ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు, విజయకాంత్, ప్రకాష్ సింగ్ బాదల్, నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్, అద్వానీ
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి వెళుతుందన్న ఆశాభావం టిడిపి అధ్యక్షుడు, కాబోయే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి వెళుతుందన్న ఆశాభావం టిడిపి అధ్యక్షుడు, కాబోయే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డిఏ(నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ ప్రజలు మార్పును కోరుకున్నట్లు తెలిపారు. ఎన్డిఏ చైర్మన్గా ఎంపికైన మోడీని చంద్రబాబు శాలువతో సన్మానించారు. మన రాష్ట్రం నుంచి ఎన్డిఏ సమావేశానికి చంద్రబాబు నాయుడుతోపాటు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
ఈ ఉదయం చంద్రబాబు నాయుడు తమ ఎంపిలతో కలిసి బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడుతో సమావేశమయ్యారు. రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించారు. ఆ తరువాత ఆయన బిజెపి అగ్రనేత అద్వానీతో కూడా సమావేశమయ్యారు. సాయంత్రం గుజరాత్ భవన్లో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆయనతో కొద్దిసేపు సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్దికి సంబంధించిన అంశాలను ఆయనతో చర్చించారు.


