వైఎస్ జగన్ కు గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్! | Governor Narasimhan given appointment to YS Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ కు గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్!

Sep 26 2013 5:28 PM | Updated on Sep 5 2018 8:33 PM

వైఎస్ జగన్ కు గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్! - Sakshi

వైఎస్ జగన్ కు గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్!

రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం విషయంపై చర్చించే అంశంపై అపాయింట్ మెంట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం విషయంపై చర్చించే అంశంపై అపాయింట్ మెంట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్ 30 తేదిన సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ కేటాయించారు. రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉంచాలనే అంశంపై తమ పార్టీ వైఖరిని గవర్నర్ కు  వైఎస్ జగన్ వివరించనున్నారు. 
 
తెలంగాణపై కేంద్రం తీర్మానం పంపడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి... సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  డిమాండ్‌ చేస్తోంది.  అలాగే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని,  తీర్మానం తర్వాత రాజీనామాలు ఆమోదించుకోవాలనే మూడు డిమాండ్లతో స్పీకర్‌ను కలుస్తామని శోభానాగిరెడ్డి వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement