
ఇప్పడు యువరాజ్ బౌలింగ్ సెట్ కాదు: ధోనీ
గత వరల్డ్ కప్ విజయంలో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఆ వరల్డ్ కప్ లో యువరాజ్ 15 వికెట్లు తీసి టీమిండియా వరల్డ్ కప్ ను కైవశం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
మెల్ బోర్న్:గత వరల్డ్ కప్ విజయంలో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఆ వరల్డ్ కప్ లో 15 వికెట్లు తీసిన యువరాజ్ టీమిండియా వరల్డ్ కప్ ను కైవశం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుకున్నాడు. అయితే 2015 వరల్డ్ కప్ కు యువరాజ్ ను ఎంపిక చేయకపోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం వన్డేల్లో మారిన బౌలింగ్ సమీకరణాలతో యువరాజ్ సింగ్ బౌలింగ్ అంతగా లాభించే అవకాశం లేదని స్పష్టం చేశాడు.
'ఒకసారి రూల్స్ మారిన తరువాత చూడండి. యువరాజ్ బౌలింగ్ ఎక్కువగా చేయలేదు.ట్వంటీ 20 లో బౌలింగ్ కాస్త అతని రెగ్యులర్ మ్యాచ్ ల్లో బౌలింగ్ పై ప్రభావం చూపింది. నిబంధనలు మారిన తరువాత 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటున్నారు. దీంతో యువరాజ్ బౌలింగ్ జట్టుపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు'అని ధోనీ తెలిపాడు. 2011 యువరాజ్ సింగ్ పోషించిన పాత్రను ఈ వరల్డ్ కప్ లో సురైష్ రైనా పూర్తి చేయగలడని ధోనీ ఆశాభావం వ్యక్తం చేశాడు.