'చంద్రబాబు పుట్టుక తెలుగు తల్లికే అవమానం' | How can Chandrababu Naidu tour in Seemandhra, questions Sharmila | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు పుట్టుక తెలుగు తల్లికే అవమానం'

Sep 6 2013 2:15 PM | Updated on Oct 19 2018 8:11 PM

'చంద్రబాబు పుట్టుక తెలుగు తల్లికే అవమానం' - Sakshi

'చంద్రబాబు పుట్టుక తెలుగు తల్లికే అవమానం'

చంద్రబాబునాయుడు తెలుగు గడ్డ మీద పుట్టినందుకు... తెలుగు తల్లే అవమానంతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ షర్మిల మండిపడ్డారు.

నంద్యాల : చంద్రబాబునాయుడు తెలుగు గడ్డ మీద  పుట్టినందుకు... తెలుగు తల్లే  అవమానంతో  తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ షర్మిల మండిపడ్డారు.  ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారో  ప్రజలు నిలదీయాలని ఆమె  పిలుపునిచ్చారు. ఆరో రోజు సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల...నంద్యాలలో  ప్రసంగించారు. చంద్రబాబు పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోశారని ఆమె మండిపడ్డారు.

ఈ సందర్భంగా  ఆమె నంద్యాలలో పొట్టి శ్రీరాములు, వైఎస్ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో సమైక్య  శంఖారావ రథం దూసుకుపోతోంది. రాయలసీమ ప్రజలు తమ కాంక్ష సమైక్య రాష్ట్రమేనని నినదిస్తున్నారు. తిరుపతిలో ప్రారంభమైన సమైక్య శంఖారావం రాయలసీమ జిల్లాల్లో సమైక్య నినాదాన్ని వినిపిస్తూ ముందుకు సాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement