సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల స్కాం జరిగింది | ambati rambabu takes on chandra babu | Sakshi
Sakshi News home page

సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల స్కాం జరిగింది

Jun 19 2016 4:53 PM | Updated on Aug 20 2018 9:35 PM

సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల స్కాం జరిగింది - Sakshi

సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల స్కాం జరిగింది

చెన్నై సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.

హైదరాబాద్: చెన్నై సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. వాస్తవాలను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్ఆర్ సీపీ నిజానిర్ధారణ కమిటీని అమరావతిలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. అమరలింగేశ్వరస్వామి భూముల కుంభకోణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన కొడుకు లోకేష్కు సంబంధం ఉంది కాబట్టే అడ్డుకున్నారని విమర్శించారు.

ఈ నెల 26న చెన్నైలో ధర్మాన ప్రసాదరావు బృందం పర్యటించి, సదావర్తి సత్రం భూములపై వాస్తవాలను వెలుగులోకి తెస్తుందని రాంబాబు చెప్పారు. అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్ఆర్ సీపీ ప్రయత్నిస్తుంటే, అడ్డుకునేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు దొంగలు కాబట్టే భయపడుతున్నారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement