ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యం | no special status for andhra pradesh, clarifies centre | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యం

Jul 31 2015 1:59 PM | Updated on Mar 29 2019 9:31 PM

ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యం - Sakshi

ప్రత్యేక హోదా ఇవ్వడం అసాధ్యం

రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వివరణ ఇచ్చింది. శుక్రవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వివరణ ఇచ్చింది. శుక్రవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు స్పష్టం చేసింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, కేవలం ప్యాకేజీ మాత్రమే ఇచ్చిందని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి అయినా ప్రత్యేక హోదా ఇవ్వడం  అసాధ్యమని ఆయన వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు ఎలాంటి హోదా లేదని ఆయన చెప్పారు. తాము ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి మాత్రమే ఇవ్వగలమని అన్నారు.

కాగా రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు అయిదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభ సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఇప్పుడు ప్రత్యేక హోదా హామీని తుంగలోకి తొక్కుతోంది. దీనిపై రాష్ట్రప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement