కోడిగుడ్డు రూ. 15 ... టమాటో కిలో రూ. 80... | 1 Egg Rs 15, 1 KG Tomato Rs 80 in Vizag | Sakshi
Sakshi News home page

కోడిగుడ్డు రూ. 15 ... టమాటో కిలో రూ. 80...

Oct 14 2014 10:05 AM | Updated on Sep 2 2017 2:50 PM

కోడిగుడ్డు రూ. 15 ... టమాటో కిలో రూ. 80...

కోడిగుడ్డు రూ. 15 ... టమాటో కిలో రూ. 80...

కోడిగుడ్డు రూ. 15, పాలు లీటర్ రూ. 80, పెట్రోల్ లీటర్ రూ. 100, టమాటో కిలో రూ. 80 ... ఇది విశాఖపట్నంలో నిత్యవసర ధరల రేట్లు.

విశాఖపట్నం: కోడిగుడ్డు రూ. 15, పాలు లీటర్ రూ. 80, పెట్రోల్ లీటర్ రూ. 100, టమాటో కిలో రూ. 80 ... ఇది విశాఖపట్నంలో నిత్యవసర ధరల రేట్లు. హుదూద్ తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నం నగరంతోపాటు మిగిలిన జిల్లాల్లో నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి. మొన్నటి వరకు హుదూద్ తుపాన్తో అతలాకుతలమైన సామాన్యుడు... ఇప్పుడు నిత్యవసర వస్తువుల ధరలతో విలవిల్లాడిపోతున్నాడు. ప్రజల నుంచి డబ్బులు దండుకునే సమయం ఇదేనంటూ అమ్మకందార్లు రెచ్చిపోతున్నారు.

దీంతో  నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి సామాన్యుడిలో నెలకొంది. నిత్యవసర ధరలు కొనుగోలు చేసేందుకు షాపుల వద్ద భారీగా ప్రజలు క్యూలో నిలబడ్డారు. అలాగే పెట్రోల్ బంకులు వాహానదారులతో కిక్కిరిపోయాయి.  తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా మున్సిపల్ పంపుల్లో నీరు రాకపోవడంతో నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement