breaking news
Rahul Gandhi
-
రహదారులు ఇలాగేనా ఉండేది?
రాయ్‌బరేలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించారు. అమేథీ ఎంపీ కిషోరీ లాల్ శర్మతో కలిసి కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించేందుకు జరిగిన ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోజ్ కుమార్ పాండే, ఉద్యానవన శాఖ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద నిర్మించిన రహదారుల దుస్థితిని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంతలమయమైన రోడ్ల ఫోటోలను ప్రదర్శించారు. వాటి నిర్మాణానికి బాధ్యత వహించిన ఏజెన్సీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏ రోడ్డుకు ఏ సంస్థ బాధ్యత వహిస్తుందో తెలిపే రికార్డులను నిర్వహించాలని పేర్కొన్నారు. దెబ్బన్న రోడ్లను మరమ్మతు చేస్తామని చేపడతామని పీఎంజీఎస్‌వై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హామీ ఇచి్చనట్లు దిశా కమిటీ నామినేటెడ్ సభ్యుడు ఉమేష్ బహదూర్ సింగ్ చెప్పారు. జిల్లాలోని రోడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, ఫోటోల రూపంలో సాక్ష్యాలను సమరి్పంచిన తర్వాతే ఈ సమస్యను రాహుల్ గాంధీ లేవనెత్తారని వెల్లడించారు. దిశా సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. రాహుల్‌పై మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించడం కంటే వాటిలో లోపాలను వెతకడానికే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తప్పుపట్టారు. -
అభివృద్ధిని చూడలేని నారాజ్ మామ
వడోదర: ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ విషయంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా చూడలేక విమర్శకులు నిత్యం అసంతృప్తి చెందుతూ అలిగిన మామ(నారాజ్ ఫుఫా) లాగా ఫిర్యాదులు చేస్తూ, లేనిపోని సమస్యలను సృష్టిస్తారని అన్నారు. అలాగే ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. రాహుల్ నిర్వహిస్తున్న ఛాత్రోంకీ గూంజ్(విద్యార్థుల ప్రతిధ్వని) సభలను ఝూట్ కీ గూంజ్(అబద్ధాల ప్రతిధ్వని)గా కొట్టిపారేశారు. మోదీ మంగళవారం గుజరాత్లో పర్యటించారు. వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.35,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నవీ ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీని అనుసంధానించే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని మూడు కీలక సెక్షన్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వేగంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నత్తనడకలా సాగేవని ఆక్షేపించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. తప్పులు వెతకడమే వారి పని ‘‘తప్పులు వెతకడమే ప్రతిపక్షాల పనిగా మారింది. కొత్తగా ప్రారంభించిన ఫ్రైట్ కారిడార్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ ఎల్లప్పుడూ తప్పులు వెతుకుతారు. ముంబై ఓడరేవు నుంచి వడోదరకు ఇటీవల డబుల్–స్టాక్ కంటైనర్ సరుకు రవాణా రైలును నడిపించాం. దీనివల్ల ఒకే ప్రయాణంలో 250కి పైగా ట్రక్కులకు సమానమైన సరుకును ఆ రెండు నగరాల మధ్య రవాణా చేయగలిగాం. ఇప్పుడు నారాజ్ ఫుఫాజీ (అలిగిన మామగారు) నోటికి పని చెబుతారు. డబుల్–స్టాక్ కంటైనర్ రైళ్లు వస్తే ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ట్రక్కులు ఎక్కడికి వెళ్తాయి? ప్రజలు కొనుగోలు చేసిన ట్రక్కుల మాటేంటి? అని ప్రశ్నిస్తారు. విమర్శలు చేయడానికి ఫుఫాజీకి ఇప్పుడు కొత్త విషయం దొరికింది. రవాణా కారిడార్‌పైనా వారికి సందేహాలు వస్తాయి. దేశ పురోగతికి వ్యతిరేకంగా విమర్శలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకైనా వెళ్తాయి. ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి వారికి ఏదో ఒక సాకు కావాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌తో పోలిస్తే ఎన్డీయే పదేళ్ల పాలనలో ఆధునీకరణ వేగంగా జరిగింది. 2014 తర్వాత 50,000 ఆధునిక రైలు బోగీలను నిర్మించాం. గత ప్రభుత్వం పదేళ్లలో కనీసం 50,000 మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయింది. రాజకీయ ప్రసంగాల కంటే వాస్తవికతకే యువత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు. రాజకీయ తప్పుదారి పట్టించే చర్యలకు గురికావొద్దు. అబద్ధాలతో అడుగడుగునా తప్పుదోవ పట్టించేవారు కనిపిస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నేటి యువత సత్యం వైపే నిలబడుతుంది. సౌర, పవన, జల, అణు శక్తి వంటి రంగాల్లో ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్ధితో పనిచేస్తోందో యువతకు తెలుసు’’ అని మోదీ అన్నారు.ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ‘‘దేశంలో లక్షలాది మంది యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏటా మన కుటుంబాల ఆదాయంలో చాలాభాగం కోచింగ్‌ల కోసమే ఖర్చవుతోంది. అందుకే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే మా లక్ష్యం’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘నమో కమలం’ ప్రారంభం దక్షిణ గుజరాత్‌లోని నవసారి పట్టణంలో బీజేపీ నూతన కార్యాలయం ‘నమో కమలం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అధికార పార్టీకి ఉన్న అధికారం, పదవులు, సంస్థాగత బలం పూర్తిగా ప్రజాసేవ కోసమేనని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. బీజేపీలో సాధారణ క్షేత్రస్థాయి కార్యకర్త కూడా ఎప్పుడూ అధికార మదంతో విర్రవీగలేదని అన్నారు. తమ కార్యకర్తలు ప్రజాసేవకు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. తమ దృష్టిలో అధికారం కేవలం సేవాభావం కోసమేనని తెలిపారు. -
కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా 120 మంది కొత్త జాతీయ కార్యదర్శుల ఎంపికకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్వయంగా నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వారి చురుకుదనం, పనితీరు నివేదిక ఆధారంగా అర్హతలను పరిశీలిస్తున్నారు. జాతీయ స్థాయి పదవుల నియామకాలకు రాజకీయ సీనియారిటీకి బదులుగా పనితీరు, చురుకుదనాన్ని ప్రధాన ప్రామాణికంగా పరిగణిస్తున్నారు.జాతీయ కార్యదర్శి పదవుల కోసం రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిసి నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన నేతలను ఢిల్లీకి పిలిపించారు. సోమవారం 30 మంది నేతలను ఇంటర్వ్యూ చేశారు. రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ రెండు రోజుల పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మళ్లీ కొనసాగనుంది. ఒక్కోసారి 10 మంది చొప్పున నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. గతంలో వారు చేసిన పనులు, ప్రొఫైల్ తదితర అంశాలపై రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఇంటర్వ్యూకు హాజరవుతున్న నేతల పనితీరు నివేదికలు ఇప్పటికే ఆయన వద్ద ఉన్నాయి.వివిధ రాష్ట్రాల్లో జాతీయ కార్యదర్శుల నియామకానికి కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత కార్యదర్శుల్లో 60 శాతానికిపైగా మార్పులు చేసి కొత్త ముఖాలకు అవకాశం కల్పించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. కేవలం సిఫార్సులు, సిఫార్సు లేఖల ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయి వాస్తవాలు, పని సామర్థ్యం, దూరదృష్టి ఆధారంగా యువతకు అవకాశం కల్పించాలన్నది రాహుల్‌గాంధీ ఉద్దేశం. జాతీయ కార్యదర్శి పదవికి 120 మంది నేతలను ఇంటర్వ్యూ చేయనున్నారు. అనంతరం వారి నియామకం చేపట్టనున్నారు. కాంగ్రెస్ ‘సంఘటన్ సృజన్’ కార్యక్రమంలో పరిశీలకులుగా పనిచేసిన నేతలకు ఈ పదవుల కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.2004లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పునరుద్ధరణ, తరాల మార్పు రాహుల్‌గాంధీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. యువతను ముందుకు తీసుకురావడంతోపాటు సంస్థాగత వ్యవస్థలో మార్పులకు ఆయన గతంలోనూ ప్రయత్నించారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలోనూ ఇంటర్వ్యూ ఆధారిత నియామక ప్రక్రియను అనుసరించారు. గతంలో సీనియర్ నేతల వ్యతిరేకత, అంతర్గత విభేదాల కారణంగా ఈ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో జరుగుతున్న మార్పులతో పరిస్థితి మారుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యువ నేతలకు అవకాశాలు కల్పిస్తున్నారు. దీని కొనసాగింపుగానే జాతీయ కార్యదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించి సమ్మిళిత బృందాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.ఇది కూడా చదవండి: పేరులో తేడా.. పద్మశ్రీ గ్రహీతకూ ‘సర్’ నోటీసు! -
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్‌లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్‌కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్‌ను ఆయన తన బ్రాండ్‌గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్‌లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్‌తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్‌ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్ -
ఛిద్రమైన కలలను నిలబెట్టగలరా?
న్యూఢిల్లీ: బిహార్‌లో విద్యా రంగంలో సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం, తుపాకులతో కాల్పులు జరపడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విరిగిన ఎముకలను సరిచేయవచ్చు గానీ చెదిరిపోయిన విద్యార్థుల కలలను పునరుద్ధరించగలరా? అని ప్రధాని మోదీ, బిహార్ సీఎం సామ్రాట్‌లను ప్రశ్నించారు. బిహార్ విద్యార్థులు, యువతతో తాను ఇటీవల సమావేశమైన వీడియోను రాహుల్ గాంధీ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. పరీక్షల విధానంలో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు గళమెత్తినందుకు పోలీసులు లాఠీలతో చావబాదారని, కాల్పులు జరిపారని మండిపడ్డారు. పిల్లలు చేసిన పాపం ఏమిటి? కాల్పులు జరిపేటంత నేరం వారు ఏం చేశారు? అని నిలదీశారు. బిహార్‌లో ఏకే–47 బుల్లెట్ తాకడంతో ఒక విద్యార్థి కాలి ఎముక విరిగిపోయిందని, దాంతో సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న అతని కల కరిగిపోయిందని రాహుల్అన్నారు. మరో ఇద్దరు విద్యార్థుల భుజాల గుండా బుల్లెట్లు దూసుకెళ్లాయని తెలిపారు. విద్యార్థులు నేరస్తులు కాదని తేలి్చచెప్పారు. కుటుంబాల ఆశయాలను మోస్తూ చదువుకోవడానికి బయటకు వచి్చన పేద పిల్లలపై కాఠిన్యం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. తూటా గాయాలు మానుతాయి గానీ పిల్లల మనసుల్లో లోతుగా పాతుకుపోయిన భయానికి చికిత్స చేసే ఆసుపత్రి ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఛిద్రమైన కలలను మళ్లీ నిలబెట్టగలరా? అని నిలదీశారు. -
ఆ పక్కకు ఉండలేక.. ఈ పక్కకు రాలేక!
టీవీకే 2029లో లోక్‌సభ ఎన్నికల్లో ఇలాగే తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెస్తే రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌కు ‘ఇక్కడా కాదు.. అక్కడా కాదు’ అనే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వ్యూహకర్త అమితాబ్ తివారీ విశ్లేషించారు. అంటే, రాహుల్ గాంధీ మధ్యలో ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది. విజయ్ 2029లో ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తే, రాహుల్ గాంధీకి ప్రతిపక్షాల తరఫున ప్రధాన నాయకుడిగా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోవడం కష్టమయ్యే పరిస్థితి రావచ్చు. విజయ్ ఎదుగుదల వల్ల రాహుల్‌కు ప్రధాని రేసులో స్పష్టమైన ఆధిపత్యం లేకుండా, రాజకీయంగా మధ్యలో ఇరుక్కునే పరిస్థితి రావచ్చు. 2029 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా విజయ్ పనితీరు, టీవీకేకు లభించే ప్రజాదరణ, కాంగ్రెస్‌తో కొనసాగించే పొత్తు ఈ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారనున్నాయి.తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్ను 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఇప్పటికే బహిరంగ చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. ఇది తమిళనాడులో టీవీకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌లో అసౌకర్యానికి కారణమవుతున్నట్లు సమాచారం.విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని 2029 ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నానికి నేరుగా సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు టీవీకే తన మిత్రపక్షాలతో సెప్టెంబర్ 9న సమావేశం నిర్వహించనుంది.దక్షిణాది నుంచి ప్రధాని రావాలి టీవీకే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సమయంలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విజయ్ను జాతీయ రాజకీయాల కోణంలో ప్రస్తావించడం ప్రారంభించారు. మంత్రి ఆధవ్ అర్జున దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావాలని తమిళనాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. మరో మంత్రి జగదీశ్వరి.. విజయ్ ఏదో ఒక రోజు ప్రధాని అవుతారని అన్నారు. ఎమ్మెల్యే కనిమొళి అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు విజయే టీవీకే ప్రధాని అభ్యర్థి అని ప్రకటించారు. “ఎవరు ప్రధాని కావాలో ఢిల్లీ నిర్ణయించదు. తమిళనాడు నిర్ణయిస్తుంది” అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ కూడా విజయ్ ప్రధానమంత్రి కావడానికి మద్దతు ఇస్తారని ఆమె పేర్కొన్నారు.తాజా ఇండియా టుడే సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో తదుపరి ప్రధానమంత్రిగా విజయ్‌కు 9 శాతం మద్దతు లభించింది. నరేంద్ర మోదీ 48.7 శాతంతో ముందుండగా, రాహుల్ గాంధీ 27.1 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ మాత్రం 543 స్థానాల లోక్‌సభలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 మంది సభ్యుల మద్దతు అవసరమని, ప్రస్తుతం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చూడటం తొందరపాటు, అత్యాశతో కూడిన లక్ష్యమని అన్నారు.కాంగ్రెస్ నేతలు మాత్రం విజయ్ ప్రధాని ప్రచారాన్ని తేలికగా తీసుకుంటున్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మాణికం ఠాగూర్ దీన్ని అభిమాన సంఘం తరహా ఆలోచనగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ప్రధాని కావాలంటే 272 మంది ఎంపీల మద్దతు అవసరమని అన్నారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్ -
తమిళనాట బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు విజయ్ మరో షాక్!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అప్పుడే అధికార కూటమికి ‘2029 ఎన్నికల’ సెగ తగులుతోంది. ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు కూడా పూర్తికాకముందే.. ‘ప్రధాని అభ్యర్థి ఎవరు?’ అన్న ప్రశ్న టీవీకే-కాంగ్రెస్ మధ్య చిచ్చు రేపుతోంది. ఒకవైపు సీఎం, టీవీకే అధినేత విజయ్ను 2029 ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెస్తున్న ఆయన పార్టీ నేతలు.. మరోవైపు రాహుల్ గాంధీనే ప్రతిపక్ష కూటమి ప్రధాని ముఖంగా కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న టీవీకే మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుండటం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే నేతలను టీవీకే మంత్రులు సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఈ భేటీలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు కూటమి భవిష్యత్ వ్యూహంపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ సమావేశానికి కాంగ్రెస్‌కు ఆహ్వానం లేకపోవడం మరింత ఉత్కంఠకు తెరలేపింది.అసలు కథ మొదలైంది ఇక్కడే..టీవీకేకి చెందిన పలువురు నేతలు వరుసగా ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదాన్ని తెరపైకి తీసుకురావడంతో వివాదం మొదలైంది. విజయ్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, 2029లో ప్రధాని అభ్యర్థిగా ఆయనను ముందుకు తీసుకురావాలని పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. విజయ్‌కు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని కూడా కొందరు టీవీకే నేతలు వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో మరింత అసహనానికి కారణమైంది.కాంగ్రెస్ వార్నింగ్.. రాహుల్ మా ఛాయిస్!టీవీకేనేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. 2029లో రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నది పార్టీ విధానం కాదని.. కొందరు కొత్తగా వచ్చిన నేతల అభిమాన భావజాలం మాత్రమేనని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీలు.. జాతీయ స్థాయిలో మాత్రం ఇద్దరు వేర్వేరు నేతలను ప్రధాని కుర్చీ కోసం ముందుకు తెస్తున్నాయి. అయితే, ఈ వివాదం మాటలకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ మంత్రి ఎస్. రాజేశ్ కుమార్.. రాహుల్ గాంధీని 2029 ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు పదవుల్లో కొనసాగడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కూటమిలోని అంతర్గత ఉద్రిక్తతను మరింత బయటపెట్టాయి.మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఈ వివాదంపై ఇప్పటివరకు పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడంతా సెప్టెంబర్ 9 సమావేశంపైనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే ఇప్పటికే మిత్రపక్షాలతో చర్చలు మొదలుపెట్టింది. ఈ సమావేశంలో కూటమి నిర్మాణం, రాజకీయ ఫ్రంట్‌కు పేరు, సమన్వయ వ్యవస్థ వంటి అంశాలతో పాటు విజయ్-రాహుల్ వివాదానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా? అన్నది కీలకంగా మారింది.ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడగటం ప్రభుత్వ వ్యతిరేకమా: సీజేపీ -
అగ్రనేతల ఆమోదంతోనే...
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసనకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాంధీ ఆమోదం తెలిపారు. దీంతో గత మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కొనసాగిన సురేఖ వ్యవహారానికి పార్టీ అధిష్టానం బర్తరఫ్‌తో ముగింపునిచ్చింది. రాష్ట్ర ముఖ్య నేతలు ఇచ్చిన సమాచార క్రోడీకరణ..తమ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు..ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వేదికగా సురేఖ చేసిన వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా ఆమెపై వేటుకే హైకమాండ్ మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, క్రమశిక్షణా సంఘం అభిప్రాయాలను.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చల అనంతరం సురేఖను బర్తరఫ్ చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలకు తావులేకుండా చిన్నారెడ్డిపైనా వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సమాచారం అందిన వెంటనే..తదుపరి పర్యవసానాలు, పార్టీపై పడే ప్రభావంపై పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి..తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మూడ్రోజులుగా తర్జనభర్జనలు.. సురేఖతో పాటు చిన్నారెడ్డికి సంబంధించి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న సురేఖపై కఠినంగా వ్యవహరించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, విపక్షాలకు అ్రస్తాలను అందించినట్లే అవుతుందని అన్నారు. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాలని విన్నవించారు.దీనిపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల అభిప్రాయాలను సేకరించారు. మెజార్టీ నేతలు ఆమెను తొలగించేందుకే మొగ్గు చూపారు. సురేఖ కూడా తన వాదన ఖర్గేకు చెప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుంచే ముఖ్యమంత్రిపై మొదటగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఆమె తొలగింపుపై పట్టుబట్టడంతో గురువారం సైతం వరుస సమావేశాలు కొనసాగాయి. సోనియా, రాహుల్‌కు కేసీ సమాచారం బుధవారం నాటి వరుస భేటీల సారాంశం.. రాష్ట్ర నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను ఖర్గేతో మరోమారు చర్చించిన కేసీ వేణుగోపాల్..ఆయన సూచనల మేరకు అన్ని అంశాలను అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, సోనియాగాం«దీలకు వివరించారు. దీంతో వారు సురేఖపై వేటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు చిన్నారెడ్డిని తప్పించాలని నిర్ణయించారు. ఈ సమాచారం సీఎం, పీసీసీ చీఫ్‌లకు కేసీ వేణుగోపాల్ చేరవేశారు. కాపాడని ‘రాహుల్ మనుస్మృతి’ ఇటీవల పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ మనుస్మృతి, మహిళలపై చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై అధిష్టానం కటువుగా వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కానీ అలా జరగలేదు. మహిళలు దేశానికి అత్యంత పెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించాలని రాహుల్ ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. మహిళకు తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కలలు, లక్ష్యాలు ఉండాలని, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీసీ మంత్రి అయిన సురేఖపై చర్యలు ఉండక పోవచ్చని, ఆమెపై వేటు వేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హైకమాండ్ భావించవచ్చనే చర్చ జరిగింది. సురేఖ కూడా మీడియా ముందు రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తావించారు. కానీ పార్టీ అధిష్టానం.. సురేఖపై వేటుకే మొగ్గు చూపింది.సీఎం నివాసంలో సుదీర్ఘ చర్చలు సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో తలెత్తే పర్యవసానాలు, రాజకీయ ప్రభావం, దీనిని ఎదుర్కొనే వ్యూహంపై ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో చర్చోపచర్చలు జరిపారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాజకీయ విమర్శలకు తావివ్వకుండా బీసీ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడంపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీలోనే గద్వాల్ విజయలక్ష్మీ, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలకు పదవులు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కాగా సురేఖ తొలగింపు సమాచారం మీడియాకు అందాక ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆ తర్వాత మహేశ్‌గౌడ్, భట్టిలు కూడా హైదరాబాద్ వెళ్లారు. -
కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు ఎండ్‌కార్డ్?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మంత్రి సురేఖపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం, హైకమాండ్ ముందు సురేఖ వివరణ, ఆపై మీడియా ముందు సీఎంపై చేసిన ఆరోపణలు.. అన్నింటినీ పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు తుది నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే కీలక భేటీ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరపడొచ్చనే చర్చా జోరందుకుంది. పరకాల రాజకీయాల నేపథ్యంలో మొదలైన వివాదం.. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్(చిట్టక్క) చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా భావించారు. కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పార్టీ క్రమశిక్షణా కమిటీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సురేఖను వివరణ కోరగా.. తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే పీసీసీ మాత్రం ఈ వ్యవహారం అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ వచ్చింది. ఈలోపు ఈ వివాదంపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. సురేఖ వ్యవహారంపై ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆగస్టు 25న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చేరింది. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు.. అటు నుంచి ఏఐసీసీకి చేరింది. అప్పటి నుంచి ఈ అంశం కాంగ్రెస్ హైకమాండ్ వద్దే ఉంది. అయితే వెంటనే చర్యలు తీసుకోకుండా.. సురేఖ వివరణ, పార్టీపై దాని ప్రభావం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను అధిష్టానం పరిశీలిస్తూ వచ్చింది.రేవంత్ స్పష్టమైన వైఖరిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ ఎపిసోడ్ అంతా నడిచింది. తిరిగొచ్చిన వెంటనే ఆయన ఈ పరిణామాలపై భగ్గుమన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా సురేఖపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లాలన్నది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రాజకీయాల్లో కాకరేపిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వ్యవహారంపైనా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి పదవుల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని సీఎం రేవంత్ కోరుతుండగా.. దానికి టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ సైతం మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అయితే.. సురేఖకు మద్దతు కూడామరోవైపు సురేఖను వెంటనే కేబినెట్ నుంచి తొలగించొద్దంటూ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు హైకమాండ్‌ను కోరినట్లు తాజా సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు సహా పలువురు నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ విషయంలో హైకమాండ్ ముందు రాజకీయంగా సున్నితమైన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో.. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేసినా ఆ తర్వాతి పరిస్థితులకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.హైకమాండ్‌తో సురేఖ భేటీమరోవైపు ఢిల్లీలో నిన్నంతా కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ ఇందిరా భవన్ వేదికగా నాటకీయ పరిణామాలు జరిగాయి. అధిష్టానం పిలుపుతో అక్కడికి వెళ్లిన కొండా సురేఖ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. తనపై జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులపై వస్తున్న ఆరోపణల గురించి కూడా హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆమె చెప్పారు. ఆ వెంటనే సీఎం రేవంత్, ఖర్గేతో మరోసారి భేటీ జరిపారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే.. రాహుల్ గాంధీతో చర్చించాకే ఏ నిర్ణయమైనా వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.నేడు కీలక భేటీలురాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు తిరిగి అందుబాటులోకి రావడం, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉండటంతో గురువారం చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత రేవంత్, మహేష్ గౌడ్లు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారని సమాచారం. దీంతో ఇవాళ నిర్ణయం వెలువడొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటు ఇవాళ కొండా సురేఖ దంపతులు తిరిగి వరంగల్‌కు చేరుకోనున్నారు. అనుచరులతో వాళ్లు భేటీ అవుతారని సమాచారం అందుతోంది.కేబినెట్ మార్పులపై కూడా చర్చ?ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఉన్నారు. ఇప్పటికే అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇవాళ్టి భేటీలో సురేఖపై నిర్ణయంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సురేఖను తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలి? ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? నామినేటెడ్ పదవుల భర్తీ ఎలా చేపట్టాలి? అనే అంశాలపైనా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వేటా.. ప్రత్యామ్నాయ మార్గమా?సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ప్రచారం కొనసాగుతున్నప్పటికీ.. హైకమాండ్ మరో మార్గాన్ని పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమెకు కేబినెట్ నుంచి తప్పుకుని మరో కీలక పదవి ఇచ్చే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కొండా వ్యవహారంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని హైకమాండ్ నుంచి సూచనలు వెళ్లినట్లు సమాచారం. తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదన్న ఆదేశాలు.. ఈ అంశాన్ని పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో స్పష్టం చేస్తున్నాయి. సురేఖతో పాటు జి.చిన్నారెడ్డి వ్యవహారం కూడా హైకమాండ్ ముందుంది. ఇద్దరిపై క్రమశిక్షణా కమిటీ సిఫారసులు చేయడంతో.. ఒకేసారి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలా? లేక వేర్వేరుగా నిర్ణయం తీసుకోవాలా? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఒకవైపు రేవంత్‌రెడ్డి కఠిన చర్యల వైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారం.. మరోవైపు సురేఖకు పార్టీలోని కొందరి మద్దతు.. ఇంకోవైపు హైకమాండ్ రాజకీయ లెక్కలు.. ఈ మూడు అంశాల మధ్య తుది నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నేటి ఢిల్లీ పరిణామాలతో కొండా ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డ్ పడుతుందా? లేదంటే మరో మలుపు తిరుగుతుందా?అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్ అయ్యింది.ఇదీ చదవండి: పిల్లల బడిలో.. పెద్దోళ్ల ఆఫీస్! -
యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ బీ.. వారికి బంపరాఫర్?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ కూడా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్న వేళ.. అభ్యర్థుల ఎంపికలోనూ కొత్త విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.బలమైన ప్రజాదరణతో పాటు ఎన్నికల ప్రచారాన్ని సొంతంగా నిర్వహించగల ఆర్థిక సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు టికెట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు ‘ఇండియా టుడే’ కథనం వెల్లడించింది. ఎన్నికలను ఈసారి కాంగ్రెస్ అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. నియోజకవర్గంలో ప్రజాదరణ, గెలుపు అవకాశాలు, ప్రచారానికి అవసరమైన వనరులు ఉన్న నేతలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.అయితే.. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ గెలిచే సత్తా ఉన్న బలమైన అభ్యర్థులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. అదే సమయంలో అభ్యర్థులు పార్టీ నిధికి కూడా తమ వంతు సహకారం అందించాలని పార్టీ ఆశిస్తోంది. గతంలో ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ నుంచి నిధులు తీసుకున్న కొందరు అభ్యర్థులు వాటిని పూర్తిగా ప్రచారానికి వినియోగించకుండా తమ వద్దే ఉంచుకున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ అంశంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.2022 ఫలితాల నేపథ్యంలో కొత్త వ్యూహం2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 399 స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పలువురు అభ్యర్థులకు పార్టీ నుంచి ఎన్నికల ప్రచారం కోసం భారీగా నిధులు అందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అనుభవం నేపథ్యంలోనే ఈసారి అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలతో పాటు ఆర్థిక సామర్థ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.ఎస్పీతో సీట్లపై కాంగ్రెస్ పట్టుమరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్‌కు కీలకంగా మారింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 115 నుంచి 120 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ ఏకంగా 50 శాతం సీట్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకోవడం, ఉత్తర భారతదేశంలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ తమకు అనుకూలంగా మారుతుందని పార్టీ అంచనా వేస్తోంది. దళితులు, మైనారిటీలు, యాదవేతర ఓబీసీ వర్గాలు రాహుల్ వైపు మొగ్గుచూపుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఇక వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై యాంటీ ఇన్‌కంబెన్సీ తమకు కలిసొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ మొత్తం 403 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తోంది. సీట్ల పంపకాల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్.. ఫాలోవర్ల మోజు!.. పార్టీని పట్టించుకోరా? -
టూర్లు.. పెళ్లిళ్లు.. బంగారం: మోదీ కీలక పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వృద్ధి రేటు నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ శర వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ‘స్వదేశీ.. వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలంటించారు.కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరైన మోదీ.. మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘7.8 శాతం వృద్ధి దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. ఇది ప్రజల సంకల్ప బలం, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రతిబింబం’’ అని అన్నారు.‘ప్రపంచం యుద్ధంలో ఉంది’ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతోందని మోదీ పేర్కొన్నారు. కొవిడ్ కాలం 2020 నుంచి ఇప్పటివరకు ఎక్కడా పూర్తి స్థాయిలో స్థిరత్వం కనిపించలేదని, సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.విదేశీ టూర్లు వద్దు.. ‘వెడ్ ఇన్ ఇండియా’ఈ నేపథ్యంలో ప్రజలు దేశీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని కోరారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు అసలే నిర్వహించవద్దని సూచించారు. పెళ్లిళ్లను దేశంలోనే నిర్వహిస్తూ ‘వెడ్ ఇన్ ఇండియా’ నినాదాన్ని పాటించాలని అన్నారు. అలాగే అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బలోపేతమవుతుందని చెప్పారు.‘అబద్ధాల ప్రతిధ్వని’పై వ్యాఖ్యలుఇదే సమయంలో దేశంలో కొందరు నిరాశావాదంతో ‘జూట్ కీ గూంజ్’ (అబద్ధాల ప్రతిధ్వని) వ్యాప్తి చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విమర్శలు, నిరాశావాద ప్రచారాలను అధిగమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ‘‘దేశంలోనే కొందరు తీవ్ర నిరాశలో మునిగిపోయి అబద్ధాల ప్రతిధ్వనిని వ్యాప్తి చేస్తున్నారు. వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ వేగాన్ని కొనసాగించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.మోదీ చెప్పిన ‘జూట్ కీ గూంజ్’ పదప్రయోగం ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ప్రచారంపై కొనసాగుతున్న రాజకీయ విమర్శలకు సంబంధించి చేసిన వ్యాఖ్యగా భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ వివిధ కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. ఆయన నాలుగు కార్యక్రమాల్లో చేసిన 40 ప్రకటనల్లో 29 అవాస్తవమైనవని, మరో 11 తప్పుదారి పట్టించేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే మోదీ ‘అబద్ధాల ప్రతిధ్వని’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.7.8 శాతం వృద్ధిసోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలోని 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి కొంత తగ్గినప్పటికీ.. అంచనాలను మాత్రం అధిగమించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వంటి సవాళ్ల మధ్య ఈ వృద్ధి నమోదైంది.భారత్ స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘విధానం సరైనది.. సంకల్పం స్పష్టంగా ఉంది.. 140 కోట్ల మంది భారతీయుల ఐక్య శక్తితో దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం’’ అని తాజా వీడియో సందేశంలో ఉద్ఘాటించారు.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ? విజయ్?? పీఎం అభ్యర్థి ఎవరసలు! -
విజయ్‌తో విభేదాల్లేవు.. ఆయనే ప్రధాని అభ్యర్థి!
తమిళనాడు రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వాములైన తమిళగ వెట్రి కళగం (టీవీకే), కాంగ్రెస్ మధ్య విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే టీవీకే మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తూ హస్తం పార్టీకి అసహనం తెప్పిస్తోంది. ఆ వెంటనే అసెంబ్లీలో సీటింగ్ మార్పు.. ఇరు పార్టీల మధ్య గ్యాప్‌నకు కారణమనే చర్చా నడిచింది. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత తరహై కత్బర్ట్(Tharahai Cuthbert) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీని విజయ్ కూడా అంగీకరించారని ఆమె పేర్కొన్నారు. ‘‘సీఎం రాహుల్‌గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నారు. ఆయన కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు’’ అని తెలిపారు.‘కాంగ్రెస్ ఎవరికీ బానిస కాదు’టీవీకేకు కాంగ్రెస్ లోబడి పనిచేయడం లేదని తరహై కత్బర్ట్ స్పష్టం చేశారు. తమిళనాడులో తమ పార్టీ స్వతంత్రంగా విస్తరిస్తోందని, కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధమైన స్వతంత్ర పార్టీ అని పేర్కొన్నారు. కూటమిలో ఉన్నప్పటికీ పార్టీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.అందుకే సీటు మారాల్సి వచ్చిందిఇదిలా ఉండగా.. అసెంబ్లీలో తన సీటు మార్పుపైనా కత్బర్ట్ వివరణ ఇచ్చారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకే ఎమ్మెల్యేలతోనే కూర్చున్నారు. తాజా తాజా వివాదం నేపథ్యంలో వాళ్లు కావాలనే సీటు మారి విపక్ష సభ్యులతో కూర్చున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలోనే తనకు ముందు వరుసలో సీటు కేటాయించారని, దీనికి ఎలాంటి రాజకీయ కారణం లేదని కత్బర్ట్ స్పష్టం చేశారు. ఇక ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదానికి సంబంధించి రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదవడాన్ని కూడా కత్బర్ట్ ప్రస్తావించారు. రాహుల్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ ఆందోళన చెందుతోందని ఆరోపించారు. 2029లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఇటీవల ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి విజయ్ మూడో స్థానంలో నిలిచిన నేపథ్యంలో టీవీకే కార్యకర్తలు ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.‘విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చేస్తే బయటకొస్తాం’అంతకు ముందు.. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా టీవీకే ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ మంత్రులు తమిళనాడు ప్రభుత్వాన్ని వీడతారని ఆ పార్టీకి చెందిన మంత్రి ఎస్. రాజేశ్ కుమార్ హెచ్చరించారు. ఆగస్టు 30న మార్తాండంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2029 ఎన్నికలకు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే తాను, మరో కాంగ్రెస్ మంత్రి విశ్వనాథన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి విజయ్ కేబినెట్ నుంచి బయటకు వస్తామని ప్రకటించారు.విజయ్–రాహుల్ మధ్య సాన్నిహిత్యంమరోవైపు విజయ్, రాహుల్‌గాంధీ మధ్య మంచి సంబంధాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కరూర్ ఘటన తర్వాత విజయ్‌కు రాహుల్ ఫోన్ చేసి సంఘీభావం తెలపడాన్ని గుర్తు చేశారు. అలాగే ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంచలన అరంగేట్రం చేసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి సవాల్ విసిరింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్‌గాంధీని ఆహ్వానించగా.. వేదికపై ఆయనను తన ‘సోదరుడు’గా విజయ్ అభివర్ణించారు. టీవీకే ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ కూడా మద్దతు ప్రకటించారు.మొత్తంగా.. విజయ్ నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం కొనసాగుతున్నప్పటికీ, 2029 ప్రధాని అభ్యర్థిత్వం అంశం మాత్రం కూటమిలో కొత్త చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి ఇరు పార్టీల నేతలు విభేదాలు లేవని చెబుతున్నా.. విజయ్ పేరును ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు, రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ మద్దతు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ అంశం కూటమి మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ చెప్పిన ఆ గుంటనక్క ఎవరు? -
రాహుల్ గాందీనే ప్రధాని అభ్యర్థి!
సాక్షి, చెన్నై: జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మాత్రమే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, తమిళనాడు సీఎం విజయ్‌కి అలాంటి ఆలోచన ఊహల్లో కూడా ఉండదని ఎండీఎంకే నేత వైగో వ్యాఖ్యానించారు. ఇకపై మంత్రులు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ చూసుకోవాలని సూచించారు. సోమవారం తిరునెల్వేలిలో వైగో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులో ఒక భారీ ప్రభుత్వ మార్పు వచ్చిందని, టీవీకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ అవి నీతి రహితంగా నడిపిస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రతి శాఖలో లంచాలు ఇస్తేనే పనులు జరిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ప్రజలు ఏ ప్రభు త్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కమీషన్లు లేకుండా నేరుగా పాల న సాగుతోందన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వానికి తాను 100కి 80 మార్కులు ఇస్తున్నానని, అవినీతిని పూర్తిగా నిర్మూలించడం హిమాలయాన్ని కదిలించినంత కష్టమైన పనిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చక్కగా పనిచేస్తున్నట్టు వైగో అభినందించారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వం: ‘’రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరించకపోతే రాజీనామా చేస్తాం’’ అని మంత్రి రాజేష్‌కుమార్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సీఎం విజయ్ ఊహల్లో కూడా అలాంటి ఆలోచన ఉండదన్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాం«దీనే ప్రధాని అభ్యరి్థగా ఉంటారని, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సీఎం విజయ్ నిరోధించాలని సూచించారు. ఇక, కావేరీ నిర్వహణ బోర్డు తన బాధ్యతను విస్మరించిందని, కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూ తమిళనాడుకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని, ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైగో డిమాండ్ చేశారు. కాగా, సీఎం విజయ్ భావి ప్రదాని అంటూ మంత్రులు వ్యాఖ్యల తూటాలను అందుకోవడంతో కాంగ్రెస్ నాయకులు గుర్రు మంటున్న విషయం తెలిసిందే. చదవండి: విజయ్‌తో విభేదాల్లేవు.. ఆయనే ప్రధాని అభ్యర్థి! -
మోదీగారు...‘శుద్దీకరణ’ నేరం!
