ఘనంగా కొడాలి నాని జన్మదిన వేడుకలు | Kodali Nani celebrated the birthday celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా కొడాలి నాని జన్మదిన వేడుకలు

Oct 23 2014 2:16 AM | Updated on May 25 2018 9:17 PM

ఘనంగా కొడాలి నాని జన్మదిన వేడుకలు - Sakshi

ఘనంగా కొడాలి నాని జన్మదిన వేడుకలు

వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.

  • పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు
  •  వృద్ధులకు చీరల వితరణ
  •  ప్రభుత్వ ఆస్పత్రిలో  పళ్లు, రొట్టెల పంపిణీ
  • గుడివాడ : వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులతోపాటు పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు ఉదయాన్నే నాని నివాసానికి తరలి వచ్చి శుభాకాంక్షలు చెప్పారు.

    ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్ అడపా బాబ్జీ మాట్లాడుతూ ఎదురులేని ప్రజానాయకుడు కొడాలి నాని అని, అందుకే నియోజకవర్గ ప్రజలు వరుసగా ఎదురులేని మెజార్టీతో గెలిపిస్తున్నారని కొనియాడారు. అనంతరం పార్టీ రంగులతో అభిమానులు ఏర్పాటుచేసిన పెద్ద కేక్‌ను కొడాలి నాని కట్‌చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తాను నిత్యం ప్రజలతోనే ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు అభిమానలు అంతా ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

    పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, నాయకులు పాలడుగు రాంప్రసాద్, పాలేటి చంటి, పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు చోరగుడి రవికాంత్ ఆధ్వర్యంలో నానిని గజ మాలలతో సత్కరించారు. గుడివాడ ఎన్జీవోస్ సంఘం నాయకులు ఫరీద్‌బాషా, రాజేంద్రప్రసాద్ తదితరులు నానిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

    గుడ్లవల్లేరు మండల నాయకులు కొడాలి రామరాజు, తాళ్లూరి మాధవ, నంది వాడ మండల కన్వీనర్ పెయ్యల ఆదాం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేశిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మీగడ ప్రేమ్‌కుమార్, ఎంపీపీ పుట్టి శ్రీరావమ్మ, బేతపూడి నవరత్నరాజు, గుడివాడ ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సత్యనారాయణ, సుదేష్‌బాబు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

    గుడివాడ మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జీ, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వెంపల హైమావతి, బొమ్మారెడ్డి ధనలక్ష్మి, జ్యోతుల సత్యవేణి, అల్లం సూర్యప్రభ, మాదాసు వెంకటలక్ష్మి, చోరగుడి రవికాంత్, కిలిమి వెంకటరెడ్డి, సర్దార్‌బేగ్, కాటి విశాలి, పార్టీ మహిళా విభాగం పట్టణ కన్వీనర్ కాటాబత్తుల రత్నకుమారి, స్థానిక మార్కెట్ సెంటర్‌లో పండ్లవర్తక సంఘం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేక్‌కట్‌చేశారు.

    గంగానమ్మ చెట్టు వద్ద పట్టణ కాపుసంఘం నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. బేతవోలు లోని శాంతి వృద్ధుల ఆశ్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో చీరలు, పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ప్రచార కార్యదర్శి మట్టా విక్టర్, అల్లం రామ్మోహన్ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement