Short Stories | Sakshi
1

ట్రంప్‌ టారిఫ్‌.. మోదీ స్ట్రాంగ్‌ మెసేజ్‌

న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 50 శాతం సుంకం విధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సుంకాలతో అధిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసని, అయినా రాజీపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారాయన. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. వాళ్ల కోసం దేనికైనా భారత్‌..
Read More
2

మరోసారి భారత్‌కు వార్నింగ్‌

వాషింగ్టన్‌: భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రష్యాతో ఇకనైనా చమురు వాణిజ్యం ఆపకుంటే.. పరోక్ష ఆంక్షలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. చైనా, ఈయూల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌.. భారత్‌ విషయంలో మాత్రమే ఎందుకిలా చేస్తున్నారనేదానిపైనా..
Read More
3

గ్రాండ్‌గా మధు ప్రియ సిస్టర్‌ పెళ్లి వేడుక

టాలీవుడ్ సింగర్ మధు ప్రియ చెల్లి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఆమె సిస్టర్‌ శృతి ప్రియ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది మధుప్రియ. తన చెల్లి పెళ్లిలో ఫుల్‌ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేసింది సింగర్. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
Read More
4

భారత్‌పై ట్రంప్‌​ టారిఫ్‌ బాంబ్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి టారిఫ్‌ బాంబ్‌ పేల్చారు. అదనంగా మరో 25 శాతం పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించారాయన. దీంతో భారత్‌పై అమెరికా విధించిన సుంకాల మోత 50 శాతానికి చేరింది. ఈ క్రమంలో అధికారిక ఉత్తర్వులపై ఆయన సంతకం చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మిత్ర దేశం అంటూనే రష్యాతో భారత్‌ మైత్రిపై..
Read More
5

పులివెందులలో టీడీపీ దాడులు అందుకే.. వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ జిల్లా: తన సొంత నియోజకవర్గం పులివెందులలో గత రెండ్రోజులుగా జరిగిన పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడిన నలుగురు పార్టీ నేతలనూ బుధవారం సాయంత్రం ఆయన ఫోన్‌ ద్వారా పరామర్శించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న అరాచ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో..
Read More
6

ఉత్తరాఖండ్‌ క్లౌడ్‌బరస్ట్‌.. వాళ్లంతా ఎక్కడా?

డెహ్రాడూన్‌: దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో క్లౌడ్‌బరెస్ట్‌ ఘోర విషాదానికి దారి తీసింది. బురదతో కూడిన వరద రెండు గ్రామాలపై విరుచుకుపడి పలువురు గల్లంతు అయ్యారు. ఇప్పటిదాకా ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. అయితే కేరళ నుంచి 28 మంది బృందం ఒకటి ఆచూకీ లేకుండా పోవడంతో ఆందోళన నెలకొంది. వాళ్లంతా..
Read More
7

పులివెందులలో టీడీపీ అరాచకం.. భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ

వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నారు. తాజాగా పులివెందుల మండలం నల్లగొండువారిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల రాముపై పచ్చ మూకల దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వారికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది.
Read More
8

Asia Cup 2025: టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి!

ఆసియా కప్‌-2025 నేపథ్యంలో టీమిండియా ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఈ మెగా టోర్నీ ఆడతాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది. స్పోర్ట్స్‌ హెర్నియాకు సర్జరీ చేయించుకున్న సూర్య.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే, ఆసియా కప్‌ నాటికి అతడు పూర్తి స్థాయిలో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తాడా? లేదా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు..
Read More
9

ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో సత్తాచాటిన మహ్మద్‌ సిరాజ్‌

ఐసీసీ టెస్టు బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ స‌త్తాచాటాడు. సిరాజ్ త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ ర్యాంక్ సాధించాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 12 స్ధానాలు ఎగ‌బాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అత‌డితో పాటు మ‌రో ఫాస్ట్ బౌల‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ప్రసిద్ద్‌ 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
Read More
10

'రాజాసాబ్' కొత్త అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత

ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా గురించి నిర్మాత విశ్వప్రసాద్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. అక్టోబరు కల్లా వర్క్ పూర్తవుతుందని.. కాకపోతే తెలుగు బయ్యర్లు సంక్రాంతికి రమ్మని అడుగుతున్నారని, త్వరలో రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తామని అన్నారు. అలానే పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.
Read More
11

నాకు మొదటి ఫోన్‌ గిఫ్ట్‌ ఇచ్చిందే ఆయనే: ఉదయ భాను

టాలీవుడ్ యాంకర్ ఉదయభాను కేవలం యాంకరింగ్‌ మాత్రమే కాదు.. నటిగానూ అభిమానులను మెప్పించింది. పలు చిత్రాల్లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఉదయభాను నటిస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్‌ కీలక పాత్రలో వస్తోన్న ఈ మూవీలో ఉదయభాను ఛాలెంజింగ్‌ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
Read More
12

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్‌లతో అందరినీ అలరిస్తూ ఉంటారు. జాక్వెలిన్ చేసిన రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతే వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక జాక్వెలిన్ త్వరలో వి. జయశంకర్ దర్శకత్వం వహించే మహిళా ప్రధాన చిత్రంలో నటించవచ్చని తెలుస్తోంది. దర్శకుడు జయ శంకర్ గతంలో ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.
13

సిరాజ్‌ ఎమోషనల్‌.. గిల్‌ రియాక్షన్‌ వైరల్‌

ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) క్యాచ్‌ మిస్‌ చేయడంపై టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) స్పందించాడు. తాను ఒకవేళ ఆ క్యాచ్‌ సరిగ్గా పట్టి ఉంటే.. ఆట ఐదో రోజుకు చేరి ఉండకపోయేదని అభిప్రాయపడ్డాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా కలిగిన బ్రూక్‌ విషయంలో తాను చేసిన పొరపాటు వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
Read More
14

ఐదో టెస్టులో టీమిండియా సంచలన విజయం

లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో టీమిండియా సమం చేసింది. ఈ విజయంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన సిరాజ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ మొత్తంగా 8 వికెట్లు పడగొట్టాడు.
Read More
15

మా కోడలికి దక్కిన గొప్ప గౌరవం: మెగాస్టార్‌ ట్వీట్‌

కోడలికి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ కో ఛైర్మన్‌గా అవకాశం దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. క్రీడల అభివృద్ధికి ఉపాసన నియామకం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది గొప్ప బాధ్యతతో పాటు మా కోడలికి దక్కిన గౌరవమని ట్వీట్ చేశారు. ఉపాసన నిబద్ధత, అభిరుచి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
Read More
16

కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ నేతల భేటీ.. కవిత, కాళేశ్వరంపై చర్చ!

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌తో పాటుగా కాళేశ్వరం కమిషన్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. కాసేపట్లో తెలంగాణ కేబినెట్..
Read More
17

‘లోకేశ్‌కు సీఎం పదవి.. చంద్రబాబు ఇంట్లో గొడవలు’

లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్‌ ఇంట్లో గొడవలు పెడుతున్నాడు. కుటుంబ కలహాలు పెరిగాయి. లోకేశ్‌ను అందుకే చంద్రబాబు పొగుడుతున్నారు. సరిగ్గా చదువుకోని లోకేశ్‌ను మంత్రిని చేశారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు లోకేశ్‌. చంద్రబాబు ప్రతీ విషయంలోనూ డ్రామాలు ఆడుతున్నారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు. ఢిల్లీలో పనిచేసే ఇతర దేశాల విలేకర్లకు నెలవారీ జీతాలు ఇస్తున్నారు. పదే పదే 90
Read More
18

ENG VS IND 5th Test: ఇంగ్లండ్‌ జట్టుకు శుభవార్త

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌ చివరి రోజు ఇంగ్లండ్‌ గెలవాలంటే 35 పరుగులు, భారత్‌ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు శుభవార్త అందింది. తొలి రోజు ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన క్రిస్‌ వోక్స్‌ అవసరమైతే బ్యాటింగ్‌కు తిరిగి వస్తాడని ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ తెలిపాడు.
Read More
19

గిల్‌, గంభీర్‌ తీరుపై అశ్విన్‌ ఆగ్రహం

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఆట తీరుపై భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) విమర్శలు గుప్పించాడు. నాయకత్వ బృందం వ్యూహాలు సరిగ్గాలేవని.. ప్రతి మ్యాచ్‌లోనూ ఆఖరి వరకు పోరాడినా ఓడిపోవడం హర్షించదగ్గ విషయం కాదన్నాడు. ఓవల్‌ టెస్టులోనూ పాత తప్పిదాలే పునరావృతం చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Read More
20

భారత్‌పై ట్రంప్‌ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు

డొనాల్డ్ ట్రంప్ కీలక సహాయకుడు స్టీఫెన్ మిల్లర్.. భారత్ వాణిజ్యం కారణంగానే రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తోంది. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే విషయంలో భారత్ దాదాపుగా చైనాతో సమానంగా ఉంది. భారత్‌ చేసుకుంటున్న దిగుమతులు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిధులు సమకూర్చడానికి సాయపడుతున్నాయి. ఇది..
Read More
21

కాళేశ్వరం లీక్స్‌!

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అయితే ఈ తుది నివేదికలోని విషయాలు ఇప్పుడు బయటకు పొక్కాయి. ఈ ప్రాజెక్టులో అవినీతి బాధ్యులంటూ మాజీ సీఎం కేసీఆర్‌ సహా పలువురి పేర్లను కమిషన్‌ ప్రస్తావించింది. అంతేకాదు..
Read More
22

డిషూమ్‌ గురు శిబు సోరెన్‌ కన్నుమూత

జేఎంఎం వ్యవస్థాపకుడు, జార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరెన్‌ ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ ఉదయం(ఆగష్టు 4న) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ధృవీకరించారు. జార్ఖండ్‌ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో కీలక నేతగా, కేంద్ర మాజీ మంత్రిగా, రాజ్యసభ్యుడిగానూ ఆయన విశేష సేవలందించారు. డిషూమ్‌ గురు అనే పేరు..
Read More
23

ఈ సీఈవో శాలరీ.. ఐటీ కంపెనీల్లోనే టాప్‌

ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌టెక్‌ సీఈవో సి.విజయకుమార్ రికార్డు స్థాయి వేతనం అందుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన 10.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.94.6 కోట్లు) సంపాదించారు. ఇది భారతీయ ఐటీ రంగంలో ఎగ్జిక్యూటివ్‌లు పొందుతున్న అత్యధిక వేతనంగా నిలిచింది.
Read More
24

యశస్వి జైస్వాల్‌ వరల్డ్‌ రికార్డు

‌టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాలో ఇంత వరకు టెస్టు క్రికెట్‌లో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో జైస్వాల్‌ సాధించిన సెంచరీ (వంద పరుగులు)లో 82 పరుగులు బిహైండ్‌ స్క్వేర్‌ పొజిషన్‌ నుంచి వచ్చినవే. ఇలా ఒక ప్రత్యేకమైన ఏరియా నుంచి ఏకంగా 82 పరుగులు సాధించి... శతకం పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా జైస్వాల్‌ ప్రపంచ రికార్డు సాధించాడు.
Read More
25

'కూలీ' తెలుగు ట్రైలర్ రిలీజ్

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ తదితరులు నటించిన 'కూలీ' మూవీ ట్రైలర్ రిలీజైంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ దర‍్శకత్వంపై ఈ ట్రైలర్ అంచనాలు అమాంతం పెంచేసేలా ఉంది.
Read More
26

ఆసియాక‌ప్‌-2025కు జస్ప్రీత్‌ బుమ్రా దూరం

ఆసియాక‌ప్‌-2025కు టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా దూర‌మయ్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ల దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే బుమ్రా ఎంపికపై చీఫ్ సెలక్టర్ అజిత్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తుది నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Read More
27

రష్యాతో భారత్‌ కటీఫ్‌.. ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రష్యా నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంటున్న చమురుపై ట్రంప్‌ స్పందించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయభారత్‌ ఇకపై రష్యా నుంచి చమురు కొనబోదని నేను అనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, నేను విన్నది సరైందో కాదో నాకు తెలియదు. భారత్‌ కనుక ఇలా చేస్తే అది మంచి నిర్ణయం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది మంచి చర్య.
Read More
28

ట్రంప్‌కు అంత సీన్‌ లేదు.. రష్యా కౌంటర్‌

అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దీనిపై రష్యా స్పందిస్తూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికా మోహరించినవి జలాంతర్గాములు సైతం రష్యా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
Read More
29

ప్రసిద్‌ కృష్ణపై జో రూట్‌ సీరియస్‌

ఇంగ్లండ్‌ దిగ్గజ బ్యాటర్‌ జో రూట్‌ (Joe Root)కు కోపమొచ్చింది. టీమిండియా యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ (Prasidh Krishna) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడు అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే..
Read More
30

పసికూనపై ప్రతాపం చూపించిన న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌ జట్టు పసికూన జింబాబ్వేపై తమ ప్రతాపాన్ని చూపించింది. బులవాయో వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బౌలర్లు చెలరేగిపోయారు. జింబాబ్వేను రెండు ఇన్నింగ్స్‌ల్లో 200 పరుగుల లోపే కట్టడి చేశారు. మ్యాట్‌ హెన్రీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఐదు వికెట్ల ప్రదర్శన సహా మ్యాచ్‌ మొత్తంలో 9 వికెట్లు తీశాడు.
Read More
31

రజినీకాంత్‌ కూలీ.. సెన్సార్‌ పూర్తి

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నారు.
Read More
32

మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్‌ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.
Read More
33

రేప్‌ కేసులో దోషిగా ప్రజ్వల్‌ రేవణ్ణ

బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ, జేడీఎస్‌ సస్పెండెడ్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణకు భారీ షాక్‌ తగిలింది. పని మనిషిపై అత్యాచారం, బెదిరింపుల కేసులో ఆయన్ని దోషిగా తేల్చింది బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం. 26 మంది సాక్షులను విచారించిన కోర్టు.. అరెస్టైన దాదాపు ఏడాది తర్వాత తీర్పు ఇవ్వడం గమనార్హం.
Read More
34

గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

రక్షాబంధన్‌కు ముందు ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
Read More
35

ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ రిలీజ్‌

న్యూఢిల్లీ: జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్య రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 66 ప్రకారం ఎన్నిక నిర్వహణ జరుగుతుందని ఈసీ శుక్రవారం తెలిపింది. ఈ క్రమంలో.. సెప్టెంబర్‌ 9వ తేదీన పోలింగ్‌ జరగనున్నట్లు పూర్తి వివరాలను విడుదల చేసింది. ఆ షెడ్యూల్‌ను పరిశీలిస్తే..
36

నారా లోకేష్‌కు స్ట్రాంగ్ కౌంటర్‌

హైదరాబాద్‌: ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తామేమీ అడ్డుకోలేదన్న లోకేష్‌ వాదనలో ఎలాంటి వాస్తవం లేదని.. ఆ టైంలో చంద్రబాబు 7 లేఖలు కేంద్రానికి రాసినట్లు ఆధారాలు చూపిస్తామని..
Read More
37

క‌రుణ్ నాయ‌ర్ ఫైటింగ్‌ హాఫ్ సెంచ‌రీ..

ఓవ‌ల్ మైదానం వేదిక‌గా ఇగ్లండ్‌తో జ‌రుగుతున్న ఐదో టెస్టులో భార‌త్ త‌డ‌బ‌డుతోంది. అయితే వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టును క‌రుణ్ నాయ‌ర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. నాయ‌ర్‌ 3146 రోజుల తర్వాత టెస్టుల్లో ఆర్ధ శ‌త‌కం సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 6 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగులు చేసింది. క్రీజులో క‌రుణ్ నాయ‌ర్‌తో పాటు వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(19) ఉన్నారు.
Read More
38

భారత్‌ వల్లే ఇదంతా.. పుతిన్‌ రెచ్చిపోతున్నారు..

భారత్‌, రష్యా చమురు కొనుగోలు విషయమై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్‌ కొంటున్న చమురుతోనే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. భారత్‌కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యాలను నిధులు సమకూరుతున్నాయి.
Read More
39

బంగ్లాదేశీ నటి కోల్‌కతాలో అరెస్ట్‌.. కారణం ఇదే..

‌‌దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన మోడల్‌ శాంతా పాల్‌(28)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె నకిలీ ఆధార్‌ కార్డులతో కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు నకిలీ ఆధార్‌ కార్డులు, ఓటర్‌ కార్డు, రేషన్‌ కార్డు, బంగ్లాదేశీ పాస్‌పోర్టులు ఉన్నట్టు గుర్తించారు. ఆమె పలు సినిమాల్లో నటించినట్లు తెలుస్తున్నది. టీవీ చానల్స్‌, యాంకర్‌గా..
Read More
40

వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనపై మొదలైన అక్రమ కేసుల పర్వం

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనపై అక్రమ కేసుల పర్వం మొదలైంది. వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డితో పాటు మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.
Read More
41

సుంకాల మోత మోగించిన ట్రంప్‌.. ఈసారి ఎంతంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాల మోత మోగించారు. 70 దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. సిరియాపై అత్యధికంగా 41 శాతం విధించగా.. కెనడాపై 25 శాతం నుంచి 35 శాతం, లావోస్‌, మయన్మార్‌పై 40 శాతం, స్విట్జల్యాండ్‌పై 39 శాతం, ఇరాక్‌, సెర్బియాపై 35 శాతం, భారత్‌పై 25 శాతం, పాకిస్తాన్‌పై 19 శాతం, బంగ్లాదేశ్‌పై 20శాతం, శ్రీలంకపై 20..
Read More
42

పసిడి ప్రియులకు వరుస ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్నటి మార్కెట్‌ సెషన్‌లో తగ్గిన పసిడి ధరలు ఈరోజు కూడా కాస్త దిగివచ్చాయి. గురువారంతో పోలిస్తే శక్రవారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
43

ఎట్టకేలకు ఏపీ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

ఏపీలో పోలీసు కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. పోలీస్‌ శాఖలో తీవ్ర సిబ్బంది కొరత నేపథ్యంలో 2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులకు నియామక ప్రక్రియను ప్రారంభించింది. అయితే న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో ఫలితాల విడుదల జాప్యమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఫలితాలను హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ విడుదల చేశారు.
Read More
44

ఎయిర్‌టెల్‌ కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.. ఓటీటీలన్నీ ఫ్రీ..

ఓటీటీ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్లాన్లలో చాలా వరకు ఖరీదైనవి లేదా ఒకటీ రెండు ఓటీటీ సర్వీసులకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తాయి. కానీ ఎయిర్‌టెల్ ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒకటీ రెండు కాదు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌ సహా రెండు డజన్లకు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Read More
45

ఊర్వశి రౌతేలా.. మ్యాచ్ కోసం వెళ్తే రూ.70 లక్షలు కొట్టేశారు!

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల వింబుల్డన్‌ టోర్నీ చూసేందుకు లండన్ వెళ్లగా తన ఖరీదైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది. దాదాపు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు కలిగిన తన లగ్జరీ సూట్‌కేస్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయ అధికారులు ఎలాంటి సహాయం చేయలేదని ఊ‍ర్వశి నిరాశ వ్యక్తం చేసింది.
Read More
46

ఓటీటీకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్‌ థ్రిల్లర్‌

ప్రస్తుత రోజుల్లో ఓటీటీలు సరికొత్త కంటెంట్‌తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఓటీటీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగానే డిఫరెంట్‌ కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Read More
47

దేశ ప్రయోజనాలే ముఖ్యం.. ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటనపై పియూష్‌ గోయల్‌

సాక్షి,న్యూఢిల్లీ: దేశ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ అన్నారు. ఆగస్టు 1 నుంచి భారత వస్తువులపై 25శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై.. లోక్‌సభలో పీయూష్‌ గోయల్‌ మాట్లాడారు.
Read More
48

పతనమైంది భారత ఆర్థికం కాదు.. మీ రాజకీయ భవిష్యత్తు

సాక్షి,న్యూఢిల్లీ: ఇండియన్‌ ఎకానమీ డెడ్‌ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సమర్ధించారు. ప్రధాని మోదీ హయాంలో భారత ఆర్ధిక వ్యవస్థను చంపేశారని సంచలన కామెంట్స్‌ చేశారు.
Read More
49

ధర్మస్థళ మిస్టరీ.. వెలుగులోకి కీలక ఆధారాలు

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థళ సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇవాళ మానవ అవశేషాలు బయటపడ్డాయి.
Read More
50

పేటీఎంలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు

రాఖీ, జన్మాష్టమి తదితర పండుగల సందర్భంగా ట్రావెల్‌ మెగా ఫెస్టివల్‌ సేల్‌ కింద ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నట్లు పేటీఎం (వన్‌97 కమ్యూనికేషన్స్‌) వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా విమాన సర్వీసుల్లో 12%, అంతర్జాతీయ రూట్లలో 10%, బస్‌ బుకింగ్స్‌పై 20 % డిస్కౌంటు పొందవచ్చు.
Read More