బీజేపీ అభ్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చంద్రబాబు! | Chandrababu Naidu confuses about Candidates | Sakshi
Sakshi News home page

బీజేపీ అభ్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చంద్రబాబు!

May 1 2014 6:43 PM | Updated on Aug 15 2018 2:14 PM

బీజేపీ అభ్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చంద్రబాబు! - Sakshi

బీజేపీ అభ్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రవర్తన తీరు బీజేపీ అభ్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.

భీమవరం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రవర్తన తీరు బీజేపీ అభ్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.  తాడేపల్లిగూడెం అభ్యర్థి విషయంలో చంద్రబాబు గందరగోళానికి లోనయ్యారు. వేదికపై ఉన్నది బీజేపీ అభ్యర్ధా? లేక టీడీపీ అభ్యర్ధ్యా అనే విషయం తెలియక తికమకపడ్డారు. 
 
బీజేపీ అభ్యర్థి పేరు తెలియకపోవడంతో చంద్రబాబు కంగారు పడ్డారు.  వీర్రాజుకు ఓటు వేయాలంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపునివ్వడంతో బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావు తెల్లబోయారు.  చంద్రబాబు పిలుపుతో అవాక్కైన బీజేపీ అభ్యర్థి వెంటనే చంద్రబాబుకు సర్ధిచెప్పారు.
 
చంద్రబాబు వద్దకు వచ్చి బరిలో ఉంది వీర్రాజు కాదని తానేనంటూ మాణిక్యాలరావు సూచన చేయడంతో చంద్రబాబు తెల్లబోయారు.  ఎవరూ అభ్యర్థో తెలియని నాయకుడి పరిస్థితి ఇలా ఉంటే ఎలా అంటూ ఓటర్లు గుసగుసలాడారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement