Short Stories | Sakshi
1

నువ్వు హీరోయినేంటి? అని తిట్టారు

దర్శనా.. హృదయం సినిమాలోని ఈ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. పాటే కాదు సినిమా కూడా సూపర్‌ హిట్టు. 2022లో వచ్చిన మలయాళ చిత్రం 'హృదయం'లో ప్రణవ్‌ మోహన్‌లాల్‌ హీరోగా కల్యాణి ప్రియదర్శన్‌, దర్శనా రాజేంద్రన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది కానీ చాలామంది తనను తిట్టుకున్నారంటోంది హీరోయిన్‌ దర్శనా రాజేంద్రన్‌. కొందరైతే మరీ అసహ్యంగా కామెంట్లు....
Read More
2

ఆ ఫీచర్‌ బంద్‌: గూగుల్ పే, ఫోన్‌పే.. యాప్‌లలో కీలక మార్పు

యూపీఐ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 ‘పేమెంట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లలో ఈ మార్పు అమలులోకి రానుంది.
Read More
3

‘ఇదే ఫైనల్‌ స్క్వాడ్‌ కాదు.. వారికి మరో ఛాన్స్‌’

ఆసియా కప్‌-2025 టోర్నీకి భారత జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వాషింగ్టన్‌ సుందర్‌ గురించి మీడియా సమావేశంలో ప్రస్తావన రాగా.. ‘‘మా ప్రణాళికల్లో సుందర్‌ ఎల్లప్పుడూ ఉంటాడు. అయినా.. వరల్డ్‌కప్‌ టోర్నీకి ఇదే ఫైనల్‌ స్క్వాడ్‌ కాదు’’ అని అగార్కర్‌ పేర్కొన్నాడు.
Read More
4

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్.. ఆ వీడియో సాంగ్ వచ్చేసింది!

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్‌ కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా మెప్పించింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Read More
5

బంగారం ధరలు యూటర్న్‌!

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి.
Read More
6

అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ని సెలక్ట్‌ చేయలేదు: అగార్కర్‌

ఆసియా కప్‌-2025 టోర్నీ ఆడబోయే భారత జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు లభించలేదు. ఈ విషయంపై చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పందించాడు. ‘‘జట్టుకు ఎంపిక కాకపోవడంలో అతడి తప్పేం లేదు. అలాగే మా తప్పు కూడా ఏమీ లేదు. అతడు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే’’ అని అగార్కర్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
Read More
7

నిర్మాతకు రూ.50 కోట్లు తిరిగిచ్చిన ప్రభాస్

ప్రభాస్ అనగానే అందరికీ పాన్ ఇండియా సినిమాలే గుర్తొస్తాయి. అలా గతంలో చేసిన 'రాధేశ్యామ్'.. బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేక ఫెయిలైంది. దీంతో ప్రభాస్ తనకిచ్చిన రెమ్యునరేషన్ నుంచి రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు. ఆ విషయాన్ని ఇప్పుడు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ బయటపెట్టాడు. సదరు వీడియో వైరల్ అవుతోంది.
Read More
8

ఆసియాకప్‌లో పాక్‌తో భారత్ ఆడదు: కేదార్‌ జాదవ్‌

భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు మ‌రోసారి క్రికెట్ మైదానంలో తాడోపేడో తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాయి. ఆసియాక‌ప్‌-2025లో భాగంగా సెప్టెంబ‌ర్ 14న దుబాయ్ వేదిక‌గా దాయాదుల పోరు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో మాజీ క్రికెట‌ర్ కేదార్ జాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఆసియాక‌ప్‌లో పాకిస్తాన్‌తో భార‌త్ ఆడ‌ద‌ని అత‌డు థీమా వ్య‌క్తం చేశాడు. పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడిగా నిరసనగా భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంటదని జాదవ్‌ తెలిపాడు.
Read More
9

ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్ది రోజులుగా పసిడి ధరలు.. తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి.
Read More
10

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో దారుణం

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి ఏరియా సంగీత్‌ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పనికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. బాలిక మృతి చెందిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ల సాయంతో పోలీసులు..
Read More
11

చైనాకు సుంకాల మినహాయింపు అందుకే!

వాషింగ్టన్‌: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని భారత్‌పై 50 శాతం సుంకాలు విధించింది అమెరికా. అయితే ఈ నిర్ణయాన్ని భారత్‌ తీవ్రంగా తప్పుబట్టింది. భారత్‌ తరహాలోనే రష్యాతో చమురు కొనుగోలు జరుపుతున్న చైనాను, యూరప్‌ దేశాలకు మినహాయించడంపైనా ప్రశ్నలు సంధించింది. దీనికి ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పుడు స్పందించింది. చైనాకు మినహాయింపు ఉండడానికి ప్రత్యేక..
Read More
12

మళ్లీ కొత్త ధరకు వెండి.. బంగారం మాత్రం అక్కడే..

దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా ఉన్న​ పసిడి ధరలు ఈరోజు (సోమవారం) కూడా నిలకడగా కొనసాగాయి. ఓవైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Read More
13

ఎన్నికల సంఘంపై అభిశంసన!

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం.. దాని ప్రధానాధికారి జ్ఞానేష్‌ కుమార్‌ వ్యవహార శైలిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీజేపీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వ్యక్తి తక్షణమే రాజీనామా చేయాలని విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో.. రాజ్యాంగ హోదాలో ఆయన వివరణ ఇవ్వడం తప్పేమీ కాదనే అభిప్రాయమూ..
Read More
14

అంతా అతని చేతుల్లోనే..

వాషింగ్టన్‌: జెలెన్‌స్కీతో భేటీకి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని తక్షణమే ఆపేయడమా? లేదంటే కొనసాగించడమా? అనేది జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉందని తేల్చేశారాయన. అదే సమయంలో పుతిన్‌ డిమాండ్లను ‍ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఆ రెండూ జరగబోవు.. కొన్నింటిని మార్చడం కష్టం అంటూ వేదాంత ధోరణిలోనూ ఆయన వ్యాఖ్య చేశారు. అయితే..
Read More
15

అలా ఏడ్చే బదులు కుక్కనే పెళ్లి చేసుకోండి: ఆర్జీవీ

ఢిల్లీ వీధుల్లో శునకాలు కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆగస్టు 11న తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెనక్కు తీసుకోవాలని కోరుతూ సదా సహా జంతుప్రేమికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటివారిపై దర్శకుడు ఆర్జీవీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనుషులు చనిపోతే పాపం అనట్లేదుకానీ కుక్కల కోసం ఏడుస్తున్నారా? అని మండిపడ్డాడు. ఈ డాగ్‌ లవర్స్‌ అందరూ ఒక పని చేయండంటూ ఓ ట్వీట్‌ షేర్‌ చేశాడు. అందులో ఏముందంటే...
Read More
16

పిల్లలు కనడానికి సిద్దమవుతున్న రోబోలు!

స్త్రీ, పురుషుల కలయికతో పిల్లలు పుట్టడం సర్వసాధారణం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. సరోగసీ ద్వారా కూడా పిల్లలను కంటున్నారు. అయితే శిశువు పుట్టడానికి మనిషి గర్భమే అవసరం లేదంటూ.. చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'గర్భధారణ రోబోట్'లను సృష్టిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నా.. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంట
Read More
17

బంగారాన్ని మించిపోయిన సిగరెట్లు!

సాక్షి, సిటీబ్యూరో: విదేశాల నుంచి అక్రమ రవాణా అవుతున్న బంగారానికి సంబంధించి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు 2023–24 ఆర్థిక సంవత్సరంలో 240 కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి 132.4 కేజీల పసిడి స్వాధీనం చేసుకున్నారు. 2024–25 నాటికి కేసుల సంఖ్య 133కి, సీజ్‌ చేసిన బంగారం 42.5 కేజీలకు తగ్గిపోయింది.
Read More
18

హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ

రుణాలను చౌకగా చేయడానికి ఓవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రయత్నిస్తుంటే మరోవైపు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రం రుణ గ్రహీతకు వింత షాకిచ్చింది. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 5.5 శాతానికి తగ్గించినప్పటికీ, ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేట్లను పెంచి ఆశ్చర్యపరిచింది. ఈ బ్యాంక్‌లో కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేటు ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు పెరగనుంది.
Read More
19

డాగ్‌ లవర్స్‌ .. ఒక్కసారి ఈ వీడియో చూడండి: ఆర్జీవీ

ఢిల్లీ నగరంలోని వీధి కుక్కలన్నింటిని షెల్టర్లకు తరలించాలని ఆగస్ట్‌ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆర్జీవీ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుని సమర్థిస్తూ ట్వీట్‌ చేశాడు. ‘సుప్రీంకోర్టు తీర్పుపై ఏడుస్తున్న డాగ్‌ లవర్స్‌ ఒక్కసారి ఈ వీడియో చూడండి’ అంటూ నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేస్తున్న పాత వీడియోని షేర్‌ చేశాడు.
Read More
20

పురిటినొప్పులు.. భగవద్గీత శ్లోకం చదివాడు: హీరోయిన్‌

ఈ కృష్ణాష్టమి ఎంతో స్పెషల్‌ అంటోంది హీరోయిన్‌ హర్షిక పూనాచ. తన జీవితంలోకి చిన్న పాప వచ్చిందని చెప్తూ సంబరపడిపోయింది. చిన్నప్పుడు తాను కృష్ణుడిగా వేషం వేశానని, ఇప్పుడు కూతురిని అలా రెడీ చేశానంది. చాలా ప్రశ్నలకు భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది. నేను గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్ని. లేబర్‌ రూమ్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్నప్పుడు మామయ్య భగవద్గీతలోని శ్లోకాలు చదివాడు. ఇప్పుడు నాకు..
Read More
21

నెలసరిలో రాజకీయ పర్యటనలు.. ఇబ్బందులు ఉన్నా తప్పదు: కంగనా రనౌత్‌

సినిమాలలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ కష్టాలు అంటోంది నటి, ఎంపీ కంగనా రనౌత్‌. రాజకీయాల్లో ఉన్నప్పడు నెలసరి సమయంలో కూడా కష్టపడాల్సి వస్తోందని చెబుతోంది. సామాన్య మహిళలే కాదు ఎంపీలు కూడా నెలసరి సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ బాధను వర్ణించడం అసాధ్యమని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. సినిమా, రాజకీయ రంగాలను పోలుస్తూ..మహిళగా తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇలా వివరించింది.
Read More
22

ధర్మవరంలో ఉగ్ర కదలికలు

సత్యసాయి: ధర్మవరంలో ఉగ్ర కదలికలు పట్టణాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. ఉగ్రవాదులతో వాట్సాప్‌ కాల్‌ మాట్లాడినందుకు ఓ వ్యక్తిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. కోట ఏరియాలో నివాసం ఉంటున్న ఆ వ్యక్తి.. స్థానికంగా ఓ హోట్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. పైగా అతని ఇంటి నుంచి 16 సిమ్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని పేరు..
Read More
23

ఆసియాకప్‌ ముంగిట ఉజ్జ‌యినిలో గంభీర్‌ ప్రత్యేక పూజలు

ఆసియాక‌ప్‌-2025 ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ మధ్యప్రదేశ్‌లోని శ్రీ మహాకాళ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించాడు. శుక్ర‌వారం ఉద‌యం ఈ ప్ర‌ఖ్యాత ఆల‌యంలో 'భస్మ ఆరతి'కి తన భార్య, కుమార్తెలతో కలిసి గంభీర్‌ హాజరయ్యాడు. ఈ ఆలయంలో గంభీర్ కొన్ని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. కాగా గంభీర్ ఇంగ్లండ్ టూర్‌కు ముందు అస్సాంలోని కామాఖ్య ఆలయాన్ని కూడా సంద‌ర్శించాడు.
24

రజినీకాంత్ కూలీ తొలి రోజు కలెక్షన్స్

రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్‌ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్‌ చిత్రం కూలీ. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా తొలిరోజు అదరగొట్టింది. రిలీజ్‌కు ముందే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ కావడంతో కోలీవుడ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.140 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది.
Read More
25

అనిల్‌ అంబానీకి భారీ విజయం

చాలా ఏళ్ల తర్వాత అనిల్‌ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్‌ అవార్డ్‌ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్‌ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.
Read More
26

ఈ శుక్రవారం ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు!

చూస్తుండగానే వీకెండ్‌ వచ్చేస్తోంది. గతవారం లాగే ఈసారి కూడా వరుసగా మూడు రోజులు రావడం సినీ ప్రియులకు పండగే. ఈ వారం థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు కూలీ, వార్‌-2 ఇప్పటికే సందడి చేస్తున్నాయి. ఓకే రోజు రిలీజైన ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ఈ వారాంతంలో మూడు రోజుల పాటు సెలవులు రావడం ఈ చిత్రాలకు కలిసొచ్చే అవకాశముంది.
Read More
27

ఆ సీరియల్‌ నటి నన్ను కారుతో ఢీ కొట్టింది: జబర్దస్త్‌ సౌమ్య

సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన సౌమ్యరావు జబర్దస్త్‌ షోతో యాంకర్‌గా మారింది. ఆమె మాట్లాడుతూ.. నేను చాలా పేదరికం అనుభవించాను. ఓ రోజు అర్ధరాత్రి అమ్మ, నేను, సోదరుడు.. బస్టాప్‌లో పడుకున్నాం. రెండురోజులదాకా అన్నం తినలేదు. తిరుపతి వెళ్లినప్పుడు దర్శనానికి బదులు నాకు తిండి ఎప్పుడు పెడతారని ఎదురుచూసేదాన్ని. నేను ఓ సీరియల్‌ చేశాను. అందులోని హీరోయిన్‌ కారుతో నన్ను ఢీ కొట్టింది అని చెప్తూ ఎమోషనలైంది.
Read More
28

మీ వల్లే ఇదంతా: సుప్రీం కోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: వీధికుక్కలను దేశరాజధాని రీజియన్‌ నుంచి తరలించాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై పునఃపరిశీలన జరుగుతోంది. ఈ క్రమంలో దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. అయితే వీధికుక్కల తరలింపులో అధికారులు వ్యవహరించిన తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఈ పరిస్థితి రావడానికి భాద్యులంటూ..
Read More
29

భారత్‌కు మరిన్ని సుంకాలు తప్పవు

వాషింగ్టన్‌: భారత్‌పై సుంకాల మోత మోగించిన అమెరికా.. మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వీలైతే సుంకాలు లేకుంటే ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసింది. రష్యాతో ఆయిల్‌ కొనుగోలు వద్దంటున్నా సరే.. భారత్‌ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 50 శాతం సుంకాలను విధించారు ట్రంప్‌. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఉక్రెయిన్‌ చర్చలకు ముడిపెట్టారు. ఒకవేళ చర్చల్లో..
Read More
30

జీతాల పెరుగుదల.. ఐటీ కంపెనీ శుభవార్త

ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1, 2025 నుంచి అర్హులైన ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతన పెంపును అమలు చేయనుంది. 2025 ద్వితీయార్ధంలో చాలా మంది ఉద్యోగులకు మెరిట్ ఆధారిత వేతన పెంపును అందించే ప్రణాళికలను కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆదాయ ప్రకటనలో ధృవీకరించింది.
Read More
31

తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు: పేర్ని నాని

పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు. కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్‌ ప్రకారమే రీపోలింగ్‌ పెట్టింది. సీసీ ఫుటేజీ, వెబ్‌ క్యాస్టింగ్‌ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయమెందుకు?.
Read More
32

'కూలీ' రివ్యూ.. సినిమా ఎలా ఉంది?

సూపర్‌స్టార్ రజినీకాంత్ 'కూలీ' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇంతకీ ఎలా ఉంది? రజినీ హిట్ కొట్టారా? లోకేశ్ కనగరాజ్ తన దర్శకత్వంతో మెప్పించారా? నాగార్జున విలనిజం ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
Read More
33

మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?

భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ.. సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో చేసిన ప్రకటనలు చాలామంది ఖాతాదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ వేలరూపాయల్లో ఉంచాలనే బ్యాంకుల నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కథనంలో ఏ బ్యాంకులో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం.
Read More
34

దర్శన్‌.. చట్టానికి అతీతులేం కారు

ఢిల్లీ: అభిమాని హత్య కేసులో అరెస్టై.. బెయిల్‌ మీద బయటకు వచ్చిన కన్నడ స్టార్‌ నటుడు దర్శన్‌కు భారీ షాక్‌ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఆయనకు ఇచ్చి న బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. బెయిల్‌ ఇవ్వడానికి ఎలాంటి చట్టపరమైన కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సినిమావాళ్లకు జైళ్లలో వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందించడంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More
35

పరదా కోసం రోడ్డెక్కిన స్టార్ హీరోయిన్!

అనుపమ పరమేశ్వరన్ లీడ్‌ రోల్‌లో వస్తోన్న తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్‌ రిలీజ్ చేయగా..ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అనుపమ ఫుల్ బిజీగా ఉంది. ఇవాళ తన మూవీ కోసం రోటీన్‌కు భిన్నంగా ప్రచారం చేసింది. రోడ్డుపై మైక్ పట్టుకుని తన మూవీని చూడాలని ఆడియన్స్‌ను కోరింది.
Read More
36

ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ

టాలీవుడ్‌ నటి మంచు లక్ష్మీ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వెళ్లిన మంచు లక్ష్మీని ఈడీ బృందం దాదాపు మూడున్నర గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఐదేళ్ల లావాదేవీలను ఈడీ అధికారులకు లక్ష్మీ అందించారు.
37

చరిత్ర సృష్టించిన జేడన్‌ సీల్స్‌

వెస్టిండీస్‌ పేస్‌ సంచలనం జేడన్‌​ సీల్స్‌ (Jayden Seals) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ (Dale Steyn)పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును సీల్స్‌ బద్దలు కొట్టాడు.
Read More
38

ఏపీ ఓట్ల చోరీపై రాహుల్‌ గాంధీ మాట్లాడరా?

కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకి వైఎస్‌ జగన్‌ సూటి ప్రశ్నఏపీలో కూటమి పాలనలో ఎన్నో స్కామ్‌లువాటిపై కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు స్పందించడం లేదు? ఏపీలో 2024 జరిగిన ఎన్నికల్లో 48 లక్షల ఓట్లు తేడా వచ్చాయి. ఓట్ల చోరీ గురించి పోరాడతానంటున్న రాహుల్‌ గాంధీ.. ఏపీ గురించి ఎందుకు మాట్లాడరు?
Read More
39

పులివెందులలో జరిగింది ఎన్నికంటారా?

తాడేపల్లి: ఏపీలో పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని అన్నారాయన. సాక్షాత్తూ కలెక్టర్‌ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్..
Read More
40

బీసీసీఐపై హర్భజన్‌ సింగ్‌ ఆగ్రహం.. కారణం ఇదే

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మండిపడ్డాడు. దేశం కంటే మీకు ఆటే ముఖ్యమా అంటూ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు. క్రికెట్‌ కంటే సైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. కాబట్టి ఇప్పటికైనా ఆసియా కప్‌-2025 (Asia Cup) విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.
Read More
41

పోలీసుల కాళ్లు పట్టుకున్న పులివెందుల ఓటర్లు

పులివెందుల: జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా.. బయటి నుంచి వచ్చిన జనాలతో టీడీపీ నేతలు ఇష్టానుసారం ఓట్లు వేయిస్తున్నారు. యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. పలు గ్రామాల్లోని సిసలైన ఓటర్లు వినూత్న రీతిలో ధర్నాకు దిగారు. తమను ఓటు హక్కు వినియోగించకుండా అడ్డుకోవద్దంటూ పోలీసుల కాళ్లపై పడ్డారు. ఈ హఠాత్‌ పరిణామంతో పోలీసులు కంగుతిన్నారు. అటుపై..
Read More
42

పులివెందుల: వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌

పులివెందుల: జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. పోలీసులు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఈ ఉదయం ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు.. బలవంతంగా ఈడ్చుకెళ్లి ఆయన్ని వాహనం ఎక్కించారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు లాగి అవతల పడేశారు. బయటి నుంచి జనాలను అనుమతించిన పోలీసులు..
Read More
43

'జడలు ముట్టుకుంటే వాడు సర్రుమంటాడు'

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది ప్యారడైజ్'. దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే నాని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇంతకు ముందెన్నడు కనిపించని విధంగా రెండు జడలతో కనిపించారు. ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.
Read More
44

మునీర్‌ పిచ్చిప్రేలాపనలకు భారత్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ రెచ్చిపోయాడు. భారత్‌పై పిచ్చిప్రేలాపలను దిగాడు. ఈ క్రమంలో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ తలాతోకలేని వ్యాఖ్యలు చేశాడు. అయితే భారత్‌ ఆ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తామన్న బెదిరింపులను.. అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలని పేర్కొంది. ఈ క్రమంలో అమెరికా అండతోనే..
Read More
45

రతన్‌ టాటా బతికి ఉంటేనా..

న్యూఢిల్లీ: భారత దేశ చరిత్రలోనే అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం అత్యంత విషాద ఘటనగా నిలిచింది. అయితే ఈ ప్రమాదం తర్వాత బాధితుల విషయంలో టాటా గ్రూప్‌ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటి రూపాయల పరిహారమని ప్రకటించి.. అందులో సగం మందికే రూ.25 లక్షలను ఇప్పటిదాకా చెల్లించింది. దీంతో చాలా కుటుంబాలు అవస్థలు పడుతుండగా.. వాళ్ల తరఫున వాదించబోతున్న లాయర్‌..
Read More
46

'ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే'.. బిగ్‌ బాస్‌పై బిగ్‌ ట్విస్ట్‌!

టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో తొమ్మిదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి రణరంగమే అంటూ నాగార్జున ఇప్పటికే అంచనాలు పెంచేశారు. కామన్ మ్యాన్‌ కేటగిరీలో కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అంటూ ఇప్పటికే ప్రోమోను రిలీజ్ చేశారు.
Read More
47

అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున బిగ్ సర్‌ప్రైజ్!

అక్కినేని నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్‌ బస్టర్ మూవీ శివ. 1990లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్‌ సినీ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున సైతం శివ రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని నాన్న చెప్పారని అన్నారు.
Read More
48

అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్‌ ఓ జోకర్‌!

ఇంగ్లండ్‌ టెస్టు దిగ్గజం జో రూట్‌ (Joe Root)ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) విమర్శలు చేశాడు.ఆస్ట్రేలియా పిచ్‌ల మీద అతడు పెద్దగా బ్యాట్‌ ఝులిపించలేడన్నాడు. ఇందుకు మొయిన్‌ అలీ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. వార్నర్‌ను ఓ జోకర్‌గా అభివర్ణిస్తూ ఘాటుగా విమర్శించాడు.
Read More
49

ట్రంప్‌ టారిఫ్‌కు భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌!

న్యూఢిల్లీ: అన్యాయంగా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌ నిర్ణయానికి భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన పర్యటన రద్దు చేసుకున్నారు. అంతేకాదు.. సుమారు 30 వేల కోట్ల విలువైన రక్షణ..
Read More
50

టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోవద్దు జైస్వాల్‌: రోహిత్‌

ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకున్న టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) అనూహ్యంగా యూటర్న్‌ తీసుకున్నాడు. గోవాకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న ఈ యువ ఆటగాడు తిరిగి ముంబైకే ఆడాలని ఫిక్సయ్యాడు. అయితే, జైసూ తన నిర్ణయం మార్చుకోవడానికి ప్రధాన కారణం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma).
Read More