సభలో బాబు ‘భాషితాలు’..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శాసనసభలో మాట్లాడిన మాటలు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శాసనసభలో మాట్లాడిన మాటలు... పిచ్చపిచ్చగా చేస్తున్నారు. కూర్చోండి. మీరు మాట్లాడొద్దు. వాళ్లకు సభ్యతలేదు. పిచ్చాటలు ఆడొద్దు. తమాషాలు ఆడుతున్నారు. ఏం చేస్తారంట. ఎగిరిపడుతున్నారేంటి? మీ తండ్రి వల్లే కాలేదు. నువ్వెంత? తమాషాలు. ఇది హౌసనుకున్నారా. మీ ఇళ్లనుకున్నారా? మర్యాదగా చెప్తున్నా... తమాషాలు ఆడొద్దు. సభ్యత లేని మనుషులు. వదిలిపెట్టను మిమ్మల్ని. పోయి కూర్చోండి. ఇది ఇడుపులపాయ కాదు. లోటస్‌పాండూ కాదు. ఎందుకు వీరికింత పిరికితనం. డౌన్‌డౌన్ అనే అర్హత మీకు లేదు. పిచ్చిపిచ్చి పట్టింది. సిగ్గులేదు మీకు. అప్రజాస్వామికమంట... అప్రజాస్వామికం. నన్ను అనే అర్హత మీకు లేదు. మీ తీరు ప్రజాస్వామ్యానికే అపహాస్యం. సభా నాయకునిగా నాకు అన్ని అధికారాలున్నాయి. ఆ విషయం కూడా తెలియదు మీకు. సిగ్గులేదు. మీరు మనుషులు కాదు.


