సమగ్ర సర్వే గుట్టు విప్పిన కేసీఆర్!

సమగ్ర సర్వే గుట్టు విప్పిన కేసీఆర్! - Sakshi


తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సమగ్ర సర్వే గుట్టు విప్పారు. గత నెల 19న తెలంగాణవ్యాప్తంగా సమగ్రసర్వే నిర్వహించిన విషయం తెలిసిందే.  ఇతర రాష్ట్రాల్లో నివసించేవారు కూడా పరుగు... పరుగున వచ్చి ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఇంతకీ సమగ్ర సర్వే ఎందుకంటే.. ప్లానింగ్ కమిషన్ వేసిన ఓ ప్రశ్నకు సమాధానంగానే కేసీఆర్ ఈ సర్వే చేయించినట్లు సమాచారం.



కేసీఆర్ను ప్లానింగ్ కమిషన్ అడిగిన ఓ ప్రశ్నకు... ఆయన షేమ్గా ఫీలయ్యారట. తెలంగాణలో ఎక్కువ మంది వికలాంగులు ఎందుకు ఉన్నారని కేసీఆర్ను ప్రశ్నించారట. ఆ ప్రశ్నకు సీఎంగారు సమాధానం చెప్పలేకపోయారట. దాంతో హైదరాబాద్ వచ్చిన ఆయన ఫించన్లు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల విషయంలో బోగస్లను ఎత్తివేసి అసలైన లబ్దిదారులను గుర్తించేలా...సర్వే చేపట్టాలని డిసైడ్ అయ్యారట.



ఇందుకోసం ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ ... 'ప్లానింగ్ కమిషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నేను చాలా అవమానపడ్డాను. కించపరిచేలా ప్రశ్నించారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా పట్టిష్టమైన సర్వే చేపట్టేందుకు టైమ్ వచ్చింది' అన్నారట. దాని ఎఫెక్టే 'సమగ్ర కుటుంబ సర్వే' అట. మరోవైపు సమగ్ర సర్వేలో తెలిసిన సమాచారం ప్రకారం కేసీఆర్ మరో సర్వేకి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top