
‘బద్మాషులు’ విజయం సాధించాలి: నవీన్ చంద్ర
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లోకం మారిందా సాంగ్ ను హీరో నవీన్ చంద్ర విడుదల చేసి జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాషులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

'వారికి ఆ ధైర్యం లేదు.. అందుకే సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేశారు'
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో వివేక్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
Read More

డయాబెటిస్‌ని చిటికెలో నయం చేసే గుడి.. ఎక్కడుందంటే?
భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్‌తో బాధపడుతున్నారు.
Read More

ఆపరేషన్ సిందూర్ : రాంబాబు సింగ్ వీరమరణం
పహల్గామ్ ఉగ్రదాడి అనేక కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపిండి. తాజాగా BSF కానిస్టేబుల్ రాంబాబు సింగ్ అసువులు బాశాడు. మే 9, 2025న ఇండో-పాక్ సరిహద్దులో తన ధైర్య సైనికుల సోదరులతో కలిసి పోరాడుతున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లో ప్రత్యర్థుల కాల్పులకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతను మే 13న తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.
Read More

హీరో సూర్యలా 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్ సాధ్యమేనా! నిపుణుల వార్నింగ్ ఇదే..
కోలీవుడ్ నటుడు సూర్య శివకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన పరంగా ఆయనకు సాటి లెరెవ్వరూ. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఒదిగిపోవడం సూర్య ప్రత్యేకత. తన వైవిధ్యభరితమైన నటనతో మంచి ప్రేక్షకాధరణ ఉన్న నటుడు. తాను నటించే పాత్ర కోసం మొత్తం ఆహార్యమే మార్చుకునేందుకు వెనకడుగువేయని గొప్ప నటుడు.
Read More

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి సంబంధించి బిగ్ అప్‌డేట్
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఈ ఇద్దరి గ్రేడ్ ఏ ప్లస్ కాంట్రాక్ట్ కొనసాగుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికినా రోహిత్, కోహ్లి ఇంకా భారత క్రికెట్‌లో భాగమేనని, గ్రేడ్ ఏ ప్లస్‌లో సకల సదుపాయాలకు వారు అర్హులేనని సైకియా తెలిపారు.
Read More

IPL 2025: ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే న్యూస్..
ఐపీఎల్-2025 సీజన్ పునఃప్రారంభం వేళ ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి ముంబై జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ తాత్కాలికంగా వాయిదా పడడంతో బౌల్ట్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మే 17న తిరిగి ప్రారంభమవ్వుతుండడంతో బౌల్ట్ ఒకట్రెండు రోజుల్లో భారత గడ్డపై అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
Read More

రోహిత్ శర్మకు సత్కారం.. ఇంటికి ఆహ్వానించి సన్మానించిన సీఎం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఘన సత్కారం లభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) హిట్‌మ్యాన్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. సన్మానించారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Read More

30 ఏళ్లు వచ్చినా పిల్ల దొరుకతలే!
ఒకప్పుడు వయసుకు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపిద్దామా? అని తల్లిదండ్రులు ఎదురు చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అబ్బాయిలకు సంబంధాలు దొరకడం కష్టమైపోతోంది. ఒకప్పుడు అబ్బాయి గుణగణాలు, కుటుంబం గురించి తెలుసుకుని పిల్లనిచ్చేవారు. అబ్బాయి ఏం చదువుకున్నాడు?, ఎంత సంపాదిస్తున్నాడు? అప్పులు, ఆస్తులు, రోగాలు.. సిబిల్‌స్కోర్ అబ్బో ఈ లిస్ట్ పెద్దదే!
Read More

కేన్స్‌లో ఊర్వశి రౌతేలా మ్యాజిక్ రిపీట్
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes 2025) లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela ) తన అద్భుతమైన ప్రదర్శనతో తన మాయాజాలాన్ని మరోసారి రిపీట్ చేసింది. తనదైన ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కుమని మెరిసింది.
Read More

తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?
టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు పగ్గాలు అప్పగించాలని కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఇప్పటికే శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా నియమించడం లాంఛనమే అని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్‌పై విమర్శలు చేశాడు
Read More

చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!
సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లతోపాటు మొబైల్ డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి.
Read More

దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల ఒడిదొడుకులకు లోనవుతుంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధర తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది.
Read More

రత్నాభరణాల ఎగుమతులు ఎలా ఉన్నాయంటే..
రత్నాభరణాల ఎగుమతులు (జెమ్స్, జ్యుయలరీ) ఏప్రిల్ నెలలో కొంత నీరసించాయి. గతేడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 4.62 శాతం తక్కువగా 2,037 మిలిన్ డాలర్లుగా (రూ.17,314 కోట్లు) నమోదయ్యాయి. 2024 ఏప్రిల్‌లో జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు 2,136 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసింది.
Read More

‘మోదీ జీ.. మీరు దేశాన్ని నడిపిస్తున్న తీరు అమోఘం’
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అఘోఘమని,,
Read More

హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్
కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. సత్యవర్థన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు.
Read More

సత్యజిత్ రే సినిమాతో కేన్స్‌లో సిమీ గరేవాల్ డెబ్యూ
2025 కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అరంగేట్రం చేసేందుకు అలనాటి అందాల సుందరి సిద్ధమవుతోంది. నటి, దర్శకురాలు, నిర్మాత, టాక్ షో హోస్ట్ సిమీ గరేవాల్ బాలీవుడ్‌లో పాపులర్ నటిగా కొనసాగింది. దో బదన్, రాజ్ కపూర్‌తో మేరా నామ్ జోకర్, అరణ్యర్ దిన్ రాత్రి, పదాతిక్ వంటి చిత్రాలలో తన నటనా నైపుణ్యానికి ప్రశంసలందుకుంది. అంతేకాదు అనేక టీవీ షోస్‌తో అభిమానులను ఆకట్టుకుంది.
Read More

జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం
జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి టాలీవుడ్ హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం చేశాడు. పలు సినిమాల్లో నటించిన పొట్టి జానీకి ఇటీవల షూటింగ్ లు లేక ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో కృష్ణసాయి.. పొట్టి జానీ నివాసానికి వెళ్లి భరోసాగా నిలిచారు. తక్షణ సాయం కింద 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి, కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశాడు.

విరాట్ కోహ్లీ సతీమణితో కలిసి బృందావన్ దామ్‌కు
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మరునాడే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ , సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మతో కలిసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్‌ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్ కలిసిన దంపతులు ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని కలవడం ఇది రెండోసారి కావడం విశేషం.
Read More

ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ
భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో సైనికులు భారత్ మాతాకీ జై అంటే.. శత్రువు వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ తరువాత మంగళవారం ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. అక్కడ వాయుసేన సేవలను ఉద్దేశించి ప్రసంగించారు.
Read More

ఐబీఎం హెచ్‌ఆర్‌లో ఏఐ..
కార్పొరేట్ కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అంతర్గత ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి, రోజువారీ పనులను తగ్గించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీ ఐబీఎం తన హెచ్ఆర్ (మానవ వనరుల) సిబ్బందిలో కొంత భాగాన్ని ఏఐ వ్యవస్థలతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఏఐ కొంతమంది హెచ్ఆర్ ఉద్యోగుల పనిని రీప్లేస్ చేస్తుందని పేర్కొంది.
Read More

సిస్టర్‌హుడ్ క్రియేట్ చేయడానికి ఇదొక వేదిక. సన్నగా ఉన్నామా.. లావుగా ఉన్నామా.. తెల్లగా ఉన్నామా.. నల్లగా ఉన్నామా అని కాదు.. అదసలు విషయమే కాదు. డజంట్ మ్యాటర్. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నదే మ్యాటర్. అందుకే నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం! నాటు నాటు పాట , సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం అంటున్న జపాన్ కియానా తుమీత
Read More

కారుపై కొత్త జంట స్టెప్పులు, తిట్టిపోస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియా మోజు అనేక ప్రమాదాలకు దారి తీస్తున్నప్పటికీ క్రేజ్ పోవడం లేదు. కొంతమంది యువతీ యువకులు లైక్స్, కమెంట్స్ కోసం ఎంతటికైనా దిగజారడానికి సిద్ధపడిపోతున్నారు. తాజాగా కదులుతున్న కారుపై వధువు,వరుడు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, పోలీసులు చలాన్ జారీ చేశారు.
Read More

కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ సారథి సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడే అవకాశం లేదని కుండబద్దలు కొట్టాడు.
Read More

పడి లేచిన పసిడి ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Read More

రాత్రి 8 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీ : అపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇవాళ(సోమవారం) రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నారు.
Read More

దిగ్గజ నాయకుడు.. అసలైన టార్చ్ బేరర్!
2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2014-15 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. అప్పటికి భారత్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, ఆ తర్వాత కోహ్లి సారథ్యంలో అగ్రస్థానానికి ఎగబాకింది.
Read More

కోహ్లి రిటైర్మెంట్‌పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
బీసీసీఐ తీరుపై టీమిండియా, విరాట్ కోహ్లి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో వరుస వైఫల్యాలకు కేవలం ఆటగాళ్లనే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ చురకలు అంటిస్తున్నారు.
Read More

90 రోజుల పాటు కొత్త సుంకాలు: అమెరికా, చైనా మధ్య డీల్
నువ్వా నేనా అంటూ ప్రతీకార సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయిన అమెరికా, చైనా దేశాలు టారిఫ్‌ల విషయంలో ఓ డీల్ కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం.. అమెరికా దిగుమతులపైన చైనా విధించిన 125 శాతం సుంకాలలో 10 శాతం తగ్గించింది. అదే సమయంలో అమెరికా కూడా చైనా దిగుమతుల మీద విధించిన 145 శాతం సుంకాలలో 30 శాతం తగ్గించించింది.
Read More

వేసవి ఉక్కపోతకు గాలిసోకని టైట్ దుస్తులతో ఎక్కువ మంది ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో చర్మవ్యాధుల వైద్యులను సంప్రదిస్తున్న వారిలో ఎక్కువ మంది ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ గురైన వారు ఉంటున్నారు. టైట్ దుస్తులు, జీన్స్ వంటివి వేసుకుని పది, పన్నెండు గంటల పాటు ఉంటున్న వారిలో ఈ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. వాటికి తోడు వేసవిలో సన్‌బర్న్, సెగ గడ్డలు, రాష్ వంటివి సోకే అవకాశం ఉంది.
Read More

భళా ఆయుర్వేదం రూ. 2 లక్షలతో మొదలై..
ఆయుర్వేదం అనగానే ముందుగా గుర్తొచ్చేది భారతదేశం. ఆయుర్వేదం అనగానే గుర్తొచ్చే బిజినెస్ దిగ్గజం మీరా కులకర్ణి. బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన అనేక మంది పురుషుల మధ్య ఆమె విజయం నిజంగా చాలా స్పూర్తిదాయకం. కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో వేల కోట్ల సామ్రజ్యాన్ని సృష్టించిన ఘనత, దార్శనికత ఆమె సొంతం. ఆమె మరెవ్వరో కాదు ప్రపంచ బ్యూటీ ఇండస్ట్రీలో రారాణిలా మీరా కులకర్ణి.
Read More

బంగారం జాక్‌పాట్! ఈరోజు కొంటే...
దేశంలో పసిడి ప్రియులకు బంగారం ధరలు (Gold Prices) శుభవార్త చెప్పాయి. రూ.లక్షకు చేరువలో ఉన్న మేలిమి బంగారం తులం ధర నేడు (మే 12) భారీగా దిగివచ్చింది. ఆభరణాలకు వినియోగించే పసిడి లోహం కూడా రూ.90వేల దిగువకు వచ్చేసింది. మే 12 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Read More

పీవోకేపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పీవోకేపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు.. పీవోకేను మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదన్నారు మోదీ.
Read More

సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చాలామందికి గోల్డ్ కొనుగోలు చేయడం, ఇకపై సాధ్యమేనా అనే అనుమానులు కూడా పుడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సీఈఆర్ఎన్)లోని భౌతిక శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ సాధించారు.
Read More

Vijay sethupathi: విజయ్ సేతుపతి ఏస్ ట్రైలర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. ఈ సినిమాకు అరుముగకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ సీస్ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరో శివకార్తికేయన్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
Read More

అప్పు తీర్చడం ఎలా?: చాట్‌జీపీటీ సమాధానం
చాలీచాలని జీతాలతో పనిచేసేవారి సంఖ్య ఎక్కువే ఉంది. జీతాలు సరిపోక పోవడంతో లోన్స్ తీసుకోవడం లేదా ఇతరుల దగ్గర అప్పు చేయడం వంటివి చేస్తారు. అప్పులు ఎక్కువైపోయినప్పుడు వాటిని ఎలా తీర్చాలో తెలియక కొందరు సతమతమవుతారు. చేసిన అప్పును సులభంగా ఎలా తీర్చాలి?, అనే ప్రశ్నకు.. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం ఇక్కడ చూసేద్దాం.
Read More

