Short Stories | Sakshi
1

అతడి కెరీర్‌ ముగించేశారు కదా!: అగార్కర్‌పై విమర్శల వర్షం

టీమిండియా తరఫున టెస్టుల్లో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ (Mohammad Shami) ఆశలపై సెలక్టర్లు నీళ్లు పోశారు. దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నా అతడిపై శీతకన్నేశారు. సౌతాఫ్రికాతో టెస్టుల (IND vs SA Tests)కు ఎంపిక చేసిన జట్టులో షమీకి సెలక్టర్లు చోటివ్వలేదు.
Read More
2

పనస చిప్స్‌తో ఏడాదికి రూ. 12 లక్షలు

పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకనప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఆయా పంటలను రోడ్డుమీద కుప్పలు కుప్పలుగా పారబోయడం, తగల బెట్టడం లాంటి బాధాకరమైన దృశ్యాలను చూస్తూం ఉంటాం. కానీ మిగిలిపోతున్న పనసకాయలను వృధాగా పారేయకు పుట్టిన ఆలోచనే పనసకాయ చిప్స్‌. ఆ వ్యాపారమే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.
Read More
3

మమ్దానీ సక్సెస్‌ : తెర వెనుక అంతా తానై

న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్‌ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గా, తొలి ఇండియన్‌–అమెరికన్‌ మేయర్‌ చారిత్రాత్మక విజయం ఆదినుంచి చురుకైన ఉపన్యాసాలు, పదునైన విమర్శలతో దూసుకుపోయిన మామ్దానీ ఘన విజయం జోహ్రాన్ మమ్దానీ విజయం వెనుక ఆయన భార్య కళాకారిణి , యానిమేటర్, రైటర్‌ రమా దువాజీ ప్రత్యేకంగా నిలిచారు. ఎక్కువ మందిని ఆకర్షించిన సోషల్‌ మీడియా ప్రచారం లోగో డిజైన్‌లో కీలక భూమి​క పోషించారు
Read More
4

డైరెక్టర్‌కు నేనే ఇల్లు కొనిస్తా

రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. ఈ మూవీలో రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్‌ మీట్ నిర్వహించారు.
Read More
5

అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగి ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ​మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి.
Read More
6

వైఎస్‌ జగన్‌ పర్యటన సూపర్‌ సక్సెస్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు(మంగళవారం, నవంబర్‌ 4వ తేదీ) చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన సూపర్‌ సక్పెస్‌ అయ్యింది. జగన్ పర్యటించే గ్రామాల్లో బ్యారికేడ్లు అడ్డంపెట్టినా, గ్రామస్తులను కూడా కదలనీయకుండా చేసి వేధింపులకు గురి చేసినా, ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టించాలని చూసినా వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా పర్యటన అత్యంత విజయవంతమైంది.
Read More
7

జక్కన్న ప్లాన్‌.. పైసా ఖర్చులేకుండానే ప్రమోషన్స్‌!

జక్కన్న ఏం చేసిన కొత్తగా ఉంటుంది. అలాగే ప్రతీదీ బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. SSMB 29 మూవీ ప్రమోషన్స్‌కి భారీగా ఖర్చు చేస్తున్న జక్కన్న.. ఆ సొమ్ముని కూడా తిరిగి నిర్మాతకు అప్పగిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌కి అమ్మేశారు. భారీ ధరకు జియోస్టార్‌ ఈ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం.
Read More
8

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న స్టార్‌ హీరో

ఓ సినిమాలోని పాట కోసం ఏకంగా 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నాడట అక్షయ్‌ కుమార్‌. దుర్వాసనతో పాటు నొప్పి కలిగినా..ఒక్కమాట కూడా అనకుండా షూట్‌ అయ్యేవరకు అలాగే ఉండిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్‌ చిన్నిప్రకాశ్‌ చెప్పారు.
Read More
9

హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ ఇక లేరు!

హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా (85) లండన్ ఆసుపత్రిలో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన లండన్‌లో తుది శ్వాస విడిచారు. నలుగురు హిందూజా సోదరులలో ఆయన రెండవవారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పేరుగాంచిన గోపీచంద్ హిందూజా బ్రిటన్‌లోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో ఒకరు. ఆయనకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్ కుమార్తె రీటా ఉన్నారు.
Read More
10

'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!

కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారణతో స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోష మారుమ్రోగిపోగా.., మరోవైపు కార్తీక దీపాలు, సోమవారాల పూజలతో సాధారణ భక్తుల కోలహాలం. అంత పుణ్యప్రదమై మాసం ఈ కార్తీక మాసం. ఈ సమయంలోనే చలి మొదలయ్యేది కూడా. ఈ గజగజలాడించే చలిలో మండలకాలం పాటు చన్నీటి స్నానాలతో అయప్పస్వాములు ఎంత నిష్టగా ఉదయం సాయంత్రాలు పూజలు చేస్తారో తెలిసిందే.
Read More
11

బెంగళూరు డాక్టర్‌ కేసులో ట్విస్ట్‌ : ప్రియురాలికోసమే

కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చిన బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి కేసులో మరో కీలక సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. తన చర్మవ్యాధి నిపుణురాలైన భార్య డాక్టర్ కృతిక రెడ్డి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు సర్జన్, నేరం చేసిన కొద్దిసేపటికే "నీకోసం నా భార్యను చంపాను" అనే సందేశాన్ని ప్రియురాలికి పంపించడం కలకలం రేపింది.
Read More
12

జైస్వాల్‌ సూపర్‌ సెంచరీ

రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు యశస్వి జైస్వాల్‌ సూపర్‌ సెంచరీతో కదంతొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో సైతం అర్ద సెంచరీతో (67) రాణించిన ఈ ముంబైకర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మూడంకెల మార్కును తాకాడు. 120 బంతుల్లో 11 బౌండరీల సాయంతో ఈ మార్కును చేరుకున్నాడు. జైస్వాల్‌కు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో సెంచరీ. ఓవరాల్‌గా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 17వది.
Read More
13

బిగ్‌రిలీఫ్‌: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగి ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ​సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
14

‘కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్‌ ఆర్తనాదాలు

సాక్షి,రంగారెడ్డి: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న కంకర లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read More
15

ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టు మంత్రి పొన్న ప్రభాకర్‌ అధికారికంగా ప్రకటించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Read More
16

నో ఫోటో షూట్‌, నో హగ్స్‌ : వరుడు 10 డిమాండ్లు,

కట్నం వద్దు అంటూ ఒక కాబోయే వరుడి 10 డిమాండ్లు, నెట్టింట చర్చకు దారి తీశాయి.ఇవాల్టి పెళ్లిళ్ల ట్రెండ్‌తో విసిగిపోయిన వరుడు, నో ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్‌, అసలు వీడియోగ్రాఫర్లు హడావిడేవద్దు అన్నాడు.చక్కగా ప్రశాంతంగా, పురోహితుల వేద మంత్రాల మధ్య తమ పెళ్లి జరగాలని కోరుకున్నాడు. పెళ్లి అనేది అగ్ని దేవుడి సాక్షిగా జరిగే పవిత్రమైన కార్యంఅంటూ పేర్కొన్నాడు. దీనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
Read More
17

ఆ రూ. 500 ‍కోట్లు డీల్‌..దెబ్బకు డ్రైవర్‌ తీరు మారిందిగా..!

డబ్బు దేన్నైనా మార్చేయగలదు. అది మనుషుల దగ్గర ఉంటే..ఒక్కసారిగా వారి రేంజే మారిపోతుంది. మాట తీరు మారిపోతుంది. అందుకు నిదర్శనం ఈ సీఈవోకి ఎదురైన ఘటనే. అప్పటి వరకు సీఈవో దగ్గర నార్మల్‌గా పనిచేసిన వ్యక్తిలో..ఒ‍క్కసారిగా అనూహ్యమైన మార్పు. విస్తుపోవడం సీఈవో వంతైంది. ఆ తర్వాత గానీ తెలియదు అసలు కారణం ఇది అని.
Read More
18

టీనేజర్లలో పాప్‌కార్న్‌ బ్రెయిన్‌ సిండ్రోమ్‌..! నిస్తేజంగా మార్చేసే వ్యాధి..

భారతీయ టీనేజర్లలో ఎక్కువ మంది "పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్" బారినపడుతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి యువకుల వరకు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అసలేంటి పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..Advertisement
Read More
19

బంగారం ధరలు మళ్లీ రివర్స్‌.. ఒక్క గ్రాము..

పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త పెరిగాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
20

‘ట్రంప్‌ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో జరుగుతున్న ఘటనలపై భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత కాలంలో అన్నింటా అనిశ్చితి పెరిగిపోయిందని, సైబర్‌ సవాళ్లు మరింత వేగవంతం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ట్రంప్‌ ఈ రోజు ఏమి చేస్తారో? రేపు ఏమి చేయబోతున్నారో అతనే చెప్పలేరని ద్వివేది వ్యాఖ్యానించారు.
Read More
21

విశ్వ విజేత‌గా భార‌త్‌

ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచక‌ప్‌-2025 ఛాంపియ‌న్‌గా భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు అవ‌త‌రించింది. ఆదివారం న‌వీ ముంబై వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో సౌతాఫ్రికాను 52 ప‌రుగుల తేడాతో ఓడించి తొలి ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్‌ను భార‌త్ సొంతం చేసుకుంది. 299 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో ద‌క్షిణాఫ్రికా 45.3 ఓవ‌ర్ల‌లో 246 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ 5 వికెట్ల‌తో స‌త్తాచాటింది.
Read More
22

ఈనెల 4న కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడన నియోజకవర్గం గూడురులో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తారు మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను వైఎస్‌ జగన్‌ పరిశీలించనున్నారు.
Read More
23

పెళ్లి తర్వాత లైఫ్‌లో థ్రిల్ కావాలా?

టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ(Priyadarshi Pulikonda) నటిస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'(Premante). ఈ మూవీతో నవనీత్‌ శ్రీరామ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. థ్రిల్‌ ప్రాప్తిరస్తు అనేది సబ్ టైటిల్. ఈ సినిమాలో ఆనంది(Anandhi) హీరోయిన్‌గా కనిపించనుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రాన్ని జాన్వి నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.
Read More
24

LVM3-M5 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ఘట్టాన్ని సాధించింది. ఆదివారం సాయంత్రం 5:26 గంటలకు ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి LVM3–M5 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా CMS–03 సమాచార ఉపగ్రహాన్ని 16.09 నిమిషాల్లో జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ప్రవేశపెట్టారు.
Read More
25

ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్‌ జాబ్‌ వరకు అన్ని ఫెయిలే..! కానీ ఇవాళ..

Read More
26

రేట్లు తగ్గుతాయా.. ప్రభుత్వ చర్య ఏంటి?

కేంద్ర ప్రభుత్వం తాజాగా బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం (Gold) దిగుమతి ధర 10 గ్రాములకు 42 డాలర్లకు తగ్గింది. అలాగే వెండి (Silver) దిగుమతి ధర కిలోకు 107 డాలర్లకు తగ్గింది. బేస్ ధర తగ్గితే దిగుమతిదారులపై పన్ను భారం తగ్గుతుంది. అందువల్ల మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా స్థిరంగా లేదా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
Read More
27

Bihar Elections: ‘బాహుబలి’ నేత అరెస్ట్.. మోకామాలో కలకలకం

పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మోకామా నియోజకవర్గంలో కలకలం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, బాహుబలి నేతగా పేరొందిన అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జన్ సురాజ్ పార్టీ కార్యకర్త, ఆర్జేడీ మాజీ నేత దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ను బార్హ్‌లోని అతని నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Read More
28

‘అది అసాధ్యం’.. ఖర్గేకు అమిత్‌షా కౌంటర్‌

న్యూఢిల్లీ: శతజయంతి సంవత్సరంలోకి ఇటీవలే అడుగిడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఈ దేశానికి ఇద్దరు ప్రధానులను అందించిందని, అయితే ఇంతటి ఘనత కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్‌ చేయడం విచిత్రంగా ఉన్నదని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
Read More
29

మెగా ఫ్యాన్స్ ఇది గమనించారా? మార్చేశారు

రామ్ చరణ్ అభిమానులు గమనించారో లేదో తెలియదు గానీ ఓ పెద్ద మార్పు చేశారు. మొన్నటివరకు ఓ ట్యాగ్‌ని తెగ ఉపయోగించారు. ఇప్పుడేమో దాన్ని తీసేసి మళ్లీ పాత ట్యాగ్ పెట్టేశారు. అసలు ఏమైంది? ఇంతకీ ఏంటి విషయం?
Read More
30

దోసె బిజినెస్‌తో నెలకు రూ. కోటి

ముంబైకి చెందిన జంట అఖిల్ అయ్యర్ , శ్రియ నారాయణ కర్ణాటకలోని దావణగిరె దోసెలంటే పిచ్చి ప్రేమ. ఆ దోసె మీద ప్రేమతోనే రుచికరమైన దోసెల బిజినెస్‌లోకి ఎంట్రీ చిన్నగా మొదలు పెట్టి, ఇపుడు నెలకు కోటి రూపాయలు సంపాదించే సంపాదించే స్థాయికి2024లో విరాట్‌ కోహ్లీ, అనుహ్క శర్మ , రోహిత్‌శర్మ,దీపికా పదుకోనెలాంటివారు వీరి దోసెలకు ఫిదా
Read More
31

10 కోట్లతో దూసుకుపోయిన ‘అమ్మపాట’

అమ్మ పాటే.. జోల పాట.. అమృతానికన్న తియ్యనంటా’.. అంటూ సాగే అమ్మ పాట సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. అందరి మనసుల్లో అల్లుకుపోయింది. అమ్మ ప్రేమలోని కమ్మదనాన్ని గుర్తు చేసింది. ఈ తెలుగు పాట దేశంలోనే కాకుండా విదేశాల్లోని తెలుగువారందరికీ చేరువైంది. ఈ పాట 100 మిలియన్‌ వ్యూస్‌ మైలురాయిని చేరిన నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌లోని శ్రీకాంత్‌ షూటింగ్‌ హౌస్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.
Read More
32

ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ 62వ పుట్టిన రోజు

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ 62 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దాతగా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్‌ ఐకాన్‌గా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు నీతా. రిలయన్స్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ భార్యగా మాత్రమేకాదు, వ్యాపారవేత్తగా, దాతగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న మహిళ. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక, ఇతర అనేక రంగాల్లో సేవలతో లక్షలాదిమందికి దగ్గరయ్యారు.
Read More
33

‘ఢిల్లీ కాదది..ఇంద్రప్రస్థ’.. సాక్ష్యాలతో ఎంపీ లేఖ

న్యూఢిల్లీ: ఢిల్లీ పేరు మార్పు అంశం మరోమారు వార్తల్లో నిలిచింది. ఢిల్లీ బీజేపీ ఎంపి ప్రవీణ్ ఖండేల్వాల్ తాజాగా హోంమంత్రి అమిత్ షాకు దేశరాజధాని ఢిల్లీ పేరును మార్చాలంటూ లేఖ రాశారు. రాజధాని పురాతన మూలాలను అనుసరించి, ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని ఆయన కోరారు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ‘ఇంద్రప్రస్థ విమానాశ్రయం’గా మార్చాలని ప్రవీణ్ కోరారు.
Read More
34

PKL 12: విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతంటే?

ప్రొ కబడ్డీ లీగ్-12వ సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ విజేతగా అవతరించింది. ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 31-28 తేడాతో టేబుల్ టాపర్ పుణెరి పల్టన్‌ ను ఓడించింది. ఫలితంగా ఆషు మాలిక్ కెప్టెన్సీలోని ఢిల్లీ రెండోసారి పీకేఎల్‌ టైటిల్ అందుకుంది. విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతంటే?
Read More
35

భలే.. బంగారం మళ్లీ త‍గ్గింది కానీ..

పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుదలతో ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
36

Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్‌

తిరువనంతపురం: ‍కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీష్ కుమార్‌ను కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)అధికారులు సుధీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, విచారించిన దరిమిలా అరెస్ట్‌ చేశారు.
Read More
37

ఐరాసలో మిథున్‌రెడ్డి ప్రసంగం

న్యూయార్క్‌: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. భారత ప్రతినిధిగా ఆయన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సర్వసభ్య-80వ సమావేశాల్లో ప్రసంగించారు. అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై మాట్లాడిన ఆయన. ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారత్ అభ్యంతరాలను స్పష్టంగా..
Read More
38

ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ ప్రపంచ రికార్డు

ఒకేసారి రెండు స్కిల్స్‌ని ప్రదర్శించడం మాటలు కాదు. అది కూడా సంగీతాన్ని, స్మిమ్మింగ్‌ని మిళితం చేస్తూ..ప్రదర్శించడానికి ఎంతో ప్రాక్టీస్‌ ఉండాల్సిందే. లేదంటే నీటిలో తేలుతూ..సంగీత వాయిద్యా పరికరాలను వాయించడం అంత సులువు కాదు. అదికూడా రివర్స్‌(బ్యాక్‌ స్టోక్‌)తో ఈత కొడుతూ వాయిద్యడం అంత ఈజీ కాదు. కానీ ఈ యువకుడు ఆ అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రికార్డు సృష్టించాడు.
Read More
39

ఆన్‌లైన్‌ షాపింగ్‌ : రూ. 2 లక్షల ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే..!

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే అలవాటున్న వారికి షాకింగ్‌ న్యూస్‌. దీపావళి సందర్భంగా బెంగళూరు టెక్నీషియన్‌కు ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. దాదాపు రెండు లక్షల రూపాయల స్మార్ట్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే రాయి(టైల్‌) వచ్చింది. అన్‌బాక్సింగ్‌ వీడియో తీయడంతో అమెజాన్‌ పూర్తి సొమ్మును వాపస్‌ ఇచ్చింది. దర్యాప్తు కొనసాగుతోంది .
Read More
40

హరహరమహదేవ శంబో... పవిత్ర శివాలయాలు

కార్తీక మాసంలో మహాశివుడిని భక్తితో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం, అలాగే కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ మాసం శివరాధనకు అంకితం. ఈ మాసంలో ఒక్కసారైనా శివాలయాలన్ని సందర్శించి, భక్తితో దీపారాధన చేస్తే మోక్షం లబిస్తుందని, కష్టాలన్నీ తొలగి, అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం.
Read More
41

పసిడి ధరలు రివర్స్‌.. 22 క్యారెట్ల బంగారం ఏకంగా..

పసిడి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుదలతో ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలో గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Rate) ఒక్కసారిగా రివర్స్‌ అయ్యాయి. మరోవైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
Read More
42

కూటమి సర్కార్‌ రైతుల నడ్డి విరిచింది: వైఎస్‌ జగన్‌

తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మోంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు.
Read More
43

డిజిటల్‌ అరెస్ట్‌ స్కాం: షాక్‌తో ప్రాణాలిడిచిన రిటైర్డ్‌ ఆఫీసర్‌ 

ఇటీవలి కాలంలో డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. తాజాగా ముంబై పోలీసులమని చెప్పి పుణేకు ఒక రిటైర్డ్‌ ఉద్యోగిని నిలువునా ముంచేశారు. ఆగస్టు 16-సెప్టెంబర్ 17 మధ్య సాగిన ఈ వ్యవహారంలో ఆయన ఏకంగా 1.9 కోట్ల రూపాయలు మోసం పోవడంతో ఆయన గుండె ఆగిపోయింది.
Read More
44

క్యాబ్‌ డ్రైవర్‌నుంచి కోటీశ్వరుడిగా ఎదిగాడు

అమెరికాలో క్యాబ్ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించిన భారతీయ వలసదారుడు ఇప్పుడు సంవత్సరానికి రూ. 17కోట్లు సంపాదిస్తున్నాడు. పంజాబ్‌కు చెందిన మనీ సింగ్‌ 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు వెళ్లాడు. గంటకు 530 రూపాయల వేతనం నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఇపుడు రెండు కంపెనీఫౌండర్‌గా కోట్లు ఆర్జించే స్థాయికి చేరాడు.
Read More
45

స్వరోవ్స్కి అంబాసిడర్‌గా రష్మిక్‌ స్టైలిష్‌ లుక్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా లాస్ ఏంజిల్స్‌లో జరిగిన స్వరోవ్స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ ప్రారంభోత్సవ వేడుకలో స్టన్నింగ్‌ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంది. స్వరోవ్స్కీ స్థాపించి 130 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2025లో 130వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. "130 ఇయర్స్ ఆఫ్ లైట్ అండ్‌ జాయ్" అనే పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Read More
46

మన వంటకం దోసె..బ్రిటిష్‌ చెఫ్‌ని ఎంతలా మార్చేసింది..!

మన భారతీయ వంటకాలకు ఫిదా కానివారెవ్వరూ.!. దేశ దేశాలలో ఉన్న వివిధ రుచల యందు భారతీయుల రుచులు వేరయా అనొచ్చు కదూ..మనవాళ్లు టేస్ట్‌..మాములుగా ఉండదు. ఎందుకంటే మన దక్షిణ భారతదేశ బ్రేక్‌ఫాస్ట్‌లపై మనుసు పారేసుకున్న బ్రిటిష్‌ చెఫ్‌..ఎంతలా మన టేస్ట్‌కి దాసోహం అయ్యేడో తెలిస్తే విస్తుపోతారు. మరీ ఆ కథేంటో చకచక చదివేయండి మరి..
Read More
47

తెలంగాణలో రగ్బీ అభివృద్ధికై ఆదిత్య విజ్ఞప్తి

తెలంగాణ రగ్బీ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఆదిత్య వుత్పల.. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ వైస్‌ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.సోనిబాలా దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీ విస్తరించేలా.. క్రీడాభివృద్ధి కొరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లోని ఆణిముత్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో రాష్ట్ర, జోనల్‌ స్థాయిల్లో ప్రోత్సాహం అందించాలని ఆదిత్య కోరారు.
48

ఆ హీరో ఆడిషన్‌కు పిలిచి అసభ్యంగా..

ప్రముఖ హీరో అజ్మల్‌ అమీర్‌ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్‌ నెట్టింట వైరలయింది. ఇదంతా ఏఐ మాయ అని.. అజ్మల్‌ వాటిని కొట్టిపారేశాడు. ఇలాంటి ఫేక్‌ వీడియోలతో కెరీర్‌ నాశనం చేయలేరు అని వీడియో రిలీజ్‌ చేశాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్‌ నర్విని దేరి.. అజ్మల్‌ అలాంటి దుర్మార్గుడే అంటోంది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2018లో చెన్నైలోని ఓ మాల్‌లో అజ్మల్‌ను తొలిసారి కలిశాను. ఆడిషన్‌..
Read More
49

Mumbai: నకిలీ శాస్త్రవేత్త అరెస్ట్‌.. లెక్కలేనన్ని బాగోతాలు వెల్లడి

ముంబై: దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా విభాగం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ కేంద్రంలో ఒక నకిలీ శాస్త్రవేత్తను అరెస్టు చేయడానికి తోడు, అతని నుంచి అనుమానిత న్యూక్లియర్‌ డేటా, 14 మ్యాప్‌లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాలలో ఏదైనా గోప్యమైన న్యూక్లియర్‌ డేటా ఉన్నదీ లేనిదీ తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
Read More
50

ఆస్ట్రేలియా యువ క్రికెటర్‌ మృతి

క్రికెట్‌ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. బంతి తాకి 17 ఏళ్ల ఆస్ట్రేలియా యువ క్రికెటర్‌ బెన్‌ ఆస్టిన్‌ మృత్యువాత పడ్డాడు. ప్రీ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా బౌలర్‌ సంధించిన ఓ బంతి బెన్‌ ఛాతీపై బలంగా తాకింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. రెండు రోజుల చికిత్స అనంతరం బెన్‌ తుదిశ్వాస విడిచాడు. బెన్‌ ఉదంతం ఆస్ట్రేలియా యువ క్రికెటర్‌ ఫిల్‌ హ్యూస్‌ను గుర్తు చేసింది.
Read More