
అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (Andre Russel)పై ఆ జట్టు బౌలర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ప్రశంసలు కురిపించాడు. ఇప్పట్లో అతడు రిటైర్ కాబోడని.. కనీసం మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు కేకేఆర్ రసెల్‌ను రూ. 12 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది.

బనానాతో హెల్దీగా.. టేస్టీగా!
వేసవి సెలవులొచ్చేశాయి. ఈ సమయంలో పిల్లలకి పోషకమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడం చాలా అవసరం. పిల్లలు సైతం సిద్ధం చేసుకోగలిగే ఈజీ రెసిపీల గురించి తెలుసుకుందాం. వీటిల్లో బనానా రెసిపీలు మొదటి వరసలో ఉంటాయి. పైగా అవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.
Read More

పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు
దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.
Read More

తప్పతాగి పిచ్చి చేష్టలు, తిక్క కుదిర్చిన ఇండిగో
ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడో వ్యక్తి. మద్యం తాగి, ఆమె పట్ల అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్‌ను వేధించాడన్న ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read More

ఫారం 16లో జరిగిన మార్పులు ఇవే.. గమనించారా?
2024–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారంలో 16 మార్పులు వచ్చాయి. మీ యజమాని ఈ మార్పులు చేసిన తర్వాత మీకు ఫారం 16 జారీ చేస్తారు.
Read More

భువనగిరి సినిమాలకు సిరి
హైదరాబాద్ శివారులోని యాదాద్రి భువనగిరి జిల్లా.. సినిమాలు, టెలిఫిల్మ్‌లు, యాడ్ ఫిల్మ్‌ల షూటింగ్‌లకు అనుకూలంగా ఉండటం దర్శక నిర్మాతలకు కలిసొస్తోంది. పేరు మోసిన డైరెక్టర్లు, హీరో, హీరోయిన్లతో ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. పల్లె వాతావరణం, ప్రకృతి రమణీయత, పచ్చని వరి పొలాలు, చెరువులు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, గుట్టలు ఫిలిం సిటీ పక్కనే ఉండటం..సినిమా నిర్మాణానికి అనుకూలంగా ఉంది.
Read More

కాపురాల్లో డబ్బు చిచ్చు!
మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది.
Read More

IND vs ENG: బుమ్రాకు భారీ షాక్!
ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇందుకు కారణం ఏమిటంటే..
Read More

విశాఖలో విషాదం
విశాఖలోని సీతమ్మధారలో విషాదం నెలకొంది. సితార అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పూర్ణిమ (38) ఈరోజు ఉదయం తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది. ఈ సందర్భంగా ఆమెపై చెట్టు విరిగి పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో కారు, బైక్ సహా ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి.
Read More

హైవే-363ని జాతికి అంకితమిచ్చిన గడ్కరీ
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో నితిన్ గడ్కరీ జాతీయ రహదారి 363ని గడ్కరీని జాతికి అంకితం చేశారు. జాతీయ రహదారులతో దేశాన్ని అనుసంధానిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్రమంత్రిగా ప్రజల సమస్యలను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. గడ్చిరోలి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నేను ఇంజనీర్‌ను కాదు.. కానీ, 13 డాక్టరేట్లు వచ్చాయి. చీకటి ఉన్న చోటనే వెలుగు
Read More

బోర్డర్ టెన్షన్.. జమ్ముకశ్మీర్‌లో జైళ్లకు భద్రత పెంపు
కశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన..
Read More

రైతులకు బాసటగా..
తాడేపల్లి: అకాల వర్షాలు పడతాయని తెలుసు. అయినా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. అధికార యంత్రాంగం నిస్తేజంలో ఉండిపోయింది. ఫలితంగానే.. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. కానీ, ప్రభుత్వం నుంచి వాళ్లకు పరిహారం ఇప్పించాల్సిన బాధ్యత మనది. అందుకే నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లండి. వాళ్లను పరామర్శించండి అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
Read More

వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలు
ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభిస్తే దేశీయంగా రెస్టారెంట్ రంగం 2028 నాటికి 1.5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) వైస్ ప్రెసిడెంట్ జొరావర్ కల్రా తెలిపారు. ఇందుకోసం ‘పరిశ్రమ’ హోదా కల్పించాలని, జీఎస్టీపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాల్లాంటివి ఇవ్వాలని కోరారు.
Read More

యుద్దానికి సిద్దమంటున్న పాక్..
భారత్ యుద్ధ సన్నద్దత వేళ పాకిస్తాన్ అలర్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌తో నెలకొన్న పరిస్థితులను సివిల్, మిలిటరీ నాయకత్వం.. అఖిలపక్ష భేటీలో చర్చించినట్టు సమాచారం. భారత్ దాడి చేస్తే తమ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో రాజకీయ పార్టీలకు పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి వివరించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం పీటీఐ..
Read More

నీతా అంబానీ ఫిట్నెస్, కోచ్ చెప్పి రహస్యాలు
వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ భార్య రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం తన ఫిట్నెస్ రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. తాజాగా నీతా ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Read More

పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Read More

వైభవ్ ఆట ఆకట్టుకుంది: ప్రధాని మోదీ ప్రశంసలు
ఐపీఎల్-2025 (IPL 2025)లో సంచలన బ్యాటింగ్‌తో అందరికంటా పడిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలతో ముంచెత్తారు. అతడు పడిన కష్టం, ఆడిన తీరు తనని అమితంగా ఆకట్టుకుందని అన్నారు. బిహార్‌లో ‘ఖేలో ఇండియా’ గేమ్స్ ఆరంభోత్సవం సందర్భంగా మోదీ వీడియో సందేశం ఇచ్చారు.
Read More

ఎన్నడూ లేనంత ఆర్థిక అనిశ్చితి
ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గణనీయంగా తగ్గించేసింది. కరోనా సమయం కంటే అధిక అనిశ్చితి నెలకొన్నట్టు పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2025లో 2.8 శాతం, 2026లో 3 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని తాజాగా అంచనా వేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి 2025లో 0.8 శాతం, 2026లో 1.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.
Read More

IPL 2025: సన్‌రైజర్స్ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్
గాయపడిన స్మరణ్ రవిచంద్రన్ స్థానంలో విదర్భ లెఫ్డ్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే (30 లక్షలు) సన్‌రైజర్స్ జట్టులోకి వచ్చాడు. 22 ఏళ్ల హర్ష్ .. తాజాగా ముగిసిన రంజీ సీజన్లో రికార్డు స్థాయిలో 10 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు (7 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు రెండు 10 వికెట్ల ప్రదర్శనలు) తీసి, రంజీ చరిత్రలోనే ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.
Read More

కూకట్‌పల్లిలో కాజల్ అగర్వాల్ సందడి
కూకట్‌పల్లిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సందడి చేశారు. నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న వాసవి శ్రీశ్రీ సిగ్నేచర్‌లో ఓ బంగారు ఆభరణాల షోరూంను ఆదివారం ఆమె ప్రారంభించారు. కాజల్‌ను చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు. వారికి కాజల్ అభివాదం చేసి ఆత్మీయంగా పలకరించారు.

లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:16 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు పెరిగి 24,478కు చేరింది. సెన్సెక్స్(Sensex) 391 పాయింట్లు పుంజుకుని 80,891 వద్ద ట్రేడవుతోంది.
Read More

IPL 2025: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ రిషబ్ పంత్
నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్జీపై పంజాబ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేయగా.. ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన లక్నో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలక దశలో మ్యాచ్ కోల్పోయినా లక్నో కెప్టెన్ పంత్ ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ధీమా వ్యక్తం చేశాడు.
Read More

సినిమాపై 100 శాతం సుంకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై వంద శాతం సుంకాలు విధించారు. అమెరికా చలన చిత్ర పరిశ్రమ తిరిగి బాగుపడడమే తన ఉద్దేశమని, కొన్ని దేశాలు అమెరికా సినిమాను చంపే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారాయన. ఈ క్రమంలో హాలీవుడ్, అమెరికా లోని ఇతర లొకేషన్లలో షూటింగ్ జరగాలనే కామెంట్ చేశారు.
Read More

సరళతర ఎఫ్‌డీఐ విధానం.. అవకాశాలు అపారం
భారత్ అమలు చేస్తున్న సరళతర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం (ఎఫ్‌డీఐ) విదేశీ ఇన్వెస్టర్లకు అపారమైన పెట్టుబడి అవకాశాలను ఆఫర్ చేస్తోందని డెలాయిట్ ఇండియా తెలిపింది. ఫార్మాస్యూటికల్స్, ఆటో, పర్యాటక రంగాలకు ఎఫ్‌డీఐలను ఆకర్షించే శక్తితోపాటు ఉపాధి కల్పనకు చోదకాలుగా నిలవగలవని పేర్కొంది. వీటికితోడుగా ఎగుమతులు, ఆవిష్కరణలు భారత్ తదుపరి దశ వృద్ధిని నడిపించగలవని తెలిపింది.
Read More

మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్
దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ పలు కీలక అంశాలపై ఆధారపడనుంది. దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షకు తెరతీయనుంది. మరోపక్క భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ వారం ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
Read More

త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ
కేంద్రీకృత కేవైసీ (నో యువర్ కస్టమర్) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ, ఆర్థిక నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. కస్టమర్ల కేవైసీ వివరాలను ఒకే చోట నిర్వహించేదే సెంట్రల్ కేవైసీ. దీనివద్ద కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తే.. అన్ని ఆర్థిక సంస్థల వద్ద ఆటోమేటిక్‌గా అది అప్డేట్ అయిపోతుంది.
Read More

భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్‌తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More

‘మీరు ఒక్క క్షిపణి దాడి చేశారు.. ఇక మేమేంటో చూపిస్తాం’
తమ దేశంపై హౌతీ రెబల్స్ చేసిన క్షిపణ దాడికి అంతకుమించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాము ఏంటో చూపిస్తామంటూ హౌతీ తిరుగుబాటుదారులను..
Read More

క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ సరసన ప్రభ్‌సిమ్రన్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్ (PBKS vs LSG)తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, దురదృష్టవశాత్తూ శతకానికి తొమ్మిది పరుగుల దూరంలో ప్రభ్‌సిమ్రన్ ఆగిపోయాడు. అయితేనేం.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రిస్ గేల్, కేఎల్ రాహల్ (KL Rahul)సరసన నిలిచాడు.
Read More

మరో కాంతార లాంటి సినిమా.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్. ఆ తర్వాత వీర చంద్రహాస చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్, ఉదయ్ కడబాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు.
Read More

ఏపీకి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
రాబోవు కొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దాంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
Read More

IND vs SL: టీమిండియాకు చేదు అనుభవం.. లంక చేతిలో ఓటమి
Sri Lanka Women vs India Women: ముక్కోణపు వన్డే సిరీస్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో ఆదివారం నాటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా శ్రీలంక- భారత్- దక్షిణాఫ్రికా (Sri Lanka- India- South Africa) మధ్య లంక వేదికగా త్రైపాక్షిక సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Read More

మీరు యుద్ధంలో పాల్గొంటారా?.. లేదు.. ఇంగ్లండ్ పారిపోతా: పాక్ ఎంపీ
తమపై భారత్ యుద్ధానికి దిగితే ఏంటనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ లో కనిపిస్తోంది. భారత్ తో పోరాడే పూర్తి శక్తి సామర్థ్యాలు ఏ రకంగా చూసే పాక్ కు లేవు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ నిజంగా భారత్ యుద్ధానికి దిగితే మాత్ర..
Read More

మాకు కావాల్సింది భాగస్వాములు.. బోధకులు కాదు: జై శంకర్
యూరోపియన్ దేశాలపై భారత విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు జైశంంకర్. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ..
Read More

నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..!
నిన్న మొన్నటి వరకు అతడు పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తుండేవాడు. అనుకోకుండా ఒక రోజు న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కంటపడ్డాడు. అంతే, అతడి అదృష్టం మారిపోయింది. ఉన్నపళాన ఫ్యాషన్ మోడల్‌గా మారిపోయాడు. ఫ్యాషన్ మోడల్‌గా మారిన ఈ ఇరవైనాలుగేళ్ల పిజ్జా మేకర్ పేరు క్రిస్టియానో వెన్‌మన్.
Read More

ధీరూభాయ్ అంబానీ అసలు పేరేంటో తెలుసా?
భారదేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. రిలయన్స్ సామ్రాజ్యం గురించి తెలిసిన దాదాపు అందరికీ, ఈ కంపెనీ ప్రారంభించిన వారు ధీరూభాయ్ అంబానీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధీరూభాయ్ అంబానీ అసలు పేరు ఏమిటో.. బహుశా చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది.
Read More

మాక్సీ స్థానంలో మరో ఆస్ట్రేలియా స్టార్.. పంజాబ్ ప్రకటన
పంజాబ్ కింగ్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్థానాన్ని మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ ఓవెన్‌తో పంజాబ్ యాజమాన్యం భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
Read More

బెర్క్‌షైర్ హాత్వేను వీడనున్న వారెన్ బఫెట్: నెక్స్ట్ సీఈఓ ఎవరంటే?
శనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.
Read More

కంపెనీల కార్పొరేట్ ఫలితాలు ఇలా..
రిటైల్ స్టోర్ల దిగ్గజం షాపర్స్‌స్టాప్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 91 శాతంపైగా పడిపోయి రూ. 2 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23 కోట్లుపైగా ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 1,064 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,046 కోట్ల అమ్మకాలు సాధించింది.
Read More

RCB VS CSK: చరిత్రలో తొలిసారి ఇలా..!
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ జట్టు తొలిసారి సీఎస్కేపై ఇంటా బయటా (ఒకే సీజన్లో) విజయాలు సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) హోం గ్రౌండ్లో సీఎస్కేపై విక్టరీ సాధించిన ఆర్సీబీ.. ఈ సీజన్ అవే మ్యాచ్‌లోనూ (సీఎస్కే హోం గ్రౌండ్లో) సీఎస్కేను చిత్తు చేసింది. బెంగళూరులో సీఎస్కేపై 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన ఆర్సీబీ.. మే 28న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Read More

ఐపీవోకు సిద్ధమవుతున్న ప్రముఖ కంపెనీలు
ఆభరణాల రిటైల్ కంపెనీ ప్రయారిటీ జ్యువెల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 54 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 75 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.
Read More

లోకల్ కంటెంట్‌పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడి
డిస్నీ-రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పడిన మీడియా సంస్థ జియోస్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.32,000-33,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం రూ.30,000 కోట్ల పెట్టుబడితో పోలిస్తే 7% అధికం. స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ విస్తరణపై ఫోకస్‌గా ఉన్న కంపెనీ దేశవ్యాప్తంగా స్థానిక కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది.
Read More

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ
ఒకసారి ఛార్జ్ చేస్తే యాభై సంవత్సరాలు నిరాటంకంగా పని చేసేలా కాంపాక్ట్ న్యూక్లియర్ బ్యాటరీలను రూపొందిస్తున్నట్లు చైనీస్ బ్యాటరీ తయారుదారు బీటెవోల్ట్ ప్రకటించింది. ఇది కాంపాక్ట్ న్యూక్లియర్ ఎనర్జీలో పురోగతిని సూచిస్తుంది. బీవీ 100 నికెల్-63 ఐసోటోపులను ఉపయోగించి రేడియోధార్మికత ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.
Read More

IPL 2025: భారీ రికార్డును సొంతం చేసుకున్న ధోని.. కోహ్లి కూడా సాధ్యం కాలేదు..!
ఐపీఎల్లో ఎంఎస్ ధోని మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓ జట్టుపై 50 సిక్సర్లు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనికి ముందు క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు. గేల్ పంజాబ్ (61), కేకేఆర్‌పై (54) 50 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టగా.. రోహిత్ ఢిల్లీపై (50) ఈ ఘనత సాధించాడు.
Read More

పాకిస్థాన్ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?
పాకిస్థాన్ మొత్తం రుణం పాక్ రూపాయి(పీకేఆర్)ల్లో 70.36 ట్రిలియన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.21.15 లక్షల కోట్లు) చేరింది. ఇందులో దేశీయ, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు రెండూ ఉన్నాయి. వీటిలో గణనీయమైన భాగం చైనాకు చెందినవే. పాక్ మొత్తం అప్పుల్లో సుమారు 22 శాతం చైనా సమకూర్చినవే కావడం గమనార్హం.
Read More

RCB VS CSK: ఓటమికి నాదే బాధ్యత: ధోని
నిన్న (మే 3) ఆర్సీబీ చేతిలో (బెంగళూరులో) ఎదురైన ఓటమికి సీఎస్కే స్టాండ్ ఇన్ కెప్టెన్ ఎంఎస్ ధోని బాధ్యత తీసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి బంతి వరకు పోరాడింది. ధోని క్రీజ్‌లోకి వచ్చే సమయానికి సీఎస్కేకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ధోని రాణించకపోవడంతో సీఎస్కే 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Read More

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని మంచుకొండల్లో కొలువైన ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఆదివారం తెరచుకున్నాయి. తెల్లవారుజామున ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమహావిష్ణువును తొలిరోజే దర్శించుకునేందుకు దేశ నలుమూలు సహా నేపాల్ నుంచి సైతం ఇప్పటికే భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు.
Read More

RCB VS CSK: చరిత్ర సృష్టించిన విరాట్
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్లో) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌తో కలుపుకుని విరాట్ ఎనిమిది సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. విరాట్ తర్వాత అత్యధిక సీజన్లలో 500 ప్లస్ పరుగులు సాధించిన ఘనత డేవిడ్ వార్నర్‌కు దక్కుతుంది. వార్నర్ ఏడు సీజన్లలో ఈ ఘనత సాధించాడు.
Read More

కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు లాభమా..? నష్టమా..?
సూక్ష్మ రుణాల విభాగంలో ఒత్తిళ్ల కారణంగా గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం 8 శాతం (కన్సాలిడేటెడ్) క్షీణించింది. రూ.5,337 కోట్ల నుంచి తగ్గి రూ. 4,933 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 4,133 కోట్ల నుంచి 14 శాతం క్షీణించి రూ. 3,552 కోట్లకు తగ్గింది.
Read More

జీడీపీ వృద్ధిపై అంచనాలు ఇలా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5–6.7 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ బడ్జెట్లో ప్రకటించిన పన్ను మినహయింపు చర్యలు దేశీ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది.
Read More