సన్నని సైజుకు లావైన డిస్కౌంట్..! ఇది మాములు ఆఫర్ కాదు..
థాయ్‌ల్యాండ్‌లోని ఓ రెస్టారెంట్, కస్టమర్స్‌కి విచిత్రమైన ఆఫర్ ఇస్తోంది. ఇక్కడ భోజనం ఆర్డర్ చేయడానికి ముందు ‘మెటల్ గేట్ చాలెంజ్’ అనే ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొనాలి. అంటే ఒక ఐదు రకాల వెడల్పు అయిన మెటల్ బార్స్ మధ్య ఏర్పాటు చేసిన సన్నని సందు నుంచి బయటకు రావాలి.
Read More

అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!
తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన ఆర్థోపెడిక్ నిపుణుల్లో డాక్టర్ తేతలి దశరథరామారెడ్డి ఒకరు. తండ్రి నారాయణ రెడ్డి పేరు మీద సొంతూర్లో ఒక ట్రస్ట్ పెట్టి.. అవసరంలో ఉన్న వాళ్లకు వైద్యసహాయం అందిస్తున్నారు. అమ్మ సంకల్పబలం వల్లే తాను డాక్టర్‌నయ్యానని చెప్పే ఆయన ఇంటర్వ్యూ మదర్స్ డే సందర్భంగా..!
Read More

ఫైనల్స్ క్వీన్: స్మృతి మంధాన సంచలన శతకం
శ్రీలంకతో ఫైనల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సంచలన శతకంతో మెరిసింది. కేవలం 92 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తన కెరీర్‌లో పదకొండవ వన్డే సెంచరీ నమోదు చేసింది.
Read More

IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా గిల్!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా కొత్త కెప్టెన్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నిష్క్రమణ నేపథ్యంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. అతడికి డిప్యూటీగా మరో యువ ఆటగాడినే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
Read More

రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ
టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మళ్లీ థియేటర్‌లో విడుదలైంది. మే 9న 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు. ఒక్క రోజులోనే ఈ చిత్రం రూ.1.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
Read More

హీరోయిన్ అని తెలీదు.. ప్రెగ్నెంట్ అయ్యాకే పెళ్లి
చాన్నాళ్లకు తన రెండో పెళ్లి గురించి హీరోయిన్ అమలాపాల్ బయటపెట్టింది. ఓ అవార్డ్ షోలో పురస్కారం అందుకున్న తర్వాత జగత్ దేశాయ్ తో ప్రేమ, పెళ్లి జరగడం గురించి చెప్పింది. తాను అతడి దగ్గర ఏమేం దాచిపెట్టాననేది కూడా చెప్పుకొచ్చింది
Read More

బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో బాస్మతి బియ్యం ధరలు పెరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్(ఏఐఆర్ఈఏ) స్పందించింది. ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ఇటీవల బాస్మతి బియ్యం ధరలు పెరగడానికి భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ డిమాండ్ పెరగడమే ధరలు పెరిగేందుకు కారణమవుతుందని తెలిపింది.
Read More

తగ్గినట్టే తగ్గి.. తులం బంగారం ఇప్పుడు..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. క్రితం రోజున భారీగా క్షీణించిన పసిడి ధరలు నేడు (మే 10) కాస్త ఎగిశాయి. మరోసారి తగ్గుతుందని ఆశించిన కొనుగోలుదారులకు నేడు నిరాశ ఎదురైంది. మే 10 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Read More

రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచనలు
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పరిపాలనాధికారులకు లేఖ రాసింది. సివిల్ డిఫెన్స్ రూల్స్‌కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
Read More

మోదీని కలిసిన వరల్డ్ బ్యాంక్ చీఫ్: సింధు జలాల ఒప్పందంపై..
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ సింధు జలాల నిలిపివేతపై స్పందిస్తూ.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవడం లేదని వరల్డ్ బ్యాంక్ చీఫ్ 'అజయ్ బంగా' స్పష్టం చేశారు. మా పాత్ర కేవలం ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని అన్నారు.
Read More

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. ఆ తరువాత విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది.
Read More

తమ్ముడు మనోజ్.. అన్నకు పోటీ రావట్లేదు
మంచు మనోజ్ తన లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాడు. చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న 'భైరవం'.. థియేటర్లలోకి ఎప్పుడొస్తుందనేది ట్వీట్ చేశారు. తన పుట్టిన నెలలో మూవీ విడుదల కానుండటంపై తెగ ఆనందం వ్యక్తం చేశాడు.
Read More