నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణకు సరైన పదవి ఇవ్వకుంటే ఈ ఎన్నికలలో టిడిపికి వ్యతిరేకంగా పనిచేస్తామని ఆయన అభిమానులు హెచ్చరించారు.
విశాఖపట్నం: నందమూరి బాలకృష్ణకు సరైన పదవి ఇవ్వకుంటే ఈ ఎన్నికలలో టిడిపికి వ్యతిరేకంగా పనిచేస్తామని ఆయన అభిమానులు హెచ్చరించారు. పాయకరావుపేటలో ఈరోజు బాలకృష్ణ అభిమానుల సంఘం సమావేశం జరిగింది. బాలకృష్ణకు ఏ పదవి ఇస్తున్నారో స్పష్టం చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు.
ఈ ఎన్నికల్లో బాలకృష్ణకు సరైన పదవి ఇవ్వకపోతే టిడిపిని వ్యతిరేకిస్తామని బాలకృష్ణ ఫ్యాన్స్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ చెల్లకొండ రమేష్ చెప్పారు. ఈ నెల 8న భవిష్యత్ కార్యాచరణపై మళ్లీ సమావేశం కావాలని తీర్మానించారు.
ఇదిలా ఉండగా, బాలకృష్ణకు టిడిపి అధ్యక్ష పదవి ఇవ్వాలని కొందరు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.


