నేను సీఎం అయ్యేది ఖాయం! | I will be the CM sayes Mla Komatireddy | Sakshi
Sakshi News home page

నేను సీఎం అయ్యేది ఖాయం!

Feb 19 2017 3:56 AM | Updated on Mar 18 2019 7:55 PM

నేను సీఎం అయ్యేది ఖాయం! - Sakshi

నేను సీఎం అయ్యేది ఖాయం!

తాను ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని, కానీ ఎప్పుడు అవుతానో చెప్పలేనని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కానీ ఎప్పుడో చెప్పలేను: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

కనగల్‌: తాను ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమని, కానీ ఎప్పుడు అవుతానో చెప్పలేనని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం నల్లగొండ జిల్లా కనగల్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, 90 సీట్లు సాధించి.. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుంటామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గుర్తుకొస్తున్నాడని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌తో పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ ఇచ్చేందుకు డబ్బులు లేవంటూనే పేపర్, టీవీ ప్రకటనలకు రూ. 940 కోట్లు ఖర్చు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర నిర్వహించి కేసీఆర్‌ అబద్ధాలు, మోసాలను ఎండగడతానని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement