'పాలమూరు పరువు తీశారు'
టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇకనైనా కళ్లు తెరవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్: టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇకనైనా కళ్లు తెరవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు పరువు తీశారని ధ్వజమెత్తారు. తమ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. పావుగా వాడుకోవడానికి తెలంగాణ నాయకుడే దొరికాడా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డితో కావాలనే ఈ పని చేయించారని ఆరోపించారు. చంద్రబాబు విధానమే వెన్నుపోటు విధానమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు చెంపలు వాయించుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు.


