శింబుకు నో చెప్పిన త్రిష | Trisha walks out of Selvaraghavan-Simbu project | Sakshi
Sakshi News home page

శింబుకు నో చెప్పిన త్రిష

May 11 2015 2:43 AM | Updated on Sep 3 2017 1:48 AM

శింబుకు నో చెప్పిన త్రిష

శింబుకు నో చెప్పిన త్రిష

ప్రస్తుతం హెడ్‌లైన్స్‌లో ఉన్న నటి త్రిష. చాలా కాలం తరువాత ప్రేమ, పెళ్లి అంటూ హడావుడి చేసిన ఈ చెన్నై చిన్నది

 ప్రస్తుతం హెడ్‌లైన్స్‌లో ఉన్న నటి త్రిష. చాలా కాలం తరువాత ప్రేమ, పెళ్లి అంటూ హడావుడి చేసిన ఈ చెన్నై చిన్నది నిత్యం వార్తల్లో ఉన్నారు.అయితే ప్రియుడు వరుణ్‌మణియన్‌తో పెళ్లి రద్దవ్వడంతో మరోసారి హాట్‌న్యూస్‌గా మారింది. అంతేకాదు తానిప్పుడు సింగిల్ అని థ్యాంక్‌గాడ్ చాలా సంతోషంగా ఉంది అంటూ ట్విట్టర్‌లో పేర్కొని మరింత ప్రచారాన్ని పొందే ప్రయత్నం చేశారు. ఇక అసలు విషయం ఏమిటంటే త్రిష యువనటుడు జయ్‌కు జంటగా తన కాబోయే భర్త (ఆ మధ్య) నిర్మించనున్న చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే ఆ తరువాత ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ అవకాశాన్ని నటి తాప్సీని  వరించింది. అది వేరే విషయం లెండి.
 
 వరుణ్‌మణియన్‌తో విభేదాల కారణంగానే త్రిష ఆ చిత్రం నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే నటి త్రిష వెర్షన్ వేరేగా ఉంది. అసలు చిత్రాన్ని తాను అంగీకరిస్తే కదా వైదొలగడానికి అంటూ వివరణ ఇచ్చారు. కొందరు నిజమే కాబోలు అనుకున్నారు. అది జరిగిన కొద్ది రోజులకే త్రిష మరో చిత్రం నుంచి తప్పుకున్నారు. ఈ చిత్రంలో హీరో శింబు. దర్శకుడు సెల్వరాఘవన్. చాలా గ్యాప్ తరువాత ఈయన మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అయిన చిత్రం ఇది. చిత్ర నిర్మాణం మరో కొద్ది రోజుల్లో పట్టాలెక్కనుందనగా చిత్ర హీరోయిన్ త్రిష అనూహ్యంగా వైదొలిగారు.
 
  దీంతో సెల్వరాఘవన్, శింబు బాగా అప్‌సెట్ అయ్యారన్నది అటుంచితే అసలు త్రిష చిత్రం నుంచి వైదొలగడానికి కారణం ఏమిటన్నది ఆరా తీస్తే ఈ చిత్ర నిర్మాత ఆమె మాజీ వరుడు స్నేహితుడట. దీంతో వరుణ్‌మణియన్‌తో ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందేమోనని త్రిష ముందుగానే సెల్వరాఘవన్ చిత్రం నుంచి వైదొలగారన్నది కోలీవుడ్ టాక్. దీనికి త్రిష వివరణ మరోలో ఉంది. సెల్వరాఘవన్ తన ఫేవరెట్ దర్శకుడని ఆయన చిత్రంలో నటించడం ఎప్పుడూ సంతోషమేనని అన్నారు.
 
  అయితే కాల్‌షీట్స్ సమస్య కారణంగానే ప్రస్తుతం చిత్రం నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు. మరోసారి సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకావం వస్తే తప్పకుండా నటిస్తానని త్రిష అంటున్నారు. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ తాజాగా సుందర్ సి దర్శకత్వంలో అరణ్మణై -2 చిత్రంలో నటించడానికి అంగీకరించారన్నది గమనార్హం.
 

Advertisement
 
Advertisement
Advertisement