న్యూఢిల్లీ: ‘శుద్దీకరణ’వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలకు దిగారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను భారతీయ జనతా పార్టీ నేతలు శుద్ధి చేయడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఒక నేరమని, ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడాలని రాహుల్ గాంధీ శనివారం డిమాండ్ చేశారు. దళితులు బాగుంటే ఓర్చుకోలేని బీజేపీ–ఆర్ఎస్ఎస్ మనస్తత్వం ఇదని ఆయన న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. నేరం జరిగి 20 రోజులు అవుతున్నా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఎత్తి చూపారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం కల్పించండి. న్యాయ దక్కేలా చేయడం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఉత్తరాఖండ్ విభాగం అధ్యక్షుడు మహేంద్ర భట్ ‘శుద్ధీకరణ’ను సమర్థించుకున్నారని ఆరోపించిన రాహుల్.. ఆ ‘‘ఆ పని (శుద్ధీకరణ) చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నది మా డిమాండ్. ప్రధాని నరేంద్ర మోదీ తాను అన్ని కులాలకు చెందిన వాడినని, దేశానికి ప్రధానిని అని చెబుతూంటారు. కానీ ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మాత్రం శుద్ధీకరణను సమర్థించుకుంటున్నారు’’అని విమర్శించారు. శుద్దీకరణ చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్లని, వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ప్రధాని ఆదేశించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘హల్ద్వానీలో ఖర్గే ర్యాలీ జరిగిన రెండు రోజులకు ఆగస్టు పదవ తేదీన వాళ్లు శుద్దీకరణ చేశారు. ఇది నేరం. ఆగస్టు 13న ఖర్గే ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు’’అని గుర్తు చేశారు. ‘‘రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమిది. రాజ్యాంగాన్ని అందించిన బీఆర్ అంబేద్కర్ లాంటి వారు, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలు ఒకపక్కన ఉంటే బీజేపీ–ఆర్ఎస్ఎస్ ఇంకోపక్కన ఉన్నాయి’’ అని అన్నారు.దళితులపై వేల ఏళ్లుగా హింసదళితులపై వేల ఏళ్లుగా హింస జరుగుతోందని, రాజ్యాంగం ప్రకారం ఇది అక్రమమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈనాటికి కూడా దళిత బిడ్డలతో పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారని, ఇదీ ఈ దేశపు వాస్తవం అని రాహుల్ ఆరోపించారు. దళితులు బావుల్లోంచి నీరు తాగకుండా, టీకొట్లలో రెండు గ్లాసుల పద్ధతి పాటిస్తున్నారని ఒకటి దళితులకు, ఇంకోటి ఇతరులకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగుతూ ఎక్కడ తనను కొడతారో అన్న భయంతో హెల్మెట్ ధరించాల్సిన భారత్‌లో ఉన్నామని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే మాత్రమే కాకుండా రాజస్థాన్ నేత తికారామ్ జుల్లి, ఎన్డీయే మంత్రి జీతన్ రామ్ మాంఝీలు కూడా పలు సందర్భాల్లో శుద్దీకరణ అవమానాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారని రాహుల్ వివరించారు. దళితులు ఎంత సక్సెస్ సాధిస్తే అతడిపై దాడులు అంత తీవ్రంగా ఎక్కువవుతాయని ఆరోపించారు. ‘‘ఇది అంటరానితనానికి మరోపేరు’’అని చెప్పారు. -
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మనుస్మృతికి, డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆర్ఎస్ఎస్, బీజేపీ మనుస్మృతిని అనుసరిస్తున్నాయి. మనుస్మృతి ఆధారంగానే దళితులపై వివక్ష కొనసాగుతోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభలను వాళ్లు శుద్ధీకరణ చేస్తున్నారు. ఈ ఘటనే వాళ్ల వివక్షకు నిదర్శనం. అంటరాని తనం పాటిస్తున్నారు.. అది నేరం. దేశంలో దళితులపై అనాదిగా కొనసాగుతున్న అణచివేతకు ఇప్పటికీ పూర్తిగా తెరపడలేదని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో దళిత విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం, ‘శుద్ధీకరణ’ పేరుతో వివక్ష చూపడం వంటి ఘటనలు అంటరానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కులాలకు చెందిన వాడినని ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ.. బీజేపీ నేతలు మాత్రం పాత కుల వివక్ష విధానాలనే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి కొత్త సంస్థలు, కొత్త పేర్లు, కొత్త విభాగం వచ్చినా.. దాని విధానాలు మాత్రం మారలేదని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, హక్కులను కాపాడటం కోసమే తమ పోరాటమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారుLIVE: Special Congress Party Briefing by LoP Shri @RahulGandhi at AICC HQ, New Delhi https://t.co/f6sL6o2vHX— Congress (@INCIndia) August 29, 2026 ఇదీ చదవండి: సోనియా బుక్.. అందుకే బీజేపీ భయపడుతోందా? -
విజయ్ మరో సంచలనం.. మోదీ, రాహుల్ తర్వాత ప్లేస్!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాత.. తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా టుడే–సీ ఓటర్ నిర్వహించిన తాజా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వేలో ఈ ఆసక్తికరమైన ఫలితం వెల్లడైంది.ప్రధాని పదవికి తదుపరి ఎంపికగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. నరేంద్ర మోదీకి 48.7 శాతం మంది, రాహుల్ గాంధీకి 27.1 శాతం మంది మద్దతు తెలిపారు. అనూహ్యంగా విజయ్‌కు ఏకంగా 9.2 శాతం మంది మద్దతు పలికారు. దీంతో ఆయన మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థిగా విజయ్ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.విజయ్ తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 2 శాతంతో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ 1.7 శాతంతో, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 1.3 శాతంతో, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఆ రకంగానూ విజయ్‌కు ఆదరణేప్రధాని ఎంపిక ప్రశ్నతో పాటు.. ప్రస్తుత ప్రతిపక్ష నేతల్లో కూటమికి నాయకత్వం వహించేందుకు ఎవరు సమర్థులని అడిగినప్పుడు కూడా విజయ్ మంచి స్థానంలో నిలిచారు. ఈ విభాగంలో రాహుల్ గాంధీ 29 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. విజయ్ 12.2 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ 8.5 శాతం, కేజ్రీవాల్ 7.5 శాతం, అఖిలేశ్ యాదవ్ 6.9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.రెండేళ్లలోనే సీఎం.. ఇప్పుడేమోవిజయ్ 2024లో టీవీకేను స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రెండేళ్లలోనే జరిగిన తొలి ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. తొలి ఏడాది పాలన కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రధాని అభ్యర్థుల జాబితాలో వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల టీవీకే నేతలు కూడా విజయ్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను బహిరంగంగానే ప్రారంభించారు. 2029 లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే సంకేతాలు ఇస్తున్నారు.‘దక్షిణం నుంచి ప్రధాని రావాలి’విజయ్ ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే నేతల వ్యాఖ్యలు కూడా ఇటీవల జోరందుకున్నాయి. ఆగస్టు 18న తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడిన టీవీకే మంత్రి శరత్‌కుమార్.. విజయ్ భవిష్యత్ ప్రధాని అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు.అంతకుముందు టీవీకే నేత, తమిళనాడు ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున కూడా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావడం ఖాయమని, అలాంటి నాయకుడు తమిళనాడు నుంచి ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా వెలువడిన ఇండియాటుడే సర్వే ఫలితాలు టీవీకే వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.25 వేల మందితో తాజా సర్వేఇండియా టుడే గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా తాజా సర్వేను సీ ఓటర్ నిర్వహించింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్ నిర్వహించిన సాధారణ ట్రాకింగ్ సర్వేలలోని 91,795 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సర్వేలో వ్యక్తమైన ప్రజాదరణను దేశవ్యాప్తంగా ఓట్లుగా, కూటమిగా మార్చుకోవడం విజయ్‌కు పెద్ద సవాలే. అయినప్పటికీ.. తమిళనాడు రాజకీయాలకే పరిమితమైన నాయకుడిగా కాకుండా, జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో పేరు వినిపించే స్థాయికి విజయ్ చేరుకోవడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: దటీజ్ విజయ్.. తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయం -
‘రాహుల్.. ఢిల్లీకి ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?’
వరంగల్: పాలిటెక్నిక్ విద్యార్థులపై రేవంత్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులేమన్నా టెర్రరిస్టులా? అని ప్రశ్నించారాయన. తెలంగాణ విద్యార్థుల సమస్యలు రేవంత్‌కు పట్టవా?అని నిలదీశారు హరీష్‌రావు.‘విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యం అంటున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నావ్. తెలంగాణ విద్యార్థులు నీ కంటికి కనిపించడం లేదా...?, జెన్ జీ అంటూ డిల్లీలో ధర్నాలు చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కనిపించడం లేదా?, జెన్ జీ రోడ్డెక్కి పోరాడుతుంటే ఎందుకు స్పందించడం లేదు. డిల్లీకి ఒకనీతి.. తెలంగాణకు మరో నీతా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి విద్యారుల కోసం పోరాడాలి. డిల్లీ తరహాలో విద్యార్థులు తిరగడబడక ముందే.... డిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే... రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి: వేటేస్తారా?.. వదిలేస్తారా? -
రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల అంశంపై ఎందుకు స్పందించడం లేదంటూ రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 22ఏ నిషేధిత జాబితాపై కుట్ర చేసిందెవరో తేల్చాలి. 22ఏ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూదందాపై నెలరోజులుగా బీజేపీ పోరాటం చేస్తుంది. ఆధారాలతో అసెంబ్లీకి నేను చర్చకు వస్తే రాకుండా మంత్రి పారిపోయారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని ఏలేటి డిమాండ్ చేశారు. కుట్ర చేసి నిషేధిత జాబితాలో భూములు పెడితే విచారణ జరపాలి. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ లేదా హౌజ్ కమిటీ వేస్తారా స్పష్టం చేయాలి. భూ భారతి మంత్రులకు నగల, వజ్రాల హారంగా మారింది. కాంగ్రెస్ 33 నెలల పాలనలో భూ భారతి అతిపెద్ద కుంభకోణం. సీఎం రేవంత్ చెప్పిన అసలు కుట్ర ఆయన కేబినెట్లోనే జరుగుతుంది. 22A బాధితులకు న్యాయం చేయాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి. 22A అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి. అంతేకాదు సీబీఐ విచారణ కోరుతూ ప్రభుత్వం లేఖ రాయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలి’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
నటి కృతి సనన్ రక్షాబంధన్ ప్రకటనపై మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఆ యాడ్‌లో కృతి సనన్ వస్త్రధారణపై విమర్శలు రావడంతో ఆమెకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. మహిళలు ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని పేర్కొంటూ ‘స్మాష్ ద ప్యాట్రియార్కీ’ (పితృస్వామ్య వ్యవస్థను కూల్చేయాలి) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. అయితే దీనికి మరో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్పందిస్తూ కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో.. బ్రో.. కాస్త ఆగండి. భారత్ ‘మాతా’ కీ జై.. ప్రారంభిద్దాం’ అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇందులో మాతా(తల్లి)ని హైలైట్ చేస్తూ.. రాహుల్‌కు కంగనా వెటకారంగా కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత అక్కడున్న అమ్మాయితో రాహుల్ గాంధీ సంభాషణ అలాగే కొనసాగుతుంది. ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదనే ధోరణితో ఆమె రాహుల్‌ను ప్రశ్నించినట్లు ఆ బొమ్మలను కంగనా తన ఇన్‌స్టాలో స్టోరీలా పోస్ట్ చేశారు. ఓ యాడ్‌లో కృతి సనన్ దుస్తులపై మొదలైన వివాదం.. రాహుల్ జోక్యంతో రాజకీయ చర్చగా మారగా, కంగనా తాజా వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారింది.రక్షాబంధన్ సందర్భంగా ఓ నగల బ్రాండ్ రూపొందించిన 32 సెకండ్ల ప్రకటనలో కృతి సనన్ ఆధునిక దుస్తుల్లో కనిపించారు. అందులో ఆమె తన సోదరుడికి రాఖీ కట్టడంతోపాటు పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టే సన్నివేశం ఉంది. కృతి ధరించిన దుస్తులు, ప్రకటనలో పండుగను చూపించిన తీరుపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. రక్షాబంధన్ వంటి సంప్రదాయ పండుగ సందర్భంగా కృతి ధరించిన దుస్తులపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకటనను ‘ఇంటెన్షనల్లీ క్రీపీ’(ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందికరంగా చూపించారు)గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో కంగనా–కృతి మధ్య సోషల్ మీడియా వేదికగా వాదన మొదలైంది.తనపై వస్తున్న విమర్శలకు కృతి సనన్ కూడా ఘాటుగానే స్పందించారు. ఒక మహిళ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని ఆమె ధరించే దుస్తులతోనే ఎందుకు అంచనా వేయాలని ప్రశ్నించారు. పండుగల అసలు భావం దుస్తుల్లో కాకుండా వాటి వెనుక ఉన్న అనుబంధం, విలువల్లో ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ప్రశ్నించారు. అలాగే కుక్కకు రాఖీ కట్టడంపైనా స్పందిస్తూ.. రక్షాబంధన్ తమ కుటుంబంలో సోదరసోదరీమణుల మధ్య పరస్పర రక్షణ, ప్రేమకు ప్రతీక అని కృతి వివరించారు. తన సోదరి, తాను ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటామని.. ఆ బంధంలో సోదరుడు మాత్రమే రక్షించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.కృతి స్పందనను రాహుల్ గాంధీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. “ఒక మహిళ ఏం ధరిస్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె ఎంపిక. తన స్వేచ్ఛను ఉపయోగిస్తున్నందుకు మహిళలను ట్రోల్ చేయడం ఆపండి” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు ‘Smash the Patriarchy’ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. ఇక్కడే ఎంట్రీ ఇచ్చిన కంగనారాహుల్ గాంధీ కృతికి మద్దతు ప్రకటించిన కొద్దిసేపటికే కంగనా తనదైన శైలిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ‘భారత్ మాతాకీ జై.. ప్రారంభిద్దాం’ అని పేర్కొనడం ద్వారా రాహుల్ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఇంకా ఎటు దారి తీస్తుందో చూడాలి.ఇదీ చదవండి: అన్నాచెల్లెళ్ల ఆలయంలో.. రాఖీ వేడుకలు -
మహిళల్ని ట్రోల్ చేయడం ఆపండి
న్యూఢిల్లీ: రాఖీ కట్టే సమయంలో సంప్రదాయేతర దుస్తులు ధరించిందంటూ నటి కృతి సనన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘ఇన్స్టాగ్రామ్ స్టోరీ’లో పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళ ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికెళ్లాలి అనేవి ఆమె సొంత ప్రాధమ్యాలు. స్వేచ్ఛగా నచ్చిన పని చేసే మహిళల్ని వేధించడం, ట్రోల్ చేయడం ఇకనైనా ఆపండి.పితృస్వామ్య భావజాలం నశించాలి’’అని రాహుల్ అన్నారు. ఒక వజ్రాభరణాల సంస్థకు సంబంధించిన 36 సెకన్ల వాణిజ్య ప్రకటన వీడియోలో తన సోదరునికి రాఖీ కట్టే సమయంలో కృతిసనన్ ధరించిన డ్రెస్ మరీ కురచగా ఉందంటూ బీజేపీ మహిళా ఎంపీ కంగనా రనౌత్ సహా పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడం తెల్సిందే. దీనిపై కృతిసనన్ తనదైన రీతిలో దీటుగా బదులిచ్చింది. సంస్కృతి, సంప్రదాయం అనేవి మనసులో ఉంటాయి. మెడ దగ్గర ఉండవు. ఇకనైనా మహిళలు ఈ దుస్తులే ధరించాలని చెప్పే సంస్కృతి ఎప్పుడు పోతుందో? అని ఆమె అసహనం వ్యక్తంచేశారు. ‘‘సంప్రదాయక వస్త్రధారణలో శతాబ్దాల్లో ఎంతో మార్పు వచ్చింది. కానీ మన సంప్రదాయాలకు మహిళ ఏపాటి విలువ ఇస్తుందనేది ఆమె దుస్తులను చూసే లెక్కించడం బాధాకరం. పండగల అంతరార్థం మహిళ ధరించే దుస్తుల్లో ఉండదు. సంప్రదాయాలను పట్టి ఉంచే భావోద్వేగాల్లో ఉంటుంది. నా సోదరి, నేను కూడా రాఖీ కట్టుకుంటాం. సోదరుడి కంటే ఎక్కువగా ఒకరికొకరు మేం రక్షించుకుంటాం’’ అని ఆమె అన్నారు. -
కులగణనలో ఓపెన్ ఫార్మాట్ వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనాభా లెక్కల సేకరణలో కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓపెన్ ఫార్మాట్ (స్వేచ్ఛగా కులం పేరును నమోదు చేసే) విధానంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి వల్ల కచ్చితమైన వివరాలు నమోదు కాకపోగా, కులగణన అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని రాజ్యసభ, లోక్‌సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రశ్నావళిని తక్షణమే రద్దు చేయాలని, రాజకీయ పక్షాలు, నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే కొత్త విధానాన్ని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఖర్గే, రాహుల్ సంయుక్తంగా లేఖ రాశారు. తప్పుడు డేటాకు ఆస్కారం జనాభా లెక్కల్లో కులాల నమోదు కోసం ఎలాంటి కచ్చితమైన ముందస్తు జాబితా లేకుండా ‘ఓపెన్–ఎండెడ్’ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిద్వారా పౌరులు తమ కులం పేరును ఇష్టం వచ్చిన రీతిలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకే కులానికి వేర్వేరు పేర్లు, ఉప కులాలు, భిన్నమైన స్పెల్లింగ్‌లు వాడుకలో ఉన్నాయని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానం వల్ల ఒకే కులం వేలాది వేర్వేరు పేర్లతో నమోదయ్యే ప్రమాదం ఉందని వివరించారు. దానివల్ల దేశంలో కులాల సంఖ్య లక్షల్లో ఉన్నట్లుగా తప్పుడు డేటా వస్తుందని, ఫలితంగా మొత్తం కులగణన ప్రక్రియే నిరుపయోగంగా మారుతుందని తేల్చిచెప్పారు. ‘డ్రాప్–డౌన్’ జాబితాయే పరిష్కారం ఈ గందరగోళాన్ని నివారించడానికి ఓపెన్ ఫార్మాట్ బదులుగా ‘డ్రాప్–డౌన్’జాబితా పద్ధతిని అమలు చేయాలని ఖర్గే, రాహుల్ సూచించారు. జనాభా లెక్కల సేకరణ సిబ్బంది వద్ద ముందుగానే పొందుపరిచిన కులాల జాబితా ఉంటే కచ్చితమైన సమాచారం నమోదు చేయడానికి వీలుంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల జన గణనకు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(ఎస్ఈబీసీ) జాబితా, ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ఆధారంగా ఈ డ్రాప్–డౌన్ జాబితాను సులభంగా తయారు చేయవచ్చని సూచించారు. తెలంగాణ (2024), బిహార్ (2022) రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనల్లో ఈ డ్రాప్–డౌన్ విధానాన్నే అనుసరించారని వెల్లడించారు. ఆయా రాష్ట్రాల కులాల జాబితా కాపీలను ప్రధానికి రాసిన లేఖకు జతచేశారు. ప్రశ్నావళిలో ‘వెనుకబడిన తరగతి’ పదం ఏదీ? కేంద్రం తీసుకొచ్చిన తాజా ప్రశ్నావళిలో కనీసం ’వెనుకబడిన తరగతి’అనే పదం కూడా లేకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణనలో సరైన గణాంకాలు రాకపోతే అత్యంత నష్టపోయేది ఓబీసీలు, ఇతర అట్టడుగు వర్గాలేనని స్పష్టం చేశారు. దీనివల్ల విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ప్రభుత్వ పథకాల రూపకల్పన వంటి కీలక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గణాంకాలు చెబుతున్న వాస్తవాలివే..కులగణన కచ్చితంగా జరగాల్సిన అవసరాన్ని పలు గణాంకాలతో సహా ఖర్గే, రాహుల్ వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ఓబీసీ జాబితాలో 2,479 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో మండల్ కమిషన్ దేశంలో 3,743 వర్గాలను ఓబీసీలుగా గుర్తించింది. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 42 శాతం, ఇతరులు 27 శాతం ఉన్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్)–2025 అంచనాల ప్రకారం ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 9 శాతం, ఓబీసీలు 46 శాతం, ఇతరులు 24 శాతం వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఓపెన్ ఫార్మాట్’విధానాన్ని అమలు చేస్తే ఈ వాస్తవ గణాంకాలన్నీ తప్పులతడకగా మారిపోయే ముప్పు ఉందని ఖర్గే, రాహుల్ తమ లేఖలో ఉద్ఘాటించారు. ఈ పరిస్థితిని నివారించి, కుల గణన ద్వారా కచ్చితమైన సమాచారం రాబట్టేలా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. -
రాహుల్ గాంధీపై దేశానికి పెద్దగా ఆశలు లేవు.. యోగి ఆగ్రహం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. ఈ క్రమంలో.. సంప్రదాయాలు, సంస్కృతిని అవమానించేలా రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని యోగి మండిపడ్డారు.రాయ్‌బరేలీలో స్వాతంత్య్ర సమరయోధుడు రాణా బేని మాధవ్ బక్ష్ సింగ్ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహిళలు మనుస్మృతి సంకెళ్ల నుంచి బయటకు రావాలని వ్యాఖ్యానించారని యోగి ప్రస్తావించారు.“రాహుల్ గాంధీపై దేశానికి పెద్దగా ఆశలు లేవు. కానీ భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఆయనకు ప్రజాస్వామ్యంపై బాధ్యత ఉంది. దేశ సంప్రదాయాలు, వారసత్వాన్ని విమర్శించడం మీ జన్మహక్కు అని భావిస్తున్నారా?” అని యోగి ప్రశ్నించారు. మనుస్మృతి గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ భారతీయ గ్రంథాలను అధ్యయనం చేయాలని యోగి సూచించారు. మనువు, భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే అథర్వవేదం, శతపథ బ్రాహ్మణం, మత్స్య పురాణం వంటి గ్రంథాలను చదవాలని అన్నారు.“If you want to understand Manusmriti, read Artha Veda, Shatapatha Brahmana, you will get all information.”- CM Yogi Adityanath to Rahul Gandhi on 'Manusmriti mindset' remark pic.twitter.com/xwDfphNMVf— News Arena India (@NewsArenaIndia) August 24, 2026భారతీయ సంప్రదాయాలు, వారసత్వంపై అవగాహన లేకుండానే విమర్శలు చేయడం సరికాదని యోగి పేర్కొన్నారు. దేశ సంస్కృతిని అవమానించే వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.విదేశాల్లో భారత్‌పై విమర్శలురాహుల్ గాంధీ గతంలోనూ అంతర్జాతీయ వేదికలపై భారత సాంస్కృతిక వారసత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని యోగి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ బయటకు వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని, విదేశాలకు వెళ్లినప్పుడు దేశాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. దేశం ఉగ్రవాదంపై పోరాడుతున్న సమయంలో సైన్యాన్ని ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సరిహద్దుల్లో సైనికులు శత్రువులతో పోరాడుతున్నప్పుడు వారి చర్యలకు ఆధారాలు అడగడం సరికాదన్నారు.కాంగ్రెస్‌పైనా ఫైర్అయోధ్య విరాళాల చోరీ అంశం రాజకీయంగా పెను దుమారం రేపింది. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై యోగి విమర్శలు గుప్పించారు. అయోధ్యలో శ్రీరాముడి ఉనికిని ప్రశ్నించిన పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం, సంస్కృతి గురించి మాట్లాడుతోందని అన్నారు. 1975లో విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రాణా బేని మాధవ్ బక్ష్ సింగ్ పేరుతో ఆడిటోరియంను యోగి ప్రారంభించారు. ఆయన పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేసి, స్మారక సంచికను ఆవిష్కరించారు. రాయ్‌బరేలీ జిల్లాకు ఇది చారిత్రక రోజని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.రాహుల్ ఏమన్నారంటే..ఆగస్టు 22న మహారాష్ట్ర పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో మహిళల హక్కులు, స్వేచ్ఛపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. మనుస్మృతిలో మహిళల స్థానం గురించి ప్రస్తావించారు. “మనుస్మృతి ప్రకారం చిన్నతనంలో మహిళ తండ్రి ఆధీనంలో, యవ్వనంలో భర్త ఆధీనంలో, భర్త మరణించిన తర్వాత కుమారుల ఆధీనంలో ఉండాలని చెబుతుంది. మహిళ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండకూడదనే ఆలోచనను నేను వ్యతిరేకిస్తున్నాను. ఇలాంటి భావనలు సిగ్గుచేటు” అని అన్నారాయన. అలాగే బీజేపీ, ఆరెస్సెస్‌లు మహిళలను చెరసాల బందీలుగానే చూస్తుంటాయని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ.. యూపీ సీఎం యోగి ఇప్పుడు విమర్శలు గుప్పించారు. #WATCH | Pune, Maharashtra: Addressing the "Chhatron Ki Goonj" program, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The Manusmriti says- "in childhood, a female belongs to her father. In youth, she belongs to her husband. When her lord is dead, she belongs to her sons. A… pic.twitter.com/JsqPlnFXsy— ANI (@ANI) August 22, 2026ఇదీ చదవండి: సెల్ఫీ కోసం వచ్చినట్లు చేసి, ముద్దు పెట్టి.. -
రేవంత్ సర్కార్‌పై రాంచందర్‌రావు తీవ్ర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్రంగా ఆరోపించారు. విద్యార్థులు, కాలేజీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం ఒత్తిడికి గురిచేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పినా.. ఆ హామీ కూడా అమలు కాలేదని ఆయన అన్నారు. బకాయిల కోసం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తుంటే వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.రాహుల్ గాంధీకి సవాల్ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రాంచందర్‌రావు టార్గెట్ చేశారు. “రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట్లాడాలి” అంటూ సవాల్ విసిరారు. దేశంలో యువతను రెచ్చగొట్టి ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీకి ప్రయోజనాలు అందుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. విద్యార్థులకు మాత్రం ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ను గద్దె దించాలిదేశ వ్యతిరేక శక్తులతో సీఎం రేవంత్‌రెడ్డి చేతులు కలుపుతున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా తమ ప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల శక్తి ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: సెల్ఫీ కోసం వచ్చి రాహుల్‌కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా! -
సెల్ఫీ కోసం వచ్చి రాహుల్‌కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా!
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ యువతతో మమేకమయ్యే కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీల కోసం వేదికపైకి వచ్చిన ఓ యువ విద్యార్థిని.. అందరి ముందే రాహుల్ గాంధీ చెంపపై ముద్దుపెట్టుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మహారాష్ట్రలోని పూణేలో రాహుల్ గాంధీ ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ వేదికపై యువతతో మాట్లాడటంతో పాటు వారితో సెల్ఫీలు దిగారు. అదే సమయంలో ఓ విద్యార్థిని రాహుల్ వద్దకు వచ్చి ఆయన చెంపపై ముద్దు పెట్టింది. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో రాహుల్ షాకయ్యారు. అనంతరం రాహుల్ కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. తర్వాత భద్రతా సిబ్బందితో కలిసి వేదిక నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమం మొత్తం కచేరీ తరహా లైటింగ్, భారీ ఏర్పాట్లతో సాగింది.#rgtwt gurls are not not ready fr this 😭😭😭😭 pic.twitter.com/Q6t9RS2vpY— Snowbell (@Snowbel) August 23, 2026ఈ ఘటన అనంతరం, 11వ తరగతి చదువుతున్న సదరు యువతి మరియం మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీలా ఎదగడం నా కల. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవాలని, ఆయనలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం యువతలో రాహుల్ గాంధీ తనదైన ప్రభావాన్ని చూపుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన వదిలిన అంశాలనే పట్టుకుని ముందుకు సాగుతున్నారు’ అని వ్యాఖ్యలు చేసింది.It's my dream to become like Rahul Gandhi.♥️Mariyam, an 11th-grade student, aspires to walk in the footsteps of Rahul Gandhi.Rahul Gandhi flat-out owns the narrative among the youth right now. His rivals are just picking up whatever crumbs he leaves behind. 🔥💯 pic.twitter.com/VN3j1OwwzQ— Krishna Yadav (@Control_Krishna) August 24, 2026సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లుఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీతో మహిళలు, యువతులు ఎంత సౌకర్యంగా మెలుగుతున్నారో కొందరు ప్రస్తావించగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ‘మనుస్మృతి’ భావజాలాన్ని విమర్శించిన ఆయన.. మహిళలు పితృస్వామ్యాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు.రాహుల్ సభపై బీజేపీ ఫైర్రాహుల్ కార్యక్రమంపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల సమస్యలపై సీరియస్‌గా మాట్లాడకుండా రాహుల్ సాధారణ రాజకీయ ప్రసంగానికే పరిమితమయ్యారని మహారాష్ట్ర బీజేపీ నేత కేశవ్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. సభకు జనాన్ని సమీకరించేందుకు కాలేజీ బస్సులను ఉపయోగించారని కూడా ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం బీజేపీ విమర్శలను తిప్పికొట్టింది. రాహుల్ గాంధీ కార్యక్రమానికి వచ్చిన అపూర్వ స్పందనను చూసి బీజేపీ నేతలు అసహనంతో ఉన్నారని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ విమర్శించారు. LoP @RahulGandhi Ji's craze among GenZ 🔥A student kissed him with affection.....! This is how safe girls feel around him. It can never happen with any BJP leader. pic.twitter.com/shbLJi6QSK— Venisha G Kiba (@KibaVenisha) August 24, 2026 -
ది సైలెంట్ గార్డియన్
ఇదేదో ఇంగ్లిష్ సినిమా పేరు కాదు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటైన పోస్టర్ల ట్యాగ్ లైన్. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ‘రియల్ లైఫ్ బ్యాట్ మ్యాన్’గా చిత్రీకరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కోట్లా మార్గ్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రవేశ ద్వారం, 24 అక్బర్ రోడ్ పార్టీ కార్యాలయం వెలుపల, రైసినా రోడ్‌లోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ చీఫ్ అక్షయ్ లక్రా ఈ పోస్టర్లు ఏర్పాటు చేయించారు. రాహుల్ గాంధీ ఈ నెలారంభంలో ఇన్‌స్టాగ్రామ్‌లో విద్యార్థులు, యువతతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత అడిగిన ప్రశ్నలకు సమాధాన మిచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సరదాగా ‘మీరు బ్యాట్ మ్యానా?’ అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ ‘నన్ను, బ్యాట్ మ్యాన్‌ను ఒకే గదిలో ఎవ్వరూ, ఎప్పుడూ చూడలేదు అనుకుందాం’ అని బదులిచ్చారు. తాను నిజంగా బాట్ మ్యాన్ అని చెప్పకుండా, ‘నేను, బ్యాట్‌మాన్ ఒకేసారి ఒకే కనిపించలేదు కదా’ అని బ్యాట్‌మ్యాన్ సినిమాలోని సీక్రెట్ ఐడెంటిటీ కాన్సెప్ట్‌తో సమాధానమిచ్చారు. దీంతో ఈ బ్యాట్‌మ్యాన్ పోలిక ట్రెండయ్యింది. ఇప్పుడు ఏకంగా పోస్టర్లే వెలిశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా సానుకూలంగా, ప్రతికూలంగా చర్చ ఆరంభమైంది. –న్యూఢిల్లీ -
మనుస్మృతి నిబంధన సిగ్గుచేటు
పుణె: మహిళలు తమ తండ్రులు, భర్తలు లేదా కుమారులకు చెందినవారు కాదని.. తమకు తామే చెందినవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఒక మహిళ తన జీవితంలో ప్రతి దశలోనూ పురుషుడి అధికారం కింద ఉండాలన్న మనుస్మృతి నిబంధన సిగ్గుచేటు అని ఆక్షేపించారు. భారతదేశపు అతిపెద్ద బలం ఇక్కడి మహిళల 70 కోట్ల విశిష్ట ప్రయాణాలు, విశిష్ట ఊహలు, విశిష్ట కలలు అని అభివర్ణించారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చాత్రోంకీ గూంజ్’కార్యక్రమంలో యువతులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. మహిళలు బాల్యంలో తండ్రికి లోబడి ఉండాలని, యవ్వనంలో భర్తకు చెందాలని, భర్త మరణించిన తర్వాత ఆమె తన కుమారుల అ«దీనంలో ఉండాలని, స్త్రీ ఎన్నడూ స్వతంత్రంగా ఉండకూడదని మనుస్మృతి చెబుతోందని గుర్తుచేశారు. ఇలా చెప్పడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. మహిళలు ఈ దేశానికి అతిపెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, తమను తాము విశ్వసించాలని చెప్పారు. ‘‘మీరు మీకు తప్ప మరెవరికీ చెందినవారు కాదు. మీకు మీ తండ్రి, సోదరుడు, భర్త, కొడుకుతో సంబంధం ఉండవచ్చు. కానీ మీరు వారికి చెందినవారు కాదు, మీరు మీకు మాత్రమే చెందినవారు’’అని మహిళలను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. ఉపన్యాసాలు ఇవ్వడానికో, రాజకీయాల గురించి చర్చించడానికో కాకుండా.. యువత తమ భావాలను వ్యక్తపరచడానికి, వారి ఆలోచనలను చర్చించుకోవడానికి అవకాశం కల్పించడానికే ఇక్కడికి వచ్చానని అన్నారు. సంకెళ్లను బద్దలు కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవాడని, వారికి వారి సొంత కలలు, ఆశయాలు ఉంటాయని చెప్పారు. పురుషుల కంటే మహిళలు స్వభావరీత్యా ఎక్కువ సున్నిత మనస్కులు, సౌమ్యులు, కరుణామయులు, దూరదృష్టి కలవారని తెలిపారు. అందుకే వారు మన దేశానికి అసలైన సంపద అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మహిళలు తరచుగా కుమార్తె, భార్య లేదా తల్లి అనే మూడు గుర్తింపులకే పరిమితమవుతున్నారని, ఈ సంబంధాలలో తప్పేమీ లేనప్పటికీ, అవే వారి ఏకైక గుర్తింపుగా ఉండకూడదని తేల్చిచెప్పారు. నన్ను పిలవండి.. నిరసనలో కూర్చుంటా హాస్టల్లో విద్యార్థులకు సౌకర్యాలు లేవని, భద్రత కూడా కల్పించడం లేదని ‘ఛాత్రోంకీ గూంజ్’లో ఓ గిరిజన యువతి రాహుల్ గాం«దీ దృష్టికి తీసుకొచ్చారు. డిమాండ్ల పరిష్కారం కోసం పుణేలోని మంజరిలో గిరిజన విద్యార్థులు గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఈ నిరసనలో ఇద్దరు అమ్మాయిలు కూడా పాల్గొంటున్నారని, వారిలో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు. దీనిపై ఆయన స్పందిస్తూ... సమస్యల పరిష్కారం కోసం పుణేలో నిరసన వ్యక్తంచేస్తున్న గిరిజన విద్యార్థులకు అండగా ఉంటానని, తాను కూడా నిరసనలో పాల్గొంటానని చెప్పారు. ‘‘నన్ను పిలవండి.. నేను వచ్చి మీతోపాటు నిరసనలో కూర్చుంటాను’’అని పేర్కొన్నారు. విద్యావకాశాలు, ఆర్థిక స్వాతంత్య్రం, ప్రజా రవాణా భద్రత, హింస, సైబర్ వేధింపులతో సహా పలు అంశాలపై విద్యారి్థనులతో సంభాíÙంచారు. -
రాహుల్జీ.. మౌనమేల?
సిద్దిపేటజోన్: ఢిల్లీలో విద్యార్థులకు అన్యాయం జరిగితే వెళ్లి పరామర్శించిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థులపై అమానుషంగా వ్యవహరిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని, రాహుల్‌గాంధీకి ఢిల్లీలో ఒక న్యాయం.. తెలంగాణలో ఇంకో న్యాయం ఉంటుందా? అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97పై హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు నొక్కుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని, సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పి జీవో 97 ఎందుకు రద్దు చేయించడం లేదని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో ఒక సీఐ పాలిటెక్నిక్ విద్యార్థిపై దారుణంగా వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. తాను ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ బలోపేతానికి ఒకేసారి 400 మంది కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ వ్యవస్థను కూలదోసేందుకు చూస్తున్నట్టు ఆరోపించారు. సమస్యలపై మంత్రిని విద్యార్థులు కలిసి విజ్ఞప్తి చేస్తే.. మంత్రి స్థానంలో ఉండి తప్పును సరిదిద్దుతామని చెప్పాల్సింది పోయి.. హామీ ఇవ్వలేనంటూ మాట్లాడడం ఆయన బాధ్యతారాహిత్య వైఖరికి నిదర్శనమని అన్నారు. విద్యార్థులు అధైర్య పడొద్దని పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, జీవో 97 రద్దయ్యేంత వరకు మీ వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామన్నారు.లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దాదాపు 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో తనను కలిసిన సర్వేయర్ల ప్రతినిధి బృందంతో ఆయన మాట్లాడారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన సర్వేయర్ల పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించిన తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాంచీలో బాహాబాహీ
రాంచీ: ఎంపిక పరీక్షల్లో అవకతవకలపై శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు తలపడ్డాయి. విద్యా ర్థుల నిరాహార దీక్షలు, తీవ్ర ఆందోళనల నడు మ జార్ఖండ్ పబిŠల్క్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం సోరెన్ ప్రకటించగా, అందుకు సంబంధించిన ఆదేశాలపై గురువారం స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం తన చర్యను సరైన రీతిలో సమర్థించుకోకపోవడమే హైకోర్టు ఆదేశాలకు కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు జేపీ ఎస్సీ–జేఎస్ఎస్సీ రిఫామ్స్ మంచ్ సారథ్యంలో ర్యాలీగా నగరంలోని ఆల్బర్ట్ చౌక్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోరెన్, రాహుల్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు, అధికార జేఎంఎం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణకు దారి తీసింది. విద్యార్థులు ముందుగా అనుమతించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో ర్యాలీ చేపట్టడంతోపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని పోలీసులు ఆరోపించారు. ఈ సమయంలో మంచ్ నేత కునాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్పృహతప్పి పడిపోవడంతో సదర్ ఆస్పత్రిలో జాయిన్ చేశారని మరో నేత పియూశ్ కుమార్‌సింగ్ చెప్పారు. పోలీసులు విద్యార్థినులపైనా బలప్రయోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. హజారీబాగ్, గిరిదిహ్‌లోనూ విద్యార్థులు సీఎం సోరెన్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు యత్నించడం, జేఎంఎం కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణలకు దారి తీసింది. -
రాహుల్‌గాంధీ ద్వంద్వ నీతిపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం ముందు ఎప్పుడు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ప్రశ్నిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నట్లు రాహుల్‌గాంధీ నాటకాలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీలు ఝళిపిస్తూ, వారిని ఈడ్చుకెళ్లి, గొంతులు నొక్కేలా దాడులకు పాల్పడుతున్నా రాహుల్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా.. తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో విద్యార్థుల హక్కులు అణచివేస్తున్నా రాహుల్ స్పందించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో జరిగిన లాఠీచార్జ్‌ను కూడా ఖండించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేయాలని కేటీఆర్ కోరారు. విద్యార్థుల హక్కుల విషయంలో రాజకీయాలకతీతంగా నిలబడతారా.. లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ రక్షణ కల్పిస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసే నైతిక ధైర్యం ఉన్న రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్ లాఠీలకు గురైన విద్యార్థుల కోసం కూడా అదే పోరాటం చేయాలని, లేకపోతే విద్యార్థుల పట్ల ఆయనది కపట ప్రేమగానే ప్రజలు భావించాల్సి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
ధర్నా విరమించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషస్ వద్ద ధర్నాను విరమించారు. జంతర్ మంతర్ వద్ద గత నెల జరిగిన విద్యార్థుల నిరసన సమయంలో లోచవ్ (19) అనే విద్యార్థికి పెల్లెట్ గన్ల వల్ల గాయాలయ్యాయి. లోచవ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.పెల్లెట్ గన్ గాయాల ఘటనకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 118, 125 కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్లోని సెక్షన్ 118 ప్రమాదకర ఆయుధాలు లేదా మార్గాలను ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా తీవ్రమైన గాయాలు కలిగించడం గురించి చెబుతుంది. సెక్షన్ 125 ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు సంబంధించినది.అంతకుముందు ఏం జరిగింది?ఈ ఘటనకు సంబంధించిన శుక్రవారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారని లోచవ్ ఆరోపించడంతో, రాహుల్ గాంధీ కొంతమంది కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముందుగా వారు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.తెల్ల టీషర్ట్, లేత గోధుమరంగు ప్యాంట్ ధరించిన రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లోకి నడుచుకుంటూ వెళ్లడంతో అక్కడి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన అధికారులను ఒత్తిడి చేశారు. అయితే అధికారులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి నిరసన ప్రారంభించారు. లోచవ్ ఫిర్యాదును నమోదు చేసేందుకు అధికారులు అంగీకరించే వరకు తన నిరసనను విరమించబోనని ఆయన తెలిపారు.“లోచవ్ కంటిలో 3 గుళ్లు దిగాయి. అతని శరీరంలో 200 గుళ్లు ఉన్నాయి. అతని గుండె సమీపంలో తాకలేని గుళ్ల ముక్కలు ఉన్నాయి. తాము గాలి తుపాకులతో కాల్పులు జరపలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కాకపోతే గాలి తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు? బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని తమకు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారు” అని రాహుల్ మీడియాతో అన్నారు. విద్యార్థి శరీరం నుంచి వెలికితీసిన లోహపు గుళ్లను కూడా ఆయన మీడియాకు చూపించారు.ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కుమారి సెల్జా, జైరాం రమేశ్, రణదీప్ సుర్జేవాలా రాహుల్ గాంధీతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇదీ చదవండి: ధర్నా విరమించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ -
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు రాహుల్ గాంధీ
-
పెల్లెట్ గన్ వివాదం: సాహిల్‌తో కలిసి రాహుల్‌గాంధీ ధర్నా, కేసులపై డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ శుక్రవారం నాడు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) కార్యాలయంలో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. ఈ సం దర్భంగా పోలీస్ స్టేషన్ వెలుపల ధర్నా (సీట్-ఇన్) నిరసన తెలిపారు. నిరసనకారులపై దాడులు చేసిన అధికారులపై కేసులు నమోదయ్యే వరకు తాను పోలీస్ స్టేషన్లోనే ఉంటానని, న్యాయం కోరుతూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు. అయితే దీనికి పోలీసులు నిరాకరించడంతో, అతను డీసీపీ సెంట్రల్ సచిన్ శర్మను కలిసి కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలు కోరారు.జులై 20న జరిగిన 'జెన్ జీ' (Gen Z) నిరసనలో పెల్లెట్ గన్ దాడిలో గాయపడిన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్‌తో కలిసి ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తమ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడానికి నిరాకరిస్తున్నారని సాహిల్ ఆరోపించడంతో ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi arrived at the DCP Office at the Parliament Street Police Station to file a complaint. More details awaited. pic.twitter.com/YC7GiXCw7h— ANI (@ANI) August 21, 2026రాహుల్ గాంధీ, సాహిల్ . ఇతరులతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌కి రావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించడంతో, రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ బయట కూర్చుని ధర్నా నిర్వహించారు.జులై 20న జరిగిన 'సంసద్ చలో' మార్చ్ సమయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది పెల్లెట్ తుపాకులు ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, తాము పెల్లెట్ గన్లను ఉపయోగించలేదని దిల్లీ పోలీసులు పలుమార్లు ఖండించగా, సీఆర్పీఎఫ్ (CRPF) దీనిపై ఎలాంటి స్పందనా లేదు.(14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’) -
ఆ బాధ నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు : రాహుల్ ఎమోషనల్ పోస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: Rajiv Gandhi birth anniversary భారత్ రత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు.తన తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తండ్రిని కోల్పోయిన తరువాత తన తల్లి సోనియా గాంధీ వ్యక్తిగతంగా అనుభవించిన బాధలను గురించి చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో వెలువడనున్న తన తల్లి సోనియా గాంధీ జీవితకథ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.తల్లికి రాహుల్ సందేశం"నాన్న మమ్మల్ని విడిచి వెళ్ళిన రోజు నుండి, జీవితంలో నీకెదురైన ప్రతీ సవాలును నువ్వు అంతులేని ధైర్యంతో, గౌరవంతో ఎదుర్కోవడం నేను చూశాను. నువ్వు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో, నాన్న తర్వాత నీ జీవితం నిజంగా ఎంత కష్టంగా మారిందో కేవలం ప్రియాంకకు, నాకు మాత్రమే తెలుసు," అని పేర్కొన్నారు. సోనియా గాంధీకి మద్దతు ఇస్తున్న లక్షలాది మంది ప్రజలకు, అభిమానులకు ఆమె కథ త్వరలో చేరబోతున్నందుకు గర్వంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు.Mama,I last saw you and Papa together more than 35 years ago. Since the day Papa left, I have watched you face everything life threw at you with never-ending courage and dignity. Only Priyanka and I really know what you have been through, and how difficult your life after Papa… pic.twitter.com/OYumcZ2hnC— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2026 "గోప్యతను ఎక్కువగా ఇష్టపడే మీలాంటి వ్యక్తికి మీ అందమైన కథను ప్రపంచానికి చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసు," అన్నారు. రాజీవ్ పుట్టినరోజున, ఆయన తండ్రి "తన అందమైన సోనియా వైపు గర్వంగా నవ్వుతూ చూస్తున్నట్లు" తాను ఊహించుకోగలనని కూడా ఆయన తెలిపారు. సోనియా గాంధీ రాసిన ' 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) అనే పేరుతో రాసిన ఆత్మకథ త్వరలో విడుదల కానుంది. పెంగ్విన్ రాండమ్ హౌస్ వారి అనుబంధ సంస్థ అయిన ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్ ద్వారా నవంబర్ 10న అంతర్జాతీయంగా ఆవిష్కారం కానుంది. భారతదేశంలో విడుదల తేదీని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఇంకా ధృవీకరించలేదు. y"> भारतीयों के बीच सद्भावना, हर दिल में करुणा और, हर नागरिक को न्याय और लोकतंत्र में समान अधिकार..पापा, आपकी ये सीख मेरी शक्ति है और आपकी यादें मेरी हिम्मत। आपके सपनों का भारत बनाने का संकल्प हमेशा मेरा मार्गदर्शन करता रहेगा। pic.twitter.com/YsXEFO05Ur— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2026పుస్తకంలో ఏం ఉండబోతోంది?రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో సోనియా బాల్యం, భారతదేశానికి రాక, రాజీవ్ గాంధీతో వివాహం, సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీలను కోల్పోయిన విషాదకర సంఘటనలు, రాజకీయంలోకి ఆమె ప్రవేశం, 2004 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గెలిచిన తర్వాత ప్రధానమంత్రి పదవిని అంగీకరించకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం వంటి విషయాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయంమరోవైపు తన వ్యక్తిగత అనుభవాలను మాటల్లో పెట్టడంలో ఉన్న కష్టాన్ని సోనియా గాంధీ గతంలోనే అంగీకరించారు. జీవితం గురించి రాయడం అంత సులభంగా రాలేదన్నారు. అంటే ‘‘నన్ను నేను ఆవిష్కరించుకోవడం, నేను ఎల్లప్పుడూ నాలోతుల్లో దాచుకున్న క్షణాలను, అనుభవాలను పంచుకోవడం," అని ప్రచురణకర్త జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.ఇదీ చదవండి: ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి కాగా రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయన భార్య సోనియా గాంధీ, కుమారుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక వీరభూమికిచేరుకుని ఆయనకు ఘన నివాళులర్పించారు. జవహర్ భవన్లో జరిగిన 'హరా భరా స్వరాజ్' కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... స్వరాజ్ అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదని, 'స్వీయ పాలన' అని వ్యాఖ్యానించారు. తన తండ్రి నేర్పిన ఐక్యత, కరుణ, సమానత్వం, ప్రజాస్వామ్య సూత్రాలే తనకు బలమని, రాజీవ్ గాంధీ కలల భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని రాహుల్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ -
తెలంగాణలో 22A దందా.. రాహుల్‌కు హరీష్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖలో ‘22A’ చుట్టూ భారీ అవినీతి జరుగుతోందా? నిషేధిత భూముల జాబితా నుంచి ఆస్తులను తొలగించేందుకు ఏకంగా 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.22A నిబంధన ఉద్దేశం నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడమేనని హరీష్‌రావు పేర్కొన్నారు. అయితే ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడేందుకు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న వేలాది ప్రైవేటు ఆస్తులను కూడా ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చి యజమానులను వేధిస్తున్నారని విమర్శించారు.రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ రాకెట్ నడుస్తోందన్నది హరీష్‌రావు చేసిన మరో సంచలన ఆరోపణ. నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించుకునేందుకు దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇవి ఆరోపణలేనని, వీటిపై స్వతంత్ర దర్యాప్తుతో నిజానిజాలు తేలాల్సి ఉందని పేర్కొనడం సముచితం.యాదాద్రి జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాలను 22A జాబితాలో చేర్చినట్లు నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని హరీష్‌రావు తన లేఖలో ప్రస్తావించారు. ఇంత పెద్ద స్థాయిలో భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి? వాటి వెనుక కారణాలేంటి? అన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపైనా హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. భూములపై వివాదాలు సృష్టించి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు చేసుకునేలా భూ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని విమర్శించారు.ఈ మొత్తం వ్యవహారంపై 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 22A జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ ఆరోపణలతో కాకుండా.. ఎవరి ఆదేశాలతో ఏ ఆస్తిని జాబితాలో చేర్చారు? ఎందుకు తొలగించారు? అనే అంశాలను తేల్చాలని కోరారు. అంతేకాదు.. 30 శాతం కమీషన్లు, 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? దళారులు, బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఏవి? అనే విషయాలను దర్యాప్తులో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి ఆస్తుల జాబితాలో మార్పులు చేసిన అధికారులు, మధ్యవర్తుల ప్రమేయం, జరిగిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని హరీష్‌రావు కోరారు. మొత్తంగా 22A వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు సిద్ధమవుతుందా? లేక ఆరోపణలు-ప్రత్యారోపణలకే పరిమితం అవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
సుప్రీంకోర్టులో రాహుల్‌గాంధీకి భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు హైకోర్టు విచారణను కొనసాగించవద్దని అలహాబాద్ కోర్టుకు.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. సీబీఐ, ఈడీలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించరాదని తెలిపింది. ఈ కేసును విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రాహుల్ గాంధీపై నమోదైన పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం, ఈ ఆరోపణలపై సీబీఐ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి నివేదికలు సమర్పించాలని, ఈడీ కూడా తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు అంత తీవ్రమైనవి అయితే మీ ఏజెన్సీలు ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నాయని ధర్మాసనం నిలదీసింది. "కోర్టు నుంచి ఆదేశాలు రావాల్సిందేనా? మీ అంతట మీరుగా సుమోటోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదా?" అని జస్టిస్ బాగ్చి దర్యాప్తు అధికారులను ప్రశ్నించారు.కోర్టులో ఇరు పక్షాల వాదనలు.. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ విఘ్నేష్ శిశిర్‌కు ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని ప్రశ్నించారు. ఇది చట్టబద్ధత లేని, పూర్తిగా కక్షసాధింపు చర్య అని, పిటిషనర్ పదేపదే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సీబీఐ కేవలం ఫిర్యాదును ధృవీకరించడం మించి ఏమీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు వాదిస్తూ.. ఇప్పటివరకు ఈ కేసులో తమ పాత్రేమీ లేదని, ఒకవేళ ఫిర్యాదులో గమనించదగ్గ నేరాలు ఉన్నట్లు తేలితే అది చాలా తీవ్రమైన విషయమవుతుందని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీపై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలను ధృవీకరించాలని సీబీఐ, ఈడీలను ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ జూలై 20న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. సీబీఐ సమర్పించిన అఫిడవిట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, దీనిపై వ్యక్తిగతంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది. -
మోదీగారూ.. చూడండి ఏం జరిగిందో!
న్యూఢిల్లీ: యూజీసీ-నెట్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. వాటిని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని ఆరోపించారు. ‘‘మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.‘‘ఏళ్ల తరబడి చదివిన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దరఖాస్తులు, ఫీజులు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు.. అన్నీ మరోసారి చేయాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత రద్దు చేయడంపై ఆయన ప్రశ్నించారు. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా? అనే అసలు ప్రశ్నకు NTA సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.Modi ji, look at what your NTA has just done.UGC-NET exams for Sociology, English and Commerce were held between 22 and 30 June. Nearly two months later, NTA has cancelled all three because it set faulty papers and repeated old questions.Thousands of candidates who prepared… https://t.co/TUMhhMhjvL— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2026‘విద్యా వ్యవస్థ కాదు.. వసూళ్ల యంత్రం’దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ఇక విద్యా వ్యవస్థ కాదు.. ఒక ఎక్స్ట్రాక్షన్ మెషీన్‌గా మారింది. ఇది విద్యార్థుల డబ్బు, సమయం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుంటోంది. కానీ తిరిగి ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు’’ అని విమర్శించారు. పేపర్ లీక్ వ్యవహారాలపై బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం తొలి అడుగు మాత్రమేనని.. NTA నాయకత్వంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.సెప్టెంబర్‌లో రీటెస్ట్NTA ప్రకారం.. ఇంగ్లిష్, కామర్స్ అభ్యర్థులకు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్షకు సెప్టెంబర్ 10న రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు అదనపు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తామని తెలిపింది. నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న NTAపై తాజాగా యూజీసీ-నెట్ రీటెస్ట్ నిర్ణయం మరింత ఒత్తిడి పెంచింది. -
విద్యార్థుల ఆందోళనల వేళ సీఎం సోరెన్‌కు రాహుల్ లేఖ
సాక్షి, ఢిల్లీ: జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సీఎం స్వయంగా మాట్లాడాలని ఆయన సూచించారు. అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాహుల్ లేఖపై చర్చ నడుస్తోంది.లేఖలో భాగంగా.. రాజ్యాంగం కల్పించిన శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని రాహుల్ గాంధీ అన్నారు. జార్ఖండ్ రాష్ట్ర రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు, వారి డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. విద్యార్థులతో ప్రభుత్వం కమిటీ ద్వారా చర్చలు ప్రారంభించడం, వారి కొన్ని డిమాండ్లను అంగీకరించడం అభినందనీయమని రాహుల్ కొనియాడారు. అయితే కొందరు విద్యార్థులు ఇంకా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు.విద్యా వ్యవస్థపై బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు..భారతీయ విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ ఆధీనంలోకి తీసుకుని.. విద్యార్థుల శ్రమను దోచుకునే సాధనంగా మార్చాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరింత సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను వినాలని, వారి డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. -
మళ్లీ తెరపైకి అంకిత కేసు.. రాహుల్ దెబ్బతో బీజేపీకి మరో షాక్!
బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.. అంకితా భండారీ హత్య కేసు మరోసారి కమలనాథులను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నాలుగేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును రాహుల్ గాంధీ మళ్లీ తెరపైకి తీసుకురావడంతో.. ఉత్తరాఖండ్ రాజకీయాల్లో హీట్ పెరిగింది. “ఆ వీఐపీ ఎవరు? ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అంటూ రాహుల్ నేరుగా ప్రశ్నించడంతో.. బీజేపీపై మరోసారి విమర్శల వర్షం కురుస్తోంది. అసలు అంకితా కేసులో ఆ ‘వీఐపీ’ ఎపిసోడ్ ఏంటి? రాహుల్ ఆరోపణల్లో నిజమెంత? ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.ఉత్తరాఖండ్‌లో 2022లో పౌరీ గఢ్వాల్లోని వనంతర రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న అంకిత అదృశ్యమైంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మృతదేహం కాలువలో లభించింది. ఈ ఘటన అప్పట్లో ఉత్తరాఖండ్‌లో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. అంకితను హత్య చేయడానికి ముందు.. రిసార్ట్‌కు వచ్చే ఓ ‘వీఐపీ’ అతిథికి ‘ప్రత్యేక సేవలు’ అందించాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారని దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి. దీనికి అంకిత నిరాకరించడంతోనే ఆమెను హత్య చేశారని ప్రాసిక్యూషన్ కేసు వాదించింది.ఈ కేసులో రిసార్ట్ యజమాని సహా ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. అనంతరం వారు హత్య కేసులో దోషులుగా తేలారు. రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరు నిందితులకు కోర్టు ఇప్పటికే జీవిత ఖైదు విధించింది. అంటే హత్య కేసులో న్యాయపరమైన తీర్పు వచ్చినా.. ‘ఆ వీఐపీ ఎవరు?’ అనే ప్రశ్న మాత్రం ఇంకా రాజకీయంగా, సామాజికంగా చర్చకు దారితీస్తోంది. అయితే, ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ప్రశ్న వేరే. “ఆ వీఐపీ ఎవరు? ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అనేదే ఆయన ప్రశ్న. అంకిత కుటుంబాన్ని ఢిల్లీలో కలిసిన అనంతరం రాహుల్.. కేసులోని కొన్ని అంశాలపై మరోసారి ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యంగా దర్యాప్తు పూర్తికాకముందే రిసార్ట్‌లోని అంకిత గదిని కూల్చివేయడాన్ని ఆయన అనుమానాస్పదంగా పేర్కొన్నారు.“నాలుగేళ్లు గడిచినా అంకిత కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఆ ‘వీఐపీ’ని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?” అంటూ రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఉంది. ‘వీఐపీ’ ఎవరనే అంశంపై రాజకీయ ఆరోపణలు ఉన్నప్పటికీ, దానిని న్యాయస్థానం నిర్ధారించిన వాస్తవంగా చెప్పలేం. ఇప్పటికే దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులపై కోర్టు తీర్పు వేరుగా ఉంది. ఇప్పుడు అంకితా భండారీ కేసు మరోసారి రాజకీయ వేదికపైకి రావడంతో.. ‘ఆ వీఐపీ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
స్వాతంత్ర్య వేడుకలకు రెండోసారి రాహుల్ డుమ్మా.. కారణం అదేనా?
ఢిల్లీ: ఎర్రకోటలో జరుగుతున్న 80 వ స్వాతంత్ర్య వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం గైర్హాజరైంది.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో ఏడాది ఎర్రకోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు. 2024లో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై వివాదం చెలరేగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా, కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ.. కార్యక్రమంలో రెండో చివరి వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది అప్పట్లో సంప్రదాయం, ప్రొటోకాల్‌కు భిన్నంగా ఉందంటూ చర్చకు దారితీసింది.రాహుల్ గాంధీకి వెనుక వరుసలో సీటు కేటాయించడం కాంగ్రెస్ ఎంపీని మాత్రమే కాకుండా ప్రజలను అవమానించడమేనని ప్రతిపక్షం విమర్శించింది. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఒలింపియన్లకు వేదికపై చోటు కల్పించాల్సి రావడంతో సీట్ల కేటాయింపులో మార్పులు చేసినట్లు వివరణ ఇచ్చింది.ప్రొటోకాల్ ప్రకారం అధికారిక, ఆచారబద్ధమైన కార్యక్రమాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది కూడా ఖర్గే, రాహుల్ గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గైర్హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గైర్హాజరుపై ఎటువంటి ప్రకటన చేయలేదు.కాగా దేశవ్యాప్తంగాభారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ‘వందే మాతరం’ 150 ఏళ్ల వార్షికోత్సవం, అలాగే ‘యువ శక్తి–వికసిత్ భారత్@2047’ ప్రధాన అంశాలుగా వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటలో వేడుకలకు సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నట్లు సమాచారం. -
రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా చిల్లర వ్యాఖ్యలంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి నుండి అటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని రాహుల్ దెబ్బతీస్తున్నారని, ఈ వ్యాఖ్యలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య చర్యకు ముప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘నిన్న ప్రధాని నరేంద్ర మోదీపై, భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నీచమైనవి, ఖండించదగినవి. ఇది వ్యక్తిగతంగా నాకు కూడా బాధ కలిగిస్తోంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ప్రతిపక్ష నాయకుడి నుండీ ఇంతటి అసభ్యకరమైన, ఊహించలేని ప్రవర్తనను నేను ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ప్రవర్తన ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లడానికి తీవ్రమైన సంకేతం’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.కాగా, ప్రధాని మోదీ విదేశాంగ విధానం అంతా విదేశీ నాయకులను కౌగిలించుకోవడమేనని రాహుల్ గాంధీ ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ ప్రసంగిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన అసలైన స్వభావాన్ని ఎప్పుడో కోల్పోయిందని, ప్రస్తుతం అది అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు. -
‘హగ్’ కామెంట్ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకున్నారు.RaGa is in full roast mode.🤣🔥Rahul Gandhi just gave the most savage demonstration of “hug diplomacy”.*Runs and hugs Sandeep Dikshit*The hall couldn’t stop laughing. This one will travel. pic.twitter.com/XodlA8MvS8— Rajat Jain (@RajatJain) August 13, 2026ఈ సమయంలో సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.మోదీ ‘హగ్ డిప్లమసీ’పై రాహుల్ సెటైర్పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.బీజేపీ–ఆర్ఎస్ఎస్పై రాహుల్ విమర్శలుఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.‘‘మోదీ, అమిత్ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.సందీప్ దీక్షిత్ నేపథ్యంసందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. షీలా దీక్షిత్ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్‌ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. In 2024, PM Modi publicly said he was PAINED by the way Sheila Dikshit was "INSULTED" with baseless Corruption allegations.Today her own son, Sandeep Dikshit, stands on stage with Rahul & mocks the same Prime Minister 💔> He reduces a diplomatic gesture to a cheap joke by… pic.twitter.com/tALdiFnJhd— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 13, 2026‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.ట్రెండింగ్‌లో మెలోనీప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్‌ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్ గాంధీ హగ్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. -
అది జోకర్ల గుంపు
న్యూఢిల్లీ: బీజేపీ–ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ను భారతదేశంపై అవగాహన లేని జోకర్ల గుంపుగా అభివరి్ణంచారు. దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత వాస్తవికతపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ గుంపునకు ఏమీ తెలియదని ఆరోపించారు. తమకు, మరికొందరికి ప్రయోజనం చేకూర్చే ఒక వ్యవస్థను దేశంపై రుద్దడమే బీజేపీ–ఆర్ఎస్ఎస్ రాజకీయ సిద్ధాంతమని మండిపడ్డారు. ప్రధాని మోదీ విదేశాంగ విధానం అంతా విదేశీ నాయకులను కౌగిలించుకోవడమేనని ఎగతాళి చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన అసలైన స్వభావాన్ని ఎప్పుడో కోల్పోయిందని, ప్రస్తుతం అది అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు. బడా బాబులు ఆర్ఎస్ఎస్ను తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారని చెప్పారు. నేటి భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. వివిధ అంశాలపై మీడియా ప్రభుత్వ వైఖరికి వంతపాడుతోందని అన్నారు. మీడియా పరిమితులను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. కొంతమంది విదూషకులు మనపై పెత్తనం చెలాయించకుండా చూడటమే జాతీయ స్ఫూర్తి అని స్పష్టంచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాజీనామాలు సమర్పించాల్సిందేనని, అప్పటిదాకా వారికి నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు. వారిని నిద్రపోనివ్వబోమని వ్యాఖ్యానించారు. ద్వేషం, హింస లేకుండానే అనుకున్నది సాధిస్తామని స్పష్టంచేశారు. మన సంస్కృతి కోసం పోరాడుతున్నామని వివరించారు. మన దేశం ద్వేషం, పగతో కాకుండా ప్రేమ, సోదరభావం, అహింసతో ముడిపడి ఉందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. -
పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా.. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నుంచి.. నిన్నటి వరకు ఉభయ సభల్లో వాయిదాల పర్వమే కొనసాగింది. 18 రోజుల పాటు విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు.. మరోవైపు సభలను నడిపేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు.. వెరసి పార్లమెంట్ వేదికగా రాజకీయ వేడి కొనసాగింది.లోక్‌సభ, రాజ్యసభల కార్యకలాపాల సమయం కంటే వాయిదాలు, నిరసనలకే ఎక్కువ సమయం పోయింది. చివరి దశలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తి రేపినా.. ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. నిరసనల మధ్యే పలు కీలక బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందగా.. సభ వెలుపల కూడా అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఇక వర్షాకాల సమావేశాల ఇవాళ చివరి రోజు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతోంది. చర్చకు ప్రభుత్వం సిద్ధమంటోంది.. బాధ్యతపై నేరుగా సమాధానం కావాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ ఫైనల్ షోలో చర్చకు తెరలేస్తుందా?.. లేక మరోసారి చిచ్చు రగులుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.చర్చకు సిద్ధం: అమిత్ షావిద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ఏ అంశాన్నైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తానేం పారిపోలేదని.. రోజూ పార్లమెంట్‌కు వచ్చి తన ఛాంబర్‌లోనే కూర్చుకుంటున్నానని.. ఉద్దేశపూర్వకంగా విపక్షాలు సభల్ని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సుదీర్ఘ చర్చ కొనసాగించేందుకు సిద్ధమని స్పీకర్‌కు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని.. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని తెలిపారు. అయితే అమిత్ షా ప్రతిపాదనకు విపక్షాలు అంగీకరించలేదు. చర్చకు ముందు బాధ్యతపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.‘ఆదేశాలు ఎవరివి?’.. రాహుల్ ప్రశ్నఇన్నాళ్లు సభకు రాకుండా భయపడి.. ఇప్పుడు అభూత కల్పన కథలు చెబితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, బలప్రయోగానికి ఆదేశాలు ఎవరు ఇచ్చారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చింది అమిత్ షా అయితే రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ హోంశాఖ పరిధిలోనే ఉంటాయని గుర్తుచేస్తూ.. ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు.తప్పించుకుంటోంది ఎవరు?విపక్షాల తీరును ప్రభుత్వం తప్పుబట్టింది. చర్చకు డిమాండ్ చేసిన వారే ఇప్పుడు చర్చకు రావడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. హోంమంత్రి స్వయంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నినాదాలు, ఆందోళనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. అయితే.. హోం మంత్రి ఇన్నాళ్లపాటు సభకు వచ్చేందుకు భయపడ్డారని.. ఆయన ఇప్పుడు ఇచ్చే సమాధానం ఎవరికి కావాలని, విద్యార్థులపై పోలీసు చర్యలకు ఆదేశాలిచ్చింది ఆయనో కాదో తేల్చాలని, కారకుడు ఆయనే గనుక అయితే రాజీనామా చేయాలని విపక్షాలు మండిపడుతున్నాయి.విద్యార్థుల ఆందోళనలే ప్రధాన అజెండానీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలే ఈ సమావేశాల్లో ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వినియోగంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.అయితే.. మొత్తం సమావేశాల్లో ఒకే అంశంపై సభ సజావుగా సాగింది. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన పరీక్షా సవరణ బిల్లుపై జరిగిన చర్చ ప్రశాంతంగా జరిగింది. ఈ బిల్లుపై అధికార, విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించగా.. ఎలాంటి తీవ్ర అంతరాయం లేకుండా సభ కార్యకలాపాలు కొనసాగాయి. ఆ తర్వాత మాత్రం మళ్లీ విద్యార్థుల ఆందోళనలు-పోలీసుల చర్యల అంశంపై రాజకీయ రగడ కొనసాగింది.నిరసనల మధ్య కీలక బిల్లులుపార్లమెంట్లో రాజకీయ రగడ కొనసాగినప్పటికీ.. శాసనపరమైన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోలేదు. అధికార, విపక్షాల నినాదాల మధ్యే పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది.వందేమాతరం గౌరవం, జాతీయ చిహ్నాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసే సవరణలకు ఆమోదం లభించింది. వందేమాతరం అవమానాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టంలో మార్పులు చేశారు.విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. విదేశీ నిధులపై పర్యవేక్షణ, నిబంధనల కఠినతరం ఈ బిల్లులో ప్రధాన అంశాలు.మరోవైపు కేరళ రాష్ట్ర పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అలాగే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది.చివరి రోజైనా తెరపడేనా?వర్షాకాల సమావేశాల చివరి రోజు ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతుండగా.. విపక్షాలు మాత్రం బాధ్యతపై స్పష్టమైన సమాధానం కోసం పట్టుబడుతున్నాయి. 18 రోజులుగా సాగుతున్న పార్లమెంట్ పోరుకు చివరి రోజు అయినా ముగింపు లభిస్తుందా?.. లేదంటే ఫైనల్ షో కూడా మరో రాజకీయ చిచ్చుతోనే ముగుస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
అమిత్ షా ‘లెక్చర్’ మాకొద్దేవద్దు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చే ‘లెక్చర్’వినాలన్న ఆసక్తి ప్రతిపక్షానికి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. అభూత కల్పనలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తమకు అక్కర్లేదని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు అమిత్ షా చేసిన ప్రకటనపై రాహుల్ బుధవారం స్పందించారు. అమిత్ షా ఇమేజ్ బెలూన్ ఇప్పటికే పగిలిపోయిందని అన్నారు. అందులో గ్యాస్ నింపడానికి ఆయన చివరి నిమిషంలో ప్రయతి్నస్తున్నారని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీక్‌పై నిరసనకు దిగిన విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారో తెలుసుకోవాలని యువత కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులపై కాల్పులు జరపాలని అమిత్ షా ఆదేశించి ఉంటే ఆయన బాధ్యుడవుతాడని, ఒకవేళ ఆదేశించకపోతే ఆయన అసమర్థుడని తేల్చిచెప్పారు. ఏది ఏమైనా అమిత్ షా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బుధవారం మీడియాతో మాట్లాడారు. అమిత్ షాతో చర్చ జరపడానికి తమకు ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. ‘‘విద్యార్థులపై ఎవరు కాల్పులు జరిపారు? కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారు? విద్యార్థుల్లో ఒకరిని అంధుడిని చేసింది ఎవరు? ఒక విద్యార్థి చెవిలో ఎవరు కాల్చారు? లాఠీలు, మేకులతో కూడిన కర్రలతో విద్యార్థులను కొట్టాలని ఎవరు ఆదేశించారు? అనేది తెలుసుకోవాలని కోరుతున్నాం. అందులో మాత్రమే మాకు ఆసక్తి ఉంది. పిల్లలపై కాల్పులు జరపాలని అమిత్ షా ఆదేశాలు ఇచ్చారా లేదా? ఒకవేళ ఇచ్చి ఉంటే ఆయన బాధ్యుడు కాబట్టి రాజీనామా చేయాలి. ఒకవేళ ఇవ్వకపోతే అసమర్థుడు కాబట్టి రాజీనామా చేయాలి’’అని పేర్కొన్నారు. తాను మాట్లాడుతుండగా అంతరాయం కలిగించినందుకు విలేకరులపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడేటప్పుడు కూడా ఇలాగే చేస్తారా? అని ప్రశ్నించారు. అమిత్ షాలో అంత ప్రత్యేకత ఏముంది? ఆయన ముందు ఒక ఎలుకలాగా ఎందుకు నిల్చుంటారు? అని విలేకరులను నిలదీశారు.మౌనమే ఆయన అంగీకారం జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసన విషయంలో తాను మౌనంగా ఉండడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘విద్యార్థులపై జరిగే ఏ విధమైన హింసనైనా సమరి్థంచబోమని విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పాను. నేను మౌనంగా లేను, బహిరంగంగానే ఈ విషయాన్ని చెబుతున్నాను’’అని వివరించారు. అనంతరం తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ‘ఎక్స్’లో రాహుల్ షేర్ చేశారు. ‘‘ఒక వ్యక్తికి నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు, అతని మౌనమే అతనికి బదులుగా మాట్లాడుతుంది. అమిత్ షా మౌనమే ఆయన వ్యక్తంచేస్తున్న అంగీకారం’’అని ఉద్ఘాటించారు. -
రాత్రి 11 గంటలకైనా వర్కౌట్ చేస్తా.. రాహుల్ గాంధీ ఫిట్నెస్ మంత్రం..
-
అమిత్ షా బండారం బయటపడింది: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నీట్ నిరసనల అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ.. ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.“అమిత్ షా బండారం బయటపడింది. ఆయన సభకు ఎందుకు రావడం లేదు? సభకు రావడానికి ఆయన భయపడుతున్నారా?” అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. నీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలు, ఆందోళనకారులపై జరిగిన దాడులపై హోంమంత్రి సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశించింది ఎవరు? పోలీసుల కర్కశ చర్యలపై అమిత్ షా నోరు విప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘటనలకు బాధ్యత హోంమంత్రిదేనని ఆరోపించారు.VIDEO | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "Kharge ji and I have held press conferences, and the other Opposition parties have also made it clear that we are not interested in listening to Amit Shah's imagination. We are interested in one simple thing. And when we say 'we',… pic.twitter.com/sjkm33QjZ9— Press Trust of India (@PTI_News) August 12, 2026రాజీనామాకు డిమాండ్నిరసనల సమయంలో కాల్పులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే అమిత్ షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమిత్ షా ఏం మాట్లాడతారన్నది తమకు అవసరం లేదని, బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.“చర్చకు సిద్ధం”: షామరోవైపు, విపక్షాల ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ.. నీట్ అంశంతో పాటు విపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చకు రావాలని, సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని కోరారు. విపక్షాలు చర్చకు రాకుండా కేవలం ఆందోళనలు చేస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, చర్చకు వస్తారా? లేదంటే ఆందోళనలు కొనసాగిస్తారా? అనేది విపక్షాలు తేల్చుకోవాలని అన్నారు.నీట్ నిరసనల అంశంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం చర్చకు సిద్ధమంటూ చెబుతోంది. దీంతో పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. -
విద్యార్థి పోరుపై థరూర్ ఆత్మపరిశీలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యార్థి పోరుపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను సొంత పార్టీ నాయకత్వాన్ని విమర్శించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ‘ఐఐఎంయూఎన్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విపక్షాలు సరిగ్గా స్పందించలేకపోయాయని, యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించే మార్గాలను పార్టీలు తెరవాలని తాను కోరినట్లు తెలిపారు.రాహుల్ గాంధీ చేపట్టిన 'ఛాత్రోంకీ గూంజ్' కార్యక్రమం పేపర్ లీక్ అంశాలను ముందే లేవనెత్తిందని, అయితే యువత ఆకాంక్షలకు తగినట్లుగా మన విధానాలు ఎందుకు ప్రతిధ్వనించలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని థరూర్ పేర్కొన్నారు. కొందరు మీడియా ప్రతినిధులు తన మాటలను అసందర్భంగా వక్రీకరించి, పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు తన పూర్తి ప్రసంగ వీడియోను ‘ఎక్స్’ వేదికగా విడుదల చేస్తూ, రాజకీయాల్లో యువత కేవలం ప్రేక్షకులుగా కాకుండా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకు ఇవ్వాలని, రాజకీయ పార్టీలు తమ తలుపులను కొత్త తరానికి తెరవాలని శశిథరూర్ పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: భారత యువతి హత్య: ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్! -
చక్రవ్యూహంలో యువతరం
ప్రయాగ్‌రాజ్: యువతరం విషయానికొస్తే సమస్య, సమాచారం, సంపద అంశాల్లో దేశానికి వీళ్లే అతిపెద్ద బలమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో దశల వారీగా కొనసాగుతున్న ‘ఛాంత్రోంకీ గూంజ్(విద్యార్థుల గొంతు)’కార్యక్రమంలో భాగంగా శనివారం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కేపీ గ్రౌండ్లో వేలాది మంది విద్యార్థులనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఎల్లప్పుడూ తెల్లని టీ–షర్ట్ ధరించే రాహుల్ తన శైలికి భిన్నంగా లేత గులాబీరంగు సాధారణ షర్ట్‌తో ఆకట్టుకున్నారు. ‘‘మీరే ఈ దేశ గౌరవం, భవిష్యత్తు. దేశంలో యువత జనాభా అత్యధికం. మీరు సృష్టించే డేటా అపారం. 21వ శతాబ్దిలో దేశ ఆర్థికవ్యవస్థకు మీరు, డేటాయే చోదకశక్తులు. అయితే యువత వద్ద డేటా ఉంది. దానికి తోడు యువతలో ఉండాల్సిన శక్తిసామర్థ్యాలన్నీ మీకున్నాయి. కానీ వ్యవస్థ అనేది మిమ్మల్ని ఒక చక్రవ్యూహంలో పడేసింది. యువత ఎక్కువ రీల్స్ చూసేలా, ఎక్కువ వాట్సప్ మెసెజ్‌లలో మునిగిపోయేలా, ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ చేస్తూ, షేర్చేస్తూ వాటిల్లోనే గడిపేలా ఒక అదృశ్య వ్యవస్థ నడుస్తోంది. ఇదంతా యువతకు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద వ్యసనంగా తయారైంది’’అంటూ రాహుల్ వెనక తెరమీద పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ల ఫొటోలను ప్రదర్శించారు. ఫొటోలను చూపిస్తూ.. ‘‘డేటా మీది. కష్టం మీది. కానీ సంపద మాత్రం వీళ్లది. ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఇదే. అదానీ సంపద గత పదేళ్లలో 30 రెట్లు పెరిగింది. ప్రభుత్వంతో ఆయన క్విడ్ ప్రోకో(నీకిది నాకది) ఒప్పందం చేసుకున్నారు. బీజేపీ సంపద అమాంతం పెరిగింది. బీజేపీ బ్యాంక్ ఖాతాలో సొమ్ము ఇన్నేళ్లలో రూ.150 కోట్ల నుంచి ఏకంగా రూ.10,000 కోట్లకు ఎగసింది. ఇక ఆర్ఎస్ఎస్ విషయానికొస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో, మీడియా, జ్యుడీషరీ, పారామిలటరీ, విశ్వవిద్యాలయాలు, కళాశాలలల్లో ఆర్ఎస్ఎస్ భావజాల వ్యక్తులున్నారు. ఇలా వీళ్లంతా మనల్ని నియంత్రిస్తున్నారు. ఇదే వ్యవస్థ’’అని రాహుల్ అన్నారు. సర్టిఫికెట్లకు అర్థం లేకుండా పోయింది ‘‘కష్టపడి చదివి సంపాదించిన సరి్టఫికెట్లకు ఎలాంటి అర్థం లేకుండాపోయింది. ఇవి ఉద్యోగం ఇవ్వలేవు. విద్యార్థులుసైతం అత్యధిక ఫీజులు, పరీక్షల వ్యవస్థల అక్రమాల వలయంలో చిక్కుకున్నారు. ఉన్నత విద్య కోసం ఎంతో ఖర్చుచేయాల్సి వస్తోంది. తీరా కోర్సు పూర్తయ్యాక ఉద్యో గం రాదు. తయారీరంగం కుదేలవుతోంది. రుణాలు దొరకడం కష్టమైంది. పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీలు ఆగట్లేవు. ఏఐ వచ్చి ఉన్న ఉద్యోగాలనూ తీసేస్తోంది. యువత కష్టాలు ఇంకెన్నో’’అని రాహుల్ అన్నారు.అంధకారంలో అగ్గిరాజేయండి ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఎందరో విద్యార్థులు ఉద్యమించారు. పేపర్ లీకేజీలతో మనస్తాపంతో మరెందరో బలవన్మరణాలకు పాల్పడ్డారు. వాళ్లకు నా నివాళులు. అస్తవ్యవస్త విద్యారంగంలో అంధకారం అలుముకుంది. మీ తల్లిదండ్రులు చేయలేని పనిని మీరైనా చేయండి. ఇకనైనా విద్యార్థులు భయాలను విడనాడి అంధకారంలో ఉద్యమదీపాలను వెలగించి దేశంలో మార్పులకు పునాదులు వేయండి. విద్వేషం, హింసతో మార్పులు తేలేం. ప్రేమతోనే ఇది సాధ్యం. మీరే దేశ స్ఫూర్తి. మీరే దేశ భవిత. ప్రపంచంలోని బ్యూటిఫుల్ యంగ్‌స్టర్స్ మీరే. ప్రేమ దుకాణాలను తెరవండి. ప్రేమతోనే పోరాడి గెలవండి’’అని రాహుల్ అన్నారు. -
కిరణ్ రిజిజు, రాహుల్ మధ్య ముదిరిన వార్
సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన రాహుల్‌ను సవాల్ చేశారు. దీనికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇస్తూ, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇదివరకే కాంగ్రెస్ ఆమోదం తెలిపిందని దాన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు అనవసరంగా ముడిపెడుతున్నారని రాహుల్ కౌంటరిచ్చారు.అసలే ఏమైందంటేకిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతాలో మహిళలకు మరింత భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది “ఇది కాంగ్రెస్ నుంచి వచ్చిన సానుకూల సందేశంలా కనిపిస్తోంది. మహిళల విషయంలో రాహుల్ గాంధీ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది” అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.రాహుల్ గాంధీ కౌంటర్కిరణ్ రిజిజు చేసిన ఈ పోస్ట్‌కు రెండు గంటలు కూడా గడవకముందే రాహుల్ గాంధీ నుంచి సమాధానం వచ్చింది. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ మద్దతుతో పార్లమెంట్లో ఆమోదం పొందింది అనే విషయం కేంద్రమంత్రికి గుర్తు చేశారు.“ఈ బిల్లు ఇప్పటికే ఏకగ్రీవంగా, కాంగ్రెస్ పూర్తి మద్దతుతో ఆమోదించబడింది. అయితే మూడు సంవత్సరాలు గడిచినా ఇది ఎందుకు అమలు కాలేదు? ఇప్పుడు దీన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు అనవసరంగా ముడిపెట్టాలని మీరు కోరుకుంటున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.2023లో ఆమోదమైన చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్రాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.మహిళా కోటా, డీలిమిటేషన్ అంశంమహిళా రిజర్వేషన్ బిల్లు లేదా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ 2023లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదించబడింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడం ఈ చట్టం లక్ష్యం. అయితే 2023లో ఆమోదించిన చట్టం అమలును భవిష్యత్తులో నిర్వహించే జనగణనతో ముడిపెట్టింది. దీంతో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో ముడిపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియలో లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచే అవకాశం ఉంది. అందులో 33 శాతం అంటే 273 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి.గొడవ ఎందుకు?2011 జనగణన ఆధారంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల కంటే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయంగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టాన్ని ఆమోదింపజేయడానికి ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది.కాగా ఈ అంశమై కిరణ్ రిజిజు ఆగస్టు 5న రాహుల్ గాంధీతో 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రిజిజుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 6న కూడా రిజిజు ఫోన్ ద్వారా రాహుల్ గాంధీని సంప్రదించినట్లు సమాచారం. ఈసారి కాంగ్రెస్ ఈ అంశంపై అంతర్గతంగా చర్చించడంతో పాటు, తన ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో సైతం చర్చించి, అనంతరం తమ వైఖరిని తెలియజేస్తుందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. -
బీజేపీలో ఆయనే నా ఫేవరేట్.. ‘హలో అంకుల్’ అంటూ రాహుల్..
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సహజం. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీలో తనకు ఇష్టమైన నాయకుడు ఎవరో చెబుతూ.. మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరును రాహుల్‌గాంధీ ప్రస్తావించారు.ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్‌గాంధీ.. అమరీందర్ సింగ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. ‘‘ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చాలా కూల్. సైనిక చరిత్రపై ఆయనకు మంచి పట్టు ఉంది. హలో అంకుల్ అమరీందర్’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. జెన్ జెడ్, విద్యార్థులతో మరింతగా మమేకమయ్యేందుకు రాహుల్‌గాంధీ ఈ ఇన్స్టాగ్రామ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే అమరీందర్ సింగ్‌పై చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది.రాహుల్ వ్యాఖ్యలపై అమరీందర్ సింగ్ కూడా స్పందించారు. తన గురించి రాహుల్‌గాంధీ మంచి మాటలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను చిన్నప్పటి నుంచే తనకు తెలుసని గుర్తుచేశారు. రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తనకు క్లాస్మేట్, స్నేహితుడని చెప్పారు. అయితే వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వేర్వేరు అని అమరీందర్ స్పష్టం చేశారు. రాహుల్, సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని.. కానీ రాజకీయంగా మాత్రం తాను బీజేపీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు.అమరీందర్ వ్యాఖ్యలకు పంజాబ్ బీజేపీ నేతలు కూడా స్పందించారు. పంజాబ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రీత్‌పాల్ సింగ్ బలియావాల్.. అమరీందర్ సింగ్‌ను పంజాబ్‌లో అత్యున్నత స్థాయి నాయకుడిగా అభివర్ణించారు. అయితే కాంగ్రెస్ పంజాబ్ యూనిట్లో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలోనే రాహుల్ ఆయనను గుర్తు చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాణా గుర్జీత్ సింగ్ మాత్రం రాహుల్, అమరీందర్‌కు కుటుంబ సంబంధాలు ఉన్నాయని, అమరీందర్ గౌరవనీయమైన నాయకుడని అన్నారు. ఆయన కాంగ్రెస్‌ను వీడకుండా ఉంటే పార్టీలో అందరికీ మార్గదర్శకుడిగా ఉండేవారని అభిప్రాయపడ్డారు.అమరీందర్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక ప్రాంతీయ నాయకుడిగా ఉన్నారు. 2017లో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఘన విజయం అందించి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల నేపథ్యంలో 2021లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి, 2022 ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అనంతరం బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం అమరీందర్ కుటుంబ సభ్యులు కూడా బీజేపీలోనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌తో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ.. సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత అనుబంధం కొనసాగుతుందని అమరీందర్ పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో రాహుల్‌గాంధీ చేసిన ‘హలో అంకుల్ అమరీందర్’ వ్యాఖ్య మరోసారి ఆ పాత రాజకీయ, కుటుంబ అనుబంధాలను తెరపైకి తెచ్చింది."Hello, Uncle Amarinder!"LoP Shri @RahulGandhi gives a warm shoutout to his favourite politician from the BJP. pic.twitter.com/kwgQPDZ5SV— Congress (@INCIndia) August 6, 2026 -
విద్యార్థులను చూస్తే గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజీపై నిరసన తెలియజేసిన విద్యార్థులపై జరిగిన హింసాకాండకు ముమ్మాటికీ అమిత్ షా బాధ్యుడని ఆరోపించారు. విద్యార్థుల విషయంలో ఏం జరిగిందో పార్లమెంట్లో వివరించే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. జూలై 20న పోలీసుల దాడికి గురైన విద్యార్థుల బృందంతో రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ నిరసనకారులను ఇప్పుడే కలిసి చర్చించానని తెలిపారు. రాజ్యాంగం, విద్యా వ్యవస్థ, భారతదేశ భవిష్యత్తు కోసం పోరాడిన వేలాది విద్యార్థులను చూస్తే తనకు చాలా గర్వంగా ఉందన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తమపై జరిగిన దాడి, తగిలిన దెబ్బలు, ఎదురవుతున్న బెదిరింపుల గురించి వారు వివరించారని పేర్కొన్నారు. వారు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం సాగించారని, భారతదేశం అనే భావనను, దేశ భవిష్యత్తును కాపాడారని రాహుల్ ప్రశంసించారు. లోపభూయిష్టమైన, కుప్పకూలిపోతున్న, నిష్ప్రయోజనమైన విద్యా విధానం గురించి ఫిర్యాదు చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వ్యవస్థనే మార్చాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. వారు హింసకు పాల్పడలేదని, దురుసుగా ప్రవర్తించలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ వారిపై దాడి చేసి, కొట్టి, బెదిరించారని ధ్వజమెత్తారు. ఆన్లైన్లో వేధిస్తున్నారు: రియా ఆహిర్ విద్యార్థుల బృందాన్ని కలిసిన ఫొటోలను రాహుల్ గాంధీ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘భారతదేశ భవిష్యత్తును చూడండి. యువత నిర్భయులు, నిర్మొహమాటంగా మాట్లాడుతారు. వారికి దేశభక్తి ఉంది. మరి ప్రధానమంత్రి, హోంమంత్రి సంగతి ఏంటి? పార్లమెంట్‌కు వచ్చే ధైర్యం గానీ, సమాధానాలు చెప్పే తెగింపు గానీ వారికి లేవు’’అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ పక్కన సీజేపీకి చెందిన రియా ఆహిర్, నూతన్ టోపో, భరత్, ఫర్హానాజ్, ముస్కాన్ ఉన్నారు. వీరిలో మోడల్ రియా ఆహిర్ ముంబైలో విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. తనకు ఆన్లైన్లో వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గాంధీ పక్కన నిల్చొని ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను 20 మంది పిల్లలను అక్రమ అరెస్టుల నుంచి కాపాడనని, ఇప్పుడు తనను ఆన్లైన్లో వేధిస్తున్నారని చెప్పారు. తాను ఎదుర్కొంటున్నది ట్రోలింగ్ కాదని, అది ఒక నేరమని స్పష్టం చేశారు. -
సభకు సహకరించండి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిరోజూ కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పార్లమెంట్‌లోని ఆయన చాంబర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గాల పునర్వీభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లుపైనా రాహుల్ గాం«దీతో రిజిజు చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఆమోదించేందుకు సహకరించాలని రిజిజు కోరగా, రాహుల్ గాంధీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నాయి. రాహుల్, రిజిజు భేటీ దాదాపు 50 నిమిషాలపాటు జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్, కేసీ వేణుగోపాల్ కూడా ఆ తర్వాత ఈ సమావేశంలో చేరారు. వర్షాకాల సమావేశాలను పొడిగించడం లేదా ప్రత్యేక సమావేశం నిర్వహించడంపై రిజిజు ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. అయితే, నియోజకవర్గాల పునర్వీభజన అంశంపై ప్రతిపక్షం వైఖరి గురించి రాహుల్ అభిప్రాయాలను రిజిజు అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నాయి. పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన తెలియజేసిన విద్యార్థులపై జరిగిన హింస గురించి హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయడం, అయోధ్యలోని రామాలయ విరాళాల చోరీపై చర్చ జరగడం అనేవి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడానికి అత్యవసరమైన షరతులు అని రిజిజుకు రాహుల్ స్పష్టం చేసినట్లు సమాచారం. గత పది రోజుల వ్యవధిలో వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశం కావడం ఇది రెండోసారి. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు–2026ను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్తు తరాలు క్షమించవు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం దురదృష్టకరమని, బాధ్యత గల నాయకులు యువతకు ఆదర్శంగా నిలవాలని, కానీ రాహుల్ గాంధీ ఆ దిశగా వ్యవహరించడం లేదని అన్నారు.పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనుకేసుకురావడం సరికాదని, రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇదే విధంగా దూషిస్తే ఆయన అదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు.అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు వచ్చినప్పటికీ ఆయన హుందాగా స్పందించారని, చిన్నారులు తప్పులు చేయడం సహజమని, వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదేనని మోదీ సూచించారు. ఆయన స్పందనలో క్షమాగుణం, బాధ్యత మాత్రమే కనిపించగా, విద్యార్థిని స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడం భారతీయ సంస్కృతి, విలువలకు నిదర్శనమని మంత్రి అన్నారు.అలాగే, భారతీయ సంప్రదాయాలు పెద్దలను గౌరవించడం, తప్పు చేసిన వారిని క్షమించి సరైన మార్గంలో నడిపించడం వంటి విలువలను బోధిస్తాయని వారు గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా వ్యవహరించాల్సిన సమయంలో రాహుల్ గాంధీ బాధ్యతాయుత రాజకీయాలను విస్మరించారు. అయితే, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానకరమైన భాషను ప్రోత్సహించే నాయకులను భవిష్యత్తు తరాలు తిరస్కరిస్తాయని, దేశ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యువత మద్దతు ఎప్పటికీ ఉంటుందని మంత్రి కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో యువతను వాడుకోవడం.. ఆ తర్వాత నట్టేట ముంచటం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య ఘటన ఆవేవన కలిగించిందన్న ఆయన.. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ యువతను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కానీ, ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లుగా జాబ్‌క్యాలెండర్ ఇవ్వలేదు. తెలంగాణ యువత.. ప్రత్యేకించి నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో వేణు అనే యువకుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వేణు తన లేఖలో రాశాడు. అలాగే బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారని కూడా గుర్తు చేశాడు. వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ రాశాడు. బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల 42 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. హైదరాబాద్‌లో 142 ఫ్లైఓవర్లు నిర్మించిందెవరు? సచివాలయం కట్టించింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలో చివర 48 వేల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చాం.రేవంత్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానవతా దృక్ఫతం లేకుండా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడారు. విద్యార్థుల విలువ సీఎం రేవంత్‌కు ఏం తెలుసు?. అసలు నిరుద్యోగులకు ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పోలీసు ఉద్యోగాలు 20 వేలు ఖాళీ ఉన్నాయి. 7 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఎందుకిచ్చారు?. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ 24 హామీలు ఇచ్చింది. అశోక్ నగర్లో సాక్షాత్తు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు విలువ లేదు. ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా రాహుల్ పట్టించుకోరా? ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులపై దాడులు జరిగితే వెళ్తున్న ఆయన.. అసలు హైదరాబాద్‌కు ఎందుకు రావడం లేదు?. తెలంగాణ వైపు చూసే దమ్మే ఆయనకు లేదా?కాంగ్రెస్, బీజేపీ యువతను వాడుకుంటోంది. రాహుల్, రేవంత్ తెలంగాణ యువతను మోసం చేశారు. వాళ్లు ఇద్దరు ప్రకటించిన డిక్లరేషన్లు, కార్డులు క్రిమినల్ వేస్ట్. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడం క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తి సీఎం కావడం క్రిమినల్ వేస్ట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. వేణు సూసైడ్‌కు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని కేటీఆర్ నిలదీశారు.ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫారాలు నింపడం రాదని రేవంత్ అన్నారు. ఆ మాటలకు మేం బాధపడ్డాం. అసలు ఆయనకు ఎన్నికల అఫిడవిట్ ఫారం నింపడం వచ్చా?. ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణాలు తెలుసు.. కాంగ్రెస్‌కు ఎలా సమాధి కట్టాలో తెలుసు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాం. మళ్లీ పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా.. ముందు ఆ హామీని నెరవేర్చండి. యువత సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రండి అని కేటీఆర్ రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు. -
అమిత్ షా ఎక్కడ?!
జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా వాయిదాల పర్వం(ఇవాళ కూడా) కొనసాగుతోంది. అయితే అమిత్ షా గైర్హాజరీని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాన అస్త్రంగా చేసుకోగా.. బీజేపీ మాత్రం ఆరోపణలను ఖండిస్తోంది.విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు అనవసర బల ప్రయోగం జరిపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా చలో సంసద్ ర్యాలీ సమయంలో లాఠీలు, పెల్లెట్ గన్స్ వినియోగించారనే ఆరోపణలపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయని, అందుకే ఘటనకు బాధ్యత హోంమంత్రి అమిత్ షాదేనని విపక్ష నేతలు అంటున్నారు.“అమిత్ షా సమాధానం చెప్పాలి”పరీక్షల సంస్కరణ బిల్లు చర్చ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై పోలీసు చర్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన.. హోంమంత్రి అనుమతి లేకుండా ఇలాంటి పరిణామాలు ఎలా చోటుచేసుకున్నాయని నిలదీశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. వారిపై బలప్రయోగం చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అమిత్ షాపై ఉందని పేర్కొంటూ.. ఆయన సభకు రాకపోవడంపై కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.కేంద్రం వాదన ఏంటి?అయితే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. నిరసనల సమయంలో పోలీసులు సంయమనం పాటించారని, ఎలాంటి అనవసర బలప్రయోగం జరగలేదని చెబుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు.. రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా విపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.మళ్లీ రంగంలోకి CJPమరోవైపు నీట్ నిరసనలకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ ఇంకా నెరవేరలేదని ఆ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కేంద్రానికి మరో సవాల్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసుల ఉపసంహరణ, విద్యార్థులపై చర్యలపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలను మళ్లీ ఉధృతం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.షా మౌనం చర్చనీయాంశంనీట్ నిరసనల వ్యవహారంలో ఇప్పటివరకు అమిత్ షా ప్రత్యక్షంగా స్పందించకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన గైర్హాజరీని విపక్షాలు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక కారణాన్ని వెల్లడించలేదు. మరోవైపు CJP తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.విద్యార్థులపై పోలీసు చర్యల ఆరోపణలు.. అమిత్ షా మౌనం.. కేసుల ఎత్తివేత డిమాండ్.. ఈ మూడు అంశాలు కేంద్రంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో హోంమంత్రి స్పందిస్తారా? రాజకీయ రగడ మరింత కొనసాగుతుందా?? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
పునర్విభజనను సమర్థించేవాళ్లు ద్రోహులే
సాక్షి, చెన్నై: మోదీ ప్రభుత్వం తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రతి జాతీయ పార్టీ, తమిళ పార్టీ వ్యతిరేకించాలని కోరారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తే ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ శనివారం తమిళనాడులోని మహాబలిపురంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో మేధోమథన సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. తమిళ ప్రజల ఓటు హక్కును హరించి, వారి నుంచి అధికారాన్ని లాగేసుకునేలా నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను కచ్చితంగా తిప్పికొట్టాలని స్పష్టంచేశారు. పార్లమెంట్లో డీమిలిటేషన్ బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం పొందకుండా చూడాలన్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజనకు మద్దతు ఇస్తే ప్రజలపై, వారి భవిష్యత్తుపై దాడి చేయడానికి బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. క్షమాభిక్ష కాదు.. క్షమాపణ కావాలి తమిళనాడులో ‘నీట్’పరీక్ష వల్ల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు. కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు దుఃఖించడం చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని అన్నారు. అవినీతిమయమైన పరీక్షా విధానాన్ని అందించినందుకు విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మోదీ క్షమాభిక్ష అవసరం లేదని, క్షమాపణ చెప్పడమే కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. -
విద్యార్థులకు కావాల్సింది క్షమాభిక్ష కాదు మోదీజీ: రాహుల్
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష కాదు, క్షమాపణ చెప్పాలని అన్నారు."భారత్ విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష అవసరం లేదు. వారికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది" అని రాహుల్ చెప్పారు. విద్యార్థులు తనపై చేసిన వ్యాఖ్యలను "క్షమిస్తున్నాను" అన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాహుల్ ఇలా అన్నారు.నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాహుల్ కలుసుకుని ఓదార్చారు. ఈ భేటీ చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగింది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు దుఃఖంలో ఉండటాన్ని చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని రాహుల్ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి యువకుడు, యువతి వెనుక జీవితాంతం బాధ మోసే కుటుంబం ఉంటుందని చెప్పారు.పలుసార్లు ప్రశ్నపత్రాల లీకులు జరగడం, పరీక్షలు రద్దు కావడం, ఎన్నో సంవత్సరాల సన్నాహాలు ఒక్క రాత్రిలో వృథా కావడం విద్యా వ్యవస్థలోని వైఫల్యాన్ని బయటపెట్టాయని అన్నారు. నిజాయితీగా లేని వ్యవస్థలో విద్యార్థులు నిజాయితీగా శ్రమించాలని అడుగుతున్నారని చెప్పారు.ప్రశ్నపత్రం లీక్ కారణంగా భవిష్యత్తు కోల్పోయిన ఒక్క విద్యార్థినైనా, దుఃఖంలో ఉన్న ఒక్క తల్లిదండ్రినైనా ప్రధాన మంత్రి కలవలేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైందని అన్నారు. -
రాహుల్, పప్పూయాదవ్‌లపై సాధువుల ఫిర్యాదు
లక్నో: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ పప్పూయాదవ్పై హిందూ సన్యాసులు, లాయర్లు ఫిర్యాదు చేశారు.అయోధ్య రామమందిర హుండీ చోరీ పేరుతో పార్లమెంట్ ఎదుట వీరు నాటకం వేశారన్నారు. ఆ నాటకం హిందూ ధర్మాన్ని సన్యాసులను అవమానించే విధంగా ఉందని వారణాసిలోని వివిధ పోలీస్ స్టేషన్లలలో ఫిర్యాదు చేశారు.హిందూ సాధువు బాలక్‌దాస్ దేవచార్య మాట్లాడుతూ "పార్లమెంటు బయట పప్పు యాదవ్ చేసిన చర్య ద్వారా, ఆయన కాషాయ వస్త్రాలను, సాధు సమాజాన్ని, శ్రీరాముడినీ అవమానించారు. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతిపక్ష నాయకులందరిపై ఫిర్యాదు దాఖలు చేశాం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం," అని అన్నారు.అదే న్యాయవాది వినీత్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షం సనాతన ధర్మాన్ని అవమానిస్తోందన్నారు "నిన్న పార్లమెంటులో సనాతన ధర్మాన్ని అవమానించారని మేము భావిస్తున్న దానిపై ఫిర్యాదు చేశాము. పప్పు యాదవ్, రాహుల్ గాంధీలపై కేసు నమోదు చేయాలని కోరాము. మేము కేవలం వినతిపత్రం కాకుండా, కంటోన్మెంట్ పోలీసు అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించాము." అని తెలిపారు.ఫిర్యాదు ఎందుకు కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట నిన్న (శుక్రవారం) కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ఆ పార్టీ ఎంపీ పప్పూయాదవ్ కాషాయ వస్త్రాలు ధరించారు. పూజారి వేషంలో విరాళాల పెట్టె పట్టుకొని ముఖద్వారం వద్ద కూర్చొని నిరసన తెలిపారు.ఆ సమయంలో అక్కడి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరుస్తూ హుండీలో కానుకలు వేశారు. ఈ సందర్బంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పప్పూయాదవ్‌కు నమస్కారం పెట్టి హుండీలో కానుకలు వేశారు. కాగా దీనిపై ఇప్పుడు ఫిర్యాదు చేశారు. -
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. విపక్షాల నినాదాలు
పార్లమెంట్ సమావేశాలు అప్డేట్స్.. రాజ్యసభ వాయిదా.. రాజ్యసభ సోమవారానికి వాయిదా.. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు లోక్‌సభలో విపక్షాల నిరసనలు.. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా.. ఎంపీ వినూత్న నిరసనలు..రెండు కుండీలు పెట్టి అందులో డబ్బులు వేసిన ఎంపీలుహుండీ చోరీపై ఎంపీ వినూత్న నిరసనలు.స్వామీజీ గెటప్లోని వచ్చి చందా అడిగిన ఎంపీ పప్పూ యాదవ్.హుండీలో డబ్బులు వేసిన రాహుల్ గాంధీ. #WATCH | Delhi | Monsoon Session of the Parliament | Opposition MPs including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi protest over the issue of alleged Ayodhya Ram Mandir donations embezzlement pic.twitter.com/1BXa6UiUuq— ANI (@ANI) July 31, 2026 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..పార్లమెంటు మకర ద్వారం వద్ద కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ధర్నావిద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ నినాదాలుకేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని నినాదాలుపార్లమెంటుకు అమిత్ షా రావాలని డిమాండ్అయోధ్య విరాళాల చోరీపై దర్యాప్తు జరపాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల డిమాండ్ -
రాహుల్‌పై సభా హక్కుల నోటీస్
న్యూఢిల్లీ: హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గురువారం సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు ఆ నోటీస్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఠాకూర్ అందజేశారు. ‘అమిత్ షానుద్దేశించి రాహుల్ జూలై 29 తేదీన అమర్యాదగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలుచేసి సభా మర్యాదలను ఉల్లంఘించారు. విద్యార్థులతో సంభాషణను గుర్తుచేస్తూ ‘విద్యార్థులు’,‘మూర్ఖులు’,‘అంధభక్తులు’ అనే పదాలు వాడారు. చివరి రెండు పదాలు రాజకీయ ప్రత్యర్థులను, ప్రభుత్వ మద్దతుదారులనుద్దేశించి వాడారు. సభలో ఇలాంటి పదాల వినియోగాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ నియమావళిలోని 352(3), (7), 353 నిబంధనల ప్రకారం ఏనాడో నిషేధించారు. దారుణమైన ఆరోపణలు చేసిన రాహుల్‌గాంధీ వెంటనే లోక్‌సభకు, అమిత్ షాకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాహుల్ అమర్యాదకర వైఖరి అంశాన్ని సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి సిఫార్సు చేసి సమగ్ర దర్యాప్తు తర్వాత ఆయనపై తగు చర్యలు తీసుకోవాలి’’ అని తన మూడు పేజీల నోటీస్‌లో అనురాగ్ ఠాకూర్ కోరారు. -
పెల్లెట్ గన్స్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ వినియోగంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న వేళ.. ఈ అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదని స్పష్టం చేసింది. అయితే..పెల్లెట్ గన్స్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్‌ను కోర్టు అంగీకరించలేదు. బదులుగా, అసాధారణ (exceptional), అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే జూలై 20న జంతర్‌మంతర్‌లో విధుల్లో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డును (అమ్యూనిషన్ లాగ్) భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. నిరసనల్లో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.పోలీసుల అధికారాలపై కోర్టు వ్యాఖ్యలుపెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. నిరసనలు హింసాత్మకంగా మారి, దుండగులు చొరబడి పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు చట్టబద్ధంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని పేర్కొంది. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలు ఫలించకపోతే, అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో పోలీసులు బుల్లెట్లను కూడా ఉపయోగించేందుకు చట్టం అవకాశం ఇస్తుందని.. అలాంటప్పుడు ప్రాణాంతకం కాని (Non-lethal) పెల్లెట్ గన్స్‌ను పూర్తిగా నిషేధించాలని ఎలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. అదే సమయంలో.. వాటి వినియోగంపై స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయమూ వ్యక్తం చేసింది.గాయపడిన వారికి చికిత్స తప్పనిసరినిరసనల సమయంలో ఎవరైనా గాయపడితే వారికి తక్షణమే నాణ్యమైన వైద్య చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జంతర్ మంతర్ ఘటనలో గాయపడిన నిరసనకారులందరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.సీఆర్పీఎఫ్ నివేదిక ఏమంటోంది?ఇదిలా ఉండగా, జంతర్‌మంతర్ వద్ద పోలీసు చర్యపై సీఆర్పీఎఫ్ అంతర్గత విశ్లేషణలో అన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) పాటించినట్లు పేర్కొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మొదట ప్రజలను చెదరగొట్టేందుకు హెచ్చరికలు జారీ చేయడం, అనంతరం టియర్ గ్యాస్, లాఠీచార్జ్ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతోనే పంప్ యాక్షన్ గన్ ద్వారా పెల్లెట్ గన్స్‌ను వినియోగించినట్లు నివేదిక వెల్లడించింది.ఇద్దరికీ గాయాలుఈ ఘటనలో ముగ్గురి నుంచి ఐదుగురు నిరసనకారులు పెల్లెట్ల కారణంగా గాయపడినట్లు సమాచారం. మరోవైపు, 47 మంది RAF సిబ్బంది కూడా గాయపడగా, వారిలో ఆరుగురికి తలకు తీవ్ర గాయాలు అయినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది.సిబ్బందికి అండగా డీజీసీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీ.పీ. సింగ్ తన సిబ్బందికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల భద్రత, దేశ ప్రయోజనాల దృష్ట్యా విధి నిర్వహణలో అధికారులు తీసుకున్న నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తానని, చట్టబద్ధంగా విధులు నిర్వర్తించే సిబ్బంది ఎలాంటి భయాందోళనలు లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు.కాగా, నీట్ నిరసనల్లో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారంటూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాయపడిన ఓ విద్యార్థిని చూపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. దీంతో ఈ అంశం పార్లమెంట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ రాజకీయ వివాదం నడుమే సుప్రీంకోర్టు అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా తప్పుబట్టలేమని, వాటిపై సంపూర్ణ నిషేధం అవసరం లేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
‘విద్యార్థులకు న్యాయం జరగాలి’
పార్లమెంట్ సమావేశాలు అప్డేట్స్.. రాహుల్‌కు కౌంటర్..నిశికాంత్ దూబే వ్యాఖ్యలుఅమిత్ షాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను దూబే తీవ్రంగా ఖండించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరికి భయపడరు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే అమిత్ షాకు భయపడుతున్నారు.దేశాన్ని విభజించాలని కోరుకునే దేశ వ్యతిరేక శక్తులే అమిత్ షాకు భయపడుతున్నాయి.ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసంతోనే అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్పెల్లెట్ గన్స్‌పై చర్చించాలని పట్టుఅమిత్ షా సభకు రావాలంటూ నినాదాలు.చర్చకు అంగీకరించని ప్రభుత్వంవిద్యార్థులకు న్యాయం చేయాలి: రాహుల్రాహుల్ గాంధీ కామెంట్స్..విద్యార్థులకు న్యాయం జరగాలి.విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి.రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి.విద్యార్థుల హక్కులు, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.Students deserve justice. An independent SC monitored high powered committee must be constituted to probe brutalities against our students. pic.twitter.com/pZATUeAjwC— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2026 కాంగ్రెస్ వాయిదా తీర్మానం..రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై చర్చించాలని డిమాండ్ పార్లమెంట్ వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా..కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంపార్లమెంటు ద్వారం వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా అయోధ్య విరాళాల చోరీ పైన దర్యాప్తు చేయాలని నినాదాలుఉభయసభల్లో చర్చకు నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీఅయోధ్య విరాళాల చోరీపై స్వతంత్ర ఆడిటింగ్ దర్యాప్తు జరగాలని నినాదాలుచందా చోర్.. అధికారం నుంచి గద్దె దిగాలని ప్రతిపక్ష నేతల నినాదాలు#WATCH | Delhi: Congress MPs including Priyanka Gandhi Vadra and others hold a protest at Makar Dwar of the Parliament, against Union Home Minister Amit Shah over 'police action' against CJP protestors on 20th July. pic.twitter.com/zmuqaWOt6n— ANI (@ANI) July 30, 2026 -
విద్యార్థులను హింసించే హక్కు ఎవరిచ్చారు
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనకు దిగిన విద్యార్థులను కఠినంగా అణచివేయాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, కాల్పులకు అమిత్ షా ఆమోదం తెలిపారని మండిపడ్డారు. పేపర్ లీక్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీజేపీని, ఆ పార్టీ మద్దతుదారులను పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఇందుకోసం మూడు వర్గాలను ప్రస్తావించారు. విద్యార్థులు, తమకు అంతా తెలుసని భావిస్తూ దేవుడిలా నటించేవారు, ఆ రెండో వర్గమే సాక్షాత్తూ దేవుడని నమ్మే అంధభక్తులు ఉన్నారని విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఈ రోజు సభకు రాలేదని రాహుల్ అన్నారు. విద్యార్థులపై హింసకు పాల్పడే హక్కు అమిత్ షాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆయన మన విద్యార్థుల శరీరంలోకి పెల్లెట్లను(తుపాకీ గుళికలను) దించారని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో విద్య నేడు ఖరీదైన వ్యాపారంగా, విద్యా వ్యవస్థ క్రూరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లోకి విద్యా వ్యవస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై కూడా రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తూ, విద్యార్థులకు ఏమి బోధించాలనే దానిని ఆ సంస్థే నిర్దేశిస్తోందని ఆరోపించారు. విద్యా వ్యవస్థ ఆత్మను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడూ విద్యా శాఖను నడపలేదని, ఆ పని చేసింది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని ఆక్షేపించారు. విద్యార్థుల అసలైన శత్రువు ఆర్ఎస్ఎస్ అని విమర్శించారు. అన్‌పార్లమెంటరీ పదం తొలగింపు కొంతమంది విద్యార్థులతో జరిపిన సంభాషణ యువత విద్య, జ్ఞానాన్ని ఎలా చూస్తుందనే దానిపై తనకు ఒక అవగాహన కల్పించిందని రాహుల్ అన్నారు. విద్యారి్థగా ఉండడం అంటే ఏమిటని తాను ఒక విద్యారి్థని అడిగానని చెప్పారు. అంటే కళాశాల లేదా పాఠశాలలో చదువుకోవడం, పుస్తకాలు చదవడం అని అర్థమా? అని అడిగితే.. విశాలమైన దృక్పథం, విశాలమైన హృదయం కలిగినవారే విద్యార్థి అని ఆమె సమాధానమిచ్చారని పేర్కొన్నారు. ‘‘విద్యార్థి అంటే తనకు అన్నీ తెలియవని అంగీకరించే వ్యక్తి. తనకు తెలిసిన విషయాల స్థానంలో కొత్త జ్ఞానం వచ్చి చేరుతుంది. విశ్వం నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుందని అతనికి తెలుసు. జ్ఞానం కూడా నిరంతరం మారుతూ ఉంటుందని అతను అర్థం చేసుకుంటాడు. విద్యారి్థకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం వినమ్రత అని ఆమె అన్నారు’’అని రాహుల్ వెల్లడించారు. తమకు అన్నీ తెలుసని భావించే మరో వర్గం గురించి కూడా ఆమె వివరించారని పేర్కొన్నారు. ‘‘తమకు అన్నీ తెలుసని కొందరు వ్యక్తులు దృఢంగా నమ్ముతారు. విశ్వం స్థిరమైనదని, జ్ఞానం తమ అంతరంగం నుంచే ఉద్భవిస్తుందని వారు భావిస్తారు. వారు అహంకారంతో ఉంటారు. వారు ఇతరుల మాట వినరు, సత్యాన్ని గౌరవించరు’’అని చెప్పారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఉపయోగించిన ఒక పదంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యారి్థని తనతో చెప్పిన మాటలనే సభలో ప్రస్తావించానని, సభలోని ఏ సభ్యుడినీ ఉద్దేశించి అనలేదని రాహుల్ బదులిచ్చారు. రాహుల్ ఉపయోగించిన అన్‌పార్లమెంటరీ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. దాంతో స్పీకర్ ఆ పదాన్ని తొలగించారు. ఎన్డీయే సభ్యుల తీవ్ర అభ్యంతరం సభలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల పట్ల అధికార ఎన్డీయే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. దాంతో సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. రాహుల్ అబద్ధాల పుట్ట అంటూ బీజేపీ ఎంపీలు ఎదురుదాడికి దిగారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, అందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం జోక్యం చేసుకున్నారు. ఇక్కడ చర్చ జరుగుతున్నది అమిత్ షాపై కాదని అన్నారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని రాహుల్‌కు సూచించారు. -
ఓ పొలిటికల్ డిజైన్ ఉంది.. ఆ నెలలో చెబుతా: జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ల మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ‘‘నేనేదైనా మాట్లాడాలనుకుంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కి రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే బయటికి వచ్చి మాట్లాడుతా. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని కాదు’’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మూడున్నరేళ్ల క్రితం మా పార్టీలో లోపాలు ఉంటే బయట మాట్లాడాను. కార్యకర్తల వ్యవహారం, పార్టీ అంశాలపై అంతర్గతంగా, బహిరంగంగాను చర్చించాను. ఈ మధ్య పీఏసీ మీటింగ్‌లో అంతర్గతంగా మాట్లాడే విషయాలు కూడా బయటికి వస్తున్నాయని సమావేశానికి పోవడమే మానేశాను. పీఏసీ మీటింగ్‌కి వెళ్లి ఉంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఏఐసీసీ ఇంచార్జ్, సీఎం దృష్టికి తీసుకెళ్లేవాణ్ని. మళ్ళీ నేను మాట్లాడిన అంశాలు బయటకి వచ్చేవి.. అందుకే పోలేదు. ఈ మూడున్నర ఏళ్లుగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలను ఎక్కడ బహిరంగంగా, అంతర్గతంగా చర్చించలేదు’’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.‘‘ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ 40 మంది కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిచారు. అందులో నాకు ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీతో 15 నిమిషాలు మాట్లాడాను. నేను సంగారెడ్డి రాంనగర్‌లోని రాంమందిర్ నుంచి విద్యార్థి నేతగా నా రాజకీయ ప్రయాణం మొదలై.. నేడు ఢిల్లీలో మీ నివాసానికి వచ్చి మీ ముందు కూర్చునే వరకు సాగిందని చెప్పాను. మీ ముందు ఒక రోజు ఇలా కూర్చొని మాట్లాడాలని అనుకున్నా.. ఇప్పుడు మాట్లాడుతున్నా నేను అనుకున్నది సాధించాను అని చెప్పాను..ఏ పార్టీ నుంచి ప్రధాన మంత్రి ఉన్నా అధికారంలో ఉన్నన్ని రోజులే గుర్తుపెట్టుకుంటారని చెప్పా. పదవులతో పని లేకుండా గుర్తు పెట్టుకునే వారిలో మీ కుటుంబమే ఉంటుందని చెప్పా. కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశ ప్రజలు చిరకాలం గుర్తి పెట్టుకుంటారని కూడా చెప్పాను. రాహుల్ గాంధీ నన్ను పక్కకి పిలిచి ఓ మాట చెబుతాను వింటావా అని అడిగారు. మీకు ఎవరిపై అయిన కోపం ఉంటే మీడియా ముందు మాట్లాడకండి. ఢిల్లీకి వచ్చి నాతో మాట్లాడండి అన్నారు. ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ళ మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదు..రాజకీయంగా నాకు మనసులో ఓ కోరిక ఉంది. నాకు ఓ పొలిటికల్ డిజైన్ ఉంది. అది నవంబర్‌లో చెబుతా. ఈ మూడు నెలల కాలంలో రాజకీయంగా నాకు ఓ క్లారిటీ వస్తుంది. నాకు ఫ్యామిలీ కంటే పబ్లిక్, పాలిటిక్సే ముఖ్యం. నేను 24 గంటల పాటు పబ్లిక్, పాలిటిక్స్ గురించే ఆలోచిస్తా’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
‘నా వ్యాఖ్యల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను’
సాక్షి,ఢిల్లీ: లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం లేదని తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, క్షమాపణలు చెప్పబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు. బుధవారం రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యకు కేంద్రహోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలి. పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులను చావబాదారు. పెల్లెట్ గన్ తగిలి ఓ యువకుడు కన్ను పోవాల్సిన పరిస్థితి వచ్చింది.మహిళలు, మైనర్లపై కూడా దాడులు చేశారు. పోలీసులకు అమిత్‌షా ఆదేశాలైనా ఇచ్చి ఉండాలి.. ఆయనకు తెలియకుండా జరిగుండాలి’అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీల నిరసనల సందర్భంలో, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల కాల్పులు, లాఠీఛార్జీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ఆదేశాలు ఇచ్చారనడానికి రాహుల్ గాంధీ దగ్గర ఏవైనా రాతపూర్వక ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని, లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సభకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, అలాంటప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. -
అమిత్‌షా ఆదేశాల ప్రకారమే దాడులు.. రాహుల్
సాక్షి, ఢిల్లీ: పేపర్ లీక్‌పై ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలియాలంటే బీజేపీ ఎంపీలు వారి పిల్లలను అడగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారని అన్ని పార్టీలు విద్యార్థులు ఆందోళనను గౌరవించాలన్నారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని అది భావప్రకటన స్వేచ్ఛని రాహుల్ గాంధీ కేంద్రాన్ని దుయ్యబట్టారు.విద్యావ్యవస్థ క్రూరంగా మారిపోయింది. విద్యను ప్రైవేటీకరించారు. విద్యను ఆరెస్సెస్మయం చేశారు. ఇది యూపీఏ పాలన.. మా మంత్రి రాజీనామా చేయరని మరో మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ధర్మేంద్ర ప్రదాన్‌ను విద్యాశాఖ మంత్రి అని మేం అనుకోలేదు. దేశంలో విద్యాశాఖను ఆరెస్సెస్నడిపిస్తోంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆరెస్సెస్ మనుషులే వీసీలుగా ఉన్నారు ఉన్నారు.భయాన్ని దాటుకుని విద్యార్థులు పోరాటం చేశారు. విద్యార్థులపై దాడికి హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులపై పెల్లెట్స్ దాడికి హోం మంత్రే కారణం. నీట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో హోం మంత్రి ఇప్పుడు ఇక్కడ ఎందుకు లేరు?. ఆయనకి ఇక్కడ కూర్చునే ధైర్యం లేదు. ఆయన భయంతో వణికిపోతున్నారు. పోలీసుల చర్యపై విద్యార్థులకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అని రాహుల్ డిమాండ్ చేశారు.రిజిజు అభ్యంతరంకాగా రాహుల్ ప్రసంగంపై దుమారం చెలరేగింది. ఆయన చేసిన ‘ఇడియట్స్’ వ్యాఖ్యలతో ఎన్డీయే ఎంపీలు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై అని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు అభ్యంతరం వ్యక్యం చేశారు. అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ సమయంలో స్పీకర్ ‘హుందాగా వ్యవహరించాలి’ అని సభ్యులను ఉద్దేశించి సూచించారు. రాహుల్‌వి తప్పుడు ఆరోపణలన్న కిరెన్ రిజిజు.. ఆధారాల్లేకుండా ఆయన ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ‘‘విద్యార్థుల పేరుతో అనుచిత వ్యాఖ్యలు సరికాదు. హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారని ఎలా అంటారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలి’’ మంత్రి డిమాండ్ చేశారు. -
నీచమైన వ్యక్తి ప్రల్హాద్ జోషీ
న్యూఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రల్హాద్ జోషీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. అత్యాచారానికి పాల్పడిన వారికి అండగా నిలిచే వ్యక్తి, నీచమైన వ్యక్తి అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని విద్యా శాఖ మంత్రిగా నియమించడం ఏమిటని ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ ధ్వజమెత్తారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి తన మంత్రివర్గంలోని ఎవరినైనా విద్యాశాఖ మంత్రిగా ఎంపిక చేసుకుని ఉండొచ్చు కానీ ‘అత్యాచారానికి పాల్పడిన వారిని రక్షించే’ వ్యక్తిని ఎంపిక చేసుకోవడం విచిత్రంగా ఉందని చెప్పారు. ‘‘ప్రల్హాద్ జోషీ అత్యంత నీచమైన వ్యక్తి. అత్యాచారానికి పాల్పడేవారికి రక్షణ అవసరమని చెప్పే వ్యక్తి కంటే నీచమైనవాడు మరొకరు ఉండరు. ఆయనే నేడు విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి తీరు సరైంది కాదు. మంత్రివర్గంలో చాలామంది ఉండగా, వారిని కాదని ప్రల్హాద్ జోషీని ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది’’ అని రాహుల్ పేర్కొన్నారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన వారితో ప్రల్హాద్ జోషీ కలిసి ఉన్న పాత వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. -
చివరి నిమిషంలో కేంద్రం ప్లాన్ బెడిసి కొట్టిందా?
నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం.. మరో ఆసక్తికర మలుపు తిరిగింది. రాజీనామా కంటే ముందే కేంద్రం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించకుండా.. ఆయన శాఖను మార్చే ప్రతిపాదనను కేంద్రం చేసిందట. ఇదే విషయాన్ని ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా ద్వారా ప్రకటించగా.. అది వాస్తవమేనన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం, సీజేపీ మధ్య జరిగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సమావేశమైన సమయంలో.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం. మిగతా రెండు డిమాండ్లను ఎలాంటి షరతుల్లేకుండా అంగీకరిస్తూ.. ఈ ఒక్క డిమాండ్ విషయంలోనే పంతం వీడాలని కోరినట్లు సమాచారం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు దాన్ని తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలుగులోకి వచ్చింది.ఒక మంత్రిని కొనసాగించాలా? లేదంటే శాఖ మార్చాలా? అన్నది ప్రధానమంత్రి పరిధిలోని నిర్ణయమని కేంద్ర ప్రతినిధులు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. కేవలం శాఖ మారిస్తే సరిపోదని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న సీజేపీనీట్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని సీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించాలంటే నాయకత్వ మార్పు అవసరమని వాదించింది. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించలేదని తెలుస్తోంది. ఇటు రాహుల్ కూడా.. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక. ఆయన రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అనైతికం. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆయన శాఖను మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. కానీ, ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. లేకుంటే ఆందోళనలను విరమించం అని రాహుల్ గాంధీ ఆ సమయంలో మీడియా ద్వారా వెల్లడించారు. అటు నిరసనకారులు.. ఇలా విపక్షాలు . రాజీనామాపైనే పట్టుబట్టడంతో చివరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.రాజీనామా తర్వాత రాజకీయ వేడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్‌లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీయే నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్లమెంట్‌కు వచ్చిన మాజీ మంత్రికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రతిపక్షాలు.. ఆయన రాకపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ప్రసంగం ఇచ్చారు. ఉద్యమం తర్వాత కొత్త దశధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ.. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశం మరో వివాదంగా మారింది. దీనిపై కేంద్రంతో చర్చలు జరిపిన సీజేపీ.. కేసుల ఉపసంహరణ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతోంది. మొత్తంగా నీట్ వివాదం కేవలం పరీక్షల నిర్వహణ అంశానికే పరిమితం కాకుండా.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల వరకు ప్రభావం చూపింది. -
విద్యార్థులపైకి తూటాలా.. మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్
ఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారని రాహుల్ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల మొత్తం వ్యవస్థ అత్యంత కఠినంగా, అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్.. ‘బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.छात्रों के ख़िलाफ़ पूरा का पूरा सिस्टम ही जानलेवा है।खबर आ रही है कि बिहार में प्रदर्शन कर रहे छात्रों पर AK-47 से गोलियाँ चलाई गई हैं और सैकड़ों छात्रों को गिरफ़्तार करके उनपर FIR की जा रही है।मोदी जी, कहाँ गया आपका वादा कि छात्रों पर कोई FIR नहीं की जाएगी और उन्हें रिहा कर… https://t.co/c7zdyyeLA0— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2026ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, బీహార్‌లో ఏకే-47లు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ.. ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ విద్యార్థులపైన కాదు అని డిమాండ్ చేశారు.అయితే, పోలీసుల చర్యలు చట్టపరమైన పరిస్థితుల నేపథ్యంలోనే జరిగాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీహార్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసులు అధికారి ఏకే-47 పట్టుకుని నిరసనకారులపైకి ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసింది. -
పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం.. రేపటికి వాయిదా
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.పార్లమెంట్ సమావేశాలు.. 6వ రోజు అప్డేట్స్రాజ్యసభ రేపటికి వాయిదారాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో మళ్లీ గంగదగోళంరేపటికి వాయిదా వేసిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్లోక్సభ రేపటికి వాయిదాలోక్సభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో గందరగోళం.. రేపటికి వాయిదాకాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని సభా కార్యక్రమాలుయాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరగని చర్చవాయిదాల పర్వంలోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా3 గంటల వరకు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన రాజ్యసభఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళనరాజ్యసభ మళ్లీ సాయంత్రం 5.15 గంటల వరకు వాయిదాఓం బిర్లా కీలక ప్రకటనలోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లువిపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టిన కేంద్రంచర్చ ముందుకు సాగకపోవడంతో వాయిదామధ్యాహ్నం 2గం. తిరిగి ప్రారంభం కానున్న లోక్సభలోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటనబిల్లుపై ఎంపీల సూచనలు కోరిన స్పీకర్.మధ్యాహ్నం 1 గంట వరకు సవరణలకు అవకాశం.చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ.పేపర్ లీక్‌కు భారీ శిక్షలుయాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్‌లో వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదన.జరిమానా రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం.విద్యార్థుల లాఠీఛార్జిపై రగడపోలీసుల చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరా డిమాండ్.నిరసనలను అణచివేయడం సరికాదని వ్యాఖ్య.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన కాంగ్రెస్.సమగ్ర కథనం: లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపేపర్ లీక్ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యంలోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుస్పందించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుబిల్లు ఆమోదమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటనవిద్యార్థుల భవిష్యత్ రక్షణే ప్రధాన ఉద్దేశమని వెల్లడి.పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.విపక్షాలు ఇతర అంశాలతో దృష్టి మళ్లించొద్దని సూచన.పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచడమే లక్ష్యమని వ్యాఖ్య.లోక్‌సభ సైతం వాయిదామధ్యాహ్నానికి లోక్‌సభ వాయిదావిపక్షాల నిరసనల నడుమే.. యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టిన కేంద్రంవిపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని చర్చలోక్‌సభ మధ్యాహ్నం 2గం. కు వాయిదారాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదావాయిదా తర్వాత కూడా మారని సీన్పెద్దల సభలో విపక్షాల నిరసన గళంప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాల డిమాండ్మధ్యాహ్నం 2గం. దాకా సభ వాయిదా వేసిన చైర్మన్వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలులోక్సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనవిపక్షాల నిరసనల నడుమే లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్నీట్ నిరసనలు.. కేంద్రంపై పప్పు యాదవ్ ఫైర్ నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వ చర్యలు తీవ్రంగా తప్పుబట్టిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.“మన పిల్లలు ఉగ్రవాదులా? మన కూతురు నేరస్తురాలా? హక్కుల కోసం గొంతెత్తడం తప్పా?” అని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు.బిహార్‌లో దాదాపు 800 మంది విద్యార్థులను జైలుకు పంపించారని ఆరోపించారు.విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరితో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు.ఖర్గే తీవ్ర వ్యాఖ్యలునీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఖర్గే కోరారు.రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.ఖర్గే డిమాండ్‌పై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. రూల్ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనల అంశం మాన్సూన్ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనప్రధాని మోదీపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారుప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే स्टूडेंट्स पर लाठीचार्ज और पैलेट गन के इस्तेमाल के विरोध में विपक्ष संसद परिसर में विरोध प्रदर्शन कर रहा है#Parliament pic.twitter.com/ihXExAzby2— Poonam Pandey (@pandeypoonam20) July 27, 2026 बिहार के सीवान में छात्र प्रदर्शन के दौरान AK-47 से फायरिंग करने वाले SIT जवान अभिषेक पटेल को सस्पेंड कर दिया गया है!सिवान में छात्र आंदोलन के दौरान पुलिस अधिकारी अभिषेक पटेल ने छात्रों की दिशा में AK-47 असॉल्ट राइफल से फायरिंग की थी! pic.twitter.com/ZjyQa8fGOK— Sadaf Afreen صدف (@s_afreen7) July 27, 2026జంతర్ మంతర్‌లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరంశాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలినిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.ఉభయ సభలు వాయిదా!ఆరో రోజు అదే తీరునీట్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలుప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ఉభయ సభలు మధ్యాహ్నం 12గం. దాకా వాయిదాప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలులోక్సభలో విపక్ష ఎంపీల ఆందోళనపబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచనలాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలుపార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలుపార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్‌కు హీరో వెల్ కమ్ చెప్పిన ఎన్డీయే ఎంపీలుకేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలునీట్ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ఊహించినట్లే.. కాంగ్రెస్ వాయిదా తీర్మానంపార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానంవిద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్‌తో దాడిపై చర్చకు నోటీసుజంతర్ మంతర్ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగంచలో సంసద్‌ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలుతీవ్రంగా ఖండించిన కాంగ్రెస్అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీవిద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేతపరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!నేడు లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చబిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశంబీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభంబీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంటీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలుజేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారుశివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగంఅప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారుఎల్జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశంఎన్సీపీ తరఫున సునీల్ తట్కరేతృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశంపరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యంబిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తిసభ.. సజావుగా సాగేనా?సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టిగతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలునీట్ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రంఅయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతించిన యువతఆందోళన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీనేడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశంయువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలుదాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.ఎన్డీయే వ్యూహం ఏంటి?పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.విపక్షాల వ్యూహం ఏమిటి?బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్ సమరంనీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.నీట్ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.10 గంటల పాటు చర్చబిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.36 రోజుల ఉద్యమం తర్వాత..నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగాయి.విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది. -
విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం.. కేంద్రానికి మరో పరీక్ష!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానుండగా, విద్యార్థి నిరసనలు, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితిలో లేదు.జూలై 20న జరిగిన సీజేపీ చలో సంసద్ నిరసన సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడులు చేశారన్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా లేవనెత్తుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారన్న ఆరోపణలపై అమిత్ షాకు లేఖ రాశారు. 19 ఏళ్ల విద్యార్థి సహిల్ లోచాబ్ ఒక కంటిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ, ఇలాంటి బలప్రయోగానికి అనుమతి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సాధారణ దుస్తుల్లో కనిపించిన వ్యక్తులు విద్యార్థులను లాఠీలతో కొట్టిన ఘటనపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.Another disturbing video from the CJP "Sansad Chalo" protest is circulating online.Protesters allege that, after lathi charges and tear gas, pellet guns were also used during the crackdown.#संसद_मार्च#cjp_पार्टी pic.twitter.com/6IrdPuAQss— Zo World (@ZoWorldd1) July 22, 2026మరోవైపు, రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఉపనేత సాగరికా ఘోష్ రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. విద్యార్థులపై జరిగిన దాడులపై సభలో తక్షణమే చర్చ జరపాలని ఆమె కోరారు. అయితే, నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)పై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం సీఆర్పీఎఫ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి నేరాలకు మరింత కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. సవరణ బిల్లు ప్రకారం, వ్యక్తులకు కనిష్ఠ జైలు శిక్షను మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు, గరిష్ఠ శిక్షను పది సంవత్సరాలకు పెంచనున్నారు. గరిష్ఠ జరిమానాను రూ.50 లక్షలకు పెంచడంతో పాటు, సేవలందించే సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా, నిర్వాహకులకు కఠిన శిక్షలు, వ్యవస్థీకృత ప్రశ్నాపత్రాల లీకేజీ నేరాలకు మరింత కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు చేర్చారు. అలాగే కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.ఇక కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఇథనాల్ మిశ్రమ ఇంధనం (E20) కారణంగా వాహనాలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ ఈ నెల 31న ఢిల్లీలో మరో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. -
పాశవిక దాడికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచ్చింది మీరేనా? అని హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనికి జవాబు చెప్పాలని దేశ ప్రజల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయని రాహుల్ చెప్పారు. విద్యార్థులపై పాశవికంగా జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం అమిత్ షాకు రాహుల్ ఒక లేఖ రాశారు. ‘‘జంతర్‌మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. విద్యార్థులు న్యాయమైన, పారదర్శకమైన విద్యా వ్యవస్థను కోరుతూ ఆందోళన నిర్వహించారు. వారి డిమాండ్లను వినాల్సిన ప్రభుత్వం, పోలీసులతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ వినియోగం వంటి తీవ్ర బలప్రయోగానికి పాల్పడింది. విద్యార్థినులతో కొందరు పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీసుల దమనకాండలో వందలాది మంది విద్యార్థులు గాయపడ్డారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పెల్లెట్స్ తగిలి గాయపడిన, ఒక కంట్లో చూపును కోల్పోయే ప్రమాదంలో పడిన టీనేజీ విద్యార్థి సాహిల్ లోచబ్‌ను కలిశా. ఒక జర్నలిస్టు సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడాలని మీరే అనుమతి ఇచ్చారా? ఇవ్వకపోతే ఎవరు ఆదేశించారు? సాధారణ దుస్తుల్లో లాఠీలతో విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తులు పోలీసులా లేదా వలంటీర్లా? వారికి అక్కడ విధులను అప్పగించింది ఎవరు?’’ అని అమిత్‌షాను రాహుల్ నిలదీశారు. ‘‘విద్యార్థులపై జరిగిన హింస ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. యువత దేశ భవిష్యత్తు. వారు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే’’ అని రాహుల్ ఆ లేఖ ద్వారా డిమాండ్‌చేశారు. -
పోలీసుల అణచివేతపై హోంమంత్రికి రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనపై పోలీసులు జరిపిన హింసాత్మక చర్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక లేఖ రాశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, కిరాతక దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జూలై 20న ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లుతో పాటు పెల్లెట్ గన్లను ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా 19 ఏళ్ల సాహిల్ లోచబ్ అనే విద్యార్థి పెల్లెట్ గాయాల కారణంగా తన కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విద్యార్థులపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.ఈ లేఖలో రాహుల్ హోంమంత్రి అమిత్ షాకు ప్రధానంగా రెండు ప్రశ్నలు సంధించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్ల వంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించడానికి అనుమతిచ్చింది ఎవరు? పోలీసులతో కలిసి సాధారణ దుస్తుల్లో వచ్చి విద్యార్థులను కొట్టిన వ్యక్తులు పోలీసులా లేదా వాలంటీర్లా? వారిని ఎవరి ఆదేశాల మేరకు రంగంలోకి దించారు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ -
ప్రభుత్వం మీ సొంత జాగీరు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని సొంత జాగీరులా నడపొద్దని బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి ఒక హెచ్చరిక అని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవినీతికి మారుపేరైన ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి నుంచి తప్పుకోవడం మంచి పరిణామం అని స్పష్టంచేశారు. విద్యార్థుల నిరసనను ప్రధాని మోదీ. ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గతానికి’, భారతదేశ భవిష్యత్తుకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తు గతాన్ని ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం ఆందోళన చేసిన విద్యార్థులను క్రూరంగా హింసించారని, వారికి ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన హింసకు, వారిపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడానికి అనుమతించినందుకు హోంశాఖ మంత్రి అమిత్ షానే ప్రత్యక్ష బాధ్యులు అని పేర్కొన్నారు. విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ అంగీకరించదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ప్రకటించారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారు భారతదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుని, చెదపురుగుల మాదిరిగా దానిని లోపలి నుంచే డొల్లగా చేస్తోందని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ చెదపురుగును తొలగించాలని తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను, దేశ భవిష్యత్తును కాపాడడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ భవిష్యత్తు అయిన మన విద్యార్థుల విజయమని అన్నారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారంటూ విద్యార్థులను ప్రశంసించారు. విద్యా విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారత విద్యా వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ పట్టు తొలగాలని చెప్పారు. విద్యా వ్యవస్థను సంస్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గానీ ప్రభుత్వం ఆ పని చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతదేశ విద్యా వ్యవస్థపై నేడు దాడులు జరుగుతున్నాయని, కొందరు కబ్జా చేస్తున్నారని, ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. నేటి యువత ఉద్యమం విద్యా వ్యవస్థలో అక్రమాలకు, నిరుద్యోగానికి, దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు వ్యతిరేకంగా వచ్చిన స్పందన అని వ్యాఖ్యానించారు. దేశంలో ఉద్యోగ కల్పన వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సంస్థాగత వ్యవస్థలు కనుమరుగైపోయాయని, అందుకే యువత రోడ్డెక్కుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికీ వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ముమ్మాటికీ ప్రజలకు చెందినదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేదని రాహుల్ అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల భద్రత, సంస్కరణల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, పేదలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన ప్రతి వర్గం కూడా తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధమైన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు జంతర్‌మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న వారిని రాహుల్ కలిశారు. విద్యార్థులపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. -
ఇది మేము ఇస్తున్న వార్నింగ్: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. శనివారం మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ... ఇది విద్యార్థుల విజయమని తెలిపారు. దేశ భవిష్యత్తును విద్యార్దులు నిర్ణయిస్తారని చెప్పారు.‘‘ఇది భారత విద్యార్థుల నుంచి, ప్రతిపక్షం నుంచి వస్తున్న వార్నింగ్. ఇప్పటి వరకు మీరు దేశాన్ని నడిపిన తీరులోనే ఇకపై నడపలేరు. ఇది మీ వ్యక్తిగత అంశం కాదు. ఇది మీ సొంత ఆస్తి కాదు. ఈ దేశం భారత ప్రజలది. భారత రాజ్యాంగానిది. ఈ సంస్థలన్నీ మీ సొంతం కాదు. ఇదే దారిలో మీరు ముందుకు సాగితే, ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు పెద్ద స్థాయిలో ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇదే మా ప్రధాన సందేశం.మన విద్యా వ్యవస్థ ఎంతో గొప్పది. భారత విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నాశనం చేసింది. విద్యార్ధులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. భారత విద్యార్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. విద్యార్థులపై దాడికి అమిత్ షా బాధ్యత వహించాలి. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపై కాల్పులను అనుమతించము. ప్రజలు ఏం అనుకుంటున్నారో ప్రభుత్వం వినాలి. ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక. పేపర్ లీకులపై తీసుకొచ్చే బిల్లులపై విపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. నా తరఫున మద్దతు ఎప్పుడూ ఉంటుంది. విద్యార్థులకు రక్షణగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దేశ భవిష్యత్తు కచ్చితంగా గతాన్ని ఓడిస్తుంది. విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి. విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించింది. విద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే. విద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. విద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. -
BJPని దించే సమయం ఇదే.. రెచ్చిపోయిన రాహుల్ గాంధీ
-
CJP విజయంపై రాహుల్-ప్రియాంక ఫస్ట్ రియాక్షన్..!
-
ఈ ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చింది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మన విద్యా వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే దిశగా చాలా పెద్ద అడుగని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం ఆయన ఎక్స్‌లో వీడియో రూపంలో మాట్లాడారు.‘‘దేశవ్యాప్తంగా పోరాడిన విద్యార్థులందరికీ అభినందనలు. మీ అందరిని చూస్తుంటే గర్వంగా ఉంది. వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, తమ భవిష్యత్తును కాపాడేందుకు ధైర్యంగా నిలిచిన ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు.ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి. విద్యార్థులను, భారత భవిష్యత్తును గౌరవిస్తూ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులు, కార్మికులు, పేదలు, ఈ ప్రభుత్వం అణచివేసిన ప్రతి ఒక్కరూ తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడటమే నిజమైన ధైర్యం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించే సమయం వచ్చింది. భయపడొద్దు’’ అని పేర్కొన్నారు. धर्मेंद्र प्रधान का इस्तीफा हमारे education system को फिर से संवारने की दिशा में बहुत बड़ा कदम है। शाबाश देश भर के छात्रों, आप सभी पर गर्व है।सड़कों पर आ कर लोकतंत्र, संविधान और अपने भविष्य की रक्षा में डट कर खड़े होने वाले हर एक युवा, हर छात्र को बहुत-बहुत बधाई।2 मांगें… pic.twitter.com/Uc2cEOCVKA— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 -
వీడియోలు కాదు, యాక్షన్ కావాలి : రాహుల్ గాంధీ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై దేశ రాజదాని నగరం న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ,విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విడుదల చేస్తున్న వీడియోలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీడియోలు కాదు, విద్యార్థులపై కోరుతున్న డిమాండ్లపై చర్యలు కావాలి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దాడికి గురైన విద్యార్థులకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.23 రోజులుగా నిరాహార దీక్ష చేసిన విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థ అవినీతికి ప్రతీక అని విమర్శించారు. ఆయనను వేరే శాఖకు మార్చడం కాకుండా, ప్రభుత్వం నుంచే పూర్తిగా తొలగించాలని (మంత్రివర్గం నుండి తీసేయాలని) విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.మోదీ రాత్రివేళల్లో చేసే వీడియో సందేశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులకు ప్రధాని హామీలు, వీడియోలు వద్దని, తక్షణ చర్యలే కావాలని స్పష్టం చేశారు.मोदी जी, करोड़ों छात्रों का भविष्य बर्बाद करने के बाद अब आधी रात की Reel से उनका वक़्त बर्बाद मत कीजिए।प्रधान बर्ख़ास्त। दोषियों पर कार्रवाई। छात्रों से माफ़ी।इससे कम कुछ भी मंज़ूर नहीं। pic.twitter.com/RWrLLDD0WC— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 అలాగే ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ ప్రయోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన ఒక విద్యార్థిని చూపిస్తూ... విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులే ఈ దేశపు భవిష్యత్తు అని మోదీ దేశానికి గతం అని గతం ఎన్నటికీ భవిష్యత్తును ఓడించలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా AISA ప్రతినిధి నేహా బోరా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో విద్యా వ్యవస్థపై చర్చలు జరిపినట్లు తెలిపారు. కాగా నీట్ 2026 పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి మోదీ గురువారం అర్ధరాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
నీట్ సెగ.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కీలక నిర్ణయం?
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం వరుస చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో మార్పులు, ఉన్నతాధికారుల బదిలీలు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. నిరసనలు మాత్రం తగ్గడం లేదు. కీలకమైన మూడు డిమాండ్లలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానేనని అటు విద్యార్థి సంఘాలు.. నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటేనే తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదని సమాచారం. ఇదే ప్రధాన ఎజెండాగా నిన్న కేబినెట్ భేటీలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వివాదం నేపథ్యంలో ఆయన్ని మరో శాఖకు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా శాఖ మార్పును పరిశీలిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ ఉదయం ప్రెస్మీట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. నీట్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించిన ఆయన.. మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు ఆయనను కేబినెట్ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పైగా ఈ వ్యవహారంపై తనకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు చేయడంతో లాభం లేదని.. మంత్రిని తొలగించి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.#WATCH | LoP, Lok Sabha, Rahul Gandhi says, "...Students have three demands, and these are not negotiable demands... The first demand is that the Education Minister, who is corrupt, incompetent, and misaligned, has to be sacked... There's some talk going on in Mr. Modi's cabinet… pic.twitter.com/hKoXOQ4SSz— ANI (@ANI) July 25, 2026మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ వివాదం నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఏలోని 47 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ వివాదం వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించింది.అయితే ఈ చర్యలు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం సరిపోదని, రాజకీయ బాధ్యత కూడా ఉండాలని సీజేపీ, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్‌పై మాత్రం విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు జరుగుతుందా? లేదంటే ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విద్యార్థులు రాజీనామా డిమాండ్‌పై పట్టుబడుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నీట్ వివాదం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
మెట్రో ఆపగలరు.. పేపర్ లీక్ ఆపలేరు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న నీట్ అభ్యర్థుల నిరసనలు, పేపర్ లీక్ ఉదంతాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మెట్రో స్టేషన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు విధించడంతో పాటు 18 మెట్రో స్టేషన్లను మూసివేసింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. ‘మెట్రో బంద్ చేయండి, ఇంటర్నెట్ బంద్ చేయండి, దుకాణాలు బంద్ చేయండి.. కానీ ప్రధాని మోదీ మాత్రం పేపర్ లీక్ మాత్రం అడ్డుకోలేకపోయారు’ అంటూ ఎద్దేవా చేశారు. मेट्रो बंद करो।रास्ते बंद करो।दुकानें बंद करो।Internet बंद करो।खाना बंद करो।अपना हक़ मांग रहे छात्रों के ख़िलाफ़ सरकार ने ये क्रूर कदम उठाए।बस एक चीज़ बंद नहीं कर पाए, मोदी जी - पेपर लीक।— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని రాహుల్ ఆరోపించారు. జాతీయ జెండాలు పట్టుకుని నిరసన తెలుపుతున్న యువకులపై పోలీసులు పెల్లెట్ గన్లు ప్రయోగించారని, లాఠీచార్జీ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ పతనానికి ఆయనే ప్రధాన కారణమని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం, వారిపై అణచివేత చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.ఇది కూడా చదవండి: యువతకు సమాధానం ఇవ్వాల్సిందే: మోహన్ భగవత్ -
పెల్లెట్ గన్లు గురిపెట్టారు
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 20వ తేదీన శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పెల్లెట్స్ ఉపయోగించారనడానికి ఈ విద్యార్థే నిదర్శనమంటూ సాహిల్ అనే యువకుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని పునరుద్ఘాటించారు. సాహిల్ త్రివర్ణ పతాకం చేతబూని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు అతడిపై పెల్లెట్ గన్‌తో దాడి జరిగిందని, తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. సాహిల్ కన్ను దెబ్బతి న్నదని, ఆ కంటితో అతనికి ఏమీ కనిపించడం లేదని తెలిపారు. సాహిల్ శరీరానికి తగి లిన గాయాలను సైతం రాహుల్ మీడియాకు చూపించారు. వేలాది మంది యువతకు ఇదే పరిస్థితి ఎదురైందని, వారిపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపి, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని ఆరోపించారు. నిరసనకారులు చేసిన నేరం ఏమిటని తీవ్రంగా ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక ‘క్రిమినల్ ఎడ్యుకేషన్ మినిస్టర్’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భారత విద్యా వ్యవస్థ పతనానికి ప్రతీకగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. -
మీకేంత ధైర్యం.. ఢిల్లీ యూనివర్సిటీకి రాహుల్ వార్నింగ్
-
విద్యార్థులకు యూనివర్శీటీల బెదిరింపు : రాహుల్ గాంధీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన విద్యార్థి లోకం, శాంతియుతంగా పోరాడుతోంది. అయిత్ తమ విద్యార్థులు జంతర్‌మంతర్ నిరసనలో పాల్గొనవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఢిల్లీ యూనివర్సిటీ (DU), JNU హెచ్చరికలు జారీ చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.How dare you threaten students for exercising their democratic rights?Please note, you are the ones that will be held accountable when the time comes. https://t.co/Mx6D19SP5h— Rahul Gandhi (@RahulGandhi) July 24, 2026 > సోషల్ మీడియాలో ఆయా విద్యాసంస్థల ట్వీట్స్‌పై స్పందించిన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యహక్కులను వినియోగించు కుంటున్న విద్యార్థులను బెదిరించడానికి ఎంత ధైర్యం? అంటూ ఘాటుగా స్పందించారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు.విద్యార్థులపై అప్రజాస్వామికంగా బెదిరింపులకు పాల్పడిన యూనివర్శిటీల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చట్ట విరుద్ధమని ఏ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని DU పూర్వ విద్యార్థి, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ప్రశ్నించారు. విద్యార్థులకు అబద్ధాలు చెప్తున్న DU తీరు సిగ్గుచేటని హుడా విమర్శించారు. మరోవైపు విద్యార్థుల గొంతు నొక్కితేనే వారి భవిష్యత్తుకు ఎక్కువ ప్రమాదం. వారి హక్కులకు మనం మద్దతుగా నిలవాలని నటిచదర్శకురాలు పూజా భట్ హితవు పలికారు.The students safety is more in jeopardy if their voices are suppressed. If we are truly invested in their future, we must support their right to speak out rather than maintain a conspiracy of silence. 🙏 https://t.co/SB9IcHiRvb— Pooja Bhatt (@PoojaB1972) July 23, 2026 ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనంకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు 'చట్టవిరుద్ధమైన కూడళ్ళు' (unlawful assemblies) అని, వాటిలో పాల్గొంటే విద్యార్థుల భవిష్యత్తు, అకడమిక్ అవకాశాలు దెబ్బతింటాయని DU, JNU యాజమాన్యాలు హెచ్చరించాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించాయి.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ -
ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ వ్యవహారంలో చర్చలపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రధానమైన మూడు డిమాండ్లను నెరవేర్చేవరకు చర్చలు జరిపే సమస్యే లేదని తేల్చి చెప్పారు. సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యపై సభలో తాను స్పందించాలనుకున్నప్పుడు తన మైక్ లాగేసుకున్నారని విమర్శించారు. అలాగే విద్యార్థుల డిమాండ్స్ ప్రకారం నీట్ పేపర్ లీక్‌కు బాధ్యుడు, అవినీతిపరుడైన విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, విద్యార్థులపై దాడి చేసి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన్‌ను తొలగించే వరకు చర్చలుండవంటూ ప్రతిపక్షం వైఖరిని స్పష్టం చేశారు. ఈ తీవ్ర వాదోపవాదాల మధ్య సోమవారానికి లోక్‌సభ వాయిదా పడింది.ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం #WATCH | Delhi: "...the students have three demands: 1) Corrupt Education Minister has to go, 2) Action against those who attacked students and beat them up, 3) PM should apologise to the students. These are the 3 conditions. We are not going to have any conversation, any… pic.twitter.com/3KrKv60CIL— ANI (@ANI) July 24, 2026 -
మోదీ వీడియో.. వాంగ్‌చుక్ దీక్ష విరమణపై సీజేపీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నీట్ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్‌చుక్ దీక్ష ముగింపుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. వాంగ్‌చుక్ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్‌చుక్ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్ పుల్‌స్టాప్ పెట్టారు. అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్‌కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. We are relieved and grateful that Sonam sir has ended his hunger strike after 26 days.Thank you, sir, for your extraordinary courage and sacrifice. By putting your own life on the line, you awakened the conscience of an entire nation. Your life is far too precious to this…— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్ వాంగ్‌చుక్ అనే డీపీని అభిజిత్ ఇంకా ఎక్స్ కొనసాగిస్తుండడం గమనార్హం.కేంద్రం ఇచ్చిన హామీలేంటి?వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.జూన్ 28 నుంచి నిరాహార దీక్షపరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి తరలించి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలుపరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్‌కుమార్‌ను నియమించింది.మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద సమస్య.. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026అలాగే సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్‌చుక్ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.అయితే.. మోదీ ట్వీట్‌పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్ చేశారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.Don’t insult their intelligence with this pathetic midnight video. 1. Sack Pradhan.2. Punish those who beat students.3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026మాకు రాజీనామానే కావాలిఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్ విషయంలో మాత్రం తలొగ్గే తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. -
మోదీ ట్వీట్‌కు రాహుల్, సీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి.ప్రధాని మోదీ స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ ఘాటు స్పందనప్రధాని ట్వీట్‌పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’’ అంటూ విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి రాజీనామా చేయాల్సిందే:సీజేపీమరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్‌పై స్పందించింది. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించింది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది. -
పోలీసు రాజ్యం నడవదు
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: ప్రజాస్వామ్య భారత్‌లో పోలీసు రాజ్యం నడవదని, విద్యార్థులు, యువకుల ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆత్మఘోషకు కారణమైన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతాన్ని ఈ దేశం మర్చిపోదని వ్యాఖ్యానించారు. నీట్ ఘటనపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ ఢిల్లీలోని ప్రధాని నివాసం ముందు శాంతియుత ఆందోళన చేస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ‘చలో లోక్ భవన్’కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రశ్నపత్రం లీక్ చేసి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేసిన మోదీ ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేకుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న రాహుల్‌గాం«దీతోపాటు ఇతర విపక్ష ఎంపీలను అరెస్టు చేయడం దారుణమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని, ఈ ఉదంతంపై పార్లమెంటు సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సంకెళ్లు వేసుకుని నిరసన.. ఆందోళనలో భాగంగా మహేశ్‌గౌడ్, మంత్రి పొంగులేటి, విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిణ్‌రెడ్డితోపాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు చేతులకు సంకెళ్లు వేసుకుని ఇందిరమ్మ విగ్రహం ముందు కూర్చుని నిరసన తెలియజేశారు. అనంతరం నెక్లెస్‌రోడ్డులోని ఇందిరమ్మ విగ్రహం వద్దకు భారీస్థాయిలో చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి లోక్‌భవన్ వైపునకు దూసుకెళ్లే యత్నం చేశారు. అయితే, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మహేశ్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, టీపీసీసీ నేతలను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు ఎంఏ ఫయీమ్, మెట్టు సాయికుమార్, నూతి శ్రీకాంత్, దీపక్‌జాన్, జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ నేతలు బండి రమేశ్, నీలం మధు, చనగాని దయాకర్, ఫహీం ఖురేషీ, పిడమర్తి రవితోపాటు పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం మంత్రులు, కాంగ్రెస్ నేతలను నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించగా, వారు స్టేషన్లోనే బైఠాయించి నల్ల కండువాలు ధరించి నిరసన తెలియజేశారు. సుమారు రెండు గంటల పాటు అక్కడే బైఠాయించారు. వీరిని పరామర్శించేందుకు పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు నాంపల్లి పీఎస్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం సొంతపూచీకత్తుపై నేతలను విడుదల చేశారు. -
విద్యార్థులు ఉగ్రవాదులు కాదు
న్యూఢిల్లీ: భారతదేశ విద్యా వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా చట్టబద్ధమైనవని, వాటిపై రాజీ పడటానికి ఆస్కారం లేదని తేల్చిచెప్పారు. విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీట్–యూజీలో అవకతవకలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. నిరసనకు దిగిన విద్యార్థులు ఉగ్రవాదులు కాదని.. వారు కేవలం నిష్పక్షపాతమైన విద్యా వ్యవస్థ కావాలని కోరుతున్నారని చెప్పారు. పరీక్షల్లో అక్రమాల వల్ల నష్టపోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. విద్యార్థులపై దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేయాలన్నారు. రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యా వ్యవస్థ రిగ్గింగ్‌కు గురైందని, అది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియోను రాహుల్ ప్రదర్శించారు. ప్రభుత్వం, పాలకులు భయాందోళనలో ఉన్నారని, అందుకే విద్యార్థులను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే.. విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చాలి..‘‘ప్రధానమంత్రి నివాసం వద్ద మంగళవారం శాంతియుత నిరసనలో పాల్గొన్న నన్ను బలవంతంగా ఈడ్చేశారు. భౌతిక దాడి చేశారు, నిర్బంధించారు. అవన్నీ నేను లెక్కచేయను. అవి చాలా చిన్న విషయాలు. ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేయడమే నా పని. ఇప్పుడున్న విద్యా వ్వవస్థ వల్ల పేదలు ఇబ్బంది పడుతుండగా, ధనవంతులు పేపర్ లీక్‌లతో పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారు. ఈ పరిస్థితి కచ్చితంగా మారాలి. విద్యార్థులు లేవనెత్తిన మూడు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్య పేరిట దోచుకుంటున్నారు మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. భద్రతా దళాలు వారిపై ఆయుధాలు గురిపెట్టడానికి, దాడి చేయడానికి విద్యార్థులు చేసిన తప్పేంటి? వారు ఈ దేశం తమకు ఇవ్వాల్సిన వాటిని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. న్యాయబద్ధమైన విద్యా వ్యవస్థ కావాలని అంటున్నారు. విద్యా వ్యవస్థలో లోపాల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతులేని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన మన విద్యా వ్యవస్థ నేడు లోపాలమయంగా మారిన సంగతి అందరికీ తెలుసు. గత దశాబ్ద కాలంలో 152 సార్లు ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. కానీ, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. విద్యా వ్యవస్థ వైఫల్యం కారణంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. సమాజంలో ఒక వర్గం వ్యక్తులు మన విద్యా వ్యవస్థను, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. మన దేశంలో కుటుంబాలు విద్య కోసం చేసే వార్షిక వ్యయం రూ.1.32 లక్షల కోట్లు. ఇది రూ.1.4 లక్షల కోట్ల విద్యా బడ్జెట్‌కు దాదాపు సమానం. విద్య పేరిట కుటుంబాలను దోచుకుంటున్నారు. దేశంలో తయారీ రంగం మూతపడింది, పరిశ్రమల్లో అవకాశాలు లేవు, కార్పొరేట్ ఉద్యోగాలు లేవు. ఇక మిగిలిన ఏకైక మార్గం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే. అవి కూడా దక్కకుండా విద్యావ్యవస్థను ధ్వంసం చేశారు’’ అని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.జితేంద్ర సింగ్ గురించి చర్చ అనవసరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తనపై చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. జితేంద్ర సింగ్‌ను ‘అప్రస్తుత వ్యక్తి’గా అభివరి్ణంచారు. నీట్–యూజీపై చర్చకు రాహుల్ తొలుత అంగీకరించి, తర్వాత మాట మార్చారని, ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారని జితేంద్ర సింగ్ మంగళవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ బుధవారం స్పందించారు. ‘‘జితేంద్ర సింగ్ తనకు నచ్చిన ఎలాంటి విషయాన్నైనా ఊహించుకోవచ్చు. అలా ఊహించుకోవడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దాని గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ఆరోపణల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన గురించి చర్చ నిరర్థకమని పేర్కొన్నారు. పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్ ప్రతి ప్రభుత్వంలోనూ నాయకత్వం మానసికంగా కుప్పకూలిపోయే సమయం వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. పోలీసులు నాతో ఎలా ప్రవర్తించారనేది నాకు అనవసరం. నేను పట్టించుకోను. నాతో ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించినా పట్టించుకోను. విద్యా వ్యవస్థపై, పత్రాల లీకేజీలను అరికట్టడంపై, పిల్లలకు చెల్లించాల్సిన ఖర్చులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నా విషయంలో నచ్చింది చేసుకోండి. ఐదు రెట్లు కాదు కదా పది రెట్లు దాడి చేసినా ఐ డోంట్ కేర్. పోలీసులు నాతో ప్రవర్తించిన తీరువల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. దెబ్బలు తినడం నాకు అలవాటే. అది సమస్యేమీ కాదు. ఇప్పుడంతా బాగానే ఉంది. ఒకటి రెండు దెబ్బలు తినడం పెద్ద విషయం కాదు. ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసులు నన్ను ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి తొలగించారు. అయితే, ఈ ప్రభుత్వాన్ని తొలగించమని నా చెవిలో చెప్పారు. ఆ భావన వారిలో ఉంది. జరిగిన దానిపై పోలీసులు కూడా సంతోషంగా లేరు. విద్యార్థులపై దాడి చేయడం దేశ భవిష్యత్తుకు వ్యతిరేకమైన నేరమని వివేకవంతులైన కొందరు పోలీసు సిబ్బంది భావిస్తున్నారు. నిరసనకారుల్లో తమ పిల్లలను చూసుకుంటున్నారు. -
ముక్కులో నుంచి రక్తం రావడంపై స్పందించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నివాసం దగ్గర జులై 21న సాయంత్రం ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీని తరలించే సమయంలో ఆయన ముక్కులో నుంచి రక్తం వచ్చింది.దీనిపై ఇవాళ రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘పర్వాలేదు. అలాంటి దెబ్బలు తినడం నాకు కొత్త కాదు. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా బాగానే ఉంది. నా బాధ్యత భారత ప్రజల సంకల్పాన్ని వ్యక్తం చేయడం. విద్యార్థుల సంకల్పమైనా, యువత ఆకాంక్షలైనా, రైతుల గళమైనా వాటిని వినిపించడమే ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత. భారత ప్రజల గొంతుకగా నిలవాలి. ప్రజలు ఎందుకు బాధపడుతున్నారో దేశం దృష్టికి తీసుకురావాలి. ఇవి చాలా చిన్న మూల్యాలు. పెద్ద త్యాగాలు కావు. ప్రజల ఆకాంక్షల కోసం వారి వెంటే నిలబడే అవకాశం రావడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అందుకే రెండు మూడు దెబ్బలు తగిలినా నాకు ఎలాంటి సమస్య లేదు. అవసరమైతే ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను’’ అని రాహుల్ చెప్పారు. -
నీట్ ఆందోళనలపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశాన్ని రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలకు సూచించారు. పేపర్ లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఇంటర్, పదో తరగతి పరీక్షలతో పాటు పంజాబ్‌లో గ్రూప్-డీ పరీక్ష, అలాగే కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.అలాంటి సందర్భాల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ప్రతిపక్షాలు, ఇప్పుడు నీట్ లీక్ అంశాన్ని మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నాయని జేపీ నడ్డా ప్రశ్నించారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు.నీట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎంతసేపైనా చర్చించేందుకు మేము సిద్ధం. సమస్యలకు పరిష్కారం పార్లమెంట్లో చర్చ ద్వారానే లభిస్తుంది. చర్చలకు పార్లమెంట్‌కు మించిన వేదిక మరొకటి లేదు’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. -
10 ఏళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్.. వారిలో ఒక్కరికీ శిక్షపడలేదు
-
కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ 3 డిమాండ్లు
న్యూఢిల్లీ: విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జ్ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజ్‌లు జరిగాయని తెలిపారు. అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏంటని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని చెప్పారు.3 డిమాండ్లు కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు పెట్టారు. ‘‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు. "అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారింది. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్‌లు జరిగాయని మనకు తెలుసు. లెక్క వేస్తే నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టే. దీని ప్రభావం 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడింది. వీరంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు. కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. చివరికి వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారు.ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కరికీ శిక్ష పడలేదు. అంటే కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం మన విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క శిక్ష కూడా పడలేదు. వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందన్న విషయం ఒక్కటే కాదు, అది సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారింది.ఈ గణాంకం ప్రతి యువకుడికి తెలుసు. కానీ భారత ప్రభుత్వం మాత్రం తెలుసుకోలేకపోతోంది. ఒక పరీక్ష రాసే కుటుంబాలు ఖర్చు చేస్తున్న మొత్తం, కేంద్ర ప్రభుత్వం విద్య కోసం కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్‌కు దాదాపు సమానం.ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన తర్వాత, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు చేసే నిధినే విద్యా బడ్జెట్ అంటారు. అది రూ. 1.4 లక్షల కోట్లు. అదే సమయంలో, ప్రతి ఏడాది నీట్ పరీక్ష రాసే కుటుంబాలు కలిపి రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.ఇది ఆ కుటుంబాల నుంచి జరుగుతున్న బహిరంగ దోపిడీ తప్ప మరొకటి కాదు. అంత డబ్బు ఖర్చు చేయించిన తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయిందని చెబుతున్నారు. అంటే మొత్తం వ్యవస్థ అక్రమాలతో నిండిపోయింది. యువత వీధుల్లోకి రావడానికి ఇదే రెండో కారణం. అది పూర్తిగా సరైన కారణం" అని అన్నారు. -
హైదరాబాద్‌లో కాంగ్రెస్ బీజేపీ, పోటాపోటీ ర్యాలీలు
హైదరాబాద్: ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు రాలీ చేపట్టారు. లోక్‌భవన్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నక్లెస్ రోడ్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతలో మోదీ నివాసం వద్ద రాహుల్ ధర్నాకు నిరసనగా బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ర్యాలీకి దిగారు. గాంధీభవన్ ముట్టడికి బీజేపీ నేతలు తరలివెళ్లారు. ఈ నేపధ్యంలో బీజేపీ నేత రామచంద్రరావుతో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు మహేష్ గౌడ్, పొంగులేటి, రాజనర్సింహలను పోలీసులు అరెస్ట్ చేశారు. గాందీభవన్ వద్ద కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. జెండా కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అరెస్ట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలక పక్షం తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. అధికారంలో ఉంటూ పాలకపక్షం ధర్నాలు, నిరసనలతో శాంతిభద్రతలకు ఉల్లంఘిస్తోంది. కాంగ్రెస్ తీరుపై జనం నవ్వుకుంటున్నారు. పాలకపక్షం పోకడలను ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. నీట్ పై పార్లమెంట్ లో చర్చకు సిద్ధమని, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లో చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. -
రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ ర్యాలీ
వికారాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొడంగల్‌లోని తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నినాళులు అర్పించారు.కరీంనగర్ జిల్లాలో..జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల నిరసన కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్ పై నిరసన ప్రకటించారు. ప్రధాన మంత్రీ నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లెక్సీ లు దగ్ధం చేశారు.నల్లగొండలో..నల్లగొండలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.సిద్దిపేట జిల్లాలో.. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఉద్యమాన్ని , సత్యాగ్రహాన్ని తలపించింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు తిరగబడకుండా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని గాంధేయ మార్గంలో నిరసన తెలిపారు. అనేక మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల లాఠీచార్జ్ పై కనీసం హోంమంత్రి సంఘీభావం తెలపలేదు. ఇప్పటికే ఛాత్రోంకి గుంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా విద్యార్థులతో రాహుల్ గాంధీ గారు విద్యా వ్యవస్థ పై మాట్లాడుతు విద్యార్థుల గొంతు వినిపిస్తున్నారని పొంగులేటి అన్నారు. కామారెడ్డి జిల్లాలో..రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి చౌరస్తాలో 161వహై వే పై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతా రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆలే మల్లికార్జున్, జుక్కల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా..రాహుల్ గాంధీ తో పాటు ప్రతిపక్షాల నేతల అక్రమ అరెస్టు నిరసిస్తూ, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని గాంధీ చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని కాంగ్రెస్ శ్రేణుల నిరసన తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నిర్మల్ జిల్లా బైంసా.. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ముధోల్ నియోజకవర్గం ఇంచార్జ్ నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ఆందోళన బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా రాహుల్ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు.బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ప్రతిపక్షాలు నిర్వహించిన నిరసనపై స్పందించిన గిరిరాజ్ సింగ్.. రాహుల్ గాంధీ తీరుపై మండిపడ్డారు. ఆయన చర్యలు అత్యంత ప్రమాదకరమైన ఉద్దేశాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యానించారు.‘‘రాజ్యాంగ పదవిలో ఉంటూ రాహుల్ గాంధీ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారు. ఆయన ప్రవర్తన చాలా ప్రమాదకరమైనది’’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇతర దేశాల్లో జరిగిన పరిణామాలను అనుసరిస్తూ భారత్‌లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్‌పై ఆరోపణలు చేశారు. ప్రధాని నివాసం సమీపంలో నిరసన చేపట్టడం బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించారు.VIDEO | Delhi: On Congress leaders’ protest at 7, LKM, Union Minister Giriraj Singh (@girirajsinghbjp) says, “By holding a constitutional office, he (Rahul Gandhi) has torn apart the dignity of the Constitution through his actions. His conduct reflects a very dangerous intention.… pic.twitter.com/j68qjxjiha— Press Trust of India (@PTI_News) July 22, 2026ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపైనా గిరిరాజ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీరు ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం లేదని, “అర్బన్ నక్సల్స్‌గా మారుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. నిరసనల పేరుతో దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.‘‘ప్రధాని నివాసం సమీపంలో ఆందోళన చేయడం చాలా బాధ్యతారాహిత్యం. అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగి ఉంటే.. లేదంటే ఎవరైనా ప్రమాదకర వస్తువులు విసిరి ఉంటే పరిస్థితులు తీవ్రంగా ఉండేవి’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని తాను భావిస్తున్నట్లు గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు.ఇదే సమయంలో సీజేపీ నిరసనలపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. ఆందోళనల పేరుతో విద్యార్థులను ముందుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని చెబుతున్నాయి. సీజేపీ ఆందోళనలు, రాహుల్ గాంధీ నిరసనల నేపథ్యంలో కేంద్రం–విపక్షాల మధ్య రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. -
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు సంబంధించి అప్డేట్స్.. -
నీట్ మంటలు.. కేంద్రానికి రాహుల్ గాంధీ ఐదు డిమాండ్ల అస్త్రం
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు. అనంతరం మంగళవారం రాత్రి వారిని విడుదల చేశారు.రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియానికి తరలించగా, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రియాంకను పరామర్శించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్బంధంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ వీడియో సందేశం విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లు ఉంచారు.కీలక డిమాండ్లు..👉కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, 👉విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 👉విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 👉అలాగే విద్యార్థులపై జరిగిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని, 👉నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో తక్షణమే చర్చ నిర్వహించాలని, 👉దేశ విద్యా వ్యవస్థతో పాటు పోటీ పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కోరారు.దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..‘భారత్‌లో విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతోంది? ప్రశ్నపత్రాలు ఎందుకు వరుసగా లీకవుతున్నాయి? విద్య ఎందుకు అంత ఖరీదుగా మారింది? పిల్లలను చదివించడానికి కుటుంబాలు ఎందుకు అప్పుల పాలవుతున్నాయి? ఇవి లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అడుగుతున్న సహజమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పు లేదు’ అని వ్యాఖ్యానించారు. బుధవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.भारत के छात्रों और प्रधानमंत्री को मेरा सीधा संदेश... pic.twitter.com/pgZZHLLz8h— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026మరోవైపు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలిపినా, కాంగ్రెస్ విద్యార్థుల సమస్యలకు పరిష్కారం వెతకడం కంటే రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ లబ్ధే రాహుల్ గాంధీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు. -
రాహుల్ కి ముక్కు నుంచి రక్తస్రావం
-
నేడు కాంగ్రెస్ చలో లోక్‌భవన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేడు చలో లోక్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నేతలు లోక్‌భవన్ వెళ్లనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి లోక్‌భవన్ వెళ్లనున్న కాంగ్రెస్ నేతలు.ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అలాగే, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. -
ప్రధాని నివాసం 'యుద్ధరంగం'
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల ధర్నాతో ఢిల్లీ లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాస ప్రాంతం అట్టుడికింది. న్యాయం చేయాలని కోరిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు మంగళవారం గొంతెత్తాయి. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్ సహా పలు పార్టీల ఎంపీలు, నేతలు హైసెక్యూరిటీ జోన్ అయిన ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాల హోరుతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అరుపులు, తోపులాటలతో యుద్ధ రంగాన్ని తలపించింది. దాదాపు 20 నిమిషాల తర్వాత కేంద్ర ప్రభుత్వ దూతగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి ధర్నా స్థలికి చేరుకున్నారు. నిరసన విరమించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఫోన్లో మాట్లాడారు. నీట్–యూజీపై పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. మోదీ రాజీనామా చేయాల్సిందేనని, లేకపోతే రాత్రంతా ఇక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. చేసేది లేక జితేంద్ర సింగ్ వెనుదిరిగారు. ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు తమ చేతులను తాళ్లతో కట్టేసుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగింది. చివరకు పోలీసులు ప్రతిపక్ష నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు..విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి జరిగినట్లేనని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎలాంటి సమాధానాలు చెప్పకుండా, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోకుండా తప్పించుకోగలనని ప్రధాని మోదీ భావిస్తున్నారని.. కానీ, ఈసారి అలా చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. మన విద్యార్థులకు న్యాయం జరగాలని విశ్వసించే దేశభక్తి గల ప్రతి భారతీయుడు ఈ ధర్నాలో తమతో చేరాలని రాహుల్ కోరారు. విద్యార్థుల గళాన్ని ఎవరూ విస్మరించలేరని చెప్పారు. ‘‘సోమవారం విద్యార్థులపై జరిగిన అరాచకాలకు సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం కోరేందుకు ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్లాం. జరిగిన దానికి బాధ్యత వహించడానికి గానీ, దీనిపై పార్లమెంట్లో చర్చ జరపడానికి గానీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థుల హక్కులు, వారి న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘విద్యార్థులపై లాఠీచార్జి, బలప్రయోగం చేసినందుకు ఈ పిరికిపంద, నియంతృత్వ ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు. మోదీ, అమిత్ షా మన యువత పట్ల తప్పు చేశారు. వారు పదవుల నుంచి తప్పుకోవాల్సిందే’’ అని మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం చేసి, వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే దాకా తమ పోరాటం ఆపబోమని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకూ వెనక్కి తగ్గబోమన్నారు. పోలీసులు తమపై బలప్రయోగం చేశారని కొందరు ఎంపీలు ఆరోపించారు. సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.అరెస్టు.. విడుదల ప్రధానమంత్రి నివాసం ఎదుట బైఠాయించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టుచేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించేందుకు ప్రయత్నించాయి. పోలీసులను తనను అరెస్టు చేసే సమయంలో రాహుల్ గాంధీ నేలపై పడుకొని కనిపించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆయనకు స్వల్ప గాయమైంది. రాహుల్‌కు, అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు నిర్బంధించి, ఛత్రసాల్ స్టేడియంకు తరలించారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుతం అమలవుతోంది’’ అని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు. చిత్రంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు రాహుల్ గాంధీ కంటి కింద గాయం కావడంతోపాటు చేతులు, కాళ్లపై కూడా స్వల్ప గాయాలయ్యాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాహుల్ ముక్కు నుంచి రక్తం కారినట్లు తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తున్న ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో షేర్చేశారు. ‘‘మోదీజీ, మీరు ఎంత ఒత్తిడి తెచ్చినా, మీ సర్వశక్తులు ఒడ్డినా సరే విద్యార్థుల న్యాయం జరగడం కోసం సాగుతున్న ఈ పోరాటం మాత్రం ఇప్పుడు ఆగదు’’ అని ఉద్ఘాటించారు. మంగళవారం రాత్రి రాహుల్, అఖిలేష్‌ను ఛత్రసాల్ స్టేడియం నుంచి పోలీసులు విడుదల చేశారు. ప్రియాంక గాంధీని మందిర్‌మార్గ్ స్టేషన్‌కు తరలించారు. ఆమె తల్లి సోనియా గాంధీ స్టేషన్‌కు చేరుకొని ప్రియాంకను పరామర్శించారు. తర్వాత ప్రియాంకను పోలీసులు విడుదల చేశారు.పార్టీ నేతలను అరెస్టు చేసి తరలించిన మందిర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సోనియాగాంధీ రాహుల్ గాంధీ మాట మార్చారు నీట్–యూజీకి సంబంధించిన అన్ని అంశాలపై, దానిపై జరుగుతున్న ఉద్యమంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై చర్చకు అంగీకరించిన రాహుల్ గాంధీ కొద్ది నిమిషాల్లోనే వెనక్కి తగ్గారని, ఆ స్థాయి నాయకుడికి ఇది తగదని పేర్కొన్నారు. పార్లమెంట్లో చర్చించడంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని పట్టబట్టారని చెప్పారు. నీట్–యూజీపై పార్లమెంట్లో నిబంధనల ప్రకారం అధికారిక చర్చ కోసం కాంగ్రెస్ ఇప్పటివరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. రాహుల్ గాంధీ వంటి సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత మాట తప్పడం దురదృష్టకరం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని జితేంద్ర సింగ్ ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చకు ఇకనైనా ముందుకు రావాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడినా వెనక్కి తగ్గని రాహుల్ గాంధీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసనకు దిగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్ కల్యాణ్ మార్గ్‌కు చేరుకుని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మాట్లాడారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాహుల్ గాంధీ పట్టుబడ్డారు.నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని రాహుల్ గాంధీ చెప్పారు. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ జరిపించాలని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని చెప్పారు. సమాధానం దాటవేసే ధోరణిలో మోదీ ఉన్నారు. విద్యార్థులపై దాడి.. దేశంపై దాడేనని చెప్పారు.స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని కాంగ్రెస్ చెప్పింది. రాహుల్ గాంధీ డిమాండ్లపై కేంద్ర మంత్రి అమిత్ షాతో జితేంద్ర సింగ్ చర్చించారు. ఆందోళనలో పాల్గొనాలని ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ పార్టీ 5 డిమాండ్లు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలినీట్ పేపర్‌పై హోంమంత్రి సమాధానం చెప్పాలినీట్ పేపర్ లీక్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలిఆదివారం (జులై 20) జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ జరిపించాలి छात्रों पर हमला हर भारतीय परिवार पर हमला है।प्रधानमंत्री मोदी को लगता है कि वो बिना जवाब दिए, बिना किसी नतीजे का सामना किए बच निकलेंगे - नहीं कर पाएंगे, इस बार तो बिल्कुल नहीं। मैं हर उस देशभक्त भारतीय से अपील करता हूं जो मानता है कि हमारे छात्रों को न्याय मिलना चाहिए -…— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026 -
మోదీ నివాసం వద్ద రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతల ధర్నా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా తదితర కాంగ్రెస్ నేతలు లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. చేతులు కట్టేసుకుని వారు నిరసన తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేతలను పోలీసులు కోరుతున్నారు. సీజేపీ ర్యాలీ వేళ భద్రతా బలగాలు విద్యార్థులపై ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టింది.లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ మాట్లాడుతూ.. "మమ్మల్ని అత్యంత దారుణంగా అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న ఢిల్లీ పోలీసులు మా విద్యార్థులపై దారుణంగా వ్యవహరించినందుకు నిరసన తెలిపేందుకు ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్నాం. ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కేంద్ర హోంమంత్రి కూడా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ప్రధానమంత్రి నోరు కూడా విప్పడం లేదు" అని అన్నారు.అదుపులోకి తీసుకున్న తర్వాత పంజాబ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ.. "ఇది బీజేపీ ఉగ్రవాదం. వారు విద్యార్థుల మాట వినడం లేదు..." అని ఆరోపించారు. -
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్‌గాంధీ
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నీట్ (NEET) పరీక్షలో జరిగిన అక్రమాలపై జవాబుదారీతనం కోరుతూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులకు పైగా జరుగుతున్న నిరసనలు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తరలింపుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రధాన విధానాలపై విమర్శలు గుప్పించారు.గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను నిరసన స్థలం నుండి బలవంతంగా తరలించి, ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది గంటలకే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసత్యం, హింసలే మోదీ ప్రభుత్వ ప్రధాన సూత్రాలు అంటూ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను బలవంతంగా తరలించడం తప్పు అంటూ శనివారం ట్వీట్ చేశారు.The core tenets of the Modi government are Asatya and Hinsa.The removal of Sonam Wangchuk ji from Jantar Mantar while he was on a non-violent hunger strike is wrong.Paper leaks, the rising cost of education, and student suicides are critical issues for India’s future. No…— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026 విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ వరుస ట్వీట్లలో స్పందించారు. ఎంతటి బలప్రయోగం చేసినా, ఈ సమస్యలను లేవనెత్తకుండా భారతదేశ విద్యార్థులను గానీ, వారిని ప్రేమించి విశ్వసించే మనల్ని గానీ ఎవరూ ఆపలేరన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో పేపర్ లీక్‌లు, పెరిగిపోతున్న విద్యా ఖర్చులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలపై గళమెత్తే భారతదేశ విద్యార్థులను లేదా వారికి మద్దతుగా నిలిచే వారిని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తద్వారా వాంగ్‌చుక్ నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతును చాటారు. रिया के पिता, राजेश जी बेटी को खोकर इस तरह टूटे कि उन्हें देखने वाले हर शख़्स की आँखें भर आईं।यह सिर्फ़ एक परिवार का दर्द नहीं। पेपर लीक ने ऐसे कई परिवारों से उनका बच्चा छीन लिया।हर नाम के पीछे एक माँ है, एक पिता है - जिनके लिए अब कोई कल नहीं।इस System को नए सिरे से बनाना… pic.twitter.com/wCGC5lleh1— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2026అలాగే తన కుమార్తెను కోల్పోయిన బాధలో రియా తండ్రి రాజేష్ ఎంతో కుంగిపోయారనీ, ఆయనను చూసిన ప్రతి ఒక్కరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయన్నారు. ఇది కేవలం ఒక కుటుంబం పడుతున్న వేదన మాత్రమే కాదు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటన ఇలాంటి అనేక కుటుంబాల నుండి వారి పిల్లలను దూరం చేసింది. ప్రతీబాధితుడి వెనుక ఒక తల్లి, ఒక తండ్రి ఉంటారు, కానీ వారికి ఇక రేపు అనే ఆశ లేకుండా పోయింది. ఈ వ్యవస్థను మొదటి నుండి పునర్నిర్మించాల్సి ఉంది. పిల్లలకు ఒత్తిడి కాకుండా భద్రత లభించాలి, అలాగే తల్లిదండ్రులకు కన్నీళ్లు కాకుండా, వారి త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కాలని రాహుల్ తెలిపారు. అంతకు ముందు గురువారం, కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్లకు బహిరంగంగా మద్దతు పలికింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూనే, దీక్షను విరమించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ వాంగ్చుక్ను కోరారు.కాగా జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను శనివారం ఉదయం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల సలహా మేరకు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనను ఆసుపత్రికి మార్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు తమ ఆందోళనను విరమించి, ఆ ప్రాంతాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. జూన్ 28 నుండి వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారు. గత మూడు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీక్ష ప్రారంభమైనప్పటి నుండి ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారని, బీపీ, బ్లడ్ షుగర్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు శుక్రవారం తెలిపారు.ఇదీ చదవండి: వాంగ్‌చుక్ దీక్ష భగ్నం : ఎట్టకేలకు స్పందించిన రాహుల్గాంధీమరోవైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన తర్వాత, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తాను నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వాంగ్ చుక్‌ను తరలించినప్పటికీ ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారింది -
విద్యాసంస్థలపై పార్టీలకు, సంస్థలకు పెత్తనం తగదు
డెహ్రాడూన్: దేశంలోని విద్యాసంస్థలపై ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా సంస్థకు పెత్తనం ఉండరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ ఘటనలపై రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రం డెహ్రాడూన్‌లో ఆయన కాంగ్రెస్ చేపట్టిన చాత్రోం కీ గుంజ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యావ్యవస్థలో అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పేపర్ లీకేజీలకు కారణమని, వీటి కారణంగా ఇప్పటి వరకు కనీసం 7.5 కోట్ల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్లు, పరీక్ష కేంద్రాలు, పేపర్ రూపకల్పన చేసేవారు, ట్రాన్స్‌లేటర్లు, రవాణాదారులు, విక్రేతలు ఇంకా, ఎన్టీఏ, అన్నిటికంటే పైన విద్యాశాఖ మంత్రి సహా మొత్తం వ్యవస్థ అంతా ఈ అక్రమాలకు కారణమయ్యారని ఆరోపించారు. వీరిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ‘మన విద్యాసంస్థలు స్వతంత్రంగా ఉండాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీ, లేదా సంస్థ మన విద్యాసంస్థలపై పెత్తనం చేయరాదు. ఎన్టీఏ చీఫ్, వర్సిటీల వైస్ చాన్స్లర్లుగా ఏదో ఒక సంస్థతో సంబంధాలున్న వారిని నియమించరాదు’అని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనలను అంతం చేయాలంటే రాజకీయ ఏకాభిప్రాయం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని రాహుల్ పేర్కొన్నారు. లాభాపేక్ష మాత్రమే కలిగి ఉండే ప్రైవేట్ సంస్థలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించరాదని తెలిపారు. పరీక్షల నిర్వహణ ప్రభుత్వ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ ఘటనలు బయటకు వచ్చిన వెంటనే బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదే సమయంలో, బాధితులైన విద్యార్థులకు పరిహారం చెల్లించడం, రక్షణ కల్పించడం, వెంటనే మళ్లీ పరీక్ష నిర్వహించడం వంటి తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. -
వాంగ్‌చుక్ దీక్షపై రాహుల్ మౌనం వెనుక..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దాదాపు మూడు వారాలుగా చేపట్టిన నిరాహార దీక్షకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ తన సొంత ప్రచార కార్యక్రమం ‘ఛాత్రోన్ కి గూంజ్’ (విద్యార్థుల గళం)పై దృష్టి సారించారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అవకతవకలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జూలై 17న డెహ్రాడూన్‌లోని బన్ను స్కూల్ మైదానంలో ఆయన బహిరంగ సభ నిర్వహించనున్నారు. मोदी जी.. थोड़ा सा घबरा गए क्या? pic.twitter.com/tWNHCkVlte— Congress (@INCIndia) July 15, 2026ఈ సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్‌ను ఎంచుకోగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వేదికను మార్చాల్సి వచ్చింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ‘మోదీజీ, మీరు కంగారు పడుతున్నారా? ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు. నిరుద్యోగం దేశంలోని అతిపెద్ద సమస్య అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు వాంగ్‌చుక్ దీక్షకు కాంగ్రెస్ దూరంగా ఉందనే విమర్శలను ఆ పార్టీ నేతలు తోసిపుచ్చారు. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం పోరాడుతున్నాయని, రాహుల్ గాంధీ గతంలోనే లడఖ్ ప్రజల గళాన్ని వినిపించారని వారు గుర్తు చేశారు. కాగా, సీజేపీ (సీజేపీ) తన నిరసనను జూలై 20న పార్లమెంటు సమావేశాల ప్రారంభం వరకు కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇది కూడా చదవండి: ఇరాన్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి -
కేంద్రం విద్యను వ్యాపారంగా మార్చింది
కంటోన్మెంట్: కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను వ్యాపారంగా మార్చిందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ‘చాత్రోంకి గూంజ్’పేరిట బుధవారం బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగ, విద్యా, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో కేంద్ర ప్రభుత్వం.. లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ సహా పలు జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలు దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఇన్ని ఆరోపణలు, ఆధారాలు వెలుగులోకి వచ్చినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఆయనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత బాధాకరమని అన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ‘చాత్రోంకి గూంజ్’కార్యక్రమాన్నిచేపట్టారని తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం కలిగిన వ్యవస్థను కేంద్రం అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ కన్వినర్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేశ్ విద్యార్థులు పాల్గొన్నారు.నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఈ దఫాలో 50కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తామని, ఆయా కార్పొరేషన్లకు డైరెక్టర్ పదవులను కూడా త్వరలోనే నింపుతామని ఆయన వెల్లడించారు. ఆయన బు«ధవారం గాం«దీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. నలుగురైదుగురు మినహా రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షుల పనితీరు బాగుందని చెప్పారు. మండల కమిటీల నియామకంలో డీసీసీల నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. డీసీసీలతో సమావేశాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. సీపీఐ తమ మిత్రపక్షంగా ఉందని, ఆ పార్టీతో మైత్రి కొనసాగుతుందని కూడా మహేశ్‌గౌడ్ వెల్లడించారు. -
రాహుల్, ప్రియాక ఎక్కడ? క్లిష్ట సమయంలో ఏమయ్యారు?
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పరీక్షల అక్రమాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’(సీజేపీ) చేపట్టిన నిరసనల్లోనూ, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలమైన కేరళలోని వయనాడ్‌లోనూ ఆయన కనిపించకపోవడంపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.వయనాడ్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వాద్రా బాధితులను పరామర్శించకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వయనాడ్ ప్రజలకు రాహుల్, ప్రియాంక పలు హామీ ఇచ్చారని, కానీ క్షేత్రస్థాయిలో ఎవరూ అందుబాటులో లేరని రాజ్యసభ ఎంపీ సుధాంశు త్రివేది ఆరోపించారు. మరోవైపు నీట్ వంటి పరీక్షల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ‘ఛాత్రోన్ కీ గూంజ్’ పేరుతో సొంతంగా ప్రచారం చేస్తోందే తప్ప, సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలోని నిరసనలో పాల్గొనకపోవడం గమనార్హం. జులై 17న డెహ్రాడూన్‌లో జరగనున్న విద్యార్థి సమావేశంలో రాహుల్ పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా, క్లిష్ట సమయంలో రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం రాజకీయంగా పెద్ద వివాదంగా మారింది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ భీకర దాడి: హమాస్ కీలక కమాండర్లు హతం! -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్‌కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
"నెట్ పరీక్షలో 90 ప్రశ్నలు మ్యాచ్"
సాక్షి,ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.యూజీసీ-నెట్ సోషియాలజీ పరీక్షకు ముందు 100 పేజీల PDF సర్క్యులేట్ అయిందని, అందులోని దాదాపు 90 ప్రశ్నలు అసలు పరీక్ష పేపర్‌తో మ్యాచ్ అయ్యాయన్నారు. నీట్ పరీక్ష పేపర్ ఉదంతం ముగిసి కొద్దిరోజులైన గడవక ముందే.. యూజీసీ నెట్ పేపర్‌కు సంబంధించిన ఆరోపణలు తీవ్ర ఆవేదన కలిగిస్తుందన్నారు. ఈ విషయమై ఎక్స్ ఖాతా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. గత వారం జరిగిన యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి వెలుగులోకి వచ్చిన తీవ్రమైన ఆరోపణలు అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని రాహుల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.."పరీక్షకు ముందు 100 పేజీల పీడీఎఫ్ విక్రయం జరిగింది. ఈ పీడీఎఫ్ ప్రశ్నపత్రం రూపకల్పనకు సంబంధించినది, ఇది కేవలం ఎన్‌టిఎ (NTA) వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుంది. - ఈ పీడీఎఫ్‌లోని దాదాపు 90 ప్రశ్నలు అసలు సోషియాలజీ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలుతున్నాయి". అని అన్నారు.ఆ పీడీఎఫ్‌ని బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో రూ. 2.25 లక్షలకు అమ్ముతున్నారని. ఇదే నెట్వర్క్, సీఎస్ఐఆర్-నెట్, హెచ్టిఇటి, ఏడిఎ (ADA) వంటి రాబోయే పరీక్షలకు సైతం ప్రశ్నపత్రాలను అందిస్తున్నట్లు సమచారం అందిందని తెలిపారు. నీట్, నెట్లో పదే పదే కుంభకోణాలు జరుగుతున్నప్పటికీ, మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.పేపర్ లీక్ వ్యవహారంలో ఒక పెద్ద మాఫియా పని చేస్తుందని, వారిపై దృష్టి పెట్టాల్సింది పోయి... విద్యార్థులను, సోషల్ మీడియాను నియంత్రించాలని చూడటం సరికాదన్నారు. ఈ పేపర్ లీకేజీలను ఒక పెద్ద ఉద్యమంగా మార్చాలని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల గొంతుక ద్వారానే విద్యావ్యవస్థలో మార్పు వస్తుందని ఆయన పిలుపునిచ్చారు. -
‘రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా 46 మంది కాంగ్రెస్ నేతలు.. అధిష్టానానికి లేఖలు’
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్‌రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హైకమాండ్‌కు లేఖలు రాశారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలపై స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి, ఆయన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్య గ్యాప్ బాగా పెరిగిందని ఆరోపించారు. ఇటీవల రేవంత్‌రెడ్డి చేసిన ‘హిట్లర్’ వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నెగెటివ్ అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే 46 మంది నాయకులు సీఎంకు వ్యతిరేకంగా ఉన్నారని, రేవంత్‌రెడ్డిని మార్చాలంటూ పలువురు మంత్రులు సైతం అధిష్టానాన్ని కోరినట్లు వెల్లడించారు.ప్రస్తుతం రేవంత్‌రెడ్డిని ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు మాత్రమే కాపాడుతున్నారని ఏలేటి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి కారణంగానే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల మధ్య కూడా విభేదాలు వచ్చాయని అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డిపై మీనాక్షి నటరాజన్ నివేదిక సమర్పించారని.. ఆ నివేదికను మనసులో పెట్టుకునే ఆమెకు ఎంపీ పదవి రాకుండా రేవంత్‌రెడ్డి అడ్డుకున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు -
పోన్లెండి సార్! ఏదో రకంగా పబ్లిసిటీ వస్తుందిగా!
పోన్లెండి సార్! ఏదో రకంగా పబ్లిసిటీ వస్తుందిగా! -
రాహుల్ గాంధీ ‘మిస్సింగ్’ పోస్టర్ల కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్‌లో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది.అర్ధరాత్రి పోస్టర్ల కలకలంఢిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్డుతో పాటు పలు ప్రధాన కూడళ్లలో రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన ‘మిస్సింగ్’ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే, ఈ పోస్టర్లను ఎవరు అంటించారనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంట్ సమావేశాలు, కీలక ఎన్నికలు, లేదా పార్టీ అంతర్గత ప్రాముఖ్యత కలిగిన సమయాల్లో రాహుల్ గాంధీ దేశంలో ఉండరంటూ శనివారం నుంచే బీజేపీ తన విమర్శల పదును పెంచిన మరుసటి రోజే ఈ పోస్టర్లు కలకలం రేపడం గమనార్హం.‘లీడర్ ఆఫ్ పర్యటన్’ఈ అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ ఎంపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్ష నేత పదవిని @లీడర్ ఆఫ్ పర్యటన్ (టూరిజం) అండ్ పార్టీయింగ్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లేదా దేశానికి, సొంత పార్టీకి ఆయన అవసరం ఉన్నప్పుడల్లా విదేశాలకు వెళ్లడం రాహుల్‌కు అలవాటుగా మారిందని, ప్రజల కంటే ఆయన టూరిజానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.మోదీ వర్సెస్ రాహుల్ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుతో రాహుల్ గాంధీని పూనావాలా పోల్చారు. పీఎం మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 9,000 రోజులకు పైగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజాసేవలో ఉన్నారని, కానీ రాహుల్ మాత్రం ఎప్పుడూ వెకేషన్ మూడ్‌లోనే ఉంటారని విమర్శించారు. రాహుల్ విదేశీ పర్యటనల ఖర్చుల వెనుక ఉన్న మూలాలను ప్రశ్నించిన ఆయన, దేశ వ్యతిరేక ఎజెండాను ప్రోత్సహించే శక్తులు దీని వెనుక ఉన్నాయంటూ ఆరోపించారు. కాగా, ఈ పోస్టర్లు, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
రాహుల్‌పై బీజేపీ ‘మీమ్స్’ వార్.. కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ మరో డిజిటల్ వార్ మొదలుపెట్టింది. రాహుల్ విదేశీ పర్యటనలపై మీమ్స్‌తో పోస్టులు పెడుతూ.. విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఆయన తరచూ చేసే విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి వస్తోందంటూ నిలదీసింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తూ.. రాహుల్ గాంధీ గ్లోబల్ లీడర్ అని.. అనేక దేశాలు, సంస్థలు ఆయనను ఆహ్వానిస్తుంటాయంటూ పేర్కొంది.ప్రముఖ సినిమా టైటిళ్ల ఆధారంగా రూపొందించిన 'ఛడ్ దే ఇండియా' (ఇండియాను వదిలేయ్), 'లాపతా రాహుల్' (కనిపించకుండా పోయిన రాహుల్) పోస్టర్లతో బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గో రాహుల్ గాన్, టూరిస్ట్ జిందా హై, పరదేశ్ వంటి మరికొన్ని పోస్టర్లు కూడా వైరల్‌గా మారాయి. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను కలవాలని అనుకుంటున్నారని స్పష్టం చేసింది. ఆయన చాలా తక్కువ సమయం మాత్రమే కేటాయించగలరు కాబట్టి, ఆయన పర్యటనలు చిన్నవిగా, తరచుగా ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు."రాహుల్ గాంధీ కేవలం మన దేశానికి మాత్రమే నాయకుడు కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయనను ఒక గొప్ప నాయకుడిగా భావిస్తారు. చాలా మంది ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వరుస ఆహ్వానాల కారణంగా ఆయన కేవలం రెండు రోజులు, నాలుగు, ఐదు రోజులు మాత్రమే సమయం కేటాయించి ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీతో ఏకీభవించరని గ్రహించాలి. ప్రజలు భారతదేశాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు, ఆ కోణంలోనే వారు రాహుల్ గాంధీని కూడా చూస్తారు" అని ఖుర్షీద్ పేర్కొన్నారు.విదేశీ పర్యటనలు చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన వెంటనే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్తే తప్పేంటి? విదేశాలకు వెళ్లవద్దన్నా ప్రధాని.. ఆ తర్వాత తనే స్వయంగా విదేశీ పర్యటనకు వెళ్తారు. రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడంటూ ఆయన సమర్థించారు. -
పరువు నష్టం కేసులో రాహుల్ ‘సారీ’
జబల్పూర్: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ చౌహాన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ కోరారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో రాహుల్ బుధవారం పిటిషన్ వేశారు. గురువారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రమోద్‌కుమార్ అగర్వాల్ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. 2018లో ఝబువాలో జరిగిన ర్యాలీలో పనామా పత్రాల లీక్ కుంభకోణంతో సంబంధముందంటూ రాహుల్ తన పేరును ప్రస్తావించారంటూ కార్తికేయ ఆరోపిస్తున్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ భోపాల్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు రాహుల్‌కు సమన్లు పంపింది. దీంతో, రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం కుమారుడి పేరుకు బదులుగా పొరపాటున కార్తికేయ పేరును ప్రస్తావించానని పిటిషన్లో తెలిపారు. పరువునష్టం కేసుతోపాటు సమన్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై, కార్తికేయ సానుకూలంగా స్పందించారు. రాహుల్ క్షమాపణను స్వీకరిస్తున్నానని, భోపాల్ కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని తెలిపారు. దీంతో, హైకోర్టు కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆయనకిలాంటివి అలవాటే: బీజేపీ తప్పుడు ఆరోపణలు పదేపదే చేయడం, న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తే తర్వాత క్షమాపణలు చెప్పడం వంటివి రాహుల్ గాం«దీకి అలవాటై పోయాయని బీజేపీ ఆరోపించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తూ ఆయన అబద్ధాల కోరుగా మారారని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కాదు..దు్రష్పచార నేత’అంటూ అభివర్ణించింది. -
రాహుల్‌పై మండిపడ్డ ధర్మేంద్ర ప్రధాన్
సాక్షి, ఢిల్లీ: నీట్ వ్యవహారంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఈ మెుత్తం ఎపిసోడ్లో ఆయన వ్యవహారించిన తీరు తనను తీవ్ర అసహానానికి గురిచేసిందన్నారు. ఇటీవల నీట్ పరీక్ష ముగిసిన నేపథ్యంలో ఈరోజు( మంగళవారం) ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖీలో ఆయన మాట్లాడుతూ "ప్రశ్నలు అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంది. కానీ పరీక్షకు మూడు రోజుల ముందు, విద్యార్థులను భయపెట్టడానికి, వారి సన్నద్ధతను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ కోటాలో ఒక కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థుల సన్నద్ధతను దెబ్బతీయడానికి, అరాచకాన్ని సృష్టించడానికి ఆయన ప్రయత్నించారు" అని అన్నారు.నీట్ పరీక్ష లీకేజ్‌తో విద్యార్థుల ఆత్మహత్యల పట్ల తీవ్ర కలత చెందాను. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రిగా, విద్యార్థి ఆత్మహత్య జరిగిన ప్రతిసారీ నన్ను నేనే తిట్టుకుంటాను. ఈ విచ్ఛిన్నమైన వ్యవస్థను మనం సరిదిద్దాలి. కానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ విద్యార్థుల ఆత్మహత్యలను వాడుకున్న తీరు నీచమైన రాజకీయాలని మండిపడ్డారు. ప్రస్తుత వ్యవస్థను ఎలా మెరుగుపరచాలనే దానిపై రాహుల్ గాంధీ , కాంగ్రెస్ నుంచి ఇదివరకూ ఒక్క సానుకూల సూచన కూడా తనకు అందలేదన్నారు.ఒక విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రాన్నివిద్యార్థి తండ్రి అభ్యర్థన మేరకే కేటాయించారని మంత్రి స్పష్టం చేశారు. "ఈ విషయం వెలుగులోకి రాగానే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని గంటల్లోనే స్పందించి, కేంద్రాన్ని నాగ్‌పూర్‌కు మార్చిందని తెలిపారు. ఈ ఘటనను సైతం రాహుల్ గాంధీ రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.కాగా నీట్-యూజీలో పేపర్ లీక్‌లు, పరీక్షా కేంద్రాల సమస్యలతో సహా జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్.. ప్రభుత్వంపై పదేపదే విమర్శలు గుప్పించాయి. గత వారం కోటాలో విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో గాంధీ మాట్లాడుతూ, పరీక్షా విధానం మోసపూరితంగా ఉందని, విద్యా వ్యవస్థలోని అవినీతి కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
‘ఎన్టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్ నిప్పులు!
న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET) నిర్వహణ తీరుపై మరోసారి తీవ్ర దుమారం రేగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చేసిన ఒక పొరపాటు ఒక విద్యార్థి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థికి రీ-ఎగ్జామ్ సెంటర్ ఏకంగా విదేశాల్లో (అబుదాబి) కేటాయించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై, ఎన్టీఏపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థి నెల రోజులుగా ఎంతో కష్టపడి నీట్ రీ-ఎగ్జామ్ కోసం సన్నద్ధమయ్యాడు. అయితే పరీక్షకు సరిగ్గా ఒక్కరోజు ముందు అతను తన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగా, అందులోని పరీక్షా కేంద్రం చూసి షాక్‌కు గురయ్యాడు. ఆ విద్యార్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ‘అబుదాబి’లో సెంటర్ కేటాయించారు. ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ ఎక్స్ ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎన్టీఏ పనితీరును తప్పుపట్టారు. అసలు ఇలాంటి ఘోరమైన తప్పు ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ‘విద్యార్థి ఉన్న నగరంలోనే ఒక పరీక్షా కేంద్రాన్ని సరిగ్గా కేటాయించలేని విద్యా వ్యవస్థకు, ఇలాంటి అత్యున్నత స్థాయి పరీక్షలను నిర్వహించే హక్కు ఎక్కడిది?’ అని ప్రశ్నించారు.విద్యార్థుల, వారి తల్లిదండ్రుల సహనాన్ని ఎన్టీఏ పరీక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల తాను కోటాలో విద్యార్థులను కలిసి వారి బాధలను పంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థ యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని విమర్శిస్తూ.. ‘ఇది నిజమైన విద్యా వ్యవస్థ కాదు, ఇది ఒక తరానికి చెందిన డబ్బును, సమయాన్ని, మానసిక ప్రశాంతతను నిలువునా దోపిడీ చేసిందన్నారు. పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడటం ఇకనైనా ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలోని విద్యార్థులకు బాధ్యతాయుతమైన, సమాధానం చెప్పే విద్యా వ్యవస్థ, పరీక్షా యంత్రాంగం అవసరమని ఇందుకోసం తాము పోరాడి తీరుతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్! -
ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?
సాక్షి, చెన్నై: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరూ ఉండరంటారు.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అదే విషయం మరోసారి రుజువయ్యేలా కనిపిస్తుంది. ఇటీవలే ఇండియా కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేకు... రాహుల్ గాంధీ మరోసారి కలిసి పనిచేసేలా రాయబారం పంపినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే ...?ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా అధికార ఎన్టీఏ కూటమిని మరింత బలీయంగా మార్చగా అదే సమయంలో ఇండియా కూటమిని బలహీన పరిచాయి. కూటమిలో ప్రధానంగా ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం.. అదే విధంగా టీవీకేకు మద్ధతిచ్చి మిత్ర ధర్మాన్ని పాటించలేదని ఆగ్రహం చెంది.. ఇండియా కూటమి నుంచి వైదొలిగింది. ఈ పరిస్థితులు నడుమ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా డీఎంకే అధినేత స్టాలిన్ "గౌరవనీయ ప్రతిపక్ష నాయకులు తిరు రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." అని సాధారణంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనికి బదులిచ్చిన రాహుల్ గాంధీ "భారతదేశ భావనను, మన రాజ్యాంగాన్ని, సమాఖ్యవాదాన్ని పరిరక్షించాలనే మన ఉమ్మడి సంకల్పం మనకు మార్గదర్శకంగా కొనసాగుతుంది - ఇది మన ప్రజాస్వామ్య ఆత్మ కోసం చేసే పోరాటం, మనం గెలిచే వరకు దీన్ని కలిసికట్టుగా పోరాడతాం." అని ప్రత్యత్తరమిచ్చారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారాయి. ఇండియా కూటమిలోకి మళ్లీ రావాలని రాహుల్ స్టాలిన్‌కు రాయభారం పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా గతేడాది రాహుల్ గాంధీకి స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ "రక్త సంబంధంతో కాదు, ఆలోచన, దార్శనికత, లక్ష్య సాధన ద్వారా బంధించబడిన నా ఆదర్శ సోదరుడు మీరు ఇలాగే దృఢంగా నిలబడి, ధైర్యంతో నాయకత్వం వహించాలి. ఉజ్వల భారతదేశం వైపు మన పయనించే ఈ ప్రయాణంలో విజయం మనదే అవుతుంది." అని రాహుల్ ని ప్రశంసిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది మాత్రం నామమాత్రంగా విషెస్ చెప్పారు. -
రీ-నీట్ రగడలో మరో రాజకీయ తుపాన్.. రాహుల్ పోరాట పిలుపు
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధించడంపై ఆయన అభ్యంతరాలు తెలిపారు. ‘టెలిగ్రామ్ బ్యాన్’ అనేది ప్రశ్నపత్రాల లీకేజీలను ఆపేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వ కొత్త ఎత్తుగడ. అంటే, దొంగను పట్టుకోవడానికి బదులు, బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడం. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా టెలిగ్రామ్‌లో చదువుతున్నారు. నోట్స్, పరీక్షల సిరీస్‌లు, చర్చలు, సన్నద్ధత టెలిగ్రామ్ ద్వారానే జరుగుతోంది. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎలా పరిష్కారం అవుతుంది?ఇది పూర్తి భద్రత ఇచ్చే మార్గం కాదు. దేశంలోని ప్రతి విద్యార్థికీ ఇది తెలుసు, ప్రశ్నపత్రాల లీకేజీ మాఫియాకూ తెలుసు. మరి తర్వాతి నిషేధం ఎవరిపై ఉంటుంది? వాట్సాప్పైనా? పరీక్ష రోజు విద్యార్థులను తనిఖీ చేస్తారు. జేబులను కత్తెరలతో కత్తిరిస్తారు. ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపిస్తారు. హడావుడికి మాత్రం కొదవ ఉండదు. కానీ సమస్య మూలాలపై ఒక్క చర్య కూడా ఉండదు. ఎందుకంటే ప్రశ్నపత్రాల లీకేజీ మాఫియా ఇదే ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతోంది. యువతను రక్తకన్నీరు పెట్టిస్తోంది. మోదీజీ ఈ హడావుడి ఆపండి. విద్యార్థులపై కాదు, మాఫియాపై దెబ్బ కొట్టండి. ‘విద్యార్థుల ప్రతిధ్వని’ వినండి. లేకపోతే దేశ యువతకు తమ హక్కులు ఎలా సాధించుకోవాలో తెలుసు’’ అని తెలిపారు.పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం..నీట్ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఉమేశ్, రియా గురించి రాహుల్ గాంధీ మరో ట్వీట్లో స్పందించారు. ‘‘నేను కోటాకు బయలుదేరాను. కానీ, నా మనసులో రెండు పేర్లు మార్మోగుతున్నాయి.. ఉమేశ్, రియా. నిన్న, సీకర్‌లో ఉమేశ్, డెహ్రాడూన్‌లో రియా.. ఇద్దరూ రీ-నీట్ ఒత్తిడిని తట్టుకోలేక తమ జీవితాలను ముగించుకున్నారు. 22, 23 ఏళ్ల వాళ్లే.. కలల ఆకాశంలో ఎగరాల్సిన వారు.. ఈ అన్యాయ వ్యవస్థ ముందు ఓడిపోయారు.ఈ మరణాలు అవినీతితో నిండిన వ్యవస్థ ఫలితం. దీనికి బాధ్యులు మోదీ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులను కాపాడాల్సిన చోట, ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, యువత భవిష్యత్తుతో వ్యాపారం చేసే వారికి పదేపదే అండగా నిలిచారని ఆరోపణలు ఉన్నాయి.ఈ రోజు కోటా నుంచి మేము ఒక పోరాటాన్ని ప్రారంభించబోతున్నాం. ఒక్కటే లక్ష్యం.. ఏ చిన్నారి కలలు ఇలా ఛిన్నాభిన్నం కాకూడదు, ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డను ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ప్రతి కుటుంబం అనుభవిస్తున్న ఈ వేదన ఇప్పుడు ‘విద్యార్థుల ప్రతిధ్వని’గా మారి దేశమంతా మార్మోగుతుంది’’ అని తెలిపారు. कोटा के लिए निकल चुका हूँ पर दिल में दो नाम गूंज रहे हैं: उमेश और रिया।कल, सीकर में उमेश और देहरादून में रिया - दोनों ने Re-NEET के दबाव में अपनी ज़िंदगी ख़त्म कर ली।22 और 23 साल के बच्चे - जिन्हें सपनों के खुले आसमान में उड़ना था वो इस अन्यायी व्यवस्था से हार गए।ये मौतें…— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2026 -
కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. 12 రోజుల్లో 4 సమావేశాలు..
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్ర నేతల మధ్య పెరుగుతున్న అసమ్మతి, నాయకత్వ పోరు, వర్గపోరును చల్లార్చేందుకు పార్టీ అధిష్ఠానం గత 12 రోజుల్లో నాలుగు కీలక సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల ముందు పార్టీ ఐక్యత దెబ్బతింటే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే ఆందోళన కాంగ్రెస్‌లో కనిపిస్తోంది.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన ఆధిపత్యాన్ని కొనసాగించగా, కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. ఇదే సమయంలో పంజాబ్‌లో ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సమీకరణాలను మరింత వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పంజాబ్‌కు చెందిన సీనియర్ నేతలు వరుసగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర యూనిట్లో ఉన్న విభేదాలను వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల నాటికి పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాలని నేతలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం.పంజాబ్ కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహాల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు నేతలు రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఎన్నికల వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నికల నాటికి మరింత తీవ్రమైతే ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తోంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే ముందుగా పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్ఠానం అభిప్రాయపడుతోంది. అందుకే వరుస సమావేశాల ద్వారా నేతల మధ్య సమన్వయం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, పార్టీ అంతర్గత విభేదాలు కొనసాగితే ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లేలా కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. హైకమాండ్ జోక్యంతో విభేదాలు సద్దుమణుగుతాయా? లేక ఎన్నికల సమయానికి మరోసారి బహిరంగంగా బయటపడతాయా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఇండియా కూటమిలోకి ఓవైసీ ? యూపీలో కొత్త ట్విస్ట్
-
మాట జారిన రాహుల్.. ఇండియా కూటమిలో దుమారం
తిరువనంతపురం: ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై విజయన్‌తో పాటు సీపీఎం అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇండియా కూటమిలో ఐక్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే..ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మిత్రపక్షాల మధ్య సంబంధాలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ రాజకీయాలను ప్రస్తావిస్తూ..‘కేరళలో మేము సీపీఎంతో రాజకీయంగా పోరాడుతున్నాం. అక్కడ పినరాయి విజయన్ మా ప్రధాన ప్రత్యర్థి. అందుకే నేను వెళ్లి ఆయనను హగ్ చేసుకోలేను, చేయను కూడా’ అని కామెంట్స్. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.పినరాయి ఘాటు స్పందన..రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన పినరాయి విజయన్.. తనకు హగ్ చేయడం లేదా చేయకపోవడం అసలు సమస్య కాదన్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశమే ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు.‘నన్ను హగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హగ్ చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఇప్పుడు నన్ను హగ్ చేయలేనని చెప్పడం ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం, అదే సమయంలో మిత్రపక్షాలపై దాడి చేయడం సరైన రాజకీయ విధానం కాదని విమర్శించారు.సీపీఎం నుంచి తీవ్ర ప్రతిస్పందన..రాహుల్ వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేజీ కూడా తీవ్రంగా స్పందించారు. ‘పినరాయి విజయన్ను హగ్ చేయమని ఎవరూ రాహుల్ గాంధీని అడగలేదు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణలను బలపరిచేలా మాట్లాడటం మాత్రం మానుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులు బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయని అన్నారు.Mr Rahul Gandhi said in INDIA alliance meeting that he cannot hug his alliance partner CPM’s ex-CM Mr Pinarayi Vijayan because he has an ongoing political fight with him. pic.twitter.com/8G9OE0npcm— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) June 14, 2026కేరళలో కాంగ్రెస్-సీపీఎం ప్రత్యర్థులేఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఎం జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం రెండు పార్టీలు దశాబ్దాలుగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కేరళలో ఎల్డీఎఫ్కు సీపీఎం నాయకత్వం వహిస్తుండగా, యూడీఎఫ్‌కు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. ప్రతి ఎన్నికలోనూ ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ జరుగుతుంది. అందువల్ల జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకోవడం కొనసాగుతోంది.కూటమికి కొత్త తలనొప్పి..ఇప్పటికే ఇండియా కూటమిలోని పలు మిత్రపక్షాల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ మధ్య, పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్య, కేరళలో కాంగ్రెస్-సీపీఎం మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూటమి ఐక్యతపై కొత్త సందేహాలకు తావిచ్చాయి. 2029 లోక్‌సభ ఎన్నికల దిశగా ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో మిత్రపక్షాల మధ్య బహిరంగ విమర్శలు కూటమికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి నాయకుల మధ్య పరస్పర విమర్శలు అధికార బీజేపీఒకి రాజకీయ అస్త్రంగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు వేదికలపై ఐక్యంగా ఉన్నామని చెబుతూనే, మరోవైపు పరస్పరం విమర్శించుకోవడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా రాహుల్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం కాంగ్రెస్-సీపీఎం మధ్య మాటల యుద్ధానికి దారితీయగా, ఇండియా కూటమి భవిష్యత్తుపై కూడా కొత్త చర్చకు తెరలేపింది. -
ఓటు చోరీ.. ఇప్పుడు సీటు చోరీ: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారని చెప్పారు. ఆయన పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే మిగులుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ ఖూనీ చేస్తోందని చెప్పారు.అలాగే, కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయంపై రాహుల్ స్పందిస్తూ.. ‘‘ఓటు చోరీ, సర్కార్ చోరీ తర్వాత బీజేపీ-ఈసీ జుగల్బందీ, సీటు చోరీతో పోటీ మొదలుకాకముందే ముగించేసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి.కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ప్రతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ కేసులు లేవు. బీజేపీ చేసిన చిన్న అభ్యంతరం ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్‌ను రద్దు చేసింది. బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ దరఖాస్తు పత్రంలో తన పేరునే తప్పుగా రాశారు. తప్పనిసరిగా వెల్లడించాల్సిన ఎన్నో వివరాలు ఇవ్వలేదు. వాటన్నింటినీ సరిచేసుకునేందుకు ఈసీ ఆయనకు గడువు పొడిగించింది.ఒకరిని కనీసం విచారణ కూడా లేకుండానే అనర్హురాలిగా ప్రకటించారు. మరొకరికి మాత్రం నిబంధనలు పాటించకపోయినా ప్రోత్సాహం లభించింది. కాంగ్రెస్ నేతలు కలుస్తామని చెప్పినప్పుడు ఈసీ మొదట మమ్మల్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరకు సమావేశం జరిగినప్పుడు, వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీకి ఎన్నికల్లో గెలవడం కంటే, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవడం చాలా సులభం’’ అని అన్నారు. After Vote Chori and Sarkar Chori - the BJP-EC jugalbandi has finished the contest before it has even begun with Seat Chori.Look at what happened in the recent Rajya Sabha elections.Congress candidate Meenakshi Natarajan ji submitted every document. No pending cases. The EC…— Rahul Gandhi (@RahulGandhi) June 11, 2026 -
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ
మమత-సోనియా ఆలింగనం.. రాహుల్-అభిషేక్ చర్చలు.. ఏదైనా సంచలన ప్రకటన వెలువడబోతోందేమోనని.. గత రెండు రోజులుగా దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు(చీలిక, తిరుగుబాటు.. వగైరా) చోటుచేసుకుంటున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందన్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది.గతంలో..(ఎన్నికల టైంలో) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష పోరాటానికి నాయకత్వం వహించాలని ఆమె అన్నారు. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో మమత భేటీ కావడం, ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది.ఈ భేటీ జరిగిన మరుసటి రోజే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. దీంతో టీఎంసీ భవిష్యత్, కాంగ్రెస్‌తో సంబంధాలు, విలీనం అవకాశాలపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.ఇదే సమయంలో టీఎంసీలో అసంతృప్తి నేతల వర్గం పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ సభ్యుల్లో కనీసం 19 మంది మద్దతు తమకు ఉందని, తామే అసలైన పార్లమెంటరీ విభాగమని ప్రకటించబోతున్నారన్న వార్తలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వరుసగా రాజీనామాలు జరగడం కూడా మమతపై ఒత్తిడిని పెంచింది.ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మరో షాక్‌గా మారింది. అంతకుముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీని వీడారు. సుష్మితా దేవ్ ఢిల్లీలో హిమంత బిశ్వ శర్మను కలవడం ఆమె బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలకు దారితీసింది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వకుండా, సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే చెప్పారు.ఇక ఈ పరిణామాల వేళ.. ఢిల్లీలో టీఎంసీ నేతల కదలికల నేపథ్యంలో ‘విలీనం’ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా శివసేన(ఉద్దవ్ వర్గం) కీలక నేత సంజయ్ రౌత్.. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన టీఎంసీ, ఎన్సీపీ (ఎస్పీ) వంటి పార్టీలు తిరిగి కాంగ్రెస్‌లో కలవాలని వ్యాఖ్యానించడం చర్చకు మరింత ఊతమిచ్చింది.అయితే ఈ ప్రచారానికి టీఎంసీ పుల్‌స్టాప్ పెట్టింది. కాంగ్రెస్‌తో విలీనం గురించి ఎలాంటి ప్రతిపాదన లేదని, అలాంటి అంశం ఏ సమావేశంలోనూ చర్చకు రాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అసలీ పుకార్లు ఎలా పుట్టాయో తమకు అర్థం కావడం లేదని అంటోంది. ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. మమత-సోనియా, రాహుల్-అభిషేక్ భేటీల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష వ్యూహాలు, ఇండియా కూటమి బలోపేతం, 2029 లోక్‌సభ ఎన్నికల సన్నాహకాల గురించే చర్చ జరిగిందని పేర్కొన్నాయి.రెండు రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన విలీనం ప్రచారానికి చివరకు టీఎంసీ స్పందిస్తూ.. "అది పూర్తిగా పుకారు మాత్రమే.. విలీనం అంశంపై అసలు ఎలాంటి చర్చా జరగలేదు" అని తేల్చిచెప్పింది. -
కాంగ్రెస్‌కు చెక్.. వ్యూహం మార్చిన స్టాలిన్!
సాక్షి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుత విపక్షాల ఇండియా కూటమి స్థానంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మేరకు సరికొత్త వ్యూహానికి అమలు చేసే దిశగా పార్టీ కీలక నేతలైన సీనియర్ ఎంపీలను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.ఈ జాతీయ కూటమి ఏర్పాటుకు సంబంధించి చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్లుగా ఉన్న ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కీలక ఎంపీలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రతిపాదిత కూటమిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రాంతీయ పార్టీలకు డీఎంకే ఆహ్వానాలు పంపబోతున్నట్టు చర్చ జరుగుతోంది. నిన్నటి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్, రాహుల్ తీరును అనేక పార్టీల నేతలు తీవ్రంగా దుయ్యబట్టి ఉండటాన్ని పరిగణించి ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య ప్రతినిధులతో తన ఎంపీల ద్వారా మాట్లాడించే దిశగా స్టాలిన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తమిళనాట చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్‌కు స్థానం లేదు.. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కానున్న జట్టులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలన్న నిర్ణయానికి స్టాలిన్ రావడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కొత్త జట్టును ఏర్పాటు చేయడంలో భాగంగా పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ, కాంగ్రెస్ రూపంలో నష్టపోయిన పార్టీ నేతలతో సంప్రదింపునకు సన్నద్దం అవుతుండటం గమనార్హం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఎంకె గ్రూప్ (డీఎంకే) అడుగుల వేగాన్ని మున్ముందు పెంచనున్నట్టు చర్చ జరుగుతున్నది. ‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుండి కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే తాజాగా కాంగ్రెస్‌కు చెక్ పెట్టడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయనున్నడంతో మున్ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి పెరిగినట్లయ్యింది. -
రాహుల్ గాంధీ ప్రసంగం.. కూటమికి హెచ్చరిక!
ఇండియా కూటమి సమావేశంలో.. ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించారు. 'ఐక్యంగా ఉంటే బలం, విడిపోతే పతనం' అనే సందేశాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమిలోని అన్ని పార్టీలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచించారు.కూటమి భాగస్వాములు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదా బలహీనపరచుకోవడం మానుకోవాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు. దేశం, రాజ్యాంగం రక్షణ కోసం ప్రతిపక్షాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కొందరు మిత్రపక్షాలు ఎన్నికల ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ లేవనెత్తిన 'ఓటు చోరీ' ఆరోపణలకు తగిన మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ తరచుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్, వామపక్షాల వంటి కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.ఈ సమావేశంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై ఉన్న అనుమానాలు, అక్రమాల ఆరోపణల అంశాన్ని కూడా చర్చించారు. ఈ విషయంపై దేశ ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాయాలని కూటమి నిర్ణయించింది.బీజేపీని ఓడించడం అంత కష్టమైన విషయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 240 స్థానాలను కైవసం చేసుకుంది, ఇది 2019లో గెలుచుకున్న 303 స్థానాల కన్నా చాలా తక్కువ. 2024లో కాంగ్రెస్ 99 స్థానాలకు ఎగబాకిందని తమ బలాన్ని గుర్తు చేశారు. అయితే.. ప్రతిపక్షాలు పరస్పరం పోట్లాడుకుంటూ తమ బలమే తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ సమావేశంలో ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. 2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో ప్రతిపక్షాలు కలిసి కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశం ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఈ సమావేశం జరగడం విశేషం. ఆ ఎన్నికల్లో బీజేపీ అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ కేరళలో విజయం సాధించింది. తమిళనాడులో నటుడు - రాజకీయ నాయకుడు విజయ్ భారీ విజయం సాధించారు. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరగనుంది. -
రాహుల్ గాంధీ సింప్లిసిటీ.. చిన్నారికి సర్ప్రైజ్
ఒక సాధారణ రెస్టారెంట్ లంచ్ అనుకోని విధంగా ఓ చిన్నారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చింది. కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుక కోసం బయటకు వెళ్లిన ఆ బాలుడు, అదే రెస్టారెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్న ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.. డాక్టర్ ఎస్.జె.టి కజ్మీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి లంచ్‌కు వెళ్లారు. అయితే అదే హోటల్‌కు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వాళ్లకు దగ్గర్లోనే ఓ టేబుల్ మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఉత్సాహంగా ఉన్న చిన్నారి రాహుల్ గాంధీకి చేతులు ఊపగా.. ఆయన స్పందించి బాలుడిని తన వద్దకు పిలిచారు.ఆప్యాయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఆ చిన్నారితో ఫోటో దిగుతూ అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని కజ్మీ తన పోస్టులో పేర్కొన్నారు. “నా కుమారుడికి ఇది జీవితంలోనే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్” అంటూ ఆయన మరో పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది వినియోగదారులు రాహుల్ గాంధీ చేసిన ఈ సింపుల్ గెస్టర్ను ప్రశంసిస్తూ స్పందించారు. కొందరు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు.Was out for lunch on my Son’s Birthday today . As luck would have it Rahul Gandhi ji @RahulGandhi and Priyanka ji @priyankagandhi were at nearby table with family . My son waived at him in excitement , Mr Gandhi called him and made his birthday memorable !! Thank you sir ! pic.twitter.com/J6l5AjtwSl— DR.S.J.T.KAZMI (@JAFARKAZMI) June 7, 2026మరో వినియోగదారు డాక్టర్ రాకేష్ బన్సాల్ కూడా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. రాహుల్ గాంధీ చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. కుటుంబ వేడుకలో భాగమైనట్టే ఆయన ఫోటోలకు పోజ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం హృదయాన్ని హత్తుకునే అనుభవమని అభిప్రాయపడ్డారు. सार्थक 18 साल का है - पर सोच, साहस और सिद्धांत में किसी से कम नहीं।उसने और उसके साथी निसर्ग ने वो कर दिखाया जो देश के बड़े मीडिया हाउस, खोजी पत्रकार नहीं कर पाए - CBSE और COEMPT की मिलीभगत को देश के सामने रख दिया।मोदी जी चाहते हैं हमारे युवा reels बनाते रहें, पकौड़े तलते… pic.twitter.com/vjNNVItc2q— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2026సార్ధక్ ది గ్రేట్!సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన 18 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్, అతని సహచరి నిసర్గపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తాజాగా వాళ్లు పేరెంట్స్‌తో కలిసి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరి ప్రయత్నం వల్ల వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఇటు సీబీఎస్ఈ అధికారులు రీవ్యాల్యుయేషన్ ప్రక్రియలో ఉన్న సమస్యలను అంగీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. మొత్తం వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..?
-
రక్షణ కోసం కాదు.. ఆ ఒక్కరి కోసమే
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. రక్షణ అవసరాలు, షిప్పింగ్ కోసమంటూ కేంద్రం చెబుతున్నదంతా వంటి అబద్ధమన్నారు. దేశంలోనే అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో పర్యావరణానికి తీవ్రంగా హానికలిగిస్తూ హోటళ్లు, క్యాసినోలు నిర్మించుకోవడానికి.. కేవలం ఒకే ఒక్క వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చడానికే ఈ ప్రాజెక్ట్ తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం వినిపించాలని, ‘వుయ్ చూజ్ గ్రీన్ ఓవర్ గ్రీడ్’అనే పిటిషన్‌పై సంతకం చేయాలని ప్రజలను రాహుల్ కోరారు. ఏప్రిల్‌లో అండమాన్ నికోబార్ దీవుల సందర్శనకు వెళ్లిన సందర్భంగా చిత్రించిన 15 నిమిషాల వీడియోను ఆయన ఎక్స్‌లో విడుదల చేశారు. ‘మోదీ మీకు చూపించకూడదని అనుకుంటున్నది ఇదే’అనే శీర్షికతో ఉన్న వీడియోలో.. రాహుల్ గాంధీ సముద్రపు నీళ్లలోకి వెళ్లడం, అక్కడి స్థానికులతో, గిరిజన ప్రతినిధులతో మాట్లాడటంఉన్నాయి. ‘ఇక్కడున్న వేలాది చెట్లను నరికేసి, వాటిని అక్రమంగా తరలించి, కోట్ల డాలర్లు సంపాదించడమే వీరి ప్లాన్. ఆ డబ్బుతో మీ హోటళ్లు, మీ క్యాసినోలు, మీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమే ఇక్కడ జరుగుతున్న అసలు తంతు. అదే వీరి ప్లాన్’అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా దేశంలోని యువతను ప్రతి ఒక్కరినీ ఓ ప్రశ్న అడుగుతున్నా.. మీకు ఎలాంటి భారత్ కావాలనుకుంటున్నారు? కేసినోల కోసం సతత హరిత అరణ్యాలను నేలమట్టం చేసిన, మ్యాపుల్లోంచి పగడపు దీవులు లేకుండా చేసిన, గిరిజన ప్రజలను వారి భూముల నుంచి తొలగించిన, మనం పీల్చే గాలిని విషతుల్యం చేసిన భారతదేశాన్నా లేక మన సహజ సంస్కృతిని కాపాడుకుని, మన గిరిజన వర్గాలను సంరక్షించుకునే, అభివృద్ధితో కలిసి ఉండే ప్రకృతినా’అని ఆయన ప్రశ్నించారు. -
భారత్ చివరి కొనను సందర్శించా.. రాహుల్ గాంధీ
శ్రీ విజయపురం: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అండమాన్ నికోబార్ దీవులను సందర్శించారు. అక్కడి ప్రకృతి సోయగాలు తనను కట్టిపడేశాయని ఎక్స్ ఖాతా వేదికగా రాసుకొచ్చారు. అండమాన్ నికోబార్ దీవులు కేవలం రక్షణపరంగా భారత్‌కు ఎంతో ముఖ్యమైనవని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోందని కానీ వాస్తవానికి అది సరికాదన్నారు. అండమాన్ నికోబార్ చిత్రాలతో కలిగిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.రాహుల్ గాంధీ ఎక్స్‌లో అండమాన్ నికోబార్ దీవులపై పోస్ట్ చేస్తూ " నేను భారతదేశపు దక్షిణపు చివరి కొనను సందర్శించాను. ఇందిరా పాయింట్ వద్ద నిలబడ్డాను. శతాబ్దాలుగా నిలబడి ఉన్న చెట్ల కింద నడిచాను. భూమిపైనే అత్యంత జీవకళతో నిండిన పగడపు దిబ్బలలోకి మునిగాను.అక్కడ నివసించే ప్రజలతో కూర్చున్నాను. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి భూమిని లాక్కుంటున్న గిరిజన వర్గాలు. భారత ప్రభుత్వం ఈ ద్వీపాలలో స్థిరపరిచిన వలసదారులు, వీరిలో చాలామంది మాజీ సైనికులు, వీరికి సరైన పరిహారం అందడం లేదు." అని అన్నారుబీజేపీ ప్రభుత్వం ప్రజలందరికీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్.. కేవలం రక్షణ రంగానికి సంబంధించి మాత్రమే అని చెబుతాయి. కాని అది సరికాదు. ఈ పగడపు దీవులలో 1.5 కోట్ల చెట్లను నరికివేయడం. అధికారిక పటాల నుండి పగడపు దిబ్బలను తొలగించడం. సైనికులు, గిరిజనులను స్థానభ్రంశం చేయడం సరైంది కాదు. కేవలం ఒక వ్యాపారవేత్త భారతదేశపు అత్యంత అమూల్యమైన పర్యావరణ భూమిపై హోటళ్లు , క్యాసినోలను నిర్మిస్తున్నారు. అని రాహుల్ విమర్శించారు.తిరిగి పొందలేని దాన్ని నాశనం చేయడం ఎంతటి లాభానికైనా తగదనే విషయం మీకు తెలుసు అని రాహుల్ అన్నారు. తాను పర్యావరణ సమతుల్య అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఈ ద్వీపాలు ప్రపంచం ఇంతవరకు చూడని అత్యంత అసాధారణమైన సుస్థిర గమ్యస్థానంగా మారగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాంటి భారతదేశం కోసమే మనం పోరాడాలని పోరాడాలి.I visited the southernmost tip of India.I stood at Indira Point. I walked under trees that have stood for centuries. I dove into coral reefs among the most vibrant on earth.And I sat with the people who live there. Tribal communities, whose land is being taken away by… pic.twitter.com/RLNtT6L0U4— Rahul Gandhi (@RahulGandhi) June 5, 2026 -
ఆకాంక్షది మోదీ మార్కు వ్యవస్థీకృత హత్య
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అభ్యర్థిని బలవన్మరణంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేపదే జరుగుతున్న ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాలతో విద్యార్థుల భవిష్యత్ కలలు చెదిరిపోతున్నాయని రాహుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు లీకేజీలు, నీట్ పరీక్ష నిర్వహణలో అసమర్థ వార్తలతో తీవ్రంగా కలతచెంది మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష చతుర్వేది అనే అభ్యరి్థని నాగ్‌పుర్‌లో బలవన్మరణానికి పాల్పడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య ఘటనపై రాహుల్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఆకాంక్ష వైద్యవిద్య పూర్తిచేసి డాక్టర్‌గా రాణించి, సమాజానికి సేవ చేయాలని ఎంతో ఆశపడింది. ఆమె తండ్రి ఓ సాధారణ రైతు. కుమార్తె కలను నిజం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3,00,000 అప్పు తీసుకున్నారు. నాగ్‌పుర్‌లో ఆమె కోచింగ్ క్లాస్‌లకు వెళ్లడానికి వీలుగా తండ్రి వంటమనిషిగా ఉద్యోగం చేశారు. ఓ తండ్రిగా ఆయన చేయగలిగినదంతా చేశారు, కానీ నీట్ పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దయింది. దానిని తట్టుకోలేక ఆకాంక్ష బలవన్మరణానికి పాల్పడింది. ఆకాంక్ష మరణం కేవలం బలవన్మరణం కాదు. అది ప్రధాని మోదీ హయాంలో అవినీతి, చిన్నాభిన్నమైన విద్యావ్యవస్థ ఇచ్చిన బహుమతి. ఇక ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ఇప్పటికీ అదే కురీ్చలో ఉన్నారు. అవే పాత కమిటీలు, బదిలీలు, విచారణలు. సంస్కరణలు లేవు. న్యాయమూ లేదు. మోదీజీ.. అధికార పీఠం శాశ్వతం కాదు. అది వస్తుంటుంది, పోతుంటుంది’’అని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. -
నన్నే టార్గెట్ ఎందుకు?.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. తాను “పరారీలో ఉన్న వ్యక్తిని కాదు” అంటూ స్పష్టం చేస్తూనే.. రాజకీయ కారణాలతో కొందరు తన పేరును పదే పదే టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘‘నేను ఎక్కడికీ పారిపోలేదు. భారత ప్రభుత్వానికి నన్ను పట్టుకునే శక్తి ఉంది. నిజంగా కావాలంటే ఎప్పుడో పట్టుకునేవారు. ఇది ప్రభుత్వం సమస్య కాదు, మీడియా సృష్టి” అని వ్యాఖ్యానించారు. తనపై ఉన్న ‘ఫ్యుజిటివ్’ అనే ముద్రను కూడా ఆయన తిరస్కరించారు.భారతదేశంలో కేసుల విషయంపై స్పందిస్తూ.. ‘‘నన్ను నిర్దోషిగా నిరూపించుకోవాలన్న బలమైన కోరిక ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది. ఆ కోరిక కలిగినప్పుడు కచ్చితంగా వాటిని ఎదుర్కొంటా’’ అని ఆయన పేర్కొన్నారు.రాహుల్ గాంధీపై ఆరోపణలులలిత్ మోదీ ప్రధానంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో, పార్లమెంట్లో తన పేరును పదేపదే ప్రస్తావిస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రికెట్‌కు ఉన్న ప్రజాదరణ కారణంగా తన పేరును రాజకీయంగా ఉపయోగిస్తున్నారని అన్నారు.ఐపీఎల్ షిఫ్ట్ వివాదంలో చిదంబరంపై..2009లో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాకు తరలించిన విషయంపైనా మోదీ మరోసారి స్పందించారు. అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తనపై ఒత్తిడి తెచ్చారని, టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినప్పటికీ, కేంద్ర స్థాయిలో రాజకీయ కారణాలతో సమస్యలు ఎదురయ్యాయని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అందుకు ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. “చిదంబరం నన్ను బెదిరించారు. ఆయన అప్పట్లో హోంమంత్రిగా చాలా శక్తివంతంగా ఉండేవారు” అని కూడా వ్యాఖ్యానించారు.భారత ప్రభుత్వం ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ కేసుల్లో ఉన్న ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి రప్పించేందుకు కట్టుబడి ఉందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ జాబితాలో లలిత్ మోదీతో పాటు విజయ్ మాల్యా పేర్లు కూడా ఉన్నాయి. గతంలో లండన్‌లో జరిగిన విజయ్ మాల్యా పుట్టినరోజు వేడుకల వీడియోను షేర్ చేస్తూ, “భారతదేశానికి చెందిన ఇద్దరు పెద్ద ఫ్యుజిటివ్స్” అని చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదానికి దారితీశాయి. తర్వాత ఆ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ.. లలిత్ మోదీ క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చారు.లలిత్ మోదీ 2010లో భారత్ విడిచి వెళ్లిపోయారు. అప్పట్లో ఐపీఎల్ ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన అలా వెళ్లిపోవడం గమనార్హం. ఆ తర్వాత ఆయన ప్రధానంగా యూకేలో నివసిస్తూ, భారత్‌కు తిరిగి రాలేదు. తాను పరారీలో లేనని లలిత్ మోదీ మళ్లీ స్పష్టం చేసినప్పటికీ.. రాహుల్ గాంధీ, చిదంబరం పేర్లతో చేసిన ఆరోపణలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
కేంద్రంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కూటమిలో నెలకొన్న అభిప్రాయ భేదాల నేపథ్యంలో మరోమరు విపక్షాల ఐక్యత చాటేందుకు, కేంద్ర ప్రభుత్వంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేందుకు విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు 8వ తేదీన హస్తినలో భేటీకానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా మొత్తం 15 పార్టీల అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం, ప్రతిపక్ష ఐక్యతను మరింత బలోపేతం చేయడం భేటీ ప్రధాన లక్ష్యాలుగా తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, నిరుద్యోగం, ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, అంతర్జాతీయ పరిస్థితులు వంటి ప్రజా సమస్యలపై సంయుక్త పోరాటానికి భేటీలో వ్యూహాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర పరిణామాలు, వివిధ రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. అయితే ‘ఇండియా’ కూటమిలోని కొన్ని పార్టీల మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు వార్తలు రావడం కూటమిలో గందరోగళం నెలకొంది. ‘ఇండియా’ కూటమితో తెగదెంపులు చేసుకున్న ఆప్ పార్టీ ప్రతి పక్షాల కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. తమిళనాడు ఎన్నికల అనంతరం పరిణాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో తన బంధాన్ని తెంచుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు తెగిపోయిన నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలకు దూరంగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించింది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి కొద్ది రోజుల కిందటే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి తమ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో డీఎంకే సమావేశానికి దూరంగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో డీఎంకే స్థానంలో విజయ్ జోసెఫ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ సోమవారం తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకు పడింది. ‘మంత్రి ప్రధాన్’అసమర్థతకు నిలువెత్తు నిదర్శనమని ప్రధాని మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. రాజధర్మం పాటించి పదవికి రాజీనామా చేయడం మేలని సలహా ఇచ్చింది. ఎక్స్ వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్‌రమేశ్ సీబీఎస్ఈ ఓఎస్ఎం వివాదంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జవాబు పత్రాలను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్ల సాయంతో స్కాన్ చేయాలని సీబీఎస్ఈ 2025 మే నెలలో జారీ చేసిన టెండర్ స్పష్టం చేసిందని, ఈ స్కాన్ల స్పష్టత 300 డీపీఐ వరకూ ఉండాలని కూడా నిర్దేశించిందని రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. అయితే ఆగస్టులో ‘స్కానర్లు’అన్న నిబంధనను నిశ్శబ్ధంగా తొలగించారని, స్పష్టతను కూడా 200 డీపీఐకి తగ్గించారని రాహుల్ ఆరోపించారు. ఫలితంగా జవాబు పత్రాల నాణ్యత బాగా తగ్గిపోయిందని, చాలా పత్రాలు అస్పష్టంగా ఉండటంతోపాటు, కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని దీనివల్లే మార్కుల జారీలో గందరగోళం ఏర్పడిందని రాహుల్ గాంధీ ‘నిసర్గ’ఎథికల్ హ్యాకర్ పోస్టును షేర్ చేశారు. ‘‘ఇది కచ్చితంగా మోసమే. తప్పుడు మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థీ బాధితుడే’’అని స్పష్టం చేశారు. మామిడి పండ్ల గురించి మాట్లాడేందుకు సమయమున్న ప్రధానమంత్రి 18.5 లక్షల మంది విద్యార్థుల ఆన్సర్షీట్లకు సంబంధించి మాత్రం నోరు మెదపలేకపోయారని విమర్శించారు. కోఎంప్ట్ పై చర్యలెందుకు లేవు: జైరామ్ రమేశ్ సీబీఎస్ఈ వివాదంలో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తప్పు పట్టారు. ఎక్స్‌లో ఆయన ఒక పోస్టు పెడుతూ ఓఎస్ఎం సాఫ్ట్‌వేర్‌లో భద్రత లోపాలను వారాలపాటు నిరాకరించిన సీబీఎస్ఈ ఎట్టకేలకు అంగీకరించిందని, బహుశా ఈ విషయం ముందుగానే తెలియడం వల్లనే కోంఎప్ట్కు అనుగుణంగా నిబంధనలను మార్చి ఉంటారని విమర్శించారు. సరిగ్గా పనిచేయని కాంట్రాక్టు సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేస్తామని 2025 ఆగస్టు టెండర్ నిబంధనలు స్పష్టం చేయగా సెపె్టంబర్ నెలలో సవరణల పేరుతో ఈ నిబంధనను తొలగించిన విషయాన్ని రమేశ్ ఎత్తిచూపారు. కోఎంప్ట్ను రక్షించేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమిదని స్పష్టం చేశారు. ‘‘మంత్రి ప్రధాన్ అసమర్థతకు, అహానికి నిలువెత్తు నిదర్శనం. తన రాజకీయ అజెండాను అన్ని రకాల బాధ్యతలకు అతీతంగా ముందుకు నడిపించాలని చూసే వ్యక్తి’’అని ఆరోపించారు. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం కేంద్ర విద్యా శాఖ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కూడా జైరామ్ రమేశ్ ఇంకో ఎక్స్ పోస్టులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘ఇది (ప్రమాద ఘటన) కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది’’అని వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థ పునాదులు ధ్వంసం: పవన్ ఖేరాపన్నెండేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం విద్యావ్యవస్థను ధ్వంసం చేసిందని కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా సోమవారం విమర్శించారు. ‘‘సీబీఎస్ఈ కాంప్రమైజ్ అయిపోయింది. యూజీసీ ధ్వంసమైపోయింది. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు కాషాయమైపోయాయి. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లను ఆర్ఎస్ఎస్ నియమిస్తోంది. విద్యార్థులు ఎవరైనా ప్రతిఘటిస్తే అణచివేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ యవత హక్కులు కాలరాస్తున్నారు. నిరుద్యోగం ప్రబలిపోయింది. శాస్త్రీయ దృక్పథం కొరవడింది.’’అని ఆయన మోదీ హయాంపై విమర్శలు వెల్లువెత్తించారు. భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ఈ ప్రభుత్వం స్తంభింపజేసిందని అన్నారు. పరీక్ష పే చర్చ, ఎగ్జామ్ వారియర్స్ పేరుతో ప్రధాని తన ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తూంటే... పిల్లలు వారి తల్లిదండ్రులు మాత్రం రోజూ ఎంతో వేదనను అనుభవిస్తున్నారని అన్నారు. ఓఎస్‌ఎంపై ఉపాధ్యాయులు, నిపుణులు సుమారు 36 ప్రధాన లోపాలను ఎత్తిచూపినా సీబీఎస్ఈ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. -
సీబీఎస్ఈలో జేబు దొంగలు.. జాగ్రత్త!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్న ఆన్సర్ షీట్ స్కానింగ్, రీవ్యాల్యుయేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవడానికి కూడా విద్యార్థుల నుంచే డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.ఈ సందర్భంగా ఎక్స్‌లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జేబుదొంగలతో జాగ్రత్త.. ఇప్పుడు వాళ్లు CBSEలోనే కూర్చున్నారు. బోర్డు తప్పు వల్ల మీ మార్కులు తప్పుగా నమోదైతే మీకు ఏమి దక్కుతుంది? ఒక బిల్లు మాత్రమే. డిజిటల్ స్కాన్డ్ కాపీకి ఒక్కో సబ్జెక్టుకు రూ.100, రీ-టోటలింగ్‌కు రూ.100, రీ-ఎవాల్యుయేషన్కు ఒక్కో ప్రశ్నకు రూ.25 చెల్లించాలి” అంటూ మండిపడ్డారు.जेबकतरों से सावधान - आज वो CBSE के अंदर बैठे हैं। CBSE की गलती से नंबर ग़लत आए तो आपको क्या मिलता है?एक bill:Digital scan copy: ₹100/विषयRe-totalling: ₹100/paperRe-evaluation: ₹25/सवालअपनी ही answer sheet की सही जाँच के लिए एक बच्चे को ₹2000 तक भरने पड़ सकते हैं।… pic.twitter.com/H0WS1xF6Zf— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2026సీబీఎస్ఈ పరీక్షల ఆన్సర్ షీట్ల స్కానింగ్, డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. విద్యార్థుల మార్కులు తప్పుగా అప్లోడ్ అవుతున్నాయని, వాటిని సరిచేయాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం అయ్యిందో లేదో నిర్ధారించుకోవడానికి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.CBSE’s May 2025 tender required answer sheets to be scanned with automatic robotic scanners, spines preserved, at a minimum of 300 DPI.The tender re-issued in August quietly removed all of it. “Scanners” became generic. Resolution dropped to 200 DPI.Now we know what that… https://t.co/XXdorOi3oq— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2026“తప్పు సీబీఎస్ఈది.. శిక్ష విద్యార్థికి.. లాభం ప్రభుత్వానికి” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తే తప్పులు సరిదిద్దబడవని, మరింత పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో ఎక్కువ నష్టం చవిచూస్తున్నది పిల్లలేనని, వారి సమయం, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. దీనివల్ల పేజీలు మిస్ కావడం, బ్లర్ కాపీలు రావడం, సమాధాన పత్రాలు పూర్తిగా అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.ఎవరీ సార్ధక్ సిద్ధాంత్..ఈ వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ షేర్ చేసిన పోస్ట్‌లో ఉన్న అంశాలను బయటపెట్టిన వ్యక్తి జార్ఖండ్‌కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్. సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న టెండర్ పత్రాలను పరిశీలించిన ఆ 17 ఏళ్ల కుర్రాడు.. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ నిబంధనలను మూడు దశల్లో సడలించినట్లు ఆధారాలతో వెల్లడించాడు. ఈ మార్పులు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు.సార్థక్ సిద్ధాంత్ తన వెబ్సైట్లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2025 మేలో విడుదల చేసిన టెండర్లో ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లతో, కనీసం 300 DPI నాణ్యతతో స్కాన్ చేయాలని పేర్కొన్నారు. అయితే అదే టెండర్‌ను ఆగస్టులో మళ్లీ విడుదల చేసినప్పుడు ఆ నిబంధనలను సడలించి, స్కానర్ల ప్రస్తావనను సాధారణీకరించడంతో పాటు రిజల్యూషన్‌ను 200 DPIకు తగ్గించినట్లు వెల్లడించారు. అనంతరం ఆన్సర్ షీట్లను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు బయటపడిందని, దీనివల్లే బ్లర్ కాపీలు, మిస్సింగ్ పేజీలు, స్కాన్ కాని సమాధాన పత్రాల సమస్యలు వచ్చాయని ఆరోపించారు.ఇక రాహుల్ గాంధీ కోఎంప్ట్ ఎడుటెక్ సంస్థపై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ఈ సంస్థ మరో పేరుతో వివాదాల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సమాధాన పత్రాల గందరగోళానికి సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని సీబీఎస్ఈ చెబుతోంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్లకు చెందిన నిపుణులతో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వ్యవస్థను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.మొత్తంగా, లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విద్యా మూల్యాంకన వ్యవస్థ పారదర్శకత, సాంకేతిక ప్రమాణాలు, రీవ్యాల్యుయేషన్ ఫీజులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. -
ప్రశ్నిస్తే అవమానిస్తున్నారు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఓఎస్ఎం వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఇటీవల కొందరు విద్యార్థులతో సంభాషించిన వీడియోను ఆదివారం ఆయన షేర్ చేశారు. ‘వీరంతా సీబీఎస్ఈలో అవకతవకలపై మోదీ ప్రభుత్వాన్ని చాలా చిన్న ప్రశ్నలు మాత్రమే అడిగారు. ప్రశ్నిస్తే వీళ్లను అవమానిస్తున్నారు. సమాధానాలకు బదులు వీళ్లకు అవమానాలే ఎదురయ్యాయి. దేశ వ్యతిరేకులంటూ వారిపై ముద్ర వేశారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ దేశద్రోహులతో ఎంతో ఆసక్తికర సంభాషణ జరగింది. వీరికి ఎంతో చక్కటి భవిష్యత్తుంది’ అని అన్నారు. ఇటీవల సీబీఎస్ఈ అప్లోడ్ చేసిన 12వ తరగతి ఆన్సర్ షీట్ తమది కాదంటూ వేదాంత్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. అనంతరం మరికొందరు విద్యార్థులూ తమకూ ఇతరుల ప్రశ్నపత్రాలు ఇచ్చారంటూ ఆన్లైన్లో ప్రకటించడం తీవ్ర కలకలం రేగిన విషయం తెల్సిందే. -
స్పీకర్ స్థానం నుంచి మంత్రి పదవి వైపు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో హీట్ పెంచుతోంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కేబినెట్లో కొత్త ముఖాలకు అవకాశం కలి్పంచేందుకు అధిష్టానం గట్టిగా యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంటున్న ఏఐసీసీ పెద్దలు.. జూన్ చివరి వారంలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఢిల్లీ వేదికగా మారిపోయాయి. స్పీకర్ స్థానం నుంచి మంత్రి పదవి వైపు? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో పత్రిపక్ష నేత రాహుల్ గాం«దీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తనకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు కలి్పంచాలని ఆయన రాహుల్‌ను కోరినట్లు విశ్వసనీయ సమాచారం. స్పీకర్ పదవి కంటే మంత్రిగా ప్రజాసేవ చేసేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ బాట పట్టిన ఆశావహులు!... మంత్రివర్గంలో మార్పుచేర్పులు ఖాయమనే సంకేతాలు రావడంతో రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వేదికగా లాబీయింగ్ మొదలుపెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి దక్కించుకునేందుకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల వారిద్దరూ ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసి తమకు న్యాయం జరుగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. తెరవెనుక సీనియర్ల ప్రయత్నాలు.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో పారీ్టకి చెందిన సీనియర్ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల ఎమ్మె ల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సైతం ఢిల్లీకి వచ్చారు. తమ అసంతృప్తిని, ఆకాంక్షలను అధిష్టానం ముందుంచి హైదరాబాద్ పయనమయ్యారు. అధిష్టానం పెద్దలను కలిసేందుకు వచ్చిన వారు.. మీడియా కంట పడకుండా అత్యంత గోప్యత పాటించడం గమనార్హం. -
తమిళనాడు కాంగ్రెస్‌లో భారీ ట్విస్ట్..
సాక్షి, చైన్నె: కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి శుక్రవారం చేసిన ఓ ట్వీట్ తమిళనాడు కాంగ్రెస్(టీఎన్‌సీసీ)లో రచ్చకెక్కింది. ఎన్నికలలో సీట్ల కేటాయింపులో భారీ స్కాం జరిగినట్టుగా ఆమె కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీలో జరగాల్సిన ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే ప్రారంభం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఐదు చోట్ల మాత్రమే గెలిచింది. కూటమితో సీట్ల పందేరం అన్నది పెద్ద వివాదం నడుమే జరిగింది. డీఎంకే అధికారం కోల్పోవడంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే పక్షాన కాంగ్రెస్ చేరింది. ఈ కేబినెట్లో రెండు మంత్రి పదవులు సైతం దక్కించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌పై ఎంపీ జ్యోతిమణి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. ఆమె ఎక్స్ పేజీలో అన్ని వివరాలను ప్రకటించారు.కమిటీ ఏర్పాటుపై అభ్యంతరం.. టికెట్ల కేటాయింపుపై అసలు విచారణ జరపకుండా, కేవలం ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై మాత్రమే విచారించడానికి కమిటీని వేయడం అనేది తప్పు చేసిన వారిని కాపాడడానికి చేసిన ఏర్పాటు మాత్రమేనని ధ్వజమెత్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలోనే జరిగిందని, ఆ కమిటీపై ఉన్న ఆరోపణలను కాంగ్రెస్ నిబంధనల ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాత్రమే విచారించగలదన్నారు.సర్వేల పేరిట భారీ అవినీతిఅసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని వివరించారు. ముందే కొందరు అభ్యర్థులను ఖరారు చేసి, ఆ తర్వాత వారికి అనుకూలమైన నియోజకవర్గాలను కూటమి నుంచి అడిగి తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సర్వేల పేరుతో పార్టీలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారిని, గెలిచే అవకాశం ఉన్న నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారని వివరించారు. కొత్తవారికి, అసలు గెలుపు అవకాశాలు లేని చాలామందికి సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక మంది పార్టీని వీడారని, ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చింది ఎవరు? దేని ఆధారంగా ఇచ్చారు? తప్పు చేసిన వారిపై తీసుకున్న చర్యలు ఏంటీ అని ప్రశ్నించారు.పార్టీ సంస్కరణల కోసం పిలుపు ఈ దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ నుంచి కాపాడాల్సిన చారిత్రక బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఎక్కడా రాజీ పడకుండా పోరాడుతున్నారని పేర్కొంటూ, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఇలాంటి తప్పులు క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఇలాంటి అభ్యర్థుల ఎంపికపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయని, చాలాచోట్ల ఇది పార్టీ ఓటమికి కూడా కారణమవుతోందన్నారు. అయితే, విచారణ జరపడానికి బదులు తప్పు చేసిన వారిని కాపాడుతున్నారని మండిపడ్డారు. తమిళనాడు అభ్యర్థుల ఎంపికను తాను చాలా దగ్గర నుంచి చూశానని, ఇంత బహిరంగంగా తప్పులు జరగడం పార్టీ భవిష్యత్తుకు పెద్ద మైనస్ అవుతుందని హెచ్చరించారు. ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడి గెలవాలంటే జిల్లా, ప్రాంతీయ స్థాయి నాయకుల, కార్యకర్తల గళానికి విలువ ఇవ్వాలని సూచించారు. పార్టీ పారదర్శకంగా పనిచేయాలని, అందువల్ల కాంగ్రెస్‌లో అంతర్గత ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే మొదలవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు కూడా అభ్యర్థుల ఎంపికపై జోతిమణి తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. తాజాగా ఆమె తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడడం చర్చకు దారి తీసింది. -
అధికారమే తప్ప పిల్లల భవిష్యత్తు పట్టదు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈలో అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం దాల్చడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ శ్రద్ధంతా తన పదవిని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే తప్ప, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టింపులేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం), సీవోఈఎంపీటీకి ఈ కాంట్రాక్టును అప్పగించడంపై జ్యుడీషియల్ దర్యాప్తు చేపట్టాలంటూ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే తాను డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారం వెనుక వాస్తవాలు దేశ యువతకు తెలియడం అవసరమన్నారు. ‘ఓఎస్ఎం కోసం సీబీఎస్ఈ మూడుసార్లు టెండర్లు పిలిచింది. మొదటిసారి ఒక్కరూ రాలేదు. రెండోసారి వచ్చిన బిడ్డర్లలో అర్హులు లేరు. చివరగా, ఎంతో కీలమైన సాంకేతిక అర్హతలను కుదించిన తర్వాత సీవోటీఎంపీటీ రంగంలోకి వచ్చింది. ఆ కంపెనీకే టెండర్ కట్టబెట్టారు. ఆన్సర్ షీట్లలో దొర్లే పొరపాట్లకు జరిమానాలను తొలగించారు. రోబోటిక్ స్కానర్ అవసరం లేదన్నారు. స్కానింగ్ రిజొల్యూషన్‌ను తగ్గించారు’అని రాహుల్ తెలిపారు. ‘మంచి పేరున్న దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ టెండర్ వేసినా కాంట్రాక్టు ఇవ్వలేదు. ఘనమైన ఫెయిల్యూర్ రికార్డు కలిగిన సీవోటీఎంపీటీకి కాంట్రాక్టు కట్టబెట్టారు. ఈ కంపెనీ ఎవాల్యుయేషన్ తీరు ఎలా ఉందో బాధిత విద్యార్థులే చెబుతున్నారు’అంటూ రాహుల్ ఆరోపించారు. ఓఎస్ఎం విధానాన్ని తీసుకు వచ్చేముందు కనీసం ఒకటీ రెండు సంవత్సరాలు సన్నద్ధతా చర్యలను చేపట్టాలని ముందు నుంచే నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ విమర్శించారు. ఇలాంటి తప్పిదాలన్నిటికీ ప్రభుత్వానిదే బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను సైతం పక్కనబెట్టేసి 18.5 లక్షల విద్యార్థుల భవిష్యత్తును ఓ విఫల సంస్థకు ధారాదత్తం చేసిందంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలన్నదే తన ఏకైక డిమాండ్ అని రాహుల్ పేర్కొన్నారు. -
తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దేశ రాజధానిలో తన తొలి అధికారిక పర్యటనను ముగించుకుని గురువారం చెన్నైకి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవకుండానే ఆయన పర్యటన ముగిసింది. సోనియా, రాహుల్‌తో విజయ్ సమావేశం రద్దయింది. ముఖ్యమంత్రి తన పర్యటనను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేసుకున్నారని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ చెప్పుకొచ్చారు.అయితే, ప్రచారం జరుగుతున్నట్లుగా విజయ్, రాహుల్ గాంధీల భేటీ రద్దు కాలేదని... కేవలం వాయిదా మాత్రమే పడిందని తిలక్ పేర్కొన్నారు. సీఎం నీతి ఆయోగ్ సమావేశం కోసం జూన్ 11 ప్రాంతంలో మళ్లీ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు రాహుల్, సోనియా గాంధీలను కలుస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన మీడియాతో అన్నారు.కాగా, తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి బుధవారం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో విజయ్‌కి ఇదే తొలి భేటీ కావడం విశేషం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం విజయ్ తిరిగి తమిళనాడు భవన్‌కు చేరుకున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. రాష్ట్ర నిధులపై చర్చించారు.ఈ క్రమంలో జాతీయ ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారంటూ ప్రచారం జరిగింది. అటు అధికార పక్ష అగ్రనేతలను, ఇటు ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలనూ సమానంగా కలుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. చివరికి సోనియా, రాహుల్‌లతో భేటీ కాకుండానే విజయ్ పర్యటన ముగిసింది. -
రాహుల్ ఆఫర్‌ను నో అన్న సిద్ధూ
-
డీకే శివకుమార్ మంత్రివర్గ కూర్పుపై రాహుల్ ఆదేశాలు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై దృష్టి సారించింది. శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలనేదానిపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. కొత్త మంత్రివర్గంలో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం.యువతకు ప్రాధాన్యతమంత్రివర్గంలోకి అధికశాతం యువకులను తీసుకోవాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. 2028లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీలో మార్పును ప్రతిబింబించేలా, యువతను ఆకర్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేరళ తరహాలోనే యువ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న యువ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ తన వ్యూహంలో భాగంగా, ప్రస్తుతమున్న 35 మంది మంత్రులలో 25 మందిని తొలగించి, వారిని పార్టీ సంస్థాగత పనులకు పరిమితం చేసే అవకాశం ఉంది.ఇద్దరు ఉపముఖ్యమంత్రుల ప్రతిపాదనకొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించాలనే ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారిలో ఒకరిని దళిత నేతకు కేటాయించే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకు దళిత ముఖ్యమంత్రి లేరు. ఉపముఖ్యమంత్రి పదవిని దళిత నేతకు ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి భరోసా కల్పించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న జి. పరమేశ్వర దళిత నేత కావడం గమనార్హం. సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్న దళిత, వెనుకబడిన తరగతులు, మైనారిటీల ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కూడా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పార్టీ భావిస్తోంది.భిన్నాభిప్రాయాలుఅయితే ఉపముఖ్యమంత్రుల సంఖ్య విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్ వర్గం ఒక్కరికే అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, సిద్ధరామయ్య వర్గం మాత్రం ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కొత్త మంత్రివర్గం రాజకీయంగా సమతుల్యంగా ఉండాలని, ఏ ఒక్క వర్గం లేదా క్యాంపునకు అనుకూలంగా ఉండకూడదని రాహుల్ గాంధీ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని పంపారు. నెలల తరబడి సాగిన అంతర్గత పోరుకు తెరదించుతూ, మంగళవారం ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ సమావేశాల అనంతరం సిద్ధరామయ్యను ఒప్పించడంలో కాంగ్రెస్ హైకమాండ్ విజయం సాధించింది. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల ద్వారా సిద్ధరామయ్య ఎగువ సభలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: బీజేపీలో భారీ ప్రక్షాళన: కీలక రాష్ట్రాలకు కొత్త సారథులు! -
సీబీఎస్ఈ అక్రమాలపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఆన్–స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) వ్వవస్థలో అక్రమాలపై స్వతంత్ర జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మొత్తం కుంభకోణంలో నిజాలను బహిర్గతం చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) సైతం నియమించాలని అన్నారు. తెలంగాణలో వివాదాస్పద నేపథ్యం ఉన్న ఒక సంస్థకు సీబీఎస్ఈ ఈ ఓఎస్ఎం కాంట్రాక్టును అప్పగించిందని ఆరోపించారు. సీబీఎస్ఈ తీరు వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని చెప్పారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నోరుమెదపడం లేదని రాహుల్ ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షకు సంబంధించి నమ్మశక్యంకాని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేశారు. ఈ పరీక్షకు ఓఎస్ఎం చేసిన కోంపెంట్ ఎడ్యుటెక్ అనే కంపెనీ అసలు పేరు గ్లోబరెనా అని తెలిపారు. ఈ గ్లోబరెనా ఇంతకుముందు తెలంగాణలో 2019, 2023లో స్కామ్‌కు పాల్పడిందిన్నారు. తెలంగాణలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ఓఎస్ఎం ఆధారిత లోపాలే కారణమని తేల్చిచెప్పారు. మళ్లీ అదే కోంపెంట్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఖండించిన సీబీఎస్ఈ కోంపెంట్ ఎడ్యుటెక్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను సీబీఎస్ఈ బుధవారం ఖండించింది. అందులో ఎంతమాత్రం నిజం లేదని పేర్కొంది. ఓఎస్ఎం కాంట్రాక్టును కోంపెంట్కు ఇచ్చిన మాట నిజమేనని వెల్లడించింది. అయితే, రాహుల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. నిబంధనల ప్రకారమే కాంట్రాక్టును కట్టబెట్టామని తేల్చిచెప్పింది. రాహుల్ ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆక్షేపించింది. -
మోదీని ఢీ కొట్టడానికి దీదీ మాస్టర్ ప్లాన్.. INDIA కూటమి భేటీ
-
కర్ణాటక పవర్ గేమ్‌లో వైల్డ్ కార్డ్ ట్విస్ట్!
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు మరోసారి ఢిల్లీ కేంద్రంగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఢిల్లీ చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. సీఎం మార్పు ఊహాగానాల నడుమ.. ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు.ఈ భేటీ ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వ భవిష్యత్ దిశ, పరిపాలనా మార్పులు.. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు “పాలిటికల్ రీసెట్”పై కేంద్రంగా సాగనుందని సమాచారం. ప్రభుత్వం పనితీరు మెరుగుపరచడం, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి అంశాలు కూడా చర్చలో ఉండే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం ప్రస్తుతం మూడు ఆప్షన్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి. అందులో మొదటిది.. సీఎం సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించడం. అంటే నాయకత్వ మార్పు లేకుండా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయడం ఆప్షన్‌గా ఉంది. ఇందులో పనితీరు తక్కువగా ఉన్న మంత్రులను తొలగించి, సామాజిక సమతుల్యత (అహిందా ఫార్ములా.. మైనారిటీలు+వెనుకబడిన వర్గాలు+దళితులు) ఆధారంగా కొత్త సమీకరణాలు తీసుకురావాలనే ఆలోచన ఉందని తెలుస్తోంది.రెండో ఆప్షన్‌గా.. నాయకత్వ మార్పు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి బాధ్యతల్లోకి తీసుకురావడం. అదే సమయంలో సీనియర్ నేత హోదాలో సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించడం. అయితే ఇది అత్యంత సున్నితమైన రాజకీయ నిర్ణయంగా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మూడో ఆప్షన్.. దీనికి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఇదే జరిగితే.. నిజంగా కర్ణాటక రాజకీయాలకు పెద్ద సర్ప్రైజే. అదే మల్లికార్జున ఖర్గేను కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్రలో తీసుకురావడం. అంటే ప్రస్తుతం జాతీయాధ్యక్షుడిగా ఉన్న ఖర్గేను.. “వైల్డ్ కార్డ్” ఎంట్రీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లోకి తెచ్చి సీఎంను చేయడం. ఇది జరిగితే రాష్ట్రంతో పాటు జాతీయ కాంగ్రెస్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరు వర్గాలను చల్లబర్చే ఈ ఆప్షన్ కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పై మూడు ఆప్షన్లలో ఏది అమలు చేసినా.. అది కర్ణాటక రాజకీయాల వరకు సంచలనమే కానుంది.పార్టీ లోపల వర్గపోరు, నాయకత్వ ఆశలు, సామాజిక సమీకరణాలు.. వెరసి ఢిల్లీలో ఇవాళ్టి కర్ణాటక కాంగ్రెస్ నేతల కీలక భేటీని అత్యంత కీలకంగా మార్చాయి. మరోవైపు.. రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో, టికెట్ల పంపకం గురించీ చర్చించవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ చర్చలు కర్ణాటకలో కేవలం పాలన మార్పుల గురించి కాకుండా.. కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘‘అప్పటివరకు ‘నీట్’పై నిరసనలు జరుగుతూనే ఉంటాయి’’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో ఉండగా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.ఆదివారం ఎక్స్‌లో ఈ మేరకు రాహుల్ గాంధీ ఎన్ఎస్యూఐ నిరసన తెలిపిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. “లక్షలాది మంది యువత రోడ్లపై ఉన్నారు.. 22 లక్షల పిల్లల భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. అయినా ప్రధాని మౌనంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పడంపై కాదు, బాధ్యత నుంచి తప్పించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, నీట్ లాంటి ప్రశ్నపత్ర లీకులు ఆగేలా పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు మేము ఆగము” అని రాహుల్ గాంధీ అన్నారు.నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని, “ప్రశ్నపత్ర లీక్ మాఫియా” పెరగడానికి అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.ఎక్స్‌లో కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ.. “నీట్ ప్రశ్నపత్ర లీక్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను చీకటిలోకి నెట్టింది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నపత్ర లీక్ మాఫియా విస్తరిస్తోంది. బాధ్యులు మాత్రం మౌనంగా చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వినోద్ జాఖర్ నాయకత్వంలో కార్యకర్తలు పాదయాత్ర చేపట్టి, యువత వ్యతిరేక మోదీ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌తో చేసే ఈ చెలగాటాన్ని ఏ మాత్రం సహించం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని కాంగ్రెస్ పేర్కొంది.అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రశ్నపత్ర లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.ఇదిలా ఉండగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.నిరసనకారులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ అక్రమాల్లో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.जब लाखों युवा सड़क पर हों, 22 लाख बच्चों का भविष्य दांव पर हो और PM चुप हो - तो सरकार जवाब देने नहीं, बचने में लगी है।जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता और NEET जैसे पेपर लीक रोकने के लिए foolproof सिस्टम नहीं बनता - हम रुकेंगे नहीं।pic.twitter.com/6KrhfUqDkL— Rahul Gandhi (@RahulGandhi) May 24, 2026 -
వాళ్లు మనోవేదనలో మీరు రీల్స్ మోజులో
న్యూఢిల్లీ: భవిష్యత్తును నిర్ణయించే నీట్–యూజీ పరీక్షను రాత్రింబవళ్లు కష్టపడి చదివి రాశాక అది రద్దయిందని తెలిసి లక్షలాది మంది అభ్యర్థులు వేదనలో మునిగిపోతే విదేశాల్లో ప్రధాని మోదీ ‘రీల్స్’చేస్తూ సంతోషంగా కన్పిస్తున్నారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాహుల్ గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో మోదీ వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘పేపర్‌లీక్ ఉదంతంలో న్యాయం కావాలంటూ ఓవైపు యువత వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటే మోదీ ఇటలీలో మెలోడీ అంటూ రీల్స్చేస్తున్నారు. దేశంలో ఎక్కడ మంచి పని జరిగినా తన ఘనతే అని చెప్పుకుని తిరిగే మోదీ నీట్–యూజీ పేపర్ లీక్ అయితే బాధ్యత ఎందుకు తీసుకోవట్లేరు? కనీసం నీట్–యూజీ పరీక్షల నిర్వహణను కేంద్రస్థాయిలో చూసుకునే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎందుకు ఇంకా పదవి నుంచి తొలగించలేదు? ఈ విషయంపై మోదీ ఎందుకు ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు? న్యాయం కోరుతూ పలు రాష్ట్రాల్లో ఉద్యమిస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచిన ఎస్ఎస్యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు లాఠీల వర్షం కురిపిస్తున్నాయి. లాఠీలతో ప్రభుత్వం చెప్పే సమాధానం ఏరకంగానూ జవాబుదారీ అన్పించుకోదు. సమాధానం చెప్పే ధైర్యంలేక భయంతో మమ్మల్ని లాఠీలతో చావబాదుతున్నారు. అయినా మేం భయపడబోం. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించేదాకా, దేశంలో పేపర్ లీకేజీలులేని పటిష్టమైన పరీక్షా విధానం అమల్లోకి వచ్చేదాకా ఉద్యమిస్తాం. లీకేజీలతో విద్యార్థుల భవితను ప్రభుత్వం దోచుకుంటోంది’’అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జైపూర్‌లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యమిస్తున్న విద్యార్థులపైకి పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న ఫొటోను రాహుల్‌గాంధీ ఈ పోస్ట్‌కు ట్యాగ్‌చేశారు. -
‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్!
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తండ్రికి అత్యంత భావోద్వేగ భరిత నివాళులర్పించారు. గురువారం (మే 21, 2026) నాడు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా తన చిన్ననాటి అరుదైన ఫోటోను పంచుకుంటూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాహుల్ ప్రతిజ్ఞ చేశారు.వీర్ భూమి వద్ద కుటుంబ సభ్యుల నివాళులురాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని ఆయన స్మారక స్థలం ‘వీర్ భూమి’ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పిల్లలు మిరాయా, రైహాన్ వాద్రాలతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్, పి. చిదంబరం, భూపిందర్ సింగ్ హుడా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ‘ఎక్స్’ ద్వారా మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు. पापा, आपने जिस कुशल, समृद्ध और मजबूत भारत का सपना देखा था, उसे साकार करने की जिम्मेदारी मैं पूरी करूंगा।आपकी सीख, आपके संस्कार और आपकी यादें हमेशा मेरे साथ रहेंगी। pic.twitter.com/uToSqMGdY3— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2026నాన్న నేర్పిన సంస్కారమే నా ఊపిరి: రాహుల్తండ్రితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ రాహుల్ గాంధీ హిందీలో ఒక హృదయపూర్వక సందేశాన్ని రాశారు. ‘నాన్నా.. మీరు కలలు గన్న నైపుణ్యం, సంపన్నతతో కూడిన బలమైన భారతదేశాన్ని నిర్మించే బాధ్యతను నేను పూర్తిగా భుజానికెత్తుకుంటాను. మీరు నేర్పిన పాఠాలు, మీ సంస్కారం, మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి’ అని రాహుల్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ తండ్రీకొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. నవ భారత నిర్మాతకు ప్రముఖుల ప్రశంసలుకాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే రాజీవ్ గాంధీని ‘భారతదేశ అద్భుత పుత్రుడు’గా అభివర్ణించారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, దేశంలో టెలికాం, సమాచార సాంకేతిక విప్లవానికి పునాది వేయడం వంటి సంస్కరణలను ఆయన గుర్తుచేశారు. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఆ కాలంలోనే 21వ శతాబ్దం గురించి మాట్లాడిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో 40 ఏళ్ల వయసులో దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ, మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. -
మోదీ, మెలోని, మెలోడీ... కి రాహుల్ గాంధీ మాస్ ర్యాగింగ్
-
మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ముమ్మాటికీ ద్రోహులే
రాయ్‌బరేలీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముమ్మాటికీ ద్రోహులు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారంతా కలిసి భారత రాజ్యాంగంపై నిత్యం దాడి చేస్తున్నారని, దేశ ప్రయోజనాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ తన సొంత నియోజకర్గం రాయ్‌బరేలీలో రెండో రోజు బుధవారం కూడా పర్యటించారు. స్థానిక విప్లవవీరుడు ‘వీరా పాసీ’ సంస్మరణార్థం న్విహించిన బహుజన్ స్వాభిమాన్ సభలో ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మీ ఇళ్లకు వచ్చి మోదీ, అమిత్ షాల గురించి మాట్లాడితే నిలబడి గట్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లు ద్రోహులేనని తేల్చిచెప్పాలని సూచించారు. రాజ్యాంగం, అంబేడ్కర్, గాం«దీజీలపై దాడి చేస్తూ దేశాన్ని అమ్మేస్తున్నవారు ద్రోహులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కుల గణన చేపట్టకుండా జాప్యం చేస్తూ, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తూ రాజ్యాంగంపై నిత్యం 20 గంటలూ దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. త్వరలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహారం సహా అన్నింటి ధరలు ఎగబాకుతాయని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఎరువుల ధరలు సైతం పెరగడం తథ్యమని అన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా సామాన్య ప్రజలే నష్టపోతారని, అంబానీ, అదానీలపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. అంబానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, దాన్ని విదేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడని, ఆ సొమ్మును నరేంద్ర మోదీకి చేరవేస్తున్నాడని రాహుల్ ధ్వజమెత్తారు. రాబోయే సంక్షోభం నుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడలేదని, దాని ప్రభావం రెండు మూడు నెలల్లో కనిపిస్తుందని అన్నారు. చమురు ధరల విషయంలో ప్రభుత్వం తప్పేమీ లేదని మోదీ అంటున్నారని ఆక్షేపించారు. కానీ, తప్పంతా మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లదని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రాహుల్ విమర్శించారు.‘అది నాయకత్వ లక్షణం కాదు.. గిమ్మిక్’ ప్రధాని మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలొనీకి మెలొడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడంపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో స్పందించారు. ‘అది నాయకత్వ లక్షణం కాదు.. ఉత్తి గిమ్మిక్’ అని తేల్చిచెప్పారు. ఒకవైపు పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని పట్టించుకోకుండా ఇటలీలో చాక్లెట్లు ఇస్తున్నారని మోదీపై మండిపడ్డారు. మన రైతులు, కార్మికులు, వ్యాపారులు కష్టాల్లో ఉంటే మోదీ మాత్రం నవ్వుతూ రీల్స్ చేస్తున్నారని, అది చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారని రాహుల్ విమర్శించారు. రాజకీయాల్లో ఆయన రాహువు బీజేపీ చీఫ్ నబీన్ మండిపాటున్యూఢిల్లీ: ప్రధాని మోదీ ద్రోహి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ మాటలు ఆయన అరాచక మనస్తత్వాన్ని, స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ధ్వజమెత్తారు. 140 కోట్ల మంది ప్రజలను దారుణంగా కించపర్చారని, రాహుల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బుధవారం డిమాండ్ చేశారు. భారత రాజకీయాల్లో రాహుల్ ఒక ‘రాహువు’అని ఆరోపించారు. ఆయన తన ఆలోచనా విధానంతో దేశ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుండడంతో అది తట్టుకోలేక నిరాశ, అసంతృప్తికి గురై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని, మానసిక సమతుల్యత కోల్పోతున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు.


