వ్యాపారిని బైక్‌తో ఢీకొట్టి.. ఘరానా మోసం! | merchant hit by bike and cheated | Sakshi
Sakshi News home page

వ్యాపారిని బైక్‌తో ఢీకొట్టి.. ఘరానా మోసం!

Jun 18 2016 11:53 PM | Updated on Sep 4 2018 5:21 PM

వ్యాపారిని బైక్‌తో ఢీకొట్టి.. ఘరానా మోసం! - Sakshi

వ్యాపారిని బైక్‌తో ఢీకొట్టి.. ఘరానా మోసం!

నగరంలో శనివారం రాత్రి ఘారానా చోరీ జరిగింది.

హైదరాబాద్‌: నగరంలో శనివారం రాత్రి ఘారానా చోరీ జరిగింది. దుకాణం మూసివేసి బైక్‌పై ఇంటికి వెళుతున్న వ్యాపారిని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి.. రూ. 12 లక్షలు దోచుకున్నారు. అంతేకాకుండా వ్యాపారి బైక్‌ ను సైతం తీసుకొని పరారయ్యారు. ఈ ఘటన సుల్తాన్ బజార్‌లో జరిగింది.

సిద్ధి అంబర్ బజార్‌లో రాజధాని టైర్ల దుకాణం యాజమాని దివేష్ ఆదియా శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా ఈ దారుణం జరిగింది. బైక్‌ మీద వచ్చిన ఇద్దరు యువకులు ఆయన బైక్‌ను ఢీకొట్టి.. దృష్టి మరల్చారు. ఈ ప్రమాదం హడావిడిలో ఉండగానే దివేష్ బైక్‌తోపాటు ఆయన వద్ద ఉన్న రూ. 12 లక్షలను దోచుకున్నారు. దీనిపై బాధితుడు సుల్తాన్ బజార్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement