాడుతున్నారని, వీటికి భయపడబోనని ఆయన అన్నారు.

నీతి, నిజాయితీలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని, తాము ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేశాము తప్ప.. టీఆర్ఎస్లా తప్పుడు రాజకీయాలు చేయలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేను తీసుకెళ్లి ఏం చేశారో టీఆర్ఎస్ చెప్పాలని ఆయన అడిగారు.

Advertisement
 
Advertisement
Advertisement