కూటమి సర్కార్ రైతుల నడ్డి విరిచింది: వైఎస్ జగన్
తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మోంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు.
Read More
డిజిటల్ అరెస్ట్ స్కాం: షాక్‌తో ప్రాణాలిడిచిన రిటైర్డ్ ఆఫీసర్
ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. తాజాగా ముంబై పోలీసులమని చెప్పి పుణేకు ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేశారు. ఆగస్టు 16-సెప్టెంబర్ 17 మధ్య సాగిన ఈ వ్యవహారంలో ఆయన ఏకంగా 1.9 కోట్ల రూపాయలు మోసం పోవడంతో ఆయన గుండె ఆగిపోయింది.
Read More
క్యాబ్ డ్రైవర్నుంచి కోటీశ్వరుడిగా ఎదిగాడు
అమెరికాలో క్యాబ్ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించిన భారతీయ వలసదారుడు ఇప్పుడు సంవత్సరానికి రూ. 17కోట్లు సంపాదిస్తున్నాడు. పంజాబ్‌కు చెందిన మనీ సింగ్ 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు వెళ్లాడు. గంటకు 530 రూపాయల వేతనం నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఇపుడు రెండు కంపెనీఫౌండర్గా కోట్లు ఆర్జించే స్థాయికి చేరాడు.
Read More
స్వరోవ్స్కి అంబాసిడర్‌గా రష్మిక్ స్టైలిష్ లుక్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా లాస్ ఏంజిల్స్‌లో జరిగిన స్వరోవ్స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ ప్రారంభోత్సవ వేడుకలో స్టన్నింగ్ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంది. స్వరోవ్స్కీ స్థాపించి 130 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2025లో 130వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. "130 ఇయర్స్ ఆఫ్ లైట్ అండ్ జాయ్" అనే పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Read More
మన వంటకం దోసె..బ్రిటిష్ చెఫ్‌ని ఎంతలా మార్చేసింది..!
మన భారతీయ వంటకాలకు ఫిదా కానివారెవ్వరూ.!. దేశ దేశాలలో ఉన్న వివిధ రుచల యందు భారతీయుల రుచులు వేరయా అనొచ్చు కదూ..మనవాళ్లు టేస్ట్..మాములుగా ఉండదు. ఎందుకంటే మన దక్షిణ భారతదేశ బ్రేక్‌ఫాస్ట్‌లపై మనుసు పారేసుకున్న బ్రిటిష్ చెఫ్..ఎంతలా మన టేస్ట్‌కి దాసోహం అయ్యేడో తెలిస్తే విస్తుపోతారు. మరీ ఆ కథేంటో చకచక చదివేయండి మరి..
Read More
తెలంగాణలో రగ్బీ అభివృద్ధికై ఆదిత్య విజ్ఞప్తి
తెలంగాణ రగ్బీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆదిత్య వుత్పల.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సోనిబాలా దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీ విస్తరించేలా.. క్రీడాభివృద్ధి కొరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లోని ఆణిముత్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో రాష్ట్ర, జోనల్ స్థాయిల్లో ప్రోత్సాహం అందించాలని ఆదిత్య కోరారు.
ఆ హీరో ఆడిషన్‌కు పిలిచి అసభ్యంగా..
ప్రముఖ హీరో అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరలయింది. ఇదంతా ఏఐ మాయ అని.. అజ్మల్ వాటిని కొట్టిపారేశాడు. ఇలాంటి ఫేక్ వీడియోలతో కెరీర్ నాశనం చేయలేరు అని వీడియో రిలీజ్ చేశాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్ నర్విని దేరి.. అజ్మల్ అలాంటి దుర్మార్గుడే అంటోంది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2018లో చెన్నైలోని ఓ మాల్లో అజ్మల్‌ను తొలిసారి కలిశాను. ఆడిషన్..
Read More
Mumbai: నకిలీ శాస్త్రవేత్త అరెస్ట్.. లెక్కలేనన్ని బాగోతాలు వెల్లడి
ముంబై: దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా విభాగం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ కేంద్రంలో ఒక నకిలీ శాస్త్రవేత్తను అరెస్టు చేయడానికి తోడు, అతని నుంచి అనుమానిత న్యూక్లియర్ డేటా, 14 మ్యాప్‌లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలలో ఏదైనా గోప్యమైన న్యూక్లియర్ డేటా ఉన్నదీ లేనిదీ తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
Read More
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. బంతి తాకి 17 ఏళ్ల ఆస్ట్రేలియా యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ మృత్యువాత పడ్డాడు. ప్రీ మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంగా బౌలర్ సంధించిన ఓ బంతి బెన్ ఛాతీపై బలంగా తాకింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. రెండు రోజుల చికిత్స అనంతరం బెన్ తుదిశ్వాస విడిచాడు. బెన్ ఉదంతం ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్‌ను గుర్తు చేసింది.
Read More
Madhya Pradesh: రహస్య కెమెరాలో పోలీసు అధికారిణి.. ఏం చేస్తూ దొరికారంటే..
Read More
బంగారం జాక్‌పాట్! తులం ఎంతకు తగ్గిందంటే..
పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుదల బాట పట్టాయి. ఈ క్రమంలో బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు కూడా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
ప్రేయసి ఇంట ఉత్కంఠ.. ప్రియుడు హత్య.. యువతి, మామ ఆత్మహత్యాయత్నం
హమీర్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. తన ప్రియురాలికి బలవంతపు వివాహం చేస్తున్నారని తెలుసుకున్న ప్రియుడు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నాడు. అతనిని గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసి, హత్య చేశారు. ఇంతలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకోవడంతో అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు.
Read More
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్.. ప్రభాస్‌తో అలాంటి సీన్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి టాలీవుడ్లో పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి.
Read More
మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరోహీరోయిన్లు రాబోతున్నారా?
ఘట్టమనేని కుటుంబం నుంచి రాబోయే కొన్నేళ్లలో ఏడుగురు వరకు హీరోహీరోయిన్లు రాబోతున్నారు. తాజాగా కృష్ణ కూతురు మంజుల.. తన కూతురికి పుట్టినరోజు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ మహేశ్ ఫ్యామిలీ నుంచి రాబోతున్న తర్వాత తరం ఎవరెవరు?
Read More
గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్..లీవ్ ప్లీజ్!
సాధారణంగా ఉద్యోగులను బాస్‌ను లీవ్ అడగాలంటే భయం. నిజాయితీగా ఉన్నకారణం చెబితే లీవ్ ఇస్తారా? లేదా అనేదాంతో ఏవో వంకలు చెప్పేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేదనో, అబద్ధాలు చెప్పేస్తారు. అంతేకాదండోయ్.. అల్ రెడీ చనిపోయిన, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలను మళ్లి మళ్లీ చంపేస్తూ లీవ్ పెట్టే ప్రబుద్ధులు కూడా చాలామందే ఉన్నారు. బ్రేకప్ అయింది సార్. లీవ్ కావాలీ అంటూ పెట్టిన లీవ్ మెయిల్ చర్చకు దారి తీసింది.
Read More
మోంథా తుఫాను చలిగాలులు : జాగ్రత్తలు
మోంథా తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది. వర్షం, చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వర్షంలో తడవడం వల్ల జలువు, జ్వరం గొంతు నొప్పి లాంటి వ్యాధులు ముసిరే అవకాశం ఉంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిజాగ్రత్తలు పాటించాలి.
Read More
టీమిండియాకు బిగ్ షాక్..
ఆస్ట్రేలియాతో జరగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ జట్టు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ దూరమయ్యాడు. నితీశ్ ప్రస్తుతం తొడ కండరాల గాయం, మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి వారం రోజుల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. నితీశ్ ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన సంగతి తెలిసిందే.
Read More
తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీ ఉండగా.. ఎల్లుండి కేబినెట్లోకి అజారుద్దీన్ చేరనున్నారు. రాజభవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read More
కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్‌చేస్తే..
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో రోగల కారణంగా అవసరం కొద్ది పెళ్లిచేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. అవసరంతో ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!
Read More
బంగారం ధరల తుపాను! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
Read More
భారత్ కీలుబోమ్మగా ఆప్ఘనిస్తాన్.. పాక్ మంత్రి
పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ఆఫ్ఘనిస్థాన్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ఘనిస్థాన్ నాయకత్వం భారత్ కీలు బొమ్మగా మారిపోయిందంటూ విమర్శలు చేశారు. ఇస్లామాబాద్‌పై దాడి జరిగితే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి జరుగుతుంది అంటూ హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్ నాయకత్వం ఢిల్లీకి ఒక సాధనంగా వ్యవహరిస్తోంది. భారత్ కారణంగానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చర్చలు విఫలమయాయి.
Read More
ఏపీని నిండా ముంచిన మోంథా
విశాఖపట్నం: గత మూడు రోజులుగా తీర ప్రాంతాలను వణికించిన మోంథా.. తీరం దాటిపోయినా శాంతించడం లేదు. భారీగా ఈదురు గాలులు, వర్షాలతో ఏపీని వణికిస్తోంది. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో శరణార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు.. తుపాను నుంచి తీవ్రవాయుగుండంగా మారే క్రమంలోనూ భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ..
Read More
పాక్ సంతతి మహిళకు భారతీయ పౌరసత్వం
పాకిస్తాన్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలో పెచ్చరిల్లిన ఉగ్రవాదంతో విసిగిపోయిన ఓ అమ్మాయి ధైర్యంగా దేశం దాటింది. నేరుగా భారత రాజధాని ఢిల్లీకి చేరుకుంది. అనుకున్నట్లే భారతీయ స్థానిక వ్యాపారి పునీత్ కుమార్‌ను పెళ్లాడి ఇక్కడే ఉండిపోయింది. ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత ఆమె నిరీక్షణ ఫలించింది. 38 ఏళ్ల పూనమ్‌కు భారత పౌరసత్వం ఇస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
Read More
పాక్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రీజా హెండ్రిక్స్ (60) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా.. కార్బిన్ బాష్ (4-0-14-4), జార్జ్ లిండే (3-0-31-3), లిజాడ్ విలియమ్స్ (3.1-0-21-2) ధాటికి పాక్ 139 పరుగులకే ఆలౌటైంది.
Read More
రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ తారల ఇళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Read More
అద్భుతానికి శ్రీకారం చుట్టనున్నసౌదీ : ప్రపంచంలో తొలి స్కై స్టేడియం
అబ్బుర పరిచే లగ్జరీ భవనాలు, విశేషాలకు నిలయం సౌదీ అరేబియా. తాజాగా 2034 FIFA ప్రపంచ కప్ కోసం సౌదీ అరేబియా ప్రపంచంలోlo తొలి "స్కై స్టేడియం" నిర్మాణానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియా తన నియోమ్ మెగాసిటీ ప్రాజెక్ట్, ది లైన్లో భాగంగా 'నియోమ్ స్టేడియం' పేరుతో ఈ స్కై స్టేడియాన్ని నిర్మించనుంది. మికి దాదాపు 350 మీటర్ల ఎత్తులోదీన్ని నిర్మించనుంది.
Read More
కాబోయే భర్తను కళ్లారా చూసిన ఆనందం. అంతలోనే!
ఇటీవలికాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో సంభవిస్తున్నమరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా పెళ్లి ఒక రోజు ముందు నవ వధువు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో పెళ్లి బాజాలతో కళకళలాడాల్సిన వేదిక ఆత్మీయుల రోదనలతో విషాదంగా మారిపోయింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఈ ఘటన జరిగింది.
Read More
severe cyclone montha ఎమర్జెన్సీ టిప్స్
"మోంథా" తుఫాను కోస్తాతీర ప్రాంత వాసులను వణికిస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలుతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజలు స్వయంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాతావరణ అధికారుల సూచనలను ఎల్లపుడూ గమనిస్తూండాలి.
Read More
‘ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం..’
బిహార్‌లో మ్యానిఫెస్టో వేడి షురూ అయ్యింది. బిహార్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి మంగళవారం(అక్టోబర్ 28వ తేదీ) తమ మ్యానిఫెస్టోను ప్రకటించింది. ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే అంశాన్ని మ్యానిఫెస్టోలు చేర్చింది. తాము గెలిస్తే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాఘట్ బంధన్(మహా కూటమి) సీఎం అభ్యర్థి, ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు.
Read More
అదరగొట్టిన షమీ.. అగార్కర్‌కు దిమ్మతిరిగే కౌంటర్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. గుజరాత్‌తో పోరులో ఈ రైటార్మ్ బౌలర్ మొత్తంగా ఎనిమిది వికెట్లతో చెలరేగి బెంగాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా తనకు ఫిట్నెస్ లేదంటూ కామెంట్ చేసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్కు ‘బంతి’తోనే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.
Read More
వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!
సరికొత్త క్రీడా స్ఫూర్తిని నింపింది ఈ తల్లి. తన గెలుపుతో సరికొత్త అధ్యయానికి తెరతీసిందామె. గర్భంతో ఉన్నవాళ్లు చిన్న చిన్న బరువులు ఎత్తేందుకే భయపడతారు. అలాంటిది వెయిల్లిఫ్టింగ్లో పాల్గొనడమే కాదు విజయం సాధించింది ఈ మహిళ. స్థిరత్వం, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించొచ్చని నిరూపించింది ఈ తల్లి.
Read More
11 తెచ్చిపెట్టిన అదృష్టం
అబుదాబి: ఏడాదిన్నర కిందట యూఏఈ వెళ్లిన అతను.. ఈ అదృష్టాన్ని కలలో కూడా ఊహించి ఉండడు. దీపావళి పండుగ పూట.. అదీ తన అమ్మ సెంటిమెంట్ కారణంగా కోటీశ్వరుడు అయ్యాడు. రాత్రికి రాత్రే మారిపోయిన తన జీవితాన్ని చూసి ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు అనిల్‌కుమార్ బొల్లా. 1200 టికెట్ కొనుగోలు చేసి.. రూ.240 కోట్ల ప్రైజ్‌మనీ..
Read More
మరో వివాదంలో ప్రశాంత్ కిశోర్.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా!
పట్నా: ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) మరో వివాదంలో చిక్కుకున్నారు. బీహార్, బెంగాల్‌లలో ఓటరుగా నమోదు చేసుకోవడమే కాకుండా, తన చిరునామాగా టీఎంసీ కార్యాలయాన్ని చూపారు. పశ్చిమ బెంగాల్లో అతని పేరు 121 కలిఘాట్ రోడ్ చిరునామాతో ఓటరు జాబితాలో కనిపిస్తున్నది. బీహార్‌లో ససారాం పార్లమెంటరీ సీటు పరిధిలోకి వచ్చే కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకున్నారు.
Read More
Delhi: నేడు కృత్రిమ వర్షం.. కురిపిస్తారిలా.. ప్రయోజనమిదే..
Read More
ఓటీటీకి కాంతార చాప్టర్ 1.. అఫీషియల్ ప్రకటన
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.
Read More
సత్తా చాటిన తెలంగాణ ఆర్చర్ చికితా రావు
ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ ఆర్చర్ టి. చికితా రావు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం సొంతం చేసుకున్న చికితా.. టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. కాగా పంజాబ్‌లోని బతింఢాలో అక్టోబరు 25-27 మధ్య ఈ పోటీలు జరిగాయి.
అతడు అద్భుతం.. అహంకారం వద్దు: గంభీర్
టీమిండియాపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఆసీస్‌తో మూడో వన్డేలో శుబ్‌మన్, రోహిత్ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఛేదనలో వికెట్ కోల్పోకుండా 60కి పైగా పరుగులు చేయడం కలిసి వచ్చింది. ఆ తర్వాత రోహిత్-విరాట్ పార్ట్నర్షిప్ అత్యద్భుతం. రోహిత్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి’’ అన్నాడు. అదే విధంగా బౌలర్ హర్షిత్ రాణాను అభినందిస్తూనే ఒద్దికగా ఉండాలని సూచించాడు.
Read More
Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్‌గా అవ్వాలంటే..సిమర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే!
బరువు తగ్గే టాస్క్‌ని చాలా సింపుల్‌గా స్మార్ట్‌గా చేయాలంటే నిపుణులు లేదా అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించాల్సిందే. ఏదో భారంగా కాకుండా చాలా తెలివిగా తింటూ..వేగంగా బరువు తగ్గితే ఆ ఫీలే వేరు. మన సన్నిహితులు, స్నేహితులు హేయ్..! అంతలా ఎలా సన్నగా మారిపోయావు అంటే..పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అందుకోసం ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ టెక్నిక్స్ పాలో అయితే సరి..
Read More
స్వల్ప వివాదం, పేగులు బైటకొచ్చేలా దాడి, వేళ్లు నరికేశారు!
స్వల్ప వివాదానికే 22 ఏళ్ల లా విద్యార్థిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. మందుల ధర గురించి వాదన ప్రారంభమై, తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో బాధితుడు ప ప్రాణాపాయ స్థితిలో చిక్సిత పొందుతున్నాడు. ఆ విద్యార్థి ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేసునమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశాడు. ప్రదాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు.
Read More
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి 'బాహుబలి ఎపిక్', మాస్ జాతర తదితర సినిమాలు వస్తుండగా.. ఓటీటీల్లో మాత్రం మంచి క్రేజీ మూవీస్ రాబోతున్నాయి. లిస్టులో కాంతార ఛాప్టర్ 1, లోక, ఇడ్లీ కొట్టు.. చూడదగ్గ వాటిలో ఉన్నాయి. అలానే ఓ తెలుగు సిరీస్ కూడా ఇదే వీకెండ్లో అందుబాటులోకి రానుంది. ఓవరాల్‌గా ఏ మూవీస్ ఏ ఓటీటీలోకి రానుంది?
Read More
Kathika Masam 2025 ,ముఖ్యమైన రోజులు, కార్తీక పౌర్ణమి
పవిత్రమైన కార్తీకమాసం ఆరంభం, ముఖ్యమైన రోజులు కార్తీక పౌర్ణమి విశిష్టత అత్యంత మహిమాన్వితమైన మైన కార్తీకమాసంలో పుణ్యనదీ స్నానాలు, దీపారాధనలకు చాలా ప్రత్యేకత ఒక్కో రోజుకు ఒక్కో రకమైన అలాగే నాలుగు సోమవారాలు, కార్తిక ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి, నేతి దీపాల పరిమళంతో ఈ మాసం అంతా ఆధ్యాత్మిక సౌరభాలు విరబూస్తాయి.
Read More
Air India: ‘బొద్దింకను చనిపోయే వరకు ఉరితీశారు’
ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 24 (శుక్రవారం)ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఏఐ315 ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు బొద్దింకను చంపాడు. తన సీటు వద్ద కనిపించిన కాక్రోచ్‌ను ప్రయాణికుడు చంపిన ఘటనను విమాన సిబ్బంది లాగ్‌బుక్‌లో నమోదు చేశారు.
Read More
తుపాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు
మోంథా తుపాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రమత్తమైంది. ఏపీ పరిధిలో నేడు, రేపు మొత్తం 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తుఫాను తీవ్రత ఆధారంగా మరిన్ని మార్పులు చేయవచ్చని, ప్రయాణికులు గమనించాలని సూచించింది.
Bihar Election: ఎన్డీఏ, మహాకూటమిపై పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్‌లో ఎన్నికల వేడి నెలకొంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయ సందడి చేస్తున్నాయి. తాజాగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఎన్డీఏ, మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, తమ ‘జన్ సురాజ్’ పార్టీల మధ్యనే ఉంటుందని, మహాకూటమి ఓటమిపాలై, మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.
Read More
‘దేశం పరువు తీశారు’
న్యూఢిల్లీ: వీధి కుక్కల శాశ్వత షెల్టర్ల సంగతి పక్కన పెట్టి.. ముందు వాటిని పట్టుకుని శస్త్రచికిత్స చేసి తిరిగి వదిలేయాలంటూ ఆగష్టులో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని జాతీయ సమస్యగా పరిగణిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం.. ఆ ఆదేశాలూ అమలు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పుడు. సిగ్గు చేటు అంటూ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు..
Read More
Zakir Naik: హసీనా బహిష్కరిస్తే.. యూనస్ ఆహ్వానించారు!
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం అప్పటి హసీనా సర్కారు ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి ఎప్పటికీ ప్రవేశం లభించదని ప్రకటించగా దీనికి భిన్నంగా యూనస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 28-29 తేదీలలో ఢాకాలో జరిగే ఛారిటీ కార్యక్రమానికి జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పలికింది.
Read More
Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. లివ్ ఇన్ పార్ట్నర్ హతం
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన గాంధీ విహార్‌లో కలకలం రేపింది. ఇక్కడి ఒక ఫ్లాట్‌లో ఉంటున్న 32 ఏళ్ల యూపీఎస్సీ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుని లివ్ ఇన్ పార్ట్నర్తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు.
Read More
పసిడి పతనం.. కొనుగోలుదారులకు మంచి తరుణం
పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుదల బాట పట్టాయి. ఈ క్రమంలో ